సోనియా గాంధీ: రాజకీయ నాయకురాలు

సోనియా గాంధీ ( pronunciation) ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో.

ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా. 1998 - 2017 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

సోనియా గాంధీ
సోనియా గాంధీ: తొలినాళ్ళ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం
సోనియా గాంధీ
జననండిసెంబరు 9 1946
లూసియానా, ఇటలీ.
పౌరసత్వంఇటలీ (1946 - 1983) భారతదేశం (1983 - ప్రస్తుతం)
వృత్తిరాజకీయ నాయకురాలు
పదవీ కాలం1998 - 2017
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
భాగస్వాములురాజీవ్ గాంధీ
పిల్లలురాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్యతరువాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడుగగా  ఆమె నిరాకరించారు.1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా  ఎన్నికయారు.

2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టివో కాట్రొచితో స్నేహం కూడా వివాదాలకు కారణమైంది. ఒట్టొవో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలు.

తొలినాళ్ళ జీవితం

సోనియా గాంధీ: తొలినాళ్ళ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం 
సోనియా గాంధి  జన్మస్థలం, 31, కంట్రడా మెయిని (మెయిని వీధి), లూసియానా,  ఇటలీ (కుడివైపు ఇల్లు)

సోనియా తల్లిదండ్రులు స్టిఫెనో, పోలా మైనో. ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్న  కంట్రడా మెయిని గ్రామంలో జన్మించారు ఆమె. ఈ గ్రామం  విచెంజాకు 30 కి.మీ. దూరంలో ఉంది.  ఈ గ్రామంలో  మెయిని ఇంటి పేరు గల కుటుంబాలు కొన్ని  తరాలుగా  ఉంటున్నారు. వీరు రోమన్  కేథలిక్ లు.  సోనియా టురిన్ కు దగ్గర్లోని ఒర్బస్సానో అనే పట్టణంలో ఆమె పెరిగారు. ఈమె తండ్రి స్టీఫెనోకు ఆ పట్టణంలోనే ఒక నిర్మాణ వ్యాపార సంస్థ ఉంది. ఆయన రెండో ప్రపంచ యుద్ధం లో సోవియట్  మిలటరీకి  వ్యతిరేకంగా పోరాడారు. ముస్సోలిని కి, ఇటలీకి చెందిన నేషనల్ ఫాసిస్ట్ పార్టీకి అనుకులునిగా ప్రకటించుకున్నారు. ఆయన 1983లో మరణించారు. ఇప్పటికీ సోనియా తల్లి, అక్కాచెల్లెళ్ళు  ఒర్బస్సానో పట్టణానికి దగ్గర్లోనే ఉంటున్నారు.

1964లో బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాషా స్కూల్ లో ఇంగ్లీష్ నేర్చుకునేందుకు ఆమె కేంబ్రిడ్జ్ నగరం వచ్చారు. ఆ నగరంలోని ఓ గ్రీక్ రెస్టారెంట్ లో 1965లో ఆమె రాజీవ్ గాంధీ ని ఆమె కలిశారు.  కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో రాజీవ్ ఇంజినీరింగ్  చదివేవారు. వీరిద్దరూ 1968లో హిందూ వివాహ సంప్రదాయంలో  పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయ్యాకా సోనియా తన అత్తగారూ, అప్పటి భారత ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ నివాసానికి  మారారు.

వీరికి ఇద్దరు పిల్లలు. రాహుల్ గాంధీ (జననం:1970), ప్రియాంక గాంధీ (జననం:1972). రాజీవ్ పైలెట్ గా పనిచేసేవారు. సోనియా కుటుంబాన్ని చూసుకునేవారు. ఇందిరా గాంధీ భారత అత్యవసర స్థితి తరువాత 1977లో రాజీవ్ తన కుటుంబంతో సహా కొన్ని నెలలు విదేశాలకు వెళ్ళిపోయారు. 1982లో రాజీవ్ సోదరుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో  చనిపోయిన తరువాత ఆయన రాజకీయాలలోకి వచ్చారు. ఆ తరువాత నుంచి సోనియా కుటుంబంపై దృష్టి మరలకుండా ఉండేందుకు ప్రజలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.

