చామంతి: మొక్కల జాతి

చేమంతి ఒక అందమైన పువ్వు.

పుష్పించే మొక్కలలోని క్రిసాంథిమం (Chrysanthemum) ప్రజాతికి చెందిన సుమారు 30 జాతుల మొక్కలు. ఇవి ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందినవి. చేమంతి శీతాకాలంలో పూస్తుంది. సాగులో ఉన్న చేమంతి రకాలను నక్షత్ర చేమంతి (చిన్నపూలు), పట్నం చేమంతి (మధ్యస్థపూలు), పెద్దసైజు పూలు గలవిగా విభజించవచ్చు.

చామంతి: రకాలు, సాగుచేయు విధానం, సస్యరక్షణ
చేమంతి పువ్వు.

చేమంతి
చామంతి: రకాలు, సాగుచేయు విధానం, సస్యరక్షణ
A cluster of chrysanthemums
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Asterids
Order:
Family:
Tribe:
Anthemideae
Genus:
క్రిసాంథిమం
Type species
క్రిసాంథిమం ఇండికం లి.
జాతులు

Chrysanthemum aphrodite
Chrysanthemum arcticum
Chrysanthemum argyrophyllum
Chrysanthemum arisanense
Chrysanthemum boreale
Chrysanthemum chalchingolicum
Chrysanthemum chanetii
Chrysanthemum cinerariaefolium
Chrysanthemum coronarium
Chrysanthemum crassum
Chrysanthemum glabriusculum
Chrysanthemum hypargyrum
Chrysanthemum indicum
Chrysanthemum japonense
Chrysanthemum japonicum
Chrysanthemum lavandulifolium
Chrysanthemum mawii
Chrysanthemum maximowiczii
Chrysanthemum mongolicum
Chrysanthemum morifolium
Chrysanthemum morii
Chrysanthemum okiense
Chrysanthemum oreastrum
Chrysanthemum ornatum
Chrysanthemum pacificum
Chrysanthemum potentilloides
Chrysanthemum segetum
Chrysanthemum shiwogiku
Chrysanthemum sinuatum
Chrysanthemum vestitum
Chrysanthemum weyrichii
Chrysanthemum yoshinaganthum
Chrysanthemum zawadskii

రకాలు

  • పసుపు పూల రకాలు: ఎల్లో గోల్డ్, రాయచూర్, సిల్పర్ (హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సాగుచేసే రకాలు)
  • తెలుపు పూల రకాలు: రత్లామ్ సెలక్షన్, బగ్గి, ఐ.ఐ.హెచ్. ఆర్ 6.
  • ఎరుపు పూల రకాలు: రెడ్‌గోల్డ్, కో2
చామంతి: రకాలు, సాగుచేయు విధానం, సస్యరక్షణ 
ఎర్ర చామంతి పూలు (వనస్థలిపురము)

సాగుచేయు విధానం

    వాతావరణం, నాటే సమయం

చేమంతి మొక్కలు పగటి సమయంలో శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చేమంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్, జూలై మాసాలలో మొక్కలను నాటినట్టయితే నవంబరు, డిసెంబరు మాసాలలో పూస్తాయి.

చామంతి: రకాలు, సాగుచేయు విధానం, సస్యరక్షణ 
చేమంతి పూలు.
    నేలలు

తేలికపాటి నేలలు అనుకూలం. ఉదజని సూచిక 6.5 నుండి 7 మధ్య ఉండాలి. మురుగునీటి పారుదల సరిగా లేకపోతే మొక్కలు చనిపోతాయి.

    ప్రవర్థకం

పిలకలు, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధకం చేస్తారు. పూలకోతలు అయిన తర్వాత ఫిబ్రవరి. మార్చినెలలలో మొక్కల నుంచి పిలకలను కత్తిరించి నారుమడిలో నాటుకోవాలి. మొక్కలను కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధకం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకలను జూన్, జూలై నెలలలో నాటుకోవాలి.

    నాటడం - ఎరువులు

మొక్కలను 20-30 సెం.మీ ఎడంగా నాటుకోవాలి. ఎకరాకు 55 వేల నుండి 60 వేల మొక్కలు అవసరమవుతాయి. నాటడానికి ముందు ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, 60 నుండి 80 కిలోల పొటాష్ వేసుకోవాలి.

    నీటి యాజమాన్యం

నాటిన మొదటి నెలలో వారానికి రెండు నుండి మూడు సార్లు, అటుతర్వాత వారానికి ఒక తడి ఇవ్వాలి.

    ఊతమివ్వటం

చేమంతి మొక్కలు వంగిపోకుండా వెదురు కర్రతో ఊతమివ్వడం మంచిది.

    దిగుబడి

నారు నాటిన తర్వాత సుమారు నెలరోజులకు చేమంతి మొక్కల తలలు త్రుంచివేయడం వల్ల పక్క కొమ్మలు ఏర్పడి అధిక పూల దిగుబడి పొందవచ్చు. ఒక్కొక్క మొక్క నుండి 75 నుండి 120 పూలను పొందవచ్చు.

    తలలు తుంచడం

నారు నాటిన నాలుగు వారాల తర్వాత చేమంతి మొక్కల తలలను తుంచివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల నిలువు పెరుగుదల ఆగి, పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది. పంట కూడా కొంత ఆలస్యంగా వస్తుంది.

    హార్మోన్ల వాడకం

వంద పి.పి.యం (100 మి.గ్రా. లను లీటరు నీటిలో) నాఫ్తలిన్ ఎసిటిక్ ఆవ్లూన్ని మొగ్గ దశకంటె ముందుగా పిచికారి చేస్తే పూతను కొంత ఆలస్యం చేయవచ్చు. వంద నుండి 150 పి.పి.యం జిబ్బరిలిక్ ఆవ్లూన్ని పిచికారి చేస్తే 15 నుండి 20 రోజులలో త్వరగా పూతకొస్తుంది.

    పూలకోత

జూన్, జూలైలో నాటిన మొక్కలు డిసెంబరు, జనవరి వరకు పూతపూసి కోతకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపు 10 నుండి 15 సార్లు పూలు కోయవచ్చు. ఎకరాకు 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది.

సస్యరక్షణ

చేమంతి పంటకు ముఖ్యంగా పచ్చపురుగు, ముడత, ఆకు తొలుచు పురుగు ఎక్కువగా నష్టం కలగచేస్తాయి.

పచ్చపురుగు: ఈ గొంగళి పురుగులు ఆకులను తినివేయడమే కాక పువ్వును కూడా పాడుచేస్తాయి. నివారణకు మలాథియాన్ 5 శాతం పొడి 8 కిలోలను గాని లేక క్వినాల్‌ఫాస్ పొడి 8 కిలోలు ఎకరం విస్తీర్ణంలో చల్లుకోవాలి. లేదా ఎండోసల్ఫాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకుని నివారించవచ్చు.

త్రిప్పు: ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు ముడుతలు పడి ఉండిపోతాయి. పూలు కూడా వాడిపోతాయి. నివారణకు డైమిధోయేట్ 1.5 మి.లీ. లేక కార్బరిల్ 50 శాతం పొడిని 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తెగుళ్లు: నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకులపై ఏర్పడటం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణకు మంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వెలుపలి లింకులు

Tags:

చామంతి రకాలుచామంతి సాగుచేయు విధానంచామంతి సస్యరక్షణచామంతి వెలుపలి లింకులుచామంతిఆసియాక్రిసాంథిమంపువ్వుపుష్పించే మొక్కమొక్కలువ్యవసాయంశీతాకాలం

🔥 Trending searches on Wiki తెలుగు:

మీనరాశివాసుకి (నటి)గోత్రాలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంనాయీ బ్రాహ్మణులుఉదయకిరణ్ (నటుడు)ఝాన్సీ లక్ష్మీబాయిరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్2024 భారతదేశ ఎన్నికలువిడదల రజినిశ్రీనాథుడురక్త పింజరిఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంమా తెలుగు తల్లికి మల్లె పూదండవినోద్ కాంబ్లీశ్రవణ నక్షత్రముజయలలిత (నటి)నాగ్ అశ్విన్తెలుగు సాహిత్యంభూమివిశ్వనాథ సత్యనారాయణఅ ఆమహాత్మా గాంధీజ్యోతీరావ్ ఫులేబీమాపేరుతెలుగు సినిమాలు 2022ప్రేమలుఏప్రిల్ 25చాట్‌జిపిటిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపన్ను (ఆర్థిక వ్యవస్థ)పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఎన్నికలుతిక్కనపూర్వ ఫల్గుణి నక్షత్రముభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుపిత్తాశయమునువ్వు నేనురెడ్డియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఋగ్వేదంనువ్వొస్తానంటే నేనొద్దంటానాసన్ రైజర్స్ హైదరాబాద్వాస్తు శాస్త్రంఅశ్వని నక్షత్రమునాయుడురామసహాయం సురేందర్ రెడ్డిశ్రీకాకుళం జిల్లాసంభోగంఛత్రపతి శివాజీసంధిరజత్ పాటిదార్పెళ్ళి చూపులు (2016 సినిమా)తెలుగుదేశం పార్టీరైతుకందుకూరి వీరేశలింగం పంతులుశివపురాణంతోటపల్లి మధుహను మాన్వంగా గీతబలి చక్రవర్తిశ్రీలీల (నటి)భారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురాబర్ట్ ఓపెన్‌హైమర్చిత్త నక్షత్రముగైనకాలజీఆరూరి రమేష్తెలంగాణఎస్. జానకిఅమెజాన్ ప్రైమ్ వీడియోభీమా (2024 సినిమా)ఒగ్గు కథమాధవీ లతమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఆర్టికల్ 370 రద్దుఉత్తరాషాఢ నక్షత్రముసిద్ధార్థ్మెరుపు🡆 More