విజ్ఞానశాస్త్రం

విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం.ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది.

ప్రకృతి శాస్త్రంలో భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. సామాజిక శాస్త్రంలో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. గణిత శాస్త్రం లాంటివి సాంప్రదాయ శాస్త్రము|సాంప్రదాయ శాస్త్రాల క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పడ్డవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు. విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే ఇంజనీరింగ్,, వైద్యశాస్త్రం లాంటి రంగాలను అనువర్తిత శాస్త్రాలుగా చెప్పవచ్చు.

విజ్ఞానశాస్త్రం
విశ్వం నమూనా

మధ్యయుగంలో మధ్యప్రాచ్య ప్రాంతానికి చెందిన అల్ హజెన్ అనే శాస్త్రవేత్త కాంతిశాస్త్రంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడు. ప్రాచీన కాలం నుంచీ 19వ శతాబ్దం వరకు విజ్ఞానశాస్త్రాన్ని ఇప్పుడున్న స్వరూపంగా కాక తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావిస్తూ వచ్చారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకృతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయణ శాస్త్రం మొదలైన రంగాల మీద పరిశోధన చేసేవారు. ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని తత్వ శాస్త్రం ప్రకారం నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని విభజిస్తే మధ్యయుగపు మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా పదార్థాలను వివధ రకాలుగా వర్గీకరించడం మొదలుపెట్టారు.

17, 18 వ శతాబ్దాలలో శాస్త్రవేత్తలు శాస్త్ర పరంగా తాము కనుగొన్న సత్యాలను కొన్ని ప్రకృతి నియమాల రూపంలోకి సూత్రీకరించే ప్రయత్నం చేశారు. 19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే కేవలం పరిశోధనల ద్వారా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది. 19వ శతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం లాంటి శాస్త్రాలు ప్రస్తుతం ఉన్న రూపును సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు రూపుదిద్దుకున్నాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

ఇంజనీరింగ్గణిత శాస్త్రంప్రకృతి శాస్త్రంవైద్యశాస్త్రం

🔥 Trending searches on Wiki తెలుగు:

పాములపర్తి వెంకట నరసింహారావుప్రియురాలు పిలిచిందిఆవకాయచిరంజీవి నటించిన సినిమాల జాబితాఅన్నప్రాశనజే.సీ. ప్రభాకర రెడ్డివై.యస్. రాజశేఖరరెడ్డిసామెతలుఉసిరిఇజ్రాయిల్కనకదుర్గ ఆలయంగుణింతంచంద్రయాన్-3తమన్నా భాటియావరిఆర్టికల్ 370 రద్దువంకాయఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంవిశాల్ కృష్ణభారత రాజ్యాంగ పీఠికదక్షిణ విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గంవేంకటేశ్వరుడుకోడెల శివప్రసాదరావుయానాందగ్గుబాటి పురంధేశ్వరికందుకూరి వీరేశలింగం పంతులుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థబతుకమ్మక్వినోవాగొట్టం గుట్టమల్లికజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరజాకార్జీమెయిల్నువ్వుల నూనెకల్క్యావతారముయనమల రామకృష్ణుడుశోభన్ బాబుజాతీయములుశ్రీ గౌరి ప్రియమంజుల (నటి)పరశురాముడుసుడిగాలి సుధీర్విశాఖపట్నంఆరూరి రమేష్గోత్రాలుపాల్కురికి సోమనాథుడుగురుడురుక్మిణి (సినిమా)ఆది పర్వముబ్రహ్మంగారి కాలజ్ఞానంవేసవి కాలంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆర్తీ అగర్వాల్ఘట్టమనేని కృష్ణవిడదల రజినిఆతుకూరి మొల్లరాధిక (నటి)రోహిత్ శర్మమహాభాగవతంమియా ఖలీఫాసిద్ధార్థ్మీనరాశిఏ.పి.జె. అబ్దుల్ కలామ్సామెతల జాబితాగరుడ పురాణంహైన్రిక్ క్లాసెన్రత్నం (2024 సినిమా)క్రిక్‌బజ్తెలుగుదేశం పార్టీగద్దర్స్త్రీవాదంఇంజెక్షన్కల్వకుంట్ల కవితఉత్తర ఫల్గుణి నక్షత్రముభారత ఎన్నికల కమిషనుప్లీహము🡆 More