ఆఫ్రికా కొమ్ము

ఆఫ్రికా కొమ్ము అనేది ఆఫ్రికాలోని ఒక పెద్ద ద్వీపకల్పం.

దీన్ని సోమాలీ ద్వీపకల్పం అని కూడా అంటారు. ప్రపంచం లోని అతిపెద్ద ద్వీపకల్పాల్లో నాలుగవ స్థానంలో ఉన్న ఆఫ్రికా కొమ్ము, ఆఫ్రికా ఖండానికి తూర్పు కొసన, ఎర్ర సముద్రానికి దక్షిణం వైపున ఉంది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, సోమాలి సముద్రం, గార్డాఫుయ్ ఛానల్ వరకు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అరేబియన్ ద్వీపకల్పం, పశ్చిమాసియాలతో దానికి సముద్ర సరిహద్దు ఉంది. ఆఫ్రికా కొమ్ము జిబౌటి, సోమాలిలాండ్, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా దేశాలను కలిగి ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. మరింత విస్తృతంగా చూస్తే కెన్యా, సూడాన్, దక్షిణ సూడాన్, ఉగాండాలు కూడా ఇందులో భాగమేనని చెప్పవచ్చు. గ్రేటర్ ఆఫ్రికా కొమ్ము అనే నిర్వచనం లోకి బురుండి, రువాండా, టాంజానియాలు కూడా వస్తాయి.

ఆఫ్రికా కొమ్ము
ఆఫ్రికా కొమ్ము
ఆఫ్రికా కొమ్ము
గ్లోబుపై ఆఫ్రికా కొమ్ము
దేశాలు
4 sovereign states
1 de facto state with limited recognition
  • ఆఫ్రికా కొమ్ము Somaliland
జనాభా14,06,83,144 (2020 అంచనా.)
విస్తీర్ణం18,82,757 కి.మీ.2

పేర్లు

ఈ ద్వీపకల్పాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. పురాతన గ్రీకులు, రోమన్లు అక్కడ కనిపించే సుగంధ మొక్కల కారణంగా దీనిని రీరెజియో అరోమాటికా లేదా రీజియో సిన్నమోనిఫోరా అని అనేవారు. స్పష్టంగా తెలియని కారణంగా దీన్ని రీజియో ఇన్‌కాగ్నిటా (అజ్ఞాత భూమి) గా కూడా పేర్కొన్నారు. పురాతన, మధ్యయుగ కాలంలో, ఆఫ్రికా కొమ్మును బిలాద్ అల్ బర్బర్ ("బెర్బర్ల భూమి") అని పిలిచేవారు. దీనిని సోమాలి ద్వీపకల్పం లేదా సోమాలి భాషలో గీస్కా ఆఫ్రికా, జసిరద్దా సూమాలి లేదా గకంధుల్కా సౌమాలి అని కూడా పిలుస్తారు. ఇతర స్థానిక భాషలలో, దీనిని "ది హార్న్ ఆఫ్ ఆఫ్రికా" లేదా "ది ఆఫ్రికన్ హార్న్" అని పిలుస్తారు: హార్న్ ఆఫ్ ఆఫ్రికా పేరు కొన్నిసార్లు HoA గా కుదించి రాస్తారు. దీనిని "ది హార్న్" అని పిలవడం కూడా సాధారణం. ఇక్కడి ప్రజలను హార్న్ ఆఫ్రికన్లు అని పిలుస్తారు. పొరుగున ఉన్న ఈశాన్య ఆఫ్రికా దేశాలను కూడా కలుపుకొని గానీ లేదా ఆఫ్రికా కొమ్ము విస్తృత భౌగోళిక రాజకీయ నిర్వచనాన్ని చిన్నపాటి ద్వీపకల్ప నిర్వచనం నుండి వేరు చేయడానికి గానీ గ్రేటర్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే పదాన్ని ఉపయోగిస్తారు.

వివరణ

ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో జిబౌటి, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా అనే నాలుగు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశాలు ఉన్నాయి.

