ఆమ్‌స్టర్‌డ్యామ్: నెదెర్లాండ్స్ రాజధాని

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్ రాజధాని.

మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా 24,10,960. నగరంలో ఉన్న అనేక కాలువల కారణంగా దీన్ని ఉత్తరాది వెనిస్ గా దీన్ని పేర్కొంటారు. ఈ కాలువలను యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.

ఆమ్‌స్టర్‌డ్యామ్: నెదెర్లాండ్స్ రాజధాని
ఆమ్‌స్టర్‌డ్యాం, నార్త్‌ సీ కాలువల ఉపగ్రహ చిత్రం

ఆమ్‌స్టెల్ అనే నది పైన కట్టిన డ్యాము వద్ద ఉన్న నగరంగా దీనికి ఆ పేరు వచ్చింది. 12 వ శతాబ్దిలో చేపల పట్టే వారి పల్లెగా ఇది వెలసింది. 17 వ శతాబ్దిలో ఒక ముఖ్యమైన రేవుపట్టణంగా, వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. 19, 20 శతాబ్దాల్లో నగరం బాగా విస్తరించింది.

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్‌కు వాణిజ్య రాజధని. సాంస్కృతిక రాజధాని కూడా. ఫిలిప్స్, అక్జోనోబెల్, టోంటోం, ఐఎన్‌జి వంటి అనేక సంస్థల కేంద్ర కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఉబర్, నెట్‌ఫ్లిక్స్, టెస్లా వంటి విదేశీ సంస్థల ఐరోపా కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. 2012 లో, ఐరోపా లోని అత్యంత జీవనానుకూలమైన నగరాల్లో రెండవదిగా ఆమ్‌స్టర్‌డ్యామ్ ఎంపికైంది. జీవన నాణ్యతలో ప్రపంచంలో 12 వ అత్యుత్తమ నగరంగా మెర్సర్ ఎంపిక చేసింది. అత్యుత్తమ సాంకేతిక కేంద్రాల్లో ప్రపంచంలో 4 వ స్థానంలోను, ఐరోపాలో రెండవ స్థానం లోనూ నిలిచింది. ఆమ్‌స్టర్‌డ్యామ్ ఐరోపాలో ఐదవ అతి పెద్ద రేవుపట్టణం. ఆమ్‌స్టర్‌డ్యామ్ లోని షిఫోల్ విమానాశ్రయం ప్రయాణీకుల రద్దీలో ఐరోపా లోకెల్లా మూడవ స్థానంలో ఉంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ పౌరుల్లో ప్రముఖులు రెంబ్రాంట్, వాన్ గాఫ్.

భౌగోళికం

ఆమ్‌స్టర్‌డ్యామ్ నెదర్లాండ్స్ పశ్చిమ భాగంలో నార్త్ హాలండ్ ప్రావిన్సులో ఉంది.అంస్టెల్ నది నగరం మధ్య వరకూ ప్రవహించి ఆగిపోతుంది. అక్కడి నుండి అనేక కాలువలుగా చీలి పోతుంది. ఆమ్‌స్టర్‌డ్యామ్ సముద్ర మట్టానికి 2 మీటర్ల దిగువన ఉంటుంది. నగర విస్తీర్ణం 219.4 చ.కి.మీ. ఇందులో పార్కులు, ప్రకృతి వనాలు 12% భాగాన్ని ఆక్రమిస్తాయి..

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ ఎన్నికల వ్యవస్థఉత్తరాభాద్ర నక్షత్రముఅనువాదంరుతురాజ్ గైక్వాడ్రామాయణంశాంతిస్వరూప్హనుమాన్ చాలీసాడీజే టిల్లుతమిళనాడుజై భజరంగబలిఅవకాడోచైత్ర పూర్ణిమవెలిచాల జగపతి రావుమహాభాగవతంచిరంజీవులుస్వాతి నక్షత్రముభరణి నక్షత్రముబొత్స సత్యనారాయణఇన్‌స్టాగ్రామ్పౌర్ణమికీర్తి సురేష్నువ్వులుఅయోధ్యశివమ్ దూబేతరుణ్ కుమార్కె. అన్నామలైదేవీఅభయంఛత్రపతి శివాజీమహావీర్ జయంతిరఘుపతి రాఘవ రాజారామ్మాదిగవిరాట పర్వము ప్రథమాశ్వాసముఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారతీయుడు (సినిమా)సిమ్రాన్శ్రీవిష్ణు (నటుడు)విజయనగరంశ్రీశ్రీస్వామి వివేకానందగుంటూరు కారంగుంటకలగరరాయలసీమభారతీయ తపాలా వ్యవస్థసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుషర్మిలారెడ్డివంకాయవెల్లలచెరువు రజినీకాంత్కాకతీయుల శాసనాలుధన్‌రాజ్నేహా శర్మహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాతిక్కనచంపకమాలఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామానవ శరీరమునయన తారకల్వకుంట్ల చంద్రశేఖరరావుధర్మో రక్షతి రక్షితఃలలితా సహస్ర నామములు- 201-300నువ్వు నాకు నచ్చావ్కౌరవులువంగా గీతనారా చంద్రబాబునాయుడుతేలుసలేశ్వరంతెలుగు సినిమాలు 2022శాతవాహనులుఅలెగ్జాండర్సంధ్యావందనంపంచముఖ ఆంజనేయుడుఅక్షయ తృతీయతెలుగులో అనువాద సాహిత్యంవై.యస్.అవినాష్‌రెడ్డిసర్పంచినారా లోకేశ్కాన్సర్తిరుమలఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్🡆 More