తుర్కమేనిస్తాన్

తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్‌మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము.

దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు, తూర్పున కాస్పియన్ సముద్రము ఉన్నాయి.

Türkmenistan Jumhuriyäti
రిపబ్లిక్ ఆఫ్ తుర్కమేనిస్తాన్
Flag of తుర్కమేనిస్తాన్ తుర్కమేనిస్తాన్ యొక్క చిహ్నం
జాతీయగీతం

తుర్కమేనిస్తాన్ యొక్క స్థానం
తుర్కమేనిస్తాన్ యొక్క స్థానం
రాజధాని
అతి పెద్ద నగరం
అష్గబత్
37°58′N 58°20′E / 37.967°N 58.333°E / 37.967; 58.333
అధికార భాషలు తుర్క్‌మెన్
ప్రభుత్వం ఏక పార్టీ పాలన
స్వాతంత్యము
విస్తీర్ణం
 -  మొత్తం 488,100 కి.మీ² (52వది)
188,457 చ.మై 
 -  జలాలు (%) 4.9%
జనాభా
 -  2005 అంచనా 4,833,000 (113వది2)
 -  జన సాంద్రత 10 /కి.మీ² (173వది)
26 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $29.38 బిలియన్ (94th)
 -  తలసరి $5,900 (92వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2003) 0.738 (medium) (97వది)
కరెన్సీ తుర్క్‌మెన్ మనత్ (TMM)
కాలాంశం (UTC+5)
 -  వేసవి (DST)  (UTC+6)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .tm
కాలింగ్ కోడ్ +993
1.) నియజోవ్ అధ్యక్షుడుగా , మంత్రివర్గానికి నాయకుడుగా కూడా వ్యవహరిస్తున్నారు.
2.) 2005 గణాంకాల పై ఆధారిత ర్యాంకు

చరిత్ర

తుర్కమేనిస్తాన్ ప్రాంతము అనాదిగా జనవాసములు కలిగిన ప్రాంతము. అనేక సామ్రాజ్యాల సైన్యాలు పుష్కలమైన ప్రదేశాలకు వెళుతూ మార్గమధ్యములో ఇక్కడ తిష్ట వేశాయి.

క్రీ.పూ. 4వ శతాబ్దములో అలెగ్జాండర్ ఇండియా వెళ్లే మార్గములో తుర్కమేనిస్తాన్ ను జయించాడు. ఆ తరువాత నూటా యాభై సంవత్సరాలకు ప్రస్తుత రాజధాని అష్గబత్ పరిసర ప్రాంతములోనున్న నిసా రాజధానిగా పార్థియన్ సామ్రాజ్యము స్థాపించబడింది. 7వ శతాబ్దములో అరబ్బులు ఈ ప్రాంతాన్ని జయించి ఇస్లాం మతాన్ని వ్యాపించజేశారు. దీనితో తుర్క్‌మెన్ మధ్య ప్రాచ్య సంస్కృతిలో భాగమైనారు. ఇదే సమయములో ఆసియా, ఐరోపాల మధ్య అతిపెద్ద వాణిజ్య మార్గముగా ప్రఖ్యాత సిల్క్ రోడ్ అభివృద్ధి చెందినది.

ఖలీఫా అల్ మామూన్ తన రాజధాని మెర్వ్కు తరలించినప్పుడు అనతి కాలములోనే తుర్కమేనిస్తాన్ ప్రాంతము గ్రేటర్ ఖొరాసాన్ యొక్క రాజధానిగా ప్రసిద్ధి చెందినది.

11వ శతాబ్దము మధ్య కాలములో, సెల్ద్‌జుక్ సామ్రాజ్యమునకు చెందిన శక్తివంతమైన తుర్కలు ఆఫ్ఘనిస్తాన్ వరకు సామ్రాజ్యాన్ని విస్తరించడానికి తమ శక్తిని తుర్కమేనిస్తాన్ ప్రాంతములో కేంద్రీకరించారు. అయితే 12వ శతాబ్దపు రెండవ అర్ధ భాగములో ఆ సామ్రాజ్యము విచ్ఛిన్నమై తుర్క్‌మెన్ తమ స్వాతంత్ర్యము కోల్పోయారు. చెంఘీజ్ ఖాన్ తన పశ్చిమ దండయాత్రలో భాగముగా కాస్పియన్ సముద్రము యొక్క తూర్పు తీర ప్రాంతాన్ని తన ఆధినములోకి తెచ్చుకొన్నాడు. తర్వాత యేడు శతాబ్దాల పాటు తుర్క్‌మెన్ ప్రజలు అనేక సామ్రాజ్యాల పాలనలో తరచూ అంతర్-తెగల యుద్ధాలతో జీవించారు.

