నిమ్మగడ్డి

నిమ్మగడ్డి (Lemon grass) ఒక బహువార్షిక జాతికి చెందిన ఒక గడ్డి మొక్క.ఈ మొక్కలు 3 నుండి 4 అడుగుల ఎత్తువరకు గుబురుగా పెరుగుతుంది.వర్షపునీటి ప్రవాహం వల్ల వచ్చే నేల కోతలు పడకుండా అరికట్టటానికి ఈ పంట ఉపయోగపడుతుంది.నిమ్మగడ్ది నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు.నిమ్మనూనె వాడకం ఇప్పటిది కాదు.దీని వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి.

వంటకాలలోనూ, పరిమళాల పరిశ్రమలలోనూ, సౌందర్యచికిత్సల్లో,ఇంకా విటమిను ఎ తయారికీ దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. నిమ్మనూనెలో సిట్రాల్ అనే రసాయనముంటుంది.ఇది మంచి సవాసుననిస్తుంది.

నిమ్మగడ్డి
నిమ్మగడ్డి
నిమ్మగడ్డి మొక్కలు.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Poales
Family:
Genus:
సింబోపోగాన్

Spreng.

నూనె తీసే పద్ధతి

నిమ్మగడ్డి నూనె తీసే యంత్రం డిస్టిలేషన్ టాంకు,బాయిలర్,కండెన్సర్,సఫరేటర్ అనేభాగాలు ఉంటాయి. తాజా నిమ్మగడ్డి ఆకులను తీసుకుని డిస్టిలేషన్ టాంకులో నింపి మూతపెట్టి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి నీటి ఆవిరిద్వారా ద్రవ రూపంలోకి మారి, కండెన్సర్ ద్వారా సఫరేటర్లోకి చేరింది. దీనిని శుభ్రపరిచి నిల్వ చేసుకోవచ్చు.

నిమ్మగడ్డి నూనె ఉపయోగాలు

  • స్నానాల గదులలో వచ్చే దుర్వాసనను పోగొట్టటానికి నిమ్మనూనెలో ముంచిన దూదిని వాడతారు.
  • చెడు వాసనలను అరికట్టటానికి నిమ్మనూనెతో మరిగించిన నూనె ద్వారా ధూపం వేస్తారు.
  • వర్షాకాలంలో ఇండ్లలో దోమలు,ఈగలు ఎక్కువుగా ఉన్నప్పుడు నీటిలో రెండుచుక్కలు నిమ్మగడ్డి నూనె రెండు చుక్కలు వేసి ఆ ప్రాంతంలో తుడవటం,లేదా చల్లటం ద్వారా నివారించవచ్చు.
  • నిమ్మగడ్డి నూనెలో ఆస్ట్రిజెంట్ సుగుణాలు ఉన్నందున, దీనిని స్కిన్‌టోనర్‌గా చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది.
  • పేలు,చుండ్రు, కీళ్లనొప్పులుకు,జలుబు,జ్వరం నివారణలకు మందులాగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్‌, యాంటీ పైరెటిక్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌ సుగుణాలే అందుకు కారణం.
  • ఒత్తిడిని ఎదుర్కొనేవారు దీని సవాసన ద్వారా మనసుకు సాంత్వననివ్వడంలో ఉపయోగపడుతుంది
  • శరీరంలో అతిగా స్పందించే గ్రంథుల్ని కూడా సమతూకంలో ఉండేలా నియత్రించగల శక్తి నిమ్మగడ్డి నూనెకు ఉంది.

నిమ్మగడ్డి ఉపయోగాలు

నిమ్మగడ్డి ద్వారా తయారైన టీ త్రాగటంవలన జీర్ణ క్రియ వేగవంతం చేస్తుంది.భావోద్వేగాలను నియంత్రించి ఒత్తిడినిట్టే దూరం చేస్తుంది.లెమన్ గ్రాస్ టీ త్రాగటంవలన ఆరోగ్యపరంగా చూస్తే శరీరంలోని చెడు రసాయనాలు, మలినాలు తొలగిపోతాయని తెలుస్తుంది.దీనికున్న నిమ్మసువాసనే అందుక్కారణం. అందుకే అప్పుడప్పుడు భోజనానికి ముందు లేదా తర్వాతైనా కొద్దిగా నిమ్మగడ్డి టీ తాగడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. చాలా స్పాల్లో నిమ్మగడ్డి టీ వెల్‌కమ్‌ డ్రింక్‌గా ఇస్తారు.నిమ్మగడ్డిని సన్నగా తురిమి రోజూ తీసుకునే వంటకాలపై చల్లుకుని తినవచ్చు. నిమ్మగడ్డి పొడి, కొబ్బరిపాలు చక్కని కాంబినేషన్‌. చేపలు, చికెన్‌ తదితర వంటకాల్లో కొబ్బరిపాలతో పాటు నిమ్మగడ్డిని కూడా చేర్చవచ్చు. వేపుళ్లు కూరలు, పప్పులు, సలాడ్స్‌…పచ్చళ్లు ఇలా ఎలాంటి వంటకంలోనైనా నిమ్మగడ్డిని వాడవచ్చు.

