రసాయన శాస్త్రంలో మూలకం అనేది పదార్థానికి సంబంధించిన మౌలికమైన భావం.
ఒక పదార్థం యొక్క అణు (atom) గర్భంలో ఉన్న ప్రోటానులనే పరమాణువులు ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యని అణు సంఖ్య (atomic number, Z) అంటారు. ఆ అణు సంఖ్యని బట్టి ఆ పదార్థం ఏ మూలకమో తెలుస్తుంది. ఉదాహరణకి ఆమ్లజని అణు సంఖ్య 8 కనుక అణు గర్భంలో 8 ప్రోటానులు ఉన్న అణువులు అన్నీ ఆమ్లజని అణువులు అయి తీరాలి. భూగ్రహం మీద ద్రవ్యరాశిలో అత్యధిక పుష్కలత ఉన్న మూలకం ఇనుము (Fe); భూమి ద్రవ్యరాశిలో 89% ఇనుమే! కాని మనకి అందుబాటులో ఉన్న పెచ్చు (crust)లో అత్యధిక ద్రవ్యరాశిలో ఉన్న మూలకం ఆమ్లజని; ఇది 46.5% ఉంది.
ఇప్పటివరకు తెలిసిన 118 మూలకాలలో, 94 మూలకాలు ప్రకృతిలో లభించేవి, మిగిలిన 24 కృత్రిమంగా తయారుచేసినవి. వీటిల్లో 80 మూలకాలకి స్థిరనిశ్చలత గల ఏకస్థానులు (isotopes) ఉన్నాయి. మిగిలినవి వికీర్ణ ఏకస్థానులు (radio-isotopes); ఇవి కాలక్రమాన క్షీణించి స్థిరనిశ్చలత గల మూలకాలలోకి మారిపోతాయి.
భూగ్రహం మీద ద్రవ్యరాశిలో అత్యధిక పుష్కలత ఉన్న మూలకం ఇనుము (Fe); భూమి ద్రవ్యరాశిలో 89% ఇనుమే! కాని మనకి అందుబాటులో ఉన్న పెచ్చు (crust)లో అత్యధిక ద్రవ్యరాశిలో ఉన్న మూలకం ఆమ్లజని; ఇది 46.5% ఉంది.
మూలకం పేరు (ఇంగ్లీషులో) | మూలకం పేరు (తెలుగులో) | హ్రస్వ నామం | పుష్కలత (మిలియను భాగాలలో వాటా, ppm) |
---|---|---|---|
Oxygen | ఆమ్లజని | O | 465,000 లేదా 46.5% |
Silicon | సైకము | Si | 282,000 లేదా 28.2% |
Aluminum | అల్లూమినం | Al | 82,300 లేదా 8.23% |
Iron | ఇనుము | Fe | 56,300 లేదా 5.63% |
Calcium | ఖటికం | Ca | 41,500 లేదా 4.15% |
Sodium | సోడియం | Na | 23,600 లేదా 2.36% |
Magnesium | మంగనం | Mg | 23,300 లేదా 2.33% |
Potassium | పొటాసియం | K | 20,900 లేదా 2.09% |
Titanium | టైటేనియం | Ti | 5,560 లేదా 0.556% |
Hydrogen | ఉదజని | H | 1,450 లేదా 0.0145% |
మూలకం పేరు (ఇంగ్లీషులో) | మూలకం పేరు (తెలుగులో) | హ్రస్వ నామం | పుష్కలత (మిలియను భాగాలలో వాటా, ppm) |
---|---|---|---|
Nitrogen | నత్రజని | N | 19 ppm |
Hafnium | హేప్నియం | Hf | 3 ppm |
Uranium | యురేనియం | U | 2.7 ppm |
Terbium | టెర్బియం | Tb | 1 ppm |
Silver | వెండి | Ag | 0.075 ppm |
Platinum | ప్లేటినం | Pt | 0.005 ppm |
Gold | బంగారం | Au | 0.004 ppm |
Astanine | ఏస్టనీన్ | As | లేశం |
మూలకాలని ఒక బాణీలో అమర్చిన తీరుని ఆవర్తన పట్టిక అంటారు. పట్టికలోని నిలువు వరుసలను "గ్రూపులు" లేదా గుంపులు లేదా "కుటుంబాలు" అనిన్నీ, అడ్డు వరుసలని శ్రేణులు, "ఆవర్తులు" లేదా "పీరియడ్లు" అనీ అంటారు. ఆవర్తన పట్టికలో 18 గుంపులు, 7 ఆవర్తులు ఉన్నాయి. ఈ పట్టికలో మొట్టమొదటి (ఆవర్తు 1, గుంపు 1) గదిలో ఉదజని (Hydrogen) ఉంటుంది. రెండవ గదిలో రవిజని (Helium) ఉంటుంది. ఒకే గుంపులో ఉన్న మూలకాల లక్షణాలలో గట్టి పోలికలు కనిపిస్తాయి. ఉదాహరణకి లవజనులు (halogens) ఉన్న గుంపులో కనిపించే ఫ్లోరీను (F), క్లోరీను (Cl), బ్రోమీను (Br), అయొడీను (I) లక్షణాలలో ఒక బాణీ కనిపిస్తుంది. ఒక ఆవర్తులో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ ఆ మూలకంలోని ఎలక్ట్రానుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎడమ నుండ కుడకి ఆవర్తుల వారీగా చూస్తే మూలకాల లక్షణాలు ఒక బాణీలో కొంతసేపు పెరిగి, కొంతసేపు తగ్గి, మరల పెరుగురతూ కనిపిస్తాయి. దీనినే మెండలియవ్ ఆవర్తన సూత్రం (Mendeleev’s Periodic Law) అంటారు.
మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా నీల్స్ బోర్ విస్తృత ఆవర్తన పట్టికను నిర్మించాడు. అన్ని మూలకాలను వాటి పరమాణు సంఖ్యల ఆరోహణ క్రమంలో అమర్చడం జరిగింది. ఆవర్తన పట్టికలో ఎడమ నుంచి కుడికి పోయిన కొద్దీ ఒక మూలకం పరమాణు సంఖ్య కంటే దాని తరువాత మూలకం పరమాణు సంఖ్య ఒకటి చొప్పున పెరుగుతుంది. అనగా, ఒక మూలకం ఎలక్ట్రాన్ విన్యాసానికి దాని ముందు మూలకం ఎలక్ట్రాన్ విన్యాసం కంటే ఒక ఎలక్ట్రాన్ అధికంగా ఉంటుంది. ఇలా ఆ పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ ను 'భేదపరచే ఎలక్ట్రాన్' అంటాం.
ఈ విస్తృత ఆవర్తన పట్టికలో మూలకం పేరు, సంకేతం, పరమాణు సంఖ్య, సగటు పరమాణు ద్రవ్యరాశి విలువలు ఉంటాయి. ఈ ఆవర్తన పట్టిక రసాయన మూలకాలను ఒక క్రమమైన పట్టికలో సూచించు విధానము. దీని ఆవిష్కరణ కు ఆధ్యుడు రష్యా దేశస్తుడైన డిమిట్రీ మెండలీఫ్. ఈయన 1869 వ సంవత్సరంలో మొదటి ఆవర్తన పట్టికకు రూపకల్పన చేశారు. మెండలీఫ్ రసాయన మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా పట్టికలో అమర్చాడు. క్రొత్త మూలకాలు కనుగొన్న తదుపరి ఈ పట్టికను విస్తృతపరచడమైనది. ఈ ఆవర్తన పట్టిక విస్తరణ మూలకాల ధర్మములు, వాటి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా తయారుచేయబడినది
Group → | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Alkali metal | Alkaline earth metal | Boron group | Carbon group | Pnictogen | Chalcogen | Halogen | Noble gas | ||||||||||||
CAS: | IA | IIA | IIIB | IVB | VB | VIB | VIIB | VIIIB | IB | IIB | IIIA | IVA | VA | VIA | VIIA | VIIIA | |||
old IUPAC: | IA | IIA | IIIA | IVA | VA | VIA | VIIA | VIII | IB | IIB | IIIB | IVB | VB | VIB | VIIB | 0 | |||
Period ↓ | Hydrogen 1 H saw-ival-both isotopes | →element name atomic number chemical symbol
| Helium 2 He saw-both isotopes | ||||||||||||||||
2 | Lithium 3 Li saw-ival-both isotopes | Beryllium 4 Be saw-both isotopes | Boron 5 B saw-ival-both isotopes | Carbon 6 C saw-ival-both isotopes | Nitrogen 7 N saw-ival-both isotopes | Oxygen 8 O saw-ival-both isotopes | Fluorine 9 F saw-both isotopes | Neon 10 Ne saw-both isotopes | |||||||||||
3 | Sodium 11 Na saw-both isotopes | Magnesium 12 Mg saw-ival-both isotopes | Aluminium 13 Al saw-both isotopes | Silicon 14 Si saw-ival-both isotopes | Phosphorus 15 P saw-both isotopes | Sulfur 16 S saw-ival-both isotopes | Chlorine 17 Cl saw-ival-both isotopes | Argon 18 Ar saw-both isotopes | |||||||||||
4 | Potassium 19 K saw-both isotopes | Calcium 20 Ca saw-both isotopes | Scandium 21 Sc saw-both isotopes | Titanium 22 Ti saw-both isotopes | Vanadium 23 V saw-both isotopes | Chromium 24 Cr saw-both isotopes | Manganese 25 Mn saw-both isotopes | Iron 26 Fe saw-both isotopes | Cobalt 27 Co saw-both isotopes | Nickel 28 Ni saw-both isotopes | Copper 29 Cu saw-both isotopes | Zinc 30 Zn saw-both isotopes | Gallium 31 Ga saw-both isotopes | Germanium 32 Ge saw-both isotopes | Arsenic 33 As saw-both isotopes | Selenium 34 Se saw-both isotopes | Bromine 35 Br saw-ival-both isotopes | Krypton 36 Kr saw-both isotopes | |