భౌగోళికంగా "కొమ్ము" లాగా పొడుచుకు వచ్చినట్లుండే ప్రాంతంలో "సోమాలి ద్వీపకల్పం", ఇథియోపియా తూర్పు భాగం ఉంటాయి. కానీ మిగిలిన ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌటీలను కూడా కలుపుకుని కొమ్ము అంటారు.

చరిత్ర

పూర్వ చరిత్ర

ఆఫ్రికా కొమ్ము 
ఎరిత్రియాలోని డెకా అర్బా డెబుబ్ ప్రాంతంలో డెకా రాక్ ఆర్ట్

ఓమో అవశేషాలు (సుమారు 2,33,000 సంవత్సరాల క్రితం నాటివి), హెర్టో పుర్రె (సుమారు 1,60,000 సం. క్రితం నాటిది) వంటి తొలి హోమో సేపియన్స్ శిలాజాలను ఈ ప్రాంతం లోనే ఉన్న ఇథియోపియాలో కనుగొన్నారు.

2,79,000 సంవత్సరాల క్రితం నాటి అత్యంత పురాతన, రాతి మొనలు కలిగిన ఈటెలను ఇక్కడ కనుగొన్నారు. వీటితో పాటు, "ఇప్పటికే ఉన్న పురావస్తు, శిలాజ, జన్యు ఆధారాలను కలిపి చూస్తే తూర్పు ఆఫ్రికా, ఆధునిక సంస్కృతులు జీవశాస్త్రాలకు మూలస్థానంగా ప్రత్యేకంగా నిలబడుతుంది"

దక్షిణాన మానవ వ్యాప్తి సిద్ధాంతం ప్రకారం, ఆఫ్రికా నుండి బయటికి వెళ్ళిన దక్షిణ ప్రస్థానం, ఆఫ్రికా కొమ్ము లోని బాబ్ ఎల్ మండేబ్ ద్వారా జరిగింది. నేడు బాబ్-ఎల్-మండేబ్ జలసంధి వద్ద, ఎర్ర సముద్రం దాదాపు 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. అయితే 50,000 సంవత్సరాల క్రితం ఇది చాలా సన్నగా ఉండేది. ఇప్పటి కంటే అప్పట్లో సముద్ర మట్టాలు 70 మీటర్లు తక్కువగా ఉండేవి. జలసంధి పూర్తిగా ఎండిపోనప్పటికీ, మామూలు తెప్పలను ఉపయోగించి మధ్య మధ్యలో ఉన్న ద్వీపాలను చేరుకోగలిగేలా ఉండి ఉండవచ్చు. ఎరిట్రియాలో 1,25,000 సంవత్సరాల పురాతనమైన నత్త గుల్లల గుట్టలను కనుగొన్నారు. తొలి మానవుల ఆహారంలో సముద్ర తీరానికి దగ్గరలో సేకరించే ఆహారం కూడా ఉండేదని దీన్నిబట్టి తెలుస్తోంది.

సా.పూ. 4000 - 1000 మధ్య ఇథియోపియా, ఎరిట్రియా దేశాల వ్యవసాయంలో విత్తనాల గడ్డి, టెఫ్ ఉండేదని తెలుస్తోంది. ఇంజెరా / టైటా అనే ఫ్లాట్‌బ్రెడ్ తయారు చేయడానికి ఈ టెఫ్‌ను ఉపయోగిస్తారు. కాఫీ కూడా ఇథియోపియా లోనే ఉద్భవించింది. ఆ తరువాత అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

పురాతన చరిత్ర

సోమాలియా, జిబౌటి, ఎర్ర సముద్రం తీరంలోని ఎరిట్రియా, సుడాన్‌లతో కూడిన ప్రాంతాన్ని పురాతన ఈజిప్షియన్లు పుంట్ (లేదా "టా నెట్‌జెరు," అంటే దేవుడి భూమి) అనేవారు. దీని మొదటి ప్రస్తావన సా.పూ. 25వ శతాబ్దానికి చెందినది.

