దోమ (స్పానిష్, పోర్చుగీసు, ఆంగ్లం: Mosquito) రక్తాన్ని పీల్చి చాలా వ్యాధులకు కారణమైన కీటకము. దోమలు ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణ మండల దేశాలలో అధికంగా ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి. అవి కులిసిడే కుటుంబానికి చెందిన క్యూలెక్స్, అనాఫిలస్, ఈడిస్ దోమలు. వీటి దేహంలో తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుంటాయి. మధ్యవక్షానికి ఒక జత రెక్కలు ఉంటాయి. అంత్యవక్షానికి చెందిన రెక్కలు 'హాల్టర్లు' గా ఉండి శరీర సమతాస్థితికి పనిచేస్త్రాయి. ఆడ దోమలలో గుచ్చి పీల్చేరకమైన ముఖభాగలుంటాయి. ఇవి మానవులమీద అంతరాయక బాహ్య పరాన్న జీవులుగా బ్రతుకుతాయి. మగ దోమలు మొక్క స్రావాల మీద బ్రతుకుతాయి.
దోమ | |
---|---|
Anopheles gambiae | |
Conservation status | |
Secure | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Suborder: | Nematocera |
Infraorder: | Culicomorpha |
Family: | కులిసిడే |
ప్రజాతి | |
See text. | |
Diversity | |
41 ప్రజాతులు |
ఇవి నీటిలో ఉండే సేంద్రియ పదార్ధాలను తింటాయి. ఇవి రూపవిక్రియ జరుపుకొని ప్యూపాలుగా ఏర్పడతాయి. డింభకాలు శ్వాస గొట్టాలతోను, ప్యూపాలు అంకుశ నాళాలు, తుత్తారలతోను గాలిని పూల్చుకొంటాయి. సాధారణ వ్యక్తులతో పోల్చితే మద్యం తాగిన వారిపై దోమలు అధికంగా దాడి చేస్తాయట.
మలేరియా నుంచి కాపాడే కొత్త అవతార్ (టీకా) దోమల్నిశాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఈ దోమలు కుడితే మనిషిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మలేరియాను నియంత్రించడానికి వీలవుతుంది. దోమ లాలాజల గ్రంథుల నుంచి 'లైస్మేనియా' టీకా మందు వెలువడేలా వాటి జన్యు క్రమంలో మార్పు తెచ్చారు. మలేరియా వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 10-20 లక్షల మంది మరణిస్తున్నారు.మలేరియా పరాన్నజీవ మణిరాజు (ప్లాస్మోడియం) రాకను నిరోధించే విధంగా దోమ జన్యుక్రమంలో కొన్ని మార్పులు చేశారు. ఆ తర్వాత ఆ మార్పులతో కూడిన జన్యుసమాచారాన్ని దోమ అండాల్లో ప్రవేశపెట్టారు. వాటినుంచి పుట్టిన కొత్తతరం దోమలు మలేరియా వ్యాధి నిరోధకతను సంతరించుకున్నాయి. ఆ దోమలకు ప్లాస్మోడియంతో కూడిన రక్తాన్ని అందించి పరీక్షించారు. రక్తం తాగినప్పటికీ ఒక్క దోమలోకి కూడా పరాన్నజీవి ప్రవేశించలేకపోయింది. 'దోమల జీవితకాలం రెండువారాలకు మించదు. ఈ నేపథ్యంలో భూమ్మీద ఉన్న సాధారణ దోమలను తొలగించివేస్తూ వాటి స్థానంలో జన్యుపరివర్తిత దోమలను ప్రవేశపెట్టటం అసాధ్యమేమీ కాదు.
This article uses material from the Wikipedia తెలుగు article దోమ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.