తుర్కమేనిస్తాన్ పర్షియా నుండి వేర్పడి 1865 నుండి 1885 వరకు రష్యాలో కలపబడింది. 1894 వరకు తుర్కమేనిస్తాన్ పూర్తిగా రష్యన్ సామ్రాజ్యము యొక్క ఆధీనములోకి వచ్చింది. 1917 లో జరిగిన రష్యన్ విప్లవము, దాని తరువాత నెలకొన్న రాజకీయ ఉన్రెస్త్ 1924లో తుర్కమేనిస్తాన్ ను సోవియట్ సమాఖ్య యొక్క 15వ రిపబ్లిక్‌గా ప్రకటించడానికి దారితీసినది. అప్పుడే ఆధునిక సరిహద్దులతో ప్రస్తుత రూపములోని తుర్కమేనిస్తాన్ అవతరించింది.

1991లో సోవియట్ సమాఖ్య విఛ్ఛిన్నము కావడముతో తుర్కమేనిస్తాన్ కు స్వాతంత్ర్యము వచ్చింది. స్వాతంత్ర్యము తర్వాత కూడా సోవియట్ కాలపు కమ్యూనిష్టు నేత, సపర్మురత్ నియజోవ్ అధికారములో కొనసాగాడు.

రాజకీయాలు

పూర్వపు సోవియట్ సమాఖ్య యొక్క కమ్యూనిష్టు పార్టీలో బ్యూరోక్రాట్ అయిన సపర్మురత్ నియజోవ్, జీవితకాల అధ్యక్షునిగా తుర్కమేనిస్తాన్ యొక్క సర్వాధికారాలు తన గుప్పెట పెట్టుకొన్నాడు. ఈయన వ్యతిరేకతను సహించడు. అధ్యక్షుడు నియజోవ్ తుర్క్‌మెన్‌బాషీ (సమస్త తుర్క్‌మెన్ల యొక్క నాయకుడు) గా వ్యక్తి పూజ సర్వవ్యాపితమై ఉంది. ఈయన ముఖచిత్రము తుర్కమేనిస్తాన్ లో కరెన్సీ నోట్ల నుండి వోడ్కా సీసాల వరకు అన్నింటిమీద కనిపిస్తుంది. తుర్క్‌మెన్ జాతీయ టెలివిజన్ యొక్క చిహ్నము కూడా ఈయన చిత్రమే. నియజోవ్ రాసిన రెండు పుస్తకాలు పాఠశాలలో, మోటరుక్లబ్బుల్లో, ఇళ్లల్లో తప్పనిసరిగా చదవలసినవిగా ఆజ్ఞ జారీ చేశారు. ఈయన పేరుపెట్టలేని సంస్థలకు ఈయన తల్లి పేరు పెట్టారు. అన్ని గోడ, చేతి గడియారాలలో డయల్ మీద నియజోవ్ ముఖచిత్రము ముద్రించబడింది. రాజధాని నగరములో తానే స్వయంగా రూపొందించిన 15 మీటర్ల ఎత్తైన నియజోవ్ విగ్రహము తిరిగే మండపముపై ప్రతిష్ఠించారు. ఇది అన్నివేళలా సూర్యుని ఎదురుగా ఉండి నగరముపై కాంతి విరజిమ్ముతూ ఉంటుంది. అయితే నిజజీవితములో నియజోవ్ అంత పొడుగు మనిషేమీ కాదు. కేవలము ఐదడుగుల ఎత్తే.

తుర్క్‌మెన్లలో బాగా ప్రాచుర్యము పొందిన నినాదము హల్క్! వతన్! తుర్క్‌మెన్‌బాషి (ప్రజలు! మాతృభూమి! నాయకుడు!) నియజోవ్ వారములో రోజుల పేర్లను మార్చి తన కుటుంబసభ్యుల పేర్లు పెట్టాడు. సరికొత్త తుర్క్‌మెన్ జాతీయ గీతాన్ని, ప్రతిజ్ఞను స్వయంగా రాశాడు. అందులో మాతృభూమిని, తుర్క్‌మెన్‌బాషీని తులనాడిన వారి చేతులు తీసెయ్యాలని కుడా ఉంది.