డి ' మ్ట్ అనేది ఎరిట్రియా, ఉత్తర ఇథియోపియాలలో విస్తరించి ఉన్న ఒక రాజ్యం. ఇది క్రీ. పూ. 8వ, 7వ శతాబ్దాలలో ఉనికిలో ఉంది. బహుశా యెహా రాజధానిగా ఈ రాజ్యం నీటిపారుదల పథకాలను అభివృద్ధి చేసింది. నాగలిని ఉపయోగించారు. తృణధాన్యాలు పండించారు. ఇనుప పనిముట్లు, ఆయుధాలను తయారు చేసారు. క్రీ పూ 5 వ శతాబ్దంలో డమ్ట్ పతనం తరువాత, ఈ పీఠభూమి చిన్న చిన్న రాజ్యాల ఆధిపత్యంలోకి వచ్చింది. 1 వ శతాబ్దంలో ఈ రాజ్యాలలో ఒకటైన అక్సుమైట్ రాజ్యం ఈ ప్రాంతాన్ని తిరిగి ఏకీకృతం చేసింది.

ఆఫ్రికా కొమ్ము 
అక్సుమ్ వద్ద ఉన్న కింగ్ ఎజానా స్టేలా. ఇది అక్సుమైట్ నాగరికతకు చిహ్నంగా ఉంది.

అక్సుమ్ రాజ్యం (అక్సుమైట్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు) ఎరిట్రియా, ఇథియోపియా పర్వత ప్రాంతాలలో ఉన్న ఒక పురాతన రాజ్యం. ఇది క్రీ. శ. 1వ, 7వ శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందింది. రోమన్ సామ్రాజ్యం, పురాతన భారతదేశాల మధ్య వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించిన అక్సుమ్ పాలకులు తమ సొంత కరెన్సీని ముద్రించడం ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేశారు. అప్పటికీ క్షీణదశలో ఉన్న కుష్ రాజ్యంపై కూడా ఈ రాజ్యం తన ఆధిపత్యాన్ని స్థాపించింది. అరేబియా ద్వీపకల్పంలోని రాజ్యాల రాజకీయాల్లో కలగజేసుకుంటూ ఉండేది. చివరికి హిమ్యారైట్ రాజ్యాన్ని జయించడంతో ఈ ప్రాంతంపై తన పాలనను విస్తరించింది. ఎజానా ఆధ్వర్యంలో (320 - 360) అక్సుం రాజ్యం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మొదటి ప్రధాన సామ్రాజ్యంగా మారింది. పర్షియా, రోమ్, చైనాలతో పాటు ఆ కాలంలోని నాలుగు గొప్ప శక్తులలో ఒకటిగా దీన్ని మణి పేర్కొన్నాడు.

ఆఫ్రికా కొమ్ము 
ఎరిథ్రియన్ సముద్రపు పెరిప్లస్ ప్రకారం ఆఫ్రికా కొమ్ము, అరేబియా ద్వీపకల్పాలలోని పురాతన వాణిజ్య కేంద్రాలు

కొమ్ములో సోమాలియా ఒక ముఖ్యమైన లింకు. ఈ ప్రాంతపు వాణిజ్యాన్ని మిగిలిన పురాతన ప్రపంచంతో సోమాలియా కలిపేది. సోమాలి నావికులు, వ్యాపారులు గుగ్గులు, సుగంధ ద్రవ్యాలను విక్రయించేవారు. ఇవన్నీ పురాతన ఈజిప్షియన్లు, ఫోనిషియన్లు, మైసెనియన్లు, బాబిలోనియన్లు, రోమన్లకు విలువైన విలాసాలు. తత్ఫలితంగా రోమన్లు ఈ ప్రాంతాన్ని రీజియో అరోమాటికాగా పేర్కొనడం ప్రారంభించారు. సాంప్రదాయ యుగంలో, ఒపోన్, మోసిలాన్, మలావో వంటి అనేక అభివృద్ధి చెందుతున్న సోమాలి నగర-దేశాలు కూడా సుసంపన్నమైన ఇండో - గ్రీకో-రోమన్‌లతో వాణిజ్యం చేయడంలో సబాయన్లు, పార్థియన్లు, ఆక్సుమైట్‌లతో పోటీ పడ్డాయి.