రాజకీయ జీవితం

ప్రధాని భార్యగా..

అత్త ఇందిరా గాంధి మరణం తరువాత, భర్త ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాకా సోనియాకు భారతప్రజలతో మమేకం అవ్వాల్సి వచ్చింది. ప్రధాని భార్యగా ఆమె అధికారులు, నాయకలకు అతిధి మర్యాదలు  చేసేవారు.  రాజీవ్ తో  కలసి  ఎన్నో  రాష్ట్రాలను  అధికారికంగా సందర్శించేవారు. 1984లో అమేధి నియోజకవర్గంలో రాజీవ్  తన  మరదలు మేనకా గాంధీ కి వ్యతిరేకంగా నిలబడినప్పుడు సోనియా తన  భర్త కోసం విపరీతంగా ప్రచారం చేశారు. రాజీవ్ పదవీకాలం పూర్తయిన తరువాత బోఫోర్స్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టోవియో  సోనియా స్నేహితుడని, ఆయన ప్రధాని అధికార నివాసానికి  వచ్చేవారని ప్రచారం విపరీతంగా జరిగేది.  సోనియా 1983 ఏప్రిల్ 27లో ఇటలీ ఎంబసీకి  తన ఇటాలియన్  పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చేసారని  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అప్పట్లో ప్రకటించారు. 1992  వరకు  భారత  ప్రభుత్వం  రెండు  జాతీయతలను  అంగీకరించలేదు. అందుకోసం 1983లో  భారత  పౌరసత్వం కోసం ఇటాలియన్  పౌరసత్వం వదులుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా..

సోనియా గాంధీ: తొలినాళ్ళ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం 
2010 డిసెంబరులో దేశ పర్యటనలో భాగంగా  అప్పటి, ప్రస్తుత రష్యా ప్రధాని మిర్టీ మెద్వెదెవ్ తో  సోనియా

రాజీవ్ గాంధీ మరణం తరువాత, సోనియా ప్రధానమంత్రి పదవిని నిరాకరించడంతో పి.వి.నరసింహారావు ను ప్రధానిగా పార్టీ పెద్దలు,  సోనియా నిర్ణయించారు. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినపుడు  మాధవరావ్ సింధియా, రాజేష్ పైలట్, నారాయణ్ దత్ తివారీ, అర్జున్ సింగ్, మమతా బెనర్జీ, జి.కె.మూపనర్, పి. చిదంబరంజయంతి నటరాజన్వంటి  సీనియర్  నాయకులు  అప్పటి పార్టీ  అధ్యక్షులు  సీతారాం కేసరిపై బహిరంగ తిరుగుబాటు చేసి, కొందరు పార్టీ నుంచి  బయటకు వచ్చేసి, పార్టీ లో చీలికలు తెచ్చారు. పార్టీని తిరిగి కలపడానికి, 1997లో సోనియా కలకత్తా ప్లీనరీ  సమావేశంలో ప్రాథమిక సభ్యత్వంతో మొదలు పెట్టి, 1998లో పార్టీ నాయకురాలిగా ఎదిగారు.

1999 మేలో ముగ్గురు సీనియర్ నాయకులు శరద్ పవార్, పి.ఎ.సంగ్మా, తారిక్ అన్వర్ లు సోనియాను ప్రధాని అవ్వమని సవాలు చేశారు. దానికి ఆమె పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ వివాదం తరువాత ఈ ముగ్గురు రెబెల్ నాయకులు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.

పార్టీ ప్రాథమిక సభ్యురాలిగా చేరిన 62 రోజుల్లోనే పార్టీ ఆమెను అధ్యక్ష పదవికి ఎన్నుకుంది. ఆ ప్రతిపాదనను ఆమె అంగీకరించి, పార్టీకి అధ్యక్షురాలిగా పనిచేశారు. 1999లో కర్ణాటక లోని బళ్ళారిఉత్తర్ ప్రదేశ్ లోని అమేధీ నియోజకవర్గాల నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. రెండిటి నుంచీ గెలిచినా, అమేధీ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. బళ్ళారిలో ఆమె భాజపా నాయకురాలు సుష్మా స్వరాజ్ పై గెలుపొందారు.

