చిలగడదుంప

చిలగడదుంప (Sweet Potato) ఒక విధమైన దుంప.

చిలగడదుంప
చిలగడదుంప
చిలగడ దుంప
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
ఐ. బటాటాస్
Binomial name
ఐపోమియా బటాటాస్
చిలగడదుంప

దీని శాస్త్రీయ నామము ఐపోమియా బటాటాస్ (Ipomea batatas). దీనినే కొన్ని ప్రదేశములలో గెనసుగడ్డలు, మొహర్రంగడ్డ, ఆయిగడ్డ, రత్నపురిగడ్డ, కంద గడ్డ అని కూడా అంటారు. ఇవి రకరకాల రంగులలో లభిస్తున్నాయి

  1. లేత పసుపు
  2. నారింజ
  3. గులాబి రంగు

ఉపయోగాలు

చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు దండిగా ఉంటాయి. ఉడికించుకునో, ఆవిరిపై ఉడికించో, కాల్చుకునో, కూరగా వండుకునో.. రకరకాలుగా వీటిని తినొచ్చు. సలాడ్లకూ ఇవి మరింత రుచిని తెచ్చిపెడతాయి. కాబట్టి వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ---

పీచు

బంగాళాదుంప కన్నా చిలగడదుంపల్లో పీచు మోతాదు చాలా ఎక్కువ. దీంతో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువసేపు కేలరీలు విడులయ్యేలా చేస్తాయి.

విటమిన్‌ బీ6

చిలగడదుంపల్లో విటమిన్‌ బీ6 దండిగా ఉంటుంది. రక్తనాళాలు బలంగా ఉండేందుకు తోడ్పడే హోమోసిస్టీన్‌ను విటమిన్‌ బీ6 విడగొడుతుంది. అందువల్ల వీటితో గుండె, రక్తనాళాల సమస్యలు దూరంగా ఉంటాయి.

పొటాషియం

ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి, నీటి మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించటంలో పొటాషియం కీలకపాత్ర పోషిస్తుంది. చిలగడదుంపల్లో పొటాషియం మోతాదూ అధికంగానే ఉంటుంది.

విటమిన్‌ ఏ

చిలగడదుంపల్లో విటమిన్‌ ఏ లేదా బీటా కెరటిన్‌ ఎక్కువ. ఇది ఎండకు చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. చూపు తగ్గిపోకుండా చూస్తుంది.

మాంగనీసు

పిండి పదార్థాల జీవక్రియల్లో చాలా కీలమైన మాంగనీసు కూడా వీటిల్లో అధికం. అందువల్ల ఇవి రక్తంలో గ్లూకోజు మోతాదులు సాధారణ స్థాయిలో ఉండేలా తోడ్పడతాయి.

విటమిన్‌ సి, ఈ

వీటిల్లోని విటమిన్‌ సి రోగనిరోధకశక్తిని పెంచితే.. విటమిన్‌ ఈ మన చర్మం ఆరోగ్యంగా, నిగనిగలాడేందుకు తోడ్పడుతుంది.

సహజ చక్కెరలు

లగడదుంపల్లో దండిగా ఉండే సహజ చక్కెరలు రక్తంలో నెమ్మదిగా కలుస్తాయి. అందువల్ల రక్తంలో ఒకేసారి చక్కెర మోతాదు పెరగకుండా చూస్తాయి. ఇలా బరువు పెరగకుండా, నిస్సత్తువ రాకుండా కాపాడతాయి. నలుపు మరకలు లేని, గట్టి దుంపలు మంచి రుచిగా ఉంటాయి

Raw Sweet Potato
Nutritional value per 100 g (3.5 oz)
శక్తి360 kJ (86 kcal)
20.1 g
చక్కెరలు4.2 g
పీచు పదార్థం3.0 g
0.1 g
1.6 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
beta-Carotene
89%
709 μg
79%
8509 μg
థయామిన్ (B1)
9%
0.1 mg
రైబోఫ్లావిన్ (B2)
8%
0.1 mg
నియాసిన్ (B3)
4%
0.61 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
16%
0.8 mg
విటమిన్ బి6
15%
0.2 mg
ఫోలేట్ (B9)
3%
11 μg
విటమిన్ సి
3%
2.4 mg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
3%
30.0 mg
ఇనుము
5%
0.6 mg
మెగ్నీషియం
7%
25.0 mg
ఫాస్ఫరస్
7%
47.0 mg
పొటాషియం
7%
337 mg
జింక్
3%
0.3 mg
  • Units
  • μg = micrograms •mg = milligrams
  • IU = International units
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

మూలాలు

Tags:

చిలగడదుంప ఉపయోగాలుచిలగడదుంప మూలాలుచిలగడదుంపదుంప

🔥 Trending searches on Wiki తెలుగు:

వందే భారత్ ఎక్స్‌ప్రెస్కాలుష్యంపూర్వాభాద్ర నక్షత్రమువేపబుర్రకథఅవయవ దానంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంఇన్‌స్టాగ్రామ్బుడి ముత్యాల నాయుడునర్మదా నదిగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిసమ్మక్క సారక్క జాతరసింగిరెడ్డి నారాయణరెడ్డివరలక్ష్మి శరత్ కుమార్తెలంగాణ ప్రభుత్వ పథకాలునల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిగాంధీగూగుల్శతభిష నక్షత్రముచింతలలితా సహస్రనామ స్తోత్రంచంద్రయాన్-3నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిఆరుద్ర నక్షత్రముతెలుగుదేశం పార్టీన్యుమోనియానవరత్నాలురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ప్రధాన సంఖ్యఅల్లు అర్జున్నవనీత్ కౌర్Aశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)చర్మముమగధీర (సినిమా)గోత్రాలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాదగ్గుబాటి వెంకటేష్భారత రాజ్యాంగ సవరణల జాబితానక్షత్రం (జ్యోతిషం)ఆరూరి రమేష్సుహాసినిమశూచికనకదుర్గ ఆలయంకృత్తిక నక్షత్రముమంగళవారం (2023 సినిమా)సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుసజ్జా తేజపరశురాముడుప్రభాస్తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్క్రికెట్తహశీల్దార్విమలదానం నాగేందర్జవహర్ నవోదయ విద్యాలయంరాజ్యసభతెలంగాణశ్రీశైల క్షేత్రంపి.వెంక‌ట్రామి రెడ్డిరామోజీరావుఅధిక ఉమ్మనీరుకిరణ్ రావుసాయిపల్లవిగురువు (జ్యోతిషం)అమెరికా సంయుక్త రాష్ట్రాలుప్రకృతి - వికృతిచిరంజీవిఅయోధ్యప్రపంచ రంగస్థల దినోత్సవంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)నువ్వొస్తానంటే నేనొద్దంటానాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకియారా అద్వానీమొదటి పేజీశారద🡆 More