నిమ్మగడ్డి, నిమ్మనూనె వలన నష్టాలు

నిమ్మగడ్డిని కానీ,నిమ్మనూనె ను కానీ వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ఒక్కోసారి దీనివల్ల ఎలర్జీలు రావచ్చు.తగు మోతాదులో వాడవలసిన అవసరం ఉంటుంది.

నిమ్మగడ్డిలో కొన్ని జాతులు

  • సింబోపోగన్ పెండలస్ (జమ్మూ నిమ్మగడ్డి)
  • సింబోపోగన్ ఫ్లెక్సువ్సస్ (తూర్పు భారత నిమ్మగడ్డి)
  • సింబోపోగన్ సిట్రాటస్ (పడమటి భారత నిమ్మగడ్డి)


ta:அருகம் புல்

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

నిమ్మగడ్డి నూనె తీసే పద్ధతినిమ్మగడ్డి నూనె ఉపయోగాలునిమ్మగడ్డి ఉపయోగాలునిమ్మగడ్డి , నిమ్మనూనె వలన నష్టాలునిమ్మగడ్డి లో కొన్ని జాతులునిమ్మగడ్డి మూలాలునిమ్మగడ్డి వెలుపలి లంకెలునిమ్మగడ్డి

🔥 Trending searches on Wiki తెలుగు:

నవగ్రహాలు జ్యోతిషంనవరసాలుముదిరాజ్ (కులం)నరసింహావతారంతెలంగాణ జాతరలుఫ్లిప్‌కార్ట్కాశీనాని (నటుడు)పొట్టి శ్రీరాములుకేతిరెడ్డి పెద్దారెడ్డివందేమాతరంకిలారి ఆనంద్ పాల్తెలంగాణ రాష్ట్ర సమితిగీతా మాధురితెలుగు అక్షరాలుదుర్యోధనుడుసంస్కృతంతెలుగు నాటకంమదర్ థెరీసావాతావరణంజాతీయ మహిళ కమిషన్సైబర్ క్రైంగిడుగు వెంకట రామమూర్తిమూత్రపిండముకృష్ణా నదిహనుమాన్ చాలీసాకళ్యాణలక్ష్మి పథకంరోజా సెల్వమణికలబందదేవీ ప్రసాద్బంగారు బుల్లోడుటి. రాజాసింగ్ లోథ్నవరత్నాలుజయసుధశరత్ బాబుబరాక్ ఒబామామహాభారతంబాలగంగాధర తిలక్తెలుగు సినిమాలు 2023భారతదేశ అత్యున్నత న్యాయస్థానంఆంధ్ర మహాసభ (తెలంగాణ)కాలేయంబంగారు బుల్లోడు (2021 సినిమా)పునర్వసు నక్షత్రముఆయాసంభారతదేశంలో విద్యసముద్రఖనిరెడ్డిమరణానంతర కర్మలుకుతుబ్ షాహీ వంశంచాకలి ఐలమ్మతెలంగాణ పల్లె ప్రగతి పథకంకాకతీయుల శాసనాలురమణ మహర్షిసామెతల జాబితాగ్రంథాలయంచోళ సామ్రాజ్యంతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2023-2024)పాలపిట్టశతక సాహిత్యముఆర్. విద్యాసాగ‌ర్‌రావుభూమిరవీంద్రనాథ్ ఠాగూర్విద్యఅంతర్జాతీయ నృత్య దినోత్సవంచంద్రుడుపనససర్పంచినరేంద్ర మోదీహలో గురు ప్రేమకోసమేపొడుపు కథలుసమాచార హక్కుకాపు, తెలగ, బలిజశ్రీలంకభారత రాజ్యాంగంగద్దర్జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్లోక్‌సభ స్పీకర్శాసనసభ🡆 More