ప్రతిపక్ష నేతగా..

సోనియా గాంధీ (సోనియా గాంధీ: తొలినాళ్ళ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం pronunciation); అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో . ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా. 1998 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్య తరువాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడుగగా  ఆమె నిరాకరించారు. 1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా  ఎన్నికయారు. సోనియాను 1999లో 13వ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. భాజపా పార్టీ అధికారంలోకి వచ్చి అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడినపుడు,  ఆమె ప్రతిపక్షాలకు నేతగా వ్యవహరించారు. 2003లో  వాజపేయి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారామె.

2004 ఎలక్షన్లు, తరువాత పరిణామాలు

2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. 2010 సెప్టెంబరులో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణమైంది. ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టివో కాట్రొచితో స్నేహం కూడా వివాదాలకు కారణమైంది. ఒట్టొవో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలు.

భాజపా మాత్రం ఆమె విదేశీయురాలు కావడంతో ప్రధాని పదవికి దూరంగా ఉండాలంటూ నిరసన చేపట్టింది. చట్టం కూడా ఆమెను ప్రధాని కావడాన్ని నిరాకరిస్తుందంటూ భాజపా నిరసన వ్యక్తం చేసింది. 1995 భారత పౌరసత్వం చట్టం ప్రకారం ఆమె పౌరసత్వాన్ని  ప్రశ్నిస్తూ కోర్టులో దావా వేశారు. సుప్రీం కోర్టు మాత్రం ఈ దావాను కొట్టేశారు.

ఎన్నికలు తరువాత, సోనియా మన్మోహన్ సింగ్ ను ప్రధానిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పార్టీ నాయకులు కూడా ఆమోదించారు. అమె మద్దతుదారులు భారతీయ సంప్రదాయం ప్రకారం అధికారాన్ని త్యాగం చేశారనగా, వ్యతిరేకులు మాత్రం ఆమె నిశ్శహాయురాలిగా అభివర్ణించారు.

యూపీఏ అధ్యక్షురాలిగా..

సోనియా గాంధీ: తొలినాళ్ళ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం 
ప్రపంచ ఆర్ధిక ఫోరం నిర్వహించిన భారతాఅర్ధిక సమితి 2006లో మాట్లాడుతున్న సోనియా

2006 మార్చి, సోనియా లోక్ సభకు, జాతీయ సలహా సంఘం అధ్యక్ష పదవికి కూడా రాజీనామా ప్రకటించారు. 2006 మేలో రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి 400,000 ఓట్ల మెజారిటీతో లోక్ సభకు గెలిచారు.

యూపీఏ, జాతీయ సలహా సంఘాల అధ్యక్షురాలిగా, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, సమాచార హక్కు చట్టాల అమలులో ముఖ్యపాత్ర పోషించారు సోనియా.

2007, అక్టోబరు 2 తేదీన, మహాత్మా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఆమె యునైటెడ్ నేషన్స్ ను ఉద్దేశించి మాట్లాడారు. 2007, జులై 15న గాంధీ పుట్టినరోజును ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారు.

ఆమె నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ 2009లో సారస్వత ఎన్నికల్లో గెలిచి, మన్మోహన్ సింగ్ ప్రధానిగా  ప్రభుత్వం  ఏర్పాటు చేసింది.  1991 తరువాత 206 లోక్ సభ స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ కావడం విశేషం. ఈ ఎన్నికల్లోనే ఆమె మూడోసారి రాయ్ బరేలీ నుండి ఎంపిగా ఎన్నికయ్యారు.

2013లో 15 ఏళ్ళు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వ్యవహరించిన మొదటి వ్యక్తిగా సోనియా చరిత్ర సృషించారు. అదే సంవత్సరంలో, ఎల్.జి.బి.టి హక్కులను పరిరక్షించేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన సెక్షన్ 377 చట్టాన్ని ఖండించారు సోనియా.

2014 సార్వత్రిక ఎన్నికల్లో, సోనియా రాయ్ బరేలీ నుండి తిరిగి ఎన్నికైనా, కాంగ్రెస్ మాత్రం తీవ్ర ఓటమిని ఎదుర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ 44 లోక్ సభ, 59 రాజ్యసభ స్థానాలు గెలుచుకున్నాయి.

