తరంగము

యానకంలో ఏర్పడిన అలజడి (disturbance), యానక కణాల ఆవర్తన (periodic) చలనం వల్ల, ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రసారితమయ్యే ప్రక్రియను తరంగము (ఆంగ్లం: wave) అని అంటారు.

తరంగము నకు ఉండే చలనమును తరంగ చలనం అంటారు. తరంగ ప్రసార ప్రక్రియలో యానక కణాలు, తమ మాథ్యమిక స్థానానికి రెండువైపులా కంపనం చేస్తాయి తప్ప తరంగంతో పాటు ముందుకు ప్రయాణించవు. శక్తికి ప్రతిరూపమైన అలజడి, ఒక కణం నుంచి మరో కణానికి బదిలీ అవుతూ ముందుకు సాగుతుంది. తరంగాలన్నీ శక్తిని జనక స్థానం నుండి ముందుకు తీసుకుని పోతాయి.

తరంగము
నీటి ఉపరితలంలో తరంగాలు.

ఉదాహరణలు

తరంగాలు-రకాలు

తరంగము 
Sinusoidal waves correspond to simple harmonic motion.

తరంగములు ముఖ్యంగా రెండు రకములు. అవి.

  1. యాంత్రిక తరంగాలు
  2. విద్యుదయస్కాంత తరంగాలు

యాంత్రిక తరంగాలు

ఈ తరంగాలు రెండురకములు అవి.

  1. పురోగామి తరంగాలు
  2. స్థిర తరంగాలు

పురోగామి తరంగాలు

యానకంలో తరంగాలు ముందుకు ప్రయాణించి మరల వెనుకకు రాకపోతే వాటిని పురోగామి తరంగాలు అంటారు. ఈ తరంగాలకు ముఖ్యంగా యానకం (ప్రసార మాధ్యమం) అవసరం. ఈ తరంగాలు రెండు రకములు. అవి.

  1. అనుదైర్ఘ్య తరంగాలు
  2. తిర్యక్ తరంగాలు
అనుదైర్ఘ్య తరంగాలు
  • యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ సమాంతరంగా ఉంటే వాటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
  • ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత, జడత్వం కలిగిన యానకం అవసరం.
  • ఈ తరంగాలకు ఉదాహరణ ధ్వని తరంగాలు.
  • వీటిలో కణాలు దగ్గరగా ఉన్న ప్రాంతాలను "సంపీడనాలు", కణాలు దూరంగా ఉన్న ప్రాంతాలను "విరళీకరణాలు" అంటారు.
  • రెండు వరుస సంపీడనాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస విరళీకరణాల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.
  • ఈ తరంగాలు శూన్యంలో ప్రసారం చేయలేవు.
తిర్యక్ తరంగాలు
  • యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా ఉంటే వాటిని తిర్యక్ తరంగాలు అంటారు.
  • ఈ తరంగాల ప్రసారానికి స్థితిస్థాపకత, జడత్వం కలిగిన యానకం అవసరం.
  • ఈ తరంగాలకు ఉదాహరణ నీటి తలంపై ఏర్పడిన తరంగాలు.
  • నిశ్చలంగా ఉన్న కొలను నీటిలో, ఒక గులక రాయిని వేస్తే, అది పడిన చోట, వృత్తాకార తరంగాలు (అలలు) ఏర్పడడం మనం గమనిస్తాం. తరంగాలు వచ్చునపుడు నీటిలో ఒక తేలికగా ఉండు బెండు బంతిని వేసినపుడు అది పైకి క్రిందికి కదులుతుంది. దీనిని బట్టి యానకంలో తరంగ ప్రసారథిశకు యానకంలోని కణాల కంపన దిశ లంబంగా కదులుతాయని తెలుస్తుంది.
  • వీటిలో శృంగాలు, ద్రోణులు యేర్పడతాయి.
  • రెండు వరుస శృంగాల మధ్య దూరం గాని లేదా రెండు వరుస ద్రోణుల మధ్య దూరం గాని "తరంగ దైర్ఘ్యం" అవుతుంది.

స్థిర తరంగాలు

  • పురోగామి తరంగాలకు ఏదయినా అడ్డంకి వచ్చినపుడు అవి 180 డిగ్రీలు పరావర్తనం చెంది మరల వెనుకకు వస్థాయి. అపుడు స్థిర తరంగాలు యేర్పడుతాయి.
  • ఒక దారాన్ని గోడకు కట్టి దానిని నీవు చేతితో పట్టుకొని పైకి క్రిందికి వేగంగా కదిపించినట్లైతే కొన్ని ఉచ్చులు యేర్పడుతాయి.వీటిని స్థిర తరంగాలు అంటారు.
  • ఈ తరంగాలలో అధిక స్థానబ్రంశము గల బిందువులను ప్రస్పందన స్థానం అని, అల్ప స్థానబ్రంశము గల బిందువులను అస్పందన స్థానం అని అంటారు.
  • ఏవైనా వరుస రెండు ప్రస్పందన లెదా అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో సగం ఉంటుంది. λ/2
  • ఈ తరంగములో ప్రతి బిందువుకు ఒక ప్రత్యేక మైన కంపన పరిమితి ఉంటుంది.
  • ఏవైనా వరుస రెండు ప్రస్పందన, అస్పందన బిందువుల మధ్య దూరం తరంగ దైర్ఘ్యంలో నాల్గవ వంతు ఉంటుంది. λ/4

విద్యుదయస్కాంత తరంగాలు

తరంగము 
విద్యుదయస్కాంత తరంగం

తరంగ ప్రసారథిశకు లంబంగా కంపిస్తున్న విద్యుత్, అయస్కాంత క్షేత్రములు కలిగి ఉంటే వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. వీటి ప్రసారానికి యానకం అవసరం లేదు. అందుచేత సూర్యుని నుండి వివిధ వికిరణములు భూమిని చేరుతున్నాయి. కాని మధ్యలో చాలా ప్రాంతం వరకు యానకం లేదు. యివి ప్రస్తుతం 7 రకాలు. అవి.

  1. గామా కిరణాలు
  2. ఎక్స్ కిరణాలు
  3. అతి నీలలోహిత కిరణాలు
  4. దృగ్గోచర వర్ణపటం: పరమాణువులలోని ఉత్తేజ వేలన్సీ ఎలక్ట్రానులు, వాటి భూస్థాయిలోకి పడిపోవటం వలన దృగ్గోచర వర్ణపటం ఉద్గారమవుతుంది.
  5. పరారుణ తరంగాలు
  6. మైక్రో తరంగాలు: విద్యుద్వలయాలలో అధిక పౌనః పున్య విద్యుదయస్కాంత డోలకాలు ఉత్పత్తి చేసే వికిరణాలని మైక్రో తరంగాలు అంటారు.
  7. రేడియో తరంగాలు

ఈ తరంగాలలో ఒక్క దృగ్గోచర వర్ణపటమును మాత్రమే మన చూడగలం. మిగిలినివి కనిపించవు. కాని కొన్ని ప్రయోగాల ద్వారా చూడవచ్చు. ఉదాహరణకు టెలివిజన్ యొక్క రిమోట్ కంట్రోల్ను చీకటిలో ఆన్ చేసి ఉంచి దాని ముందు భాగమును ఒక సెల్ ఫోన్ తో ఫోటో తీసినట్లనిన మైక్రో తరంగ ఉనికిని చూడవచ్చు.పై తరంగాల లక్షణాలన్నీ విద్యుదయస్కాంత తరంగాలు పేజీలో వివరంగా చూడవచ్చు.

భాషా విశేషాలు

తరంగము [ taraṅgamu ] tarangamu. సంస్కృతం n. A wave, a surge, an undulating swell or surface like waves. అల. తరంగిణి tarangiṇi. n. A river. This and other expressions for river, sea, stream, are used in the titles of some books, as విద్యాతరంగిణి the Circle of the Sciences.

ఉదాహరణలు

తరంగము 
కొండల్ని ఢీకొంటున్న సముద్ర తరంగాలు.
  • సముద్ర తరంగాలు, నీటి ఉపరితలంలో ఏర్పడి ముఖ్యంగా తీరం వెంట కనిపించే కెరటాలు.
  • రేడియో తరంగాలు, కాంతి కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, X-కిరణాలు,, గామా కిరణాలు మొదలైన విద్యుదయస్కాంత తరంగాలు. ఈ విధమైన తరంగాలు ఏ విధమైన మాధ్యమం లేకుండా శూన్యంలో కూడా ప్రయాణిస్తాయి.
  • శబ్ద తరంగాలు — గాలి, ద్రవాలు, ఘన పదార్ధాలలో ప్రసరిస్తాయి.
  • భూకంపాలులో మూడు ప్రకంపనలు రకాలు; S, P,, L రకాలున్నాయి.

Tags:

తరంగము ఉదాహరణలుతరంగము తరంగాలు-రకాలుతరంగము భాషా విశేషాలుతరంగముఅలజడిఆంగ్లంకణాలుచలనంతరంగ చలనం

🔥 Trending searches on Wiki తెలుగు:

చేతబడితెలంగాణా సాయుధ పోరాటంగోపరాజు సమరంగన్నేరు చెట్టురక్త పింజరివిశాఖ నక్షత్రముఅచ్చులుఖండంమృగశిర నక్షత్రముతెలంగాణ జాతరలునామవాచకం (తెలుగు వ్యాకరణం)రెడ్డితెలుగు అక్షరాలురామప్ప దేవాలయంబి.ఆర్. అంబేడ్కర్పశ్చిమ గోదావరి జిల్లాపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుహర్షవర్థనుడుమహానందిబిచ్చగాడు 22023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుగుత్తా రామినీడుకుక్కరామబాణంత్రిష కృష్ణన్విష్ణుకుండినులుభారతదేశంలో జాతీయ వనాలుమలబద్దకంఆంజనేయ దండకంకృష్ణ గాడి వీర ప్రేమ గాథమఖ నక్షత్రముఇంటి పేర్లుశ్రీకాళహస్తిఝాన్సీ లక్ష్మీబాయిఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్నన్నయ్యపులిభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులురజాకార్లుతెలుగునోటి పుండుస్వామి వివేకానందగ్లోబల్ వార్మింగ్టి. రాజాసింగ్ లోథ్త్రినాథ వ్రతకల్పంబ్రాహ్మణ గోత్రాల జాబితాసమాజంఅనసూయ భరధ్వాజ్ఆశ్లేష నక్షత్రముదాశరథి రంగాచార్యశాతవాహనులుకలబందమామిడినువ్వొస్తానంటే నేనొద్దంటానాహిందూధర్మంవై.యస్.అవినాష్‌రెడ్డిహృదయం (2022 సినిమా)భారత రాజ్యాంగ సవరణల జాబితాకుతుబ్ మీనార్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుఅంగచూషణగోవిందుడు అందరివాడేలేకురుక్షేత్ర సంగ్రామంరేవతి నక్షత్రంహోళీఅమరావతిభారతదేశ చరిత్రయాదవపూజిత పొన్నాడతెలంగాణకు హరితహారంధర్మవరపు సుబ్రహ్మణ్యంతొలిప్రేమవందే భారత్ ఎక్స్‌ప్రెస్జై శ్రీరామ్ (2013 సినిమా)నువ్వు లేక నేను లేనుమంగ్లీ (సత్యవతి)🡆 More