ది టైమ్స్ ఆఫ్ ఇండియా

ది టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) భారతదేశపు ఆంగ్ల భాషా దినపత్రిక.

డిజిటల్ న్యూస్ మీడియా ది టైమ్స్ గ్రూప్ యాజమాన్యం దీన్ని ప్రచురిస్తోంది. సర్క్యులేషన్ ప్రకారం ఇది, భారతదేశంలో మూడవ అతిపెద్ద వార్తాపత్రిక, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆంగ్ల భాషా దినపత్రిక. ఇది భారతదేశంలోని అత్యంత పురాతన ఆంగ్ల-భాషా వార్తాపత్రిక. 1838లో ప్రచురించబడిన మొదటి ఎడిషన్‌తో ఇప్పటికీ చెలామణిలో ఉన్న రెండవ అత్యంత పురాతన భారతీయ వార్తాపత్రిక. దీనికి "ది ఓల్డ్ లేడీ ఆఫ్ బోరి బందర్ " అని మారుపేరు ఉంది. ఇది భారతదేశంలో "చారిత్రిక వార్తాపత్రిక ".

Av naidu
The Times of India cover 03-22-10.jpg
20 August 2013 ఆగస్టు 20 నాటి ది టైమ్స్ ఆఫ్ ఇండియా మొదటి పేజీ (కోల్‌కతా సంచిక)
రకముడిసెట్టి అనిల్ దార్మరజుదినపత్రిక
ఫార్మాటుబ్రాడ్‌షీట్

యాజమాన్యం:టైమ్స్ గ్రూపు
ప్రచురణకర్త:బెనెట్ కోల్‌మన్ అండ్ కంపెనీ
ప్రధాన సంపాదకులు:జైదీప్ బోస్
స్థాపన3 నవంబరు 1838; 185 సంవత్సరాల క్రితం (1838-11-03)
భాషఇంగ్లీషు
ప్రధాన కేంద్రముముంబై
సర్క్యులేషన్రోజుకు 30 లక్షల పైచిలుకు
ISSN0971-8257
OCLC23379369

20వ శతాబ్దం ప్రారంభంలో, భారతదేశ వైస్రాయ్ అయిన లార్డ్ కర్జన్, TOIని "ఆసియాలో ప్రముఖ పేపర్" అని పిలిచాడు. 1991లో BBC, ప్రపంచంలోని ఆరు అత్యుత్తమ వార్తాపత్రికలలో ఒకటిగా TOIకి స్థానం ఇచ్చింది.

ఇది బెన్నెట్, కోల్‌మన్ & కో. లిమిటెడ్ యాజమాన్యంలో ప్రచురించబడుతోంది. ఇది సాహు జైన్ కుటుంబానికి చెందినది. బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ఇండియా స్టడీ 2019లో, TOI భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆంగ్ల వార్తాపత్రికగా రేటింగు ఇచ్చింది. రాయిటర్స్ చేసిన సర్వేలో భారతదేశపు అత్యంత విశ్వసనీయ మీడియా న్యూస్ బ్రాండ్‌గా TOIకి రేటింగు వచ్చింది. ఇటీవలి దశాబ్దాలలో ఈ వార్తాపత్రిక భారతీయ వార్తా పరిశ్రమలో సానుకూల కవరేజీకి బదులుగా వ్యక్తులు, సంస్థల నుండి చెల్లింపులను స్వీకరించే పద్ధతిని స్థాపించిందని విమర్శలు ఎదుర్కొంది.

Write by dharma raju naidu

చరిత్ర

ది టైమ్స్ ఆఫ్ ఇండియా 
టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్స్, ca. 1898

ప్రారంభం

ది టైమ్స్ ఆఫ్ ఇండియా 
డైమండ్ జూబ్లీ, 1898 నవంబరు.

TOI తన మొదటి ఎడిషన్‌ను 1838 నవంబరు 3న ది బాంబే టైమ్స్ అండ్ జర్నల్ ఆఫ్ కామర్స్‌గా విడుదల చేసింది. మహారాష్ట్ర సంఘ సంస్కర్త రావుబహదూర్ నారాయణ్ దీనానాథ్ వేల్కర్ ఆధ్వర్యంలో బుధవారాలు, శనివారాల్లో ఈ పేపర్ ప్రచురించబడేది. బ్రిటన్ నుండి, ప్రపంచం నలుమూలల నుండి అలాగే భారత ఉపఖండం నుండి వార్తలను ప్రచురించేది. JE బ్రెన్నాన్ దాని మొదటి సంపాదకుడు. 1850లో ఇది రోజువారీ సంచికలను ప్రచురించడం ప్రారంభించింది.

1860లో, ఎడిటర్ రాబర్ట్ నైట్ (1825–1892) భారతీయ వాటాదారుల ప్రయోజనాలను కొనుగోలు చేసి, పత్రికను ప్రత్యర్థి బాంబే స్టాండర్డ్‌లో విలీనం చేసి, భారతదేశపు మొదటి వార్తా సంస్థను ప్రారంభించాడు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న పేపర్లకు, రాయిటర్స్ వార్తా సంస్థకు వార్తలను పంపే భారతీయ ఏజెంట్‌గా మారింది. 1861లో, అతను బాంబే టైమ్స్ అండ్ స్టాండర్డ్ నుండి ది టైమ్స్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చాడు. ప్రభుత్వాలను, వ్యాపార ఆసక్తులు, సాంస్కృతిక ప్రతినిధుల ప్రయత్నాలనూ తరచుగా ప్రతిఘటిస్తూ, నియంత్రణ లేదా బెదిరింపులు లేని పత్రికల కోసం నైట్ పోరాడాడు. పత్రికను జాతీయ స్థాయికి చేర్చాడు. 19వ శతాబ్దంలో, ఈ వార్తాపత్రిక కంపెనీలో 800 మందికి పైగా ఉద్యోగులు ఉండేవారు. భారతదేశం, ఐరోపాలో గణనీయమైన సర్క్యులేషను ఉండేది.

బెన్నెట్, కోల్‌మన్ యాజమాన్యం

తదనంతరం, 1892 వరకు TOI యాజమాన్యం అనేక సార్లు మారింది. థామస్ జ్యువెల్ బెన్నెట్ అనే ఆంగ్ల పాత్రికేయుడు ఫ్రాంక్ మోరిస్ కోల్‌మన్‌తో కలిసి (తరువాత 1915 SS పర్షియా మునిగిపోయినపుడు అందులో మరణించాడు) తమ కొత్త జాయింట్ స్టాక్ కంపెనీ బెన్నెట్ కోల్‌మన్ & కో. లిమిటెడ్ ద్వారా వార్తాపత్రికను కొనుగోలు చేసారు.

దాల్మియా యాజమాన్యం

సర్ స్టాన్లీ రీడ్ 1907 నుండి 1924 వరకు TOI సంపాదకత్వం వహించాడు. మహాత్మా గాంధీ వంటి ప్రముఖుల నుండి ఉత్తర ప్రత్యుత్తరాలు అందుకున్నాడు. మొత్తం మీద అతను యాభై ఏళ్లు భారతదేశంలో నివసించాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లో అతను భారతీయ కరెంట్ అఫైర్స్‌ నిపుణుడిగా గౌరవం పొందాడు.

బెన్నెట్ కోల్‌మన్ & కో. లిమిటెడ్‌ను పారిశ్రామిక కుటుంబానికి చెందిన షుగర్ మాగ్నెట్ రామకృష్ణ దాల్మియాకు రూ. 2 కోట్లకు (2020 ధరల్లో రూ 2,400 కోట్లు) విక్రయించారు. 1947లో రామకృష్ణ దాల్మియా, తాను ఛైర్మన్‌గా ఉన్న బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీల నుండి డబ్బును బదిలీ చేసి మీడియా దిగ్గజం బెన్నెట్ కోల్‌మన్ & కో.ని స్వాధీనం చేసుకున్నాడని 1955లో వివియన్ బోస్ కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ, కనుగొంది. తదుపరి కోర్టు కేసులో, రామకృష్ణ దాల్మియా అక్రమాస్తులకు, మోసానికి పాల్పడ్డాడని తేలడంతో అతనికి తీహార్ జైలులో రెండేళ్ల శిక్ష విధించారు.

జైలు శిక్షలో ఎక్కువ భాగం అతను ఆసుపత్రిలోనే గడిపాడు. జైల్లో ఉండగా బెన్నెట్, కోల్‌మన్ & కో. లిమిటెడ్ నిర్వహణ బాధ్యతలను అతని అల్లుడు, సాహు శాంతి ప్రసాద్ జైన్‌కు అప్పగించాడు. విడుదలైన తర్వాత, కంపెనీని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను అతని అల్లుడు వమ్ము చేసాడు.

జైన్ కుటుంబం (శాంతి ప్రసాద్ జైన్)

1960వ దశకం ప్రారంభంలో, శాంతి ప్రసాద్ జైన్ వార్తాపత్రికను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించారనే ఆరోపణలపై జైలు శిక్ష అనుభవించాడు. శాంతి ప్రసాద్ జైన్‌పై నిర్దిష్ట ఆరోపణలతో దాల్మియా-జైన్ గ్రూపు తప్పులను గుర్తించిన వివియన్ బోస్ కమిషన్ మునుపటి నివేదిక ఆధారంగా, బెన్నెట్, కోల్‌మన్ అండ్ కంపెనీని నిరోధించాలని, పత్రిక నిర్వహణ నుండి దాన్ని తొలగించాలనీ భారత ప్రభుత్వం పిటిషన్‌ను దాఖలు చేసింది. అభ్యర్థన ఆధారంగా, న్యాయమూర్తి వార్తాపత్రికపై నియంత్రణను చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఫలితంగా సగం మంది డైరెక్టర్లను తీసివేసి, బాంబే హైకోర్టు న్యాయమూర్తిని ఛైర్మన్‌గా నియమించారు.

చాలా ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ఉండే శాంతి ప్రసాద్ జైన్ నవ్వడానికి భయపడరు, సాధారణంగా అద్భుతమైన హాస్యాన్ని కలిగి ఉంటారు. శాంతి ప్రసాద్ జైన్ మనస్సు అందం ద్వారా బలంగా ప్రభావితమవుతుంది. శాంతి ప్రసాద్ జైన్ ఇతరుల సహవాసంలో శాంతి ప్రసాద్ జైన్‌ను నిజంగా ఆస్వాదించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.

భారత ప్రభుత్వం కింద

ది టైమ్స్ ఆఫ్ ఇండియా 
1988 స్టాంపుపై TOI
ది టైమ్స్ ఆఫ్ ఇండియా 
2013 స్టాంపుపై TOI

దాల్మియా-జైన్ లను తీవ్రంగా తప్పుబట్టిన వివియన్ బోస్ కమిషన్ నివేదిక ప్రకారం, జస్టిస్ JL నైన్ ఆధ్వర్యంలోని బాంబే హైకోర్టు, 1969 ఆగస్టు 28న బెన్నెట్, కోల్‌మన్ & కో బోర్డును రద్దు చేసి, ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త బోర్డును ఏర్పాటు చేస్తూ ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. "ఈ పరిస్థితుల్లో కంపెనీ వ్యవహారాలు ప్రజా ప్రయోజనాలకు, ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని పిటిషనర్లు చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఉత్తమం అని భావించాం" అని ధర్మాసనం పేర్కొంది. ఆ ఉత్తర్వును అనుసరించి, శాంతి ప్రసాద్ జైన్ డైరెక్టర్‌గా విరమించాడు. జైన్‌లకు చెందిన ఒక్క స్టెనోగ్రాఫర్‌ను మినహాయించి, భారత ప్రభుత్వం నియమించిన కొత్త డైరెక్టర్లతో కంపెనీ నడిచింది. విచిత్రమేమిటంటే, బోర్డు ఛైర్మన్‌గా డికె కుంటేను కోర్టు నియమించింది. కుంటేకు ముందస్తు వ్యాపార అనుభవం లేదు. అతను లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుడు కూడా.

తిరిగి జైన్ కుటుంబానికి

1976లో, ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం, పత్రిక యాజమాన్యాన్ని సాహు శాంతి ప్రసాద్ జైన్ కుమారుడు, రామకృష్ణ దాల్మియా మనవడూ అయిన అశోక్ కుమార్ జైన్‌కు తిరిగి బదిలీ చేసింది. అతను, ప్రస్తుత యజమానులు సమీర్ జైన్, వినీత్ జైన్ ల తండ్రి. జైనులు కూడా తరచూ వివిధ మనీలాండరింగ్ స్కామ్‌లలో కూరుకుపోయారు. అశోక్ కుమార్ జైన్ 1998లో స్విట్జర్లాండ్‌లో ఖాతాకు అక్రమంగా నిధులను బదిలీ (US$1.25 మిలియన్లు) చేసాడనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతని కేసును కొనసాగించినప్పుడు అతను దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

ఎమర్జెన్సీ సమయంలో

1975 జూన్ 26న, భారతదేశం అత్యవసర పరిస్థితిని ప్రకటించిన మరుసటి రోజు, TOI బొంబాయి ఎడిషన్ దాని సంస్మరణ కాలమ్‌లో ""D.E.M. O'Cracy, beloved husband of T.Ruth, father of L.I.Bertie, brother of Faith, Hope and Justice expired on 25 June" (టి.రూత్‌కు ప్రియమైన భర్త, ఎల్.ఐ. బెర్టీకి తండ్రి, విశ్వాసం, ఆశ, న్యాయాలకు సోదరుడూ అయిన D.E.M. ఓ'క్రేసీ, జూన్ 25న మరణించాడు) అని రాసింది. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన 21-నెలల అత్యవసర పరిస్థితిని ఈ చర్య విమర్శించింది. దీనినే "ఎమర్జెన్సీ" అని పిలుస్తారు. ఈ కాలాన్ని చాలా మంది నిరంకుశ యుగంగా భావించారు. 

21వ శతాబ్దంలో టైమ్స్

2006 చివరలో, టైమ్స్ గ్రూప్ విజయానంద్ ప్రింటర్స్ లిమిటెడ్ (VPL)ని కొనుగోలు చేసింది. VPL గతంలో విజయ కర్ణాటక, ఉషా కిరణ్ అనే రెండు కన్నడ వార్తాపత్రికలను, విజయ టైమ్స్ అనే ఆంగ్ల దినపత్రికను ప్రచురించింది. కన్నడ వార్తాపత్రికల విభాగంలో విజయ కర్ణాటక అగ్రగామిగా ఉండేది.

పత్రిక చెన్నై ఎడిషన్‌ను 2008 ఏప్రిల్ 12 న