తుర్కమేనిస్తాన్ యొక్క విస్తార సహజ వాయువు నిల్వలను చేజిక్కించుకోవాలనుకుంటున్న విదేశీ కంపెనీలకు ఈ నిల్వలు నియజోవ్ ఆధీనములో ఉండటము వలన ఆయనతో సహకరించక తప్పట్లేదు. ఇదే కారణముచేత ఈయన రాసిన "రుహనామా" పుస్తకము విదేశీ పారిశ్రామికవేత్తలచే క్రొయేషియన్, పోలిష్, హంగేరియన్, బంటూ మొదలైన ప్రపంచములోని ముఖ్య భాషలన్నింటిలో ప్రచురించబడింది.

ప్రాంతాలు

తుర్కమేనిస్తాన్ 5 ప్రాంతాలు లేదా వెలాయత్లర్ (ఏకవచనము - వెలాయత్), ఒక స్వతంత్ర నగరముగా విభజించబడింది.

తుర్కమేనిస్తాన్ 
ప్రాంతము ISO 3166-2 రాజధాని విస్తీర్ణము (చ.కి.మీ) విస్తీర్ణము (చ.మఈ) జనాభా (1995) పటసూచిక
అష్గబత్ అష్గబత్ 604,000
అహాల్ ప్రాంతము TM-A అష్గబత్ 95,000 36,680 722,800 1
బాల్కన్ ప్రాంతము TM-B బాల్కనబత్  138,000 53,280 424,700 2
దషోవుజ్ ప్రాంతము TM-D దషొగుజ్ 74,000 28,570 1,059,800 3
లెబాప్ ప్రాంతము TM-L తుర్క్‌మెనబత్ 94,000  36,290 1,034,700 4
మేరీ ప్రాంతము TM-M మేరీ 87,000 33,590. 1,146,800 5

భౌగోళికము

తుర్కమేనిస్తాన్ 
తుర్కమేనిస్తాన్ పటము

తుర్కమేనిస్తాన్ విస్తీర్ణము దాదాపు 488,100 చ.కి.మీలు. దేశము యొక్క 90% విస్తీర్ణంలో కారాకుం ఎడారి వ్యాపించిఉన్నది. మధ్య భాగమును తురాన్ లోతట్టుభూమి, కారాకుం ఎడారి ఆక్రమించుచున్నాయి. ఇవి అంతా చదునైన భూములు. నైఋతి సరిహద్దు వెంటా ఉన్న కోపెత్ దాగ్ పర్వతశ్రేణులు 2,912 మీటర్ల ఎత్తుకు చేరుతున్నవి. దూర పశ్చిమాన బాల్కన్ పర్వతాలు, దూర తూర్పున కుగితాంగ్ శ్రేణులు దేశములోని ఇతర చెప్పుకోదగిన ఎత్తైన ప్రదేశాలు. ఆమూ దర్యా, హరి రుద్ ఈ దేశము గుండా ప్రవహించే నదులు.

ఇక్కడ స్వల్ప వర్షాలతో కూడిన ఉప ఆయనరేఖా ప్రాంతపు ఎడారి వాతావరణము. శీతాకాలాలు పొడిగా, మితముగా ఉంటాయి. జనవరి నుండి మే వరకు చాలా మటుకు అవపాతము కురుస్తుంది. కోపెత్ దాగ్ శ్రేణులు అన్నింటికంటే ఎక్కువ అవపాతాన్ని పొందుతాయి.

ఇతర నగరములు : తుర్క్‌మెన్‌బాషి (ఇదివరకటి క్రాస్నొవోడ్స్క్), దషొగుజ్.

ఆర్ధిక వ్యవస్థ

తుర్కమేనిస్తాన్ ప్రపంచములోనే 10వ పత్తి ఉత్పత్తిదారు. సాగుభూమిలో సగభాగము పత్తి పండిస్తారు. ప్రపంచములోనే 5వ పెద్ద సహజ వాయువు నిల్వలు, చమురు నిల్వలు తుర్కమేనిస్తాన్‌లో ఉన్నాయి. 1994లో రష్యా తుర్క్‌మెన్ సహజ వాయువును హార్డ్ కరెన్సీ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి నిరాకరించడము, పూర్వపు సోవియట్ సమాఖ్యలోని పెద్ద తుర్క్‌మెన్ సహజ వాయువు వినియోగదారుల అప్పులు కొండలా పెరిగి పోవడముతో పారిశ్రామిక ఉత్పాదన వేగంగా అడుగంటి దేశ బడ్జెట్ మెరుగులో నుండి స్వల్ప తరుగుకు వెళ్లినది.

