టి. రాజాసింగ్ లోథ్

టి.

రాజాసింగ్ లోథ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

టి. రాజా సింగ్
టి. రాజాసింగ్ లోథ్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 - ప్రస్తుతం
నియోజకవర్గం గోషామహల్

వ్యక్తిగత వివరాలు

జననం (1977-04-15) 1977 ఏప్రిల్ 15 (వయసు 47)
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగు దేశం పార్టీ
తల్లిదండ్రులు టి.నావల్ సింగ్, రామి భాయి
జీవిత భాగస్వామి టి.ఉష భాయి
సంతానం 4 (3 కుమారులు, 1 కుమార్తె)
నివాసం ధూల్‌పేట్, హైదరాబాద్, 500006

జననం

టి.రాజాసింగ్ 1977, ఏప్రిల్ 15న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోషామహల్లో టి. నావల్ సింగ్, రామి భాయి దంపతులకు జన్మించాడు. అతను పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు.

వ్యక్తిగత జీవితం

రాజాసింగ్ కు ఉషాబాయితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేశాడు. అతను 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి, 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా పనిచేశాడు. రాజాసింగ్ 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అతను 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడుశాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.

రాజాసింగ్‌ ను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.

వివాదాలు

హైదరాబాద్ జూమెరత్ బజార్ లో స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి భాయ్ విగ్రహం తొలగింపు సంఘటనపై రాజాసింగ్‌పై కేసు నమోదైంది. అతను ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పై అభ్యంతరం తెలిపాడు. 2020, సెప్టెంబరులో రాజా సింగ్ హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తమ నియమావళిని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌ అతను వ్యక్తిగత ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపై నిషేధం విధించింది.

సస్పెన్షన్‌

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే కారణంతో 2022 ఆగస్టు 23న ఆయనను పార్టీ నుండి అధిష్ఠానం బహిష్కరణ చేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శాస‌నస‌భాప‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించి ఆయనపై చ‌ర్యలు తీసుకుంది. 2023లో జరిగే శాసనసభ ఎన్నికల సందర్బంగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను  పార్టీ నాయకత్వం 2023 అక్టోబర్ 22న ఎత్తివేసింది.

మూలాలు

Tags:

టి. రాజాసింగ్ లోథ్ జననంటి. రాజాసింగ్ లోథ్ వ్యక్తిగత జీవితంటి. రాజాసింగ్ లోథ్ రాజకీయ జీవితంటి. రాజాసింగ్ లోథ్ వివాదాలుటి. రాజాసింగ్ లోథ్ సస్పెన్షన్‌టి. రాజాసింగ్ లోథ్ మూలాలుటి. రాజాసింగ్ లోథ్2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుగోషామహల్ శాసనసభ నియోజకవర్గంతెలంగాణభారతీయ జనతా పార్టీరాజకీయ నాయకుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

త్రిఫల చూర్ణంభారతదేశ జిల్లాల జాబితాసుందరికరోనా వైరస్ 2019దక్షిణామూర్తి ఆలయంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఆంధ్రప్రదేశ్ చరిత్రఫిదాఅల్యూమినియంనక్షత్రం (జ్యోతిషం)లంబాడిదగ్గుబాటి వెంకటేష్గాయత్రీ మంత్రంచెక్కుదుమ్ములగొండిఅష్టవసువులుకాకినాడఆది పర్వముచిరంజీవి నటించిన సినిమాల జాబితాతెలంగాణనెమలితమిళనాడుపంచభూతలింగ క్షేత్రాలుఅన్నమయ్యవరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)రావి చెట్టుతెలుగు కులాలుచాకలి ఐలమ్మపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమేషరాశిబరాక్ ఒబామాకాకతీయులుసాయిపల్లవినిర్మలా సీతారామన్ఉత్తరాషాఢ నక్షత్రముకోజికోడ్చైనాదశదిశలుపూర్వాభాద్ర నక్షత్రముప్రియురాలు పిలిచిందిఘట్టమనేని మహేశ్ ‌బాబుహస్త నక్షత్రముపూర్వాషాఢ నక్షత్రముబ్రహ్మంగారి కాలజ్ఞానంఅనసూయ భరధ్వాజ్ధాన్యంవినుకొండకుంభరాశిస్వాతి నక్షత్రమురెడ్డిసప్త చిరంజీవులుజర్మన్ షెపర్డ్రఘురామ కృష్ణంరాజురామదాసుతీహార్ జైలుకన్యాశుల్కం (నాటకం)భూమా అఖిల ప్రియబ్రెజిల్గోత్రాలు జాబితాశ్రీముఖిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంనవీన్ పొలిశెట్టిచాట్‌జిపిటిభారతీయ శిక్షాస్మృతిమంచు మనోజ్ కుమార్కూచిపూడి నృత్యంమాయాబజార్భారత రాష్ట్రపతిపాఠశాలకాళోజీ నారాయణరావుపునర్వసు నక్షత్రముసింగిరెడ్డి నారాయణరెడ్డిఇందిరా గాంధీకుండలేశ్వరస్వామి దేవాలయంవేయి స్తంభాల గుడికృష్ణా నదిఢిల్లీ డేర్ డెవిల్స్🡆 More