వ్యక్తిగత జీవితం

సోనియా గాంధీ: తొలినాళ్ళ జీవితం, రాజకీయ జీవితం, వ్యక్తిగత జీవితం 
2009లో సోనియా

సోనియా భర్త రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పెద్ద కుమారుడు. వారికి ఇద్దరు పిల్లలు  రాహుల్ గాంధీ,  ప్రియాంకా గాంధీ.

2011 ఆగస్టులో, అమెరికాలో ఆమె శస్త్రచికిత్స చేయించుకున్నారు. న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్-కెటెరింగ్ క్యాన్సర్ సెంటర్ లో చికిత్స పొందారని, సెప్టెంబరు 9న భారతదేశం తిరిగి వచ్చారని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. జులై 18, 2012న సోనియా మాట్లాడుతూ ఇకపై తన కుమారుడు రాహుల్ పార్టీలోని అధిక భాగాన్ని చూసుకుంటారని వివరించారు. కానీ నిర్ణయం మాత్రం రాహుల్ దేనని తెలిపారు.

2013 మార్చిలో గార్డియన్ పత్రిక సోనియాను 50మంది ఉత్తమ వస్త్రాలంకరణ జాబితాలో ప్రచురించారు. "సింపుల్ గా ఉండటమే స్టైలిష్ గా  ఉండటం"  అనే సామెతను నమ్ముతారట.

2014 సార్వత్రకి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం సోనియా  ఆస్తులు 92.8 మిలియన్లు ఉండగా, 28.1 మిలియన్లు చరాస్తులు, 64.7 మిలియన్లు స్థిరాస్తులుగా పేర్కొన్నారు. అంతకుముందు ఎలక్షన్ల ప్రకారం తరువాతి ఎన్నికల ఆస్తులు 6 శాతం పెరిగింది.

గౌరవాలు, గుర్తింపులు

2013లో, ఫోర్బ్స్ పత్రిక సోనియాను ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతరాలైన స్త్రీగా పేర్కొంది. 2007లో కూడా ఫోర్బ్స్ పత్రిక ఆమెను అదే స్థానంలో పేర్కొంది. విశిష్ట జాబితాలో 2007లో 6వ ర్యాంకు ఇచ్చింది. 2010లో ఫోర్బ్స్ సోనియాను అత్యంత శక్తివంతురాలైన మహిళ జాబితాలో 10వ స్థానంలో నిలబెట్టింది. 2012లో ఫోర్బ్స్ శక్తివంతురాలైన వ్యక్తుల జాబితాలో 12వ వ్యక్తిగా పేర్కొంది.

2007, 2008 సంవత్సరాలకుగాను టైమ్ పత్రిక 100మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో చేర్చింది. న్యూ స్టేట్స్ మేన్ పత్రిక 2010 సంవత్సరంలో "ప్రపంచంలోని 50 మంది అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో 29వ స్థానం ఇచ్చింది. మూలాలు
మద్రాసు బెల్జి

సంవత్సరం పేరు అవార్డు ఇచ్చిన సంస్థ

2008 గౌరవ డాక్టరేట్ (సాహిత్యం)
మద్రాసు విశ్వవిద్యాలయం
2006 ఆర్డర్ అఫ్ఫ్ కింగ్ లెపొల్డ్
బెల్జియం ప్రభుత్వం
2006 గౌరవ డాక్టరేట్
బ్రసిల్స్ విశ్వవిద్యాలయం

సోనియా గురించిన పుస్తకాలు

• సోనియా గాంధీ - యాన్ ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్, యాన్ ఇండియన్ డెస్టినీ (2011), రాణి సింగ్ రాసిన జీవిత చరిత్ర.

• సోనియా గాంధీ: నూరుల్ ఇస్లాం సర్కార్ ద్వారా భారతదేశంతో ప్రయత్నించండి.

• ది రెడ్ చీర: ఎ డ్రమటైజ్డ్ బయోగ్రఫీ

జేవియర్ మోరో రచించిన సోనియా గాంధీ (ది రెడ్ చీర).

• సోనియా: రషీద్ కిద్వాయ్ రచించిన జీవిత చరిత్ర[63]

సంజయ బారు రచించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, 2014.

ఎన్నికల్లో పోటీ

సంవత్సరం ఎన్నికల పార్టీ నియోజకవర్గం పేరు ఫలితం ఓట్లు ఓటు వాటా%
1999 13వ లోక్‌సభ కాంగ్రెస్ అమేథి గెలిచింది 4,18,960 67.12%
బళ్లారి గెలిచింది 4,14,650 51.70%
2004 14వ లోక్‌సభ రాయ్‌బరేలీ గెలిచింది 390,179 66.18%
2006 రాయ్‌బరేలీ గెలిచింది 4,74,891 80.49%
2009 15వ లోక్‌సభ రాయ్‌బరేలీ గెలిచింది 4,81,490 72.23%
2014 16వ లోక్‌సభ రాయ్‌బరేలీ గెలిచింది 5,26,434 63.80%
2019 17వ లోక్‌సభ రాయ్‌బరేలీ గెలిచింది 5,34,918 55.80%
2024 రాజ్యసభ రాజస్థాన్

మూలాలు

Tags:

సోనియా గాంధీ తొలినాళ్ళ జీవితంసోనియా గాంధీ రాజకీయ జీవితంసోనియా గాంధీ వ్యక్తిగత జీవితంసోనియా గాంధీ గౌరవాలు, గుర్తింపులుసోనియా గాంధీ సోనియా గురించిన పుస్తకాలుసోనియా గాంధీ ఎన్నికల్లో పోటీసోనియా గాంధీ మూలాలుసోనియా గాంధీ వెలుపలి లంకెలుసోనియా గాంధీ19461998About this soundడిసెంబరు 9నాయకురాలుభారత జాతీయ కాంగ్రెస్

🔥 Trending searches on Wiki తెలుగు:

నర్మదా నదిజీలకర్రకస్తూరి రంగ రంగా (పాట)పచ్చకామెర్లుచాట్‌జిపిటిచిత్త నక్షత్రముతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంరెండవ ప్రపంచ యుద్ధంకలబందసునీత మహేందర్ రెడ్డిచదలవాడ ఉమేశ్ చంద్రపన్ను (ఆర్థిక వ్యవస్థ)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్చతుర్యుగాలుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుకమల్ హాసన్పూరీ జగన్నాథ దేవాలయంపి.వి.మిధున్ రెడ్డిమధుమేహంభారతదేశ ప్రధానమంత్రిమాధవీ లత2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతెలుగు వికీపీడియాకార్తె2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసంధిబోడె రామచంద్ర యాదవ్నవగ్రహాలుహస్తప్రయోగందశావతారములుశార్దూల విక్రీడితముఆరోగ్యంజాతీయ ప్రజాస్వామ్య కూటమిభారత జాతీయ కాంగ్రెస్మకరరాశిజనసేన పార్టీఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిరౌద్రం రణం రుధిరంమారేడుముదిరాజ్ (కులం)నరసింహావతారంఆతుకూరి మొల్లదక్షిణామూర్తిఏ.పి.జె. అబ్దుల్ కలామ్మృగశిర నక్షత్రముదొమ్మరాజు గుకేష్బొత్స సత్యనారాయణశాసనసభఆవేశం (1994 సినిమా)విశ్వనాథ సత్యనారాయణవర్షం (సినిమా)యేసు శిష్యులురావణుడుషాహిద్ కపూర్పార్లమెంటు సభ్యుడుఈనాడుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసీ.ఎం.రమేష్సర్పిమంతెన సత్యనారాయణ రాజుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంసమాచార హక్కుశ్రీకాళహస్తిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థశ్రీశ్రీనజ్రియా నజీమ్నువ్వు లేక నేను లేనుజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితామహామృత్యుంజయ మంత్రంఋతువులు (భారతీయ కాలం)జాతీయములుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షచంపకమాలమహాకాళేశ్వర జ్యోతిర్లింగంనితీశ్ కుమార్ రెడ్డిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఇన్‌స్టాగ్రామ్లక్ష్మి🡆 More