తుర్కమేనిస్తాన్ తమ సహజవాయువు, పత్తి అమ్మకాలతో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను నెట్టుకు రాగలమనే ఆశతో సంస్కరణల మార్గములో ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రైవేటీకరణ లక్ష్యాలు పరిమితముగానే ఉన్నాయి. 1998 నుండి 2002 మధ్య కాలములో తుర్కమేనిస్తాన్ తగినన్ని సహజ వాయువు ఎగుమతి మార్గాలు లేక, విస్తారమైన స్వల్పకాలిక విదేశీ అప్పు వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. అదే సమయములో అంతర్జాతీయముగా చమురు, వాయువు ధరలు పెరగడము వలన మొత్తము ఎగుమతుల యొక్క విలువ మాత్రము త్వరితగతిన పెరిగింది. సర్వవ్యాప్తమైన అంతర్గత పేదరికము, విదేశీ అప్పు భారము,, మార్కెట్ అనుకూల సంస్కరణలను అవలంభించడానికి ప్రభుత్వము యొక్క విముఖత వలన దగ్గరి భవిష్యత్తు నిరాశాజనకముగానే ఉంది.

అధ్యక్షుడు నియజోవ్ తన సొంత దర్జాలకోసము దేశము యొక్క ఖజానను ఖాళీ చేసాడు. రాజధాని బయటి ప్రాంతాలలోని ప్రజలు కటిక దారిద్ర్యముతో పోరాడుతుంటే నగరములకు, ప్రత్యేకముగా అష్గబత్కు, విస్తారముగా హంగులు కూర్చి రూపుదిద్దాడు. నియజోవ్ ఉచిత మంచినీరు, విద్యుచ్ఛక్తి, ఇంధనము ఇస్తానని ప్రమాణము చేశాడు కానీ కోతలు సర్వసాధారణము.

ప్రజలు

తుర్కమేనిస్తాన్ 
సాంప్రదాయక వస్త్రధారణలో ఒక తుర్క్‌మేన్

తుర్కమేనిస్తాన్ లో అధిక సంఖ్యాక ప్రజలు తుర్క్‌మెన్ జాతికి చెందినవారు. రష్యన్లు, ఉజ్బెక్లు ఇతర జాతుల ప్రజలు. జాతుల మధ్య వారధిగా రష్యన్ భాష ఇంకా విరివిగా ఉపయోగిస్తున్నప్పటికీ తుర్క్‌మెన్ భాష తుర్కమేనిస్తాన్ యొక్క అధికార భాష. ఉన్నత పాఠశాల స్థాయి వరకు విద్యాభ్యాసము అందరికీ తప్పనిసరి. పాఠశాల విద్య యొక్క నిడివి ఇటీవల 11 నుండి 9 సంవత్సరాలకు కుదించబడింది.

గణాంకాలు

తుర్కమేనిస్తాన్ 
Turkmen Census of 2012.

తుర్క్మెనిస్థాన్‌లో అధికంగా తుర్క్మెన్లు ఉన్నారు. వీరిలో గణనీయంగా ఉజ్బెకియన్లు, రష్యన్లు ఉన్నారు. అల్పసంఖ్యాక ప్రజలలో కజక్‌స్థానీయులు, తాతర్లు, కుర్దీలు (కోపెట్ డాఘ్ పర్వతప్రాంత స్థానికులు), ఆర్మేనియన్లు, అజర్బైజనీ ప్రజలు, బలోచ్ ప్రజలు, పష్టన్ ప్రజలు ఉన్నారు. 1939లో 18.6% ఉన్న రష్యన్ సంప్రదాయ ప్రజలు 1989 నాటికి 9,5% అయ్యారు. కొన్ని ప్రత్యేక కారణాల వలన తుర్క్మెనిస్థానీయుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని 2012 గణాంకాలు నిర్ధారించాయి." సి.ఐ.ఎ. వరల్డ్ ఫేస్ బుక్ " ఆధారంగా తుర్క్మెనిస్థాన్‌లో 85% టర్క్మెనియన్లు, 5% ఉజ్బెకియన్లు, 4% రష్యన్లు, 6% ఇతరులు ఉన్నారు. అష్గాబత్ డేటా ఆధారంగా 91% ప్రజలు టర్మెనీయులు, 3% ఉజ్బెకీయన్లు, 2% రష్యన్లు ఉన్నారని అంచనా. 1989, 2001 మద్య కాలంలో టర్క్మెనియన్లు 2.5 నుండి 4.9 మిలియన్లకు చేరుకుంది. రష్యన్ల సంఖ్య మూడింట రెండువంతులకు చేరింది. (3,34,000 నుండి 1,00,000).

భాషలు

తుర్కమెనిస్తాన్ అధికార భాష టర్క్‌మెన్. అయినప్పటికీ ఇప్పటికీ నగరాలలో రష్యాభాష వ్యవహార భాషగా ఉంది. టర్క్‌మెన్ భాష 72%, రష్యన్ భాష 12%, ఉజ్బెక్ భాష 9% ప్రజలలో వాడుకలో ఉంది. ఇతర భాషలు 7% వాడుకలో ఉన్నాయి. రష్యన్ భాష మాట్లాడే ప్రజల సంఖ్య 3,49,000, ఉజ్బెకి భాష 3,17,000, కజక్ భాష 88,000, తాతర్ భాష 40,000, ఉక్రెయి భాష 37,118, అజర్బైజనీ భాష 33,000, ఆర్మేనియన్ భాష 32,000, నార్తెన్ కుర్దిష్ భాష 20,000, లెజ్గియన్ భాష 10,400, పర్షియన్ భాష 8,000, బెలరూషియన్ భాష 2,540, ఒస్సెటిక్ భాష 1,890, దర్గ్వా భాష 1,600, లాక్ భాష 1,590, తజిక్ భాష 1,280, జార్జియన్ భాష 1,050, లితుయానియన్ భాష 224, తబసరన్ భాష 180, డంగన్ భాష ప్రజలకు వాడుక భాషలుగా ఉన్నాయి.

మతం

Turkmenistan Religions
Islam
  
89%
Christianity
  
10%
unknown
  
1%
దస్త్రం:Ashgabat (3891760823).jpg
Türkmenbaşy Ruhy Mosque the largest in Central Asia
తుర్కమేనిస్తాన్ 
Russian Orthodox church in Mary

" ది వరల్డ్ ఫేస్ బుక్ " ఆధారంగా ముస్లిముల శాతం 89%, ఈస్టర్న్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన ప్రజలశాతం 9%, ఏమతానికి చెందని వారు 2% ఉన్నారు. 2009 గణాంకాల ఆధారంగా తుర్కమెనిస్తాన్‌లో 93.1% ముస్లిములున్నారని ప్యూ రీసెర్చి సెంటర్ పేర్కొన్నది. మొదటిసారిగా మిషనరీలు దేశంలో ప్రవేశించి స్థానిక తెగలలో ప్రచారంచేసి తరువాత మతద్థాపకులుగా మారారు. సోవియట్ శకంలో కమ్యూనిస్ట్ అథారిటీలు అన్ని మతవిశ్వాసాలు అణిచివేయబడ్డాయి. కమ్యూనిస్ట్ పాలనలో మతపాఠశాలలు, మతం మీద నిషేధం విధించబడింది. విస్తారమైన మసీదులు మూసివేయబడ్డాయి. 1990 నుండి సోవియట్ పాలన ముగింపుకు వచ్చిన తరువాత మత వారసత్వం పునరుద్ధరించబడింది.మునుపటి అధ్యక్షుడు సపర్మురత్ నియజొవ్ ఇస్లామిక్ మూలసూత్రాలు పబ్లి స్కూల్స్‌లో బోధించాలని ఆదేశించాడు. సౌదీ అరేబియా, కువైత్, టర్కీ మద్దతుతో స్కూల్స్, మసీదులవంటి మతసంస్థలు తిరిగి స్త్యాపించబడ్డాయి. స్కూల్స్, మసీదులలో అరబిక్ భాషలో కురాన్, హదిత్, చరిత్ర బోధించబడింది. అధ్యక్షుడు నియాజొవ్ స్వయంగా మతసంబధిత విషయాలు రుహ్నామా పేరుతో ప్రత్యేక వాల్యూములుగా 2001, 2004లో రచించాడు. బహై మతం ఆరంభం నుండి తుర్కమెనిస్థాన్‌లో ఉనికిలో ఉంది. దేశంలో బహై సమూహాలు ఉనికిలో ఉన్నాయి. 20వ శతాబ్దంలో అష్గబత్‌లో " బహై హౌస్ ఆఫ్ వర్షిప్ " నిర్మించబడింది. 1920లో సోవియట్ దానిని స్వాధీనపరచుకుని దానిని ఆర్ట్ గ్యాలరీగా మార్చింది. 1948 భూకంపం సమయంలో దెబ్బతిని తరువాత పూర్తిగా ధ్వంసం అయింది. తరువాత అది పబ్లిక్ పార్కుగా చేయబడింది. క్రైస్తవులలో ఆర్మేనియన్ అపోస్టోలిక్ చర్చి, రోమన్ కాథలిక్ చర్చి, పెంటెకోస్టల్ క్రిస్టియంస్, ది కాలే హేవత్ వర్డ్ ఆఫ్ లైఫ్ చర్చి, ది గ్రేటర్ గ్రేస్ వరల్డ్ ఔట్ రీచ్ చర్చి, ది న్యూ అపొస్టోలిక్ చర్చి, జెహోవాస్ విట్నెసెస్, యూదిజం, ఇతర క్రైస్తవ సమూహాలకు చెందిన ప్రజలు ఉన్నారు. అదనంగా చిన్న సమూహాలుగా బహై ప్రజలు, బాప్టిస్టులు, సెవెంత్ - డే- అడ్వెంటిస్టులు, హరే కృష్ణా సంస్థకు చెందిన వారు ఉన్నారు.

బయటి లింకులు

మూలాలు

మూస:కామన్వెల్తు దేశాలు

Tags:

తుర్కమేనిస్తాన్ చరిత్రతుర్కమేనిస్తాన్ రాజకీయాలుతుర్కమేనిస్తాన్ ప్రాంతాలుతుర్కమేనిస్తాన్ భౌగోళికముతుర్కమేనిస్తాన్ ఆర్ధిక వ్యవస్థతుర్కమేనిస్తాన్ ప్రజలుతుర్కమేనిస్తాన్ గణాంకాలుతుర్కమేనిస్తాన్ బయటి లింకులుతుర్కమేనిస్తాన్ మూలాలుతుర్కమేనిస్తాన్ఆఫ్ఘానిస్తాన్ఇరాన్ఉజ్బెకిస్తాన్కాస్పియన్ సముద్రముఖజకిస్తాన్మధ్య ఆసియా

🔥 Trending searches on Wiki తెలుగు:

నోటాకానుగతెలంగాణ జనాభా గణాంకాలురాజశేఖర్ (నటుడు)మంగళగిరి శాసనసభ నియోజకవర్గంభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)మాధవీ లతసీతాదేవితెలుగు సాహిత్యంఏప్రిల్ 25తొలిప్రేమప్రకాష్ రాజ్వందేమాతరంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుకేరళశ్రావణ భార్గవిరష్మి గౌతమ్రావణుడుత్రిష కృష్ణన్ఆవర్తన పట్టికభారతదేశంలో బ్రిటిషు పాలనపాడ్యమిఏలూరురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్టైఫాయిడ్కొండా విశ్వేశ్వర్ రెడ్డిశోభన్ బాబుఇక్ష్వాకులుధనిష్ఠ నక్షత్రముశ్రీలలిత (గాయని)రోజా సెల్వమణికాన్సర్పోలవరం ప్రాజెక్టుH (అక్షరం)శ్రీముఖిసాక్షి (దినపత్రిక)ఉప్పు సత్యాగ్రహంపోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ప్రజా రాజ్యం పార్టీకమల్ హాసన్రాజీవ్ గాంధీనవగ్రహాలు జ్యోతిషంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవీరేంద్ర సెహ్వాగ్కాజల్ అగర్వాల్మలబద్దకంఆర్తీ అగర్వాల్అగ్నికులక్షత్రియులుదానం నాగేందర్ఆతుకూరి మొల్లరాకేష్ మాస్టర్శాతవాహనులుసాహిత్యంరమణ మహర్షిప్రభాస్వై.యస్. రాజశేఖరరెడ్డికర్కాటకరాశిగన్నేరు చెట్టుఅల్లూరి సీతారామరాజుఉలవలుఅమెజాన్ ప్రైమ్ వీడియోనారా చంద్రబాబునాయుడువ్యవస్థాపకతభారతదేశంలో సెక్యులరిజంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువంగవీటి రాధాకృష్ణసంస్కృతంకలియుగంహీమోగ్లోబిన్వడదెబ్బకాలేయంనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంఅమిత్ షాPHభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతెలుగు వికీపీడియాసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం🡆 More