కొమ్ము యొక్క ఎర్ర సముద్ర తీరానికి ఆవలి ఒడ్డున ఇస్లాం పుట్టుక జరిగింది. దీంతో అరేబియా ద్వీపకల్పంలో నివసిస్తున్న స్థానిక వ్యాపారులు, నావికులు అప్పటికే మతం మారిన తమ అరబ్, ముస్లిం వ్యాపార భాగస్వాముల ద్వారా క్రమంగా కొత్త మత ప్రభావంలోకి వచ్చారు. ఇస్లాం ప్రారంభ శతాబ్దాలలో ఇస్లామిక్ ప్రపంచం నుండి కొమ్ముకు ముస్లిం కుటుంబాలు వలస రావడం, తరువాతి శతాబ్దాలలో ముస్లిం పండితులు స్థానిక జనాభాను శాంతియుతంగా మతం మార్చడం మొదలైనవాటితో పురాతన నగర-రాజ్యాలు చివరికి ఇస్లామిక్ మొగాదిషు, బెర్బెరా, జైలా, బర్బర నాగరికతలో భాగమైన బరావా మెర్కా లుగా మార్పు చెందాయి. మొగాదిషు నగరం "సిటీ ఆఫ్ ఇస్లాం" గా పేరుబడింది. అనేక శతాబ్దాల పాటు అది తూర్పు ఆఫ్రికా బంగారు వ్యాపారాన్ని నియంత్రించింది.

మధ్య యుగం, ప్రారంభ ఆధునిక యుగం

ఆఫ్రికా కొమ్ము 
1540లో అడాల్ సుల్తానేట్ గరిష్ట స్థాయికి చేరుకుంది

మధ్య యుగాలలో, అడాల్ సుల్తానేట్, అజురాన్ సుల్తానేట్, జాగ్వే రాజవంశం, గెలీడి సుల్తానేట్‌లతో సహా అనేక శక్తివంతమైన సామ్రాజ్యాలు కొమ్ము లోని ప్రాంతీయ వాణిజ్యపై ఆధిపత్యం చెలాయించాయి.

896 లో స్థాపించబడిన షోవా సుల్తానేట్, పురాతన స్థానిక ఇస్లామిక్ రాజ్యాలలో ఒకటి. ఇది మధ్య ఇథియోపియాలోని పూర్వ షెవా ప్రావిన్స్‌లో కేంద్రీకృతమై ఉంది. 1285 లో ఇఫాత్ సుల్తానేట్ పరిపాలనను చేజిక్కించుకున్నాడు. సోమాలిలాండ్‌లోని జైలా రాజధానిగా ఇఫాత్ రాజ్యం పాలించబడింది. ఇది మాజీ షేవా సుల్తానేటుకు తూర్పు కొసన ఉన్న జిల్లా.

భౌగోళికం

భూగర్భ శాస్త్రం, వాతావరణం

ఆఫ్రికా కొమ్ము 
1993 మేలో నాసా అంతరిక్ష నౌక నుండి చూసినపుడు ఆఫ్రికా కొమ్ము. ఈ చిత్రంలోని నారింజ, ట్యాన్ రంగులు పొడి నుండి పాక్షిక పొడి వాతావరణాన్ని సూచిస్తాయి.

ఆఫ్రికా కొమ్ము, భూమధ్యరేఖ, కర్కట రేఖల నుండి దాదాపు సమాన దూరంలో ఉంది. ఇది ప్రధానంగా, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఏర్పడినపుడు పైకి లేచిన పర్వతాలతో కూడుకుని ఉంది. టర్కీ నుండి మొజాంబిక్ వరకు భూమి పైపెంకులో ఏర్పడిన పగులును గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఆఫ్రికన్., అరేబియన్ టెక్టోనిక్ ప్లేట్ల విభజనను ఇది సూచిస్తుంది. ఎక్కువగా పర్వతప్రాంతాలు గల ఈ ప్రాంతం రిఫ్ట్ వ్యాలీ వల్ల ఏర్పడిన లోపాల ద్వారా ఉద్భవించింది.

భూగర్భవిజ్ఞాన పరంగా సుమారు 1.8 కోట్ల సంవత్సరాల క్రితం కొమ్ము, యెమెన్ లు ఒకే భూఖండం నుండి ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏడెన్ గల్ఫ్, కొమ్ము ప్రాంతాన్ని అరేబియా ద్వీపకల్పం నుండి వేరు చేసింది. సోమాలి ఫలకానికి పశ్చిమాన తూర్పు ఆఫ్రికన్ చీలిక సరిహద్దుగా ఉంది. ఇది అఫార్ పల్లం లోని ట్రిపుల్ జంక్షన్ నుండి దక్షిణానికి విస్తరించి ఉంది. ఉత్తర సరిహద్దుగా సౌదీ అరేబియా తీరం వెంబడి ఉన్న ఏడెన్ రిడ్జ్, తూర్పు సరిహద్దుగా సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ ఉన్నాయి. సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ ఉత్తర భాగాన్ని కార్ల్స్‌బెర్గ్ రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దక్షిణ సరిహద్దుగా నైరుతి భారత శిఖరం ఉంది.

కొమ్ము లోని పల్లపు ప్రాంతాలు భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నప్పటికీ సాధారణంగా పొడిగా ఉంటాయి. ఎందుకంటే సాహెల్, సూడాన్‌కు కాలానుగుణ వర్షాలను ఇచ్చే ఉష్ణమండల రుతుపవనాల గాలులు పశ్చిమం నుండి వీస్తాయి. పర్యవసానంగా, అవి జిబౌటీ, సోమాలియా ఉత్తర భాగానికి చేరుకోవడానికి ముందే తేమను కోల్పోతాయి. దీని ఫలితంగా కొమ్ములో ఎక్కువ భాగం వర్షాకాలంలో తక్కువ వర్షపాతం పొందుతుంది.

ఆఫ్రికా కొమ్ము 
ఆఫ్రికా కొమ్ము. నాసా చిత్రం

ఇథియోపియా పర్వతాలలో, అనేక ప్రాంతాల్లో 2,000 mm (79 in) కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అస్మారాలో కూడా సగటున 570 mm (22 in) ఉంటుంది . ఈ వర్షపాతం ఈజిప్టుతో సహా ఇథియోపియా వెలుపల ఉన్న అనేక ప్రాంతాలకు ఈ వర్షపాతమే ఏకైక నీటి వనరు. శీతాకాలంలో ఈశాన్య వాణిజ్య గాలులు ఉత్తర సోమాలియాలోని పర్వత ప్రాంతాలలో మినహా మరెక్కడా తేమను అందించవు. ఇక్కడ శరదృతువు చివరిలో 500 mm (20 in) వరకు వర్షపాతాన్ని అందిస్తుంది. తూర్పు తీరంలో వార్షిక వర్షపాతం 50 mm (2.0 in) కంటే తక్కువగా ఉంటుంది .

సోమాలియా వాతావరణంలో కాలానుగుణ వైవిధ్యం అంతగా ఉండదు. ఆవర్తన రుతుపవనాలు, క్రమరహిత వర్షపాతంతో పాటు వేడి పరిస్థితులు ఏడాది పొడవునా ఉంటాయి. సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు 28 to 43 °C (82 to 109 °F) ఉంటాయి. తూర్పు సముద్ర తీరం వెంబడి ఎత్తైన ప్రదేశాలలో మాత్రం, సముద్రంపై నుండి వచ్చే చల్లని గాలులు వీస్తాయి. సోమాలియాలో జుబ్బా, షబెలే అనే రెండు శాశ్వత నదులు మాత్రమే ఉన్నాయి. ఈ రెండూ ఇథియోపియన్ మెట్ట ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి.

జనాభా, జాతులు, భాషలు

ఆఫ్రికా కొమ్ము 
కుషిటిక్ భాషలు మాట్లాడే జాతి సమూహాల మ్యాప్

భౌగోళిక సారూప్యతతో పాటు, ఆఫ్రికా కొమ్ము లోని దేశాలు చాలా వరకు భాషాపరంగా జాతిపరంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి, వివిధ సమూహాల మధ్య ఉండే పరస్పర సంబంధాల సంక్లిష్ట నమూనాను చూడవచ్చు. కొమ్ము లోని రెండు ప్రధాన స్థూల సమూహాలు -సాంప్రదాయకంగా పల్లపు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న కుషిటిక్-మాట్లాడే కుషిటిక్ ప్రజలు, మెరక ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఇథియోసెమిటిక్-మాట్లాడే ఇథియోపియన్ హైలాండర్లు, ఎరిట్రియన్ హైలాండర్లు .

ఎథ్నోలాగ్ ప్రకారం, జిబౌటీలో 10 భాషలు (రెండు స్థానికం), ఎరిట్రియాలో 14, ఇథియోపియాలో 90, సోమాలియాలో 15 (సోమాలీ మాత్రమే స్థానిక భాష) ఉన్నాయి. కొమ్ము లోని చాలా మంది ప్రజలు కుషిటిక్, సెమిటిక్ లేదా ఓమోటిక్ శాఖల ఆఫ్రోసియాటిక్ భాషలను మాట్లాడతారు. ఇథియోపియాలోని ఒరోమో ప్రజలు మాట్లాడే ఒరోమో, సోమాలియా, జిబౌటి, ఇథియోపియా, కెన్యాల్లోని సోమాలి ప్రజలు మాట్లాడే సోమాలి లు కుషిటిక్ శాఖలో భాగం; సెమిటిక్ శాఖ (ప్రత్యేకంగా ఇథియోసెమిటిక్ ఉప శాఖ)లో ఇథియోపియాలోని అమ్హారా ప్రజలు మాట్లాడే అమ్హారిక్, ఇథియోపియా లోని టిగ్రిన్యా ప్రజలు, ఎరిట్రియాలోని టిగ్రిన్యా ప్రజలు మాట్లాడే టిగ్రిన్యా ఉన్నాయి. గణనీయ సంఖ్యలో మాట్లాడే ఇతర ఆఫ్రోసియాటిక్ భాషల్లో కుషిటిక్ అఫర్, సాహో, హదియా, సిదామో, అగావ్ భాషలు, సెమిటిక్ టైగ్రే, అరబిక్, గురేజ్, హరారి, సిల్ట్, అర్గోబ్బాఉన్నాయి. అలాగే ఇథియోపియా దక్షిణ ప్రాంతాలలో నివసించే ఓమోటిక్ కమ్యూనిటీలు మాట్లాడే ఓమోటిక్ భాషలు ఉన్నాయి. ఈ యాసలలో ఆరి, డిజి, గామో, కఫా, హామర్, వోలాయిట్టా ఉన్నాయి .

ఆర్థిక వ్యవస్థ

ఆఫ్రికా కొమ్ము 
ఇథియోపియా కాఫీ బీన్స్

IMF ప్రకారం, 2010లో ఆఫ్రికా కొమ్ము ప్రాంతం మొత్తం జిడిపి (PPP) $106.224 బిలియన్లు, నామినల్ జిడిపి $35.819 బిలియన్లు. 2010లో తలసరి GDP $1061 (PPP), $358 (నామినల్).

ఈ ప్రాంతంలో 95% పైగా సరిహద్దు వాణిజ్యం అనధికారికమైనది, పత్రాలు లేనిది. పశువుల వ్యాపారులు ఈ వాణిజ్యం చేస్తారు. ఇథియోపియా నుండి పశువులు, ఒంటెలు, గొర్రెలు, మేకల అనధికారిక వ్యాపారం కొమ్ములోని ఇతర దేశాలతోను, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలోని ఇతర దేశాలతోనూ జరుగుతుంది. దీని మొత్తం విలువ సంవత్సరానికి US$250, US$300 మిలియన్ల మధ్య ఉంటుందని (అధికారిక అంచనాకు ఇది 100 రెట్లు) అంచనా. సోమాలిలాండ్‌లోని బురావో, యిరోవే పట్టణాలు కొమ్ములో అతిపెద్ద పశువుల మార్కెట్‌లకు నిలయంగా ఉన్నాయి. ఆఫ్రికా కొమ్ము నలుమూలల నుండి ప్రతిరోజూ 10,000 గొర్రెలు, మేకలు ఇక్కడ అమ్ముడవుతున్నాయి. వీటిలో చాలావరకు బెర్బెరా నౌకాశ్రయం ద్వారా గల్ఫ్ దేశాలకు రవాణా అవుతాయి. ఈ వాణిజ్యం ఆహార ధరలను తగ్గించడానికి, ఆహార భద్రతను పెంచడానికి, సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, ప్రాంతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అయితే, క్రమబద్ధీకరించబడని, పత్రాలు లేని ఈ వాణిజ్యం వలన జాతీయ సరిహద్దుల్లో వ్యాధులు మరింత సులభంగా వ్యాపించడం వంటి ప్రమాదాలను కలిగిస్తుంది. ఇంకా, కోల్పోతున్న పన్ను రాబడి, విదేశీ మారకపు రాబడుల పట్ల ప్రభుత్వాలు అసంతృప్తిగా ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

సూచనలు

Tags:

ఆఫ్రికా కొమ్ము పేర్లుఆఫ్రికా కొమ్ము వివరణఆఫ్రికా కొమ్ము చరిత్రఆఫ్రికా కొమ్ము భౌగోళికంఆఫ్రికా కొమ్ము జనాభా, జాతులు, భాషలుఆఫ్రికా కొమ్ము ఆర్థిక వ్యవస్థఆఫ్రికా కొమ్ము ఇవి కూడా చూడండిఆఫ్రికా కొమ్ము సూచనలుఆఫ్రికా కొమ్ముఆఫ్రికాఇథియోపియాఎరిత్రియాఎర్ర సముద్రంజిబౌటిటాంజానియాద్వీపకల్పంబురుండిరువాండాసొమాలియా

🔥 Trending searches on Wiki తెలుగు:

భీమ్స్ సిసిరోలియోతెలుగునాట జానపద కళలువిభక్తిచంద్రగుప్త మౌర్యుడువిశ్వక్ సేన్తెలుగు సంవత్సరాలుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంయేసు శిష్యులుమొదటి భారత స్వాతంత్ర్య యుద్ధందసరాఉసిరిభారతీ తీర్థతెలంగాణ ప్రభుత్వ పథకాలువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పోలవరం ప్రాజెక్టుమల్బరీదృశ్యం 2ఆరెంజ్ (సినిమా)ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుభారతదేశ అత్యున్నత న్యాయస్థానంఅడవికరక్కాయభారతదేశ ఎన్నికల వ్యవస్థఆయాసంనువ్వొస్తానంటే నేనొద్దంటానాఅలంకారముపంచ లింగాలుచరవాణి (సెల్ ఫోన్)హస్తప్రయోగంవ్యాసుడుసత్యనారాయణ వ్రతంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపద్మశాలీలుజైన మతంప్రాణాయామంమంగళసూత్రంభారత పార్లమెంట్దిల్ రాజుజొన్నస్వామి వివేకానందఅచ్చులుఆనం వివేకానంద రెడ్డితెలుగుదేశం పార్టీహోమియోపతీ వైద్య విధానంఉప్పు సత్యాగ్రహంవికలాంగులుశ్రీరామనవమిసీతారామ కళ్యాణం (1961 సినిమా)యన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాబలి చక్రవర్తిపోషణఆంధ్రప్రదేశ్ మండలాలుతెలంగాణ జాతరలుగృహ హింసఆనందరాజ్కమల్ హాసన్ నటించిన సినిమాలుజలియన్ వాలాబాగ్ దురంతంరంగస్థలం (సినిమా)రక్తంవేముల ప్ర‌శాంత్ రెడ్డిదేవదాసిమొదటి పేజీమానవ శరీరముకూచిపూడి నృత్యంభారతీయ సంస్కృతిభౌతిక శాస్త్రంపూరీ జగన్నాథ దేవాలయంఉప రాష్ట్రపతిహైదరాబాదు చరిత్రపంచారామాలుఅబ్యూజాసీతారామ కళ్యాణంఆది శంకరాచార్యులుకులంనీటి కాలుష్యంగోల్కొండలగ్నంఅభిజ్ఞాన శాకుంతలము🡆 More