5 | Rubidium 37 Rb saw-both isotopes | Strontium 38 Sr saw-both isotopes | Yttrium 39 Y saw-both isotopes | Zirconium 40 Zr saw-both isotopes | Niobium 41 Nb saw-both isotopes | Molybdenum 42 Mo saw-both isotopes | Technetium 43 Tc msi isotopes | Ruthenium 44 Ru saw-both isotopes | Rhodium 45 Rh saw-both isotopes | Palladium 46 Pd saw-both isotopes | Silver 47 Ag saw-both isotopes | Cadmium 48 Cd saw-both isotopes | Indium 49 In saw-both isotopes | Tin 50 Sn saw-both isotopes | Antimony 51 Sb saw-both isotopes | Tellurium 52 Te saw-both isotopes | Iodine 53 I saw-both isotopes | Xenon 54 Xe saw-both isotopes | |
6 | Caesium 55 Cs saw-both isotopes | Barium 56 Ba saw-both isotopes | 57–70 | Lutetium 71 Lu saw-both isotopes | Hafnium 72 Hf saw-both isotopes | Tantalum 73 Ta saw-both isotopes | Tungsten 74 W saw-both isotopes | Rhenium 75 Re saw-both isotopes | Osmium 76 Os saw-both isotopes | Iridium 77 Ir saw-both isotopes | Platinum 78 Pt saw-both isotopes | Gold 79 Au saw-both isotopes | Mercury 80 Hg saw-both isotopes | Thallium 81 Tl saw-ival-both isotopes | Lead 82 Pb saw-both isotopes | Bismuth 83 Bi saw-both isotopes | Polonium 84 Po msi isotopes | Astatine 85 At msi isotopes | Radon 86 Rn msi isotopes |
7 | Francium 87 Fr msi isotopes | Radium 88 Ra msi isotopes | 89–102 | Lawrencium 103 Lr msi isotopes | Rutherfordium 104 Rf msi isotopes | Dubnium 105 Db msi isotopes | Seaborgium 106 Sg msi isotopes | Bohrium 107 Bh msi isotopes | Hassium 108 Hs msi isotopes | Meitnerium 109 Mt msi isotopes | Darmstadtium 110 Ds msi isotopes | Roentgenium 111 Rg msi isotopes | Copernicium 112 Cn msi isotopes | Nihonium 113 Nh msi isotopes | Flerovium 114 Fl msi isotopes | Moscovium 115 Mc msi isotopes | Livermorium 116 Lv msi isotopes | Tennessine 117 Ts msi isotopes | Oganesson 118 Og msi isotopes |
Lanthanum 57 La saw-both isotopes | Cerium 58 Ce saw-both isotopes | Praseodymium 59 Pr saw-both isotopes | Neodymium 60 Nd saw-both isotopes | Promethium 61 Pm msi isotopes | Samarium 62 Sm saw-both isotopes | Europium 63 Eu saw-both isotopes | Gadolinium 64 Gd saw-both isotopes | Terbium 65 Tb saw-both isotopes | Dysprosium 66 Dy saw-both isotopes | Holmium 67 Ho saw-both isotopes | Erbium 68 Er saw-both isotopes | Thulium 69 Tm saw-both isotopes | Ytterbium 70 Yb saw-both isotopes | ||||||
Actinium 89 Ac msi isotopes | Thorium 90 Th saw-both isotopes | Protactinium 91 Pa saw-both isotopes | Uranium 92 U saw-both isotopes | Neptunium 93 Np msi isotopes | Plutonium 94 Pu msi isotopes | Americium 95 Am msi isotopes | Curium 96 Cm msi isotopes | Berkelium 97 Bk msi isotopes | Californium 98 Cf msi isotopes | Einsteinium 99 Es msi isotopes | Fermium 100 Fm msi isotopes | Mendelevium 101 Md msi isotopes | Nobelium 102 No msi isotopes |
Border shows natural occurrence of the element: | Primordial | From decay | Synthetic |
This article uses material from the Wikipedia తెలుగు article మూలకము, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.