కళ్యాణలక్ష్మి పథకం

కళ్యాణలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రం లోని నిరుపేద (దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన) యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం.

2017, మార్చి 13న ప్రవేశపెట్టిన 2017-18 తెలంగాణ బడ్జెట్ లో ఈ పథక ఆర్థిక సాయాన్ని రూ.51వేల నుండి రూ.75,116 లకు పెంచారు. 2018, మార్చి 19న రూ.1,00,116 కు పెంచారు. దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందజేస్తోంది.

కళ్యాణలక్ష్మి
కళ్యాణలక్ష్మి పథకం
కళ్యాణలక్ష్మి లోగో
పథకం రకంఆడబిడ్డల వివాహానికి ₹1,00,116 సాయం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనఅక్టోబర్‌ 2, 2014
బడ్జెట్ప్రతి సంవత్సరం ₹1450 కోట్లు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్టోబరు 2, 2014 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు. 18ఏళ్లు వయోపరిమితి ఉన్న బీసీ, ఓబీసీ యువతులకు ఈ పథకం వర్తిస్తుంది. గ్రామాల్లో ఆదాయం రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.

పథకం

ఈ పథకానికి 2014-15 బడ్జెటులో 230 కోట్ల రూపాయలు, 2016-17 బడ్జెటులో 738 కోట్ల రూపాయలు, 2018 బడ్జెట్లో 1,450 రూపాయలు కేటాయించబడ్డాయి. 2018 మార్చి 19న ఆర్థిక సహాయం ₹75,116 నుండి ₹1,00,116కి పెంచబడింది. ఇది పెళ్లి సమయంలో వధువు కుటుంబానికి పెళ్లి ఖర్చుల కోసం అందించబడుతుంది.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద 2021, సెప్టెంబరు 18వ తేదీనాటికి 7,14,575 మంది ఆడపిల్లలకు లబ్ధిచేకూరింది. దీనికోసం ప్రభుత్వం రూ.5,556.54 కోట్లు వెచ్చించింది. 2022, నవంబరు 18వ తేదీనాటికి 11,62,917 మంది ఆడపిల్లల పెళ్ళిలకు రూ.10,000 కోట్లు అందజేయబడింది. ఆర్థికసాయాన్ని అందజేశారు. ఇప్పటివరకు ఈ పథకానికి 13,18,983 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 11,62,917 మందికి ఈ పథకం వచ్చింది.

నిధుల కేటాయింపు

  • 2018–19 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లో ₹1450 కోట్లు కేటాయించబడింది.
  • కళ్యాణలక్ష్మి పథకం కింద 2020-21, 2022-23 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో ₹1850 కోట్లు కేటాయించి, ఒకేసారి విడుదల చేసింది.
  • 2023–24 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ లో ₹2000 కోట్లు కేటాయించి, 2023 ఏప్రిల్ 19న ఆ మొత్తం నిధులను మొదటి త్రైమాసికం విడతలోనే విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

నియమాలు - అర్హతలు

  1. అర్హులైన యువతులు తమ వివాహానికి నెల రోజుల ముందు మీ-సేవ కేంద్రాల నుంచి దరఖాస్తు చేసుకోవాలి
  2. దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన యువతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు
  3. ధరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వారి కుటుంబ సభ్యుల ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు
  4. వివాహ సమయానికి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి
  5. బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)

కావలసిన ధ్రువపత్రాలు

  1. పుట్టిన తేదీ ధృవపత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది)
  2. కులం ధృవీకరణ పత్రం (మీసేవ ద్వారా సంబంధిత అధికారులు జారీ చేసినది)
  3. ఆదాయ ధృవీవకరణ పత్రం (వివాహం జరుగు తేదీ నాటికి 6 నెలలలోపు మీ-సేవ ద్వారా సంబంధిత అధికారిచేత జారీ చేసినది)
  4. పెళ్లికూతురు, పెళ్ళికుమారుడికి చెందిన ఇద్దరి ఆధార్ కార్డులు
  5. బ్యాంకు ఖాతా పుస్తకం (వధువు పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్న బ్యాంకు ఖాతా పుస్తకంపై వధువు ఫొటో తప్పనిసరిగా ఉండాలి)
  6. వివాహ ఆహ్వాన పత్రిక

ధరఖాస్తు విధానం

తెలంగాణ ఈపాస్లో ధరఖాస్తు చేసుకోవాలి. పెళ్ళికి 10 రోజుల ముందు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఇతర వివరాలు

వివాహం జరిగిన తరువాత కళ్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం చేయాలనే నిబంధనను మార్చి, పెళ్ళి అవసరాలకోసం డబ్బును ముందే అందించాలన్న ఉద్దేశంతో దరఖాస్తు చేసిన కొద్ది రోజులలోనే ఆ దరఖాస్తు ఫారాలను పరిశీలించి, రూ.1,00,116 ఆర్థిక సాయం వధువు పేరుమీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయంలో, లేదా దగ్గరలోని తహసీల్దార్ కార్యాలయంలో పూర్తి సమాచారం పొందవచ్చు. ఈ పథకం ద్వారా మార్చి 2018 నాటికి 3,65,000 మందికి లబ్ధి చేకూరింది.

  1. 2020లో 1.67 లక్షల పైచిలుకు మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అందాయి.

మూలాలు

Tags:

కళ్యాణలక్ష్మి పథకం ప్రారంభంకళ్యాణలక్ష్మి పథకం పథకంకళ్యాణలక్ష్మి పథకం నిధుల కేటాయింపుకళ్యాణలక్ష్మి పథకం నియమాలు - అర్హతలుకళ్యాణలక్ష్మి పథకం కావలసిన ధ్రువపత్రాలుకళ్యాణలక్ష్మి పథకం ధరఖాస్తు విధానంకళ్యాణలక్ష్మి పథకం ఇతర వివరాలుకళ్యాణలక్ష్మి పథకం మూలాలుకళ్యాణలక్ష్మి పథకంతెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2017-2018)తెలంగాణ రాష్ట్రంవివాహం (పెళ్లి)

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్వకుంట్ల చంద్రశేఖరరావుసౌందర్యఫేస్‌బుక్దగ్గుబాటి వెంకటేష్దేవుడుమహాత్మా గాంధీపాములపర్తి వెంకట నరసింహారావుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.జీమెయిల్అంగచూషణఆంధ్రజ్యోతివిజయశాంతిరాజనీతి శాస్త్రముసోనియా గాంధీఅధిక ఉమ్మనీరువడ్రంగిజాతీయములుప్రియురాలు పిలిచిందితాటి ముంజలుశ్రీనివాస రామానుజన్ముదిరాజ్ (కులం)తెలంగాణ జిల్లాల జాబితాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఈడెన్ గార్డెన్స్చదరంగం (ఆట)నందమూరి బాలకృష్ణతెలంగాణ చరిత్రఆలంపూర్ జోగులాంబ దేవాలయంప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిఇన్‌స్టాగ్రామ్వంగవీటి రంగాఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రినువ్వు నాకు నచ్చావ్చేతబడిరెండవ ప్రపంచ యుద్ధంగన్నేరు చెట్టుశ్రుతి హాసన్క్రిక్‌బజ్మీనరాశిశ్రీముఖిఆవురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఅక్షరమాలఇతర వెనుకబడిన తరగతుల జాబితాసోమనాథ్వంగవీటి రాధాకృష్ణలక్ష్మీనారాయణ వి విచతుర్వేదాలుకృత్తిక నక్షత్రముకడప లోక్‌సభ నియోజకవర్గం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపసుపు గణపతి పూజఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితావిశాఖ నక్షత్రముతెలంగాణబమ్మెర పోతనశ్రీ చక్రంకరోనా వైరస్ 2019వినాయకుడుతోటపల్లి మధుడామన్కులంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఋగ్వేదంమధుమేహంభారతదేశంలో సెక్యులరిజంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)సముద్రఖనిగోదావరిగురువు (జ్యోతిషం)అక్కినేని నాగేశ్వరరావుఅనూరాధ నక్షత్రంనితీశ్ కుమార్ రెడ్డితన్నీరు హరీశ్ రావు🡆 More