కన్ఫ్యూషియస్ (ఆంగ్లం : Confucius) (చైనీస్ భాష : 孔 夫 子 Kǒng Fūzǐ లేదా K'ung-fu-tzu), సాహిత్యపరమైన అర్థం: కాంగ్ గురువు (Master Kong), (సెప్టెంబరు 28, క్రీ.పూ 551 – క్రీ.పూ.
479) చైనాకు చెందిన శోధకుడు,, సామాజిక తూర్పు దేశాల తత్వవేత్త. ఇతని బోధనలు, తత్వము అనేకానేక దేశాల ప్రజలపై తన లోతైన ప్రభావాన్ని చూపగలిగింది. ఉదాహరణకు చైనీస్, కొరియన్, జపనీస్, తైవానీస్, వియత్నామీస్ ఆలోచనలు, తత్వము, జీవితం.
చైనీయ తత్వము ప్రాచీన తత్వము | |
---|---|
孔夫子 | |
పేరు: | 孔丘|చైనీ భాష కాంగ్ కియు |
జననం: | క్రీ.పూ. సెప్టెంబరు 28, 551 కుఫూ, చైనా |
మరణం: | 479 క్రీ.పూ. కుఫూ, చైనా |
సిద్ధాంతం / సంప్రదాయం: | కన్ఫ్యూషియానిజం స్థాపకుడు |
ముఖ్య వ్యాపకాలు: | నీతి తత్వము, సామాజిక తత్వము, ఎథిక్స్ |
ప్రముఖ తత్వం: | కన్ఫ్యూషియానిజం |
ప్రభావితం చేసినవారు: | జ్హౌ కాలము చైనీయ తత్వం |
ప్రభావితమైనవారు: | తూర్పు తత్వవేత్తలు |
ఇతడి తత్వము, ప్రభుత్వ-నీతి పై, సామాజిక-సంబంధాలపై, న్యాయంపై,, ప్రామాణికతపై తన ప్రభావంచే నొక్కివక్కాణించగలిగినది. ఈ నియమాలు చైనాలో అమితంగా ఆదరణ పొందాయి. ఇతర తత్వాలు దాదాపు మరచిపోయేంత ప్రభావం చూపగలిగింది, ఉదా: హాన్ సామ్రాజ్యం నాటి చైనీయుల న్యాయవాదం (法家) లేదా టావోయిజం (道家) (206 క్రీ.పూ. – 220 సా.శ.). కన్ఫ్యూషియస్ ఆలోచనలు ఆతరువాతి కాలంలో అభివృద్ధి చెంది కన్ఫ్యూషియానిజం (儒家) అనే కొత్త తత్వానికి ఊపిరిపోసాయి. ఈ తత్వము యూరప్‌కు జెసూట్ సంఘం మాట్టియో రిక్కీ చే మొదటిసారిగా పరిచయం గావింపబడినది, దీని లాటిన్ నామం "కన్ఫ్యూషియస్".
ఇతని బోధనలు అనలెక్ట్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ (論語) లో కానవస్తాయి. ఈ బోధనలన్నీ కన్ఫ్యూషియస్ మరణించిన తరువాత క్రోడీకరించబడ్డాయి. నవీన చరిత్రకారులు ఈ క్రోడీకరణలను అంగీకరించడంలేదు. ఈ బోధనలు, కన్ఫ్యూషియస్ చేతి దస్తూరీ కాదని వీరి వాదన. కానీ దాదాపు 2,000 యేండ్ల తరువాత, ఐదు క్లాసిక్లు ఇతడి రచనలు లేదా వీటికి ఇతను సంపాదకుడు, అవి క్లాసిక్ ఆఫ్ రైట్స్ (సంపాదకుడు),, స్ప్రింగ్ అండ్ ఆటమ్న్ ఆన్నల్స్ (春秋) (రచయిత) మొదలగునవి అని విశ్వసిస్తున్నారు.
సంప్రదాయానుసారం, కన్ఫ్యూషియస్ క్రీ.పూ 551 లో వసంతకాలంలో జన్మించాడు. ఇతడి జన్మకాలములో నూరు తత్వాల పాఠశాల అనే తత్వ-ఉద్యమం బయలుదేరియుండినది. ఇతను లూ రాజ్యం (ప్రస్తుతంషాండోంగ్ రాష్ట్రం) లోనికుఫూ నగర సమీపంలో ఓ సంపన్న కుటుంబంలో జన్మించాడు. ఇతడి కుటుంబం అనేక కష్టకాలాలనూ చూసింది.
అనలెక్ట్స్ 論語 లలో, కన్ఫ్యూషియస్ తనకు తాను "ఏమీ కనుగొనని వార్తాహరుడు" ("transmitter who invented nothing") అని వ్రాసుకున్నాడు. ఇతడు "చదువు" పై అమిత ప్రాముఖ్యతను ప్రదర్శించాడు, ఇతని గ్రంథము "విద్య" కొరకు గల చైనీభాష పదం చదువు తో ప్రారంభమవుతుంది. ఈ కారణాన చైనీయులు ఇతడిని "మహా గురువు"గా గౌరవిస్తారు.జీవితం , సమాజపు సిద్ధాంతాలను స్థిరపరచే సాంప్రదాయాలను నెలకొల్పే విధానాలను దూరంగా ఉంచి, స్వయంశోధన చేపట్టాలని, తద్వారా బాహ్యప్రపంచాన్ని అధ్యయనం చేయాలని తన శిష్యులకు బోధించేవాడు.
కన్ఫ్యూషియస్ బోధనలలో ఒక బోధనపై ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూవచ్చాడు, అదే స్వీయ-శోధన , నడవడికల సూత్రీకరణ. నీతిశాస్త్రముపై , సామాజికనీతి, ప్రభుత్వ-నీతి మొదలగు అంశాలపై ఎక్కువ ప్రాధాన్యత ప్రకటించాడు.
కన్ఫ్యూషియస్ వ్యక్తిత్వంలో, జీవితంలో సంగీత సాధనకు ప్రాధాన్యం ఉంది. చైనాదేశపు సంగీతం మనుష్యుని స్వభావంలో ఒక గుణసమత్వాన్ని, భావసమత్వాన్ని అందిస్తుందని, తద్వారా నైతిక జీవనం అలవడుతుందని చెప్పేవారు. సంగీతం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలోని అధికారులకు, రాజుకూ నైతికత అలవడుతుందని, అది వారి పాలన వల్ల దేశంలో ప్రతిఫలిస్తుందని బోధించారు. సంగీతం వల్ల వ్యక్తికి నైతికత, శాంతి, పరతత్త్వ అనుభూతి కూడా లభిస్తుందని భావించేవారు. కన్ఫ్యూషియస్ హియాంక్సే(Hsiang tse) అనే విద్వాంసుని వద్ద సంగీతాన్ని అభ్యసించారు.
(వడే గైల్స్ లో ఇతని పేరు కుంగ్ చియూ, అనువాదం డి.సి.లౌ).
కన్ఫ్యూషియానిజంను చైనీయులు ఒక మతముగా అవలంబిస్తున్నప్పటికీ, అనేకానేక సందేహాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇదొక తత్వమా లేక మతమా? అని వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నవి. కన్ఫ్యూషియానిజం లో "జన్మాంతరము" లేదు. దేవుడు లేదా దేవతల గురించి ఒక సంక్లిష్టమైన దృష్టి ఉన్నప్పటికీ, ఆధ్యాత్మికపరమైన, ఆత్మసంబంధమయిన విషయాలను ఈ తత్వము స్పృశించలేక పోవడం మతపరంగా ఒక లోటు.
This article uses material from the Wikipedia తెలుగు article కన్ఫ్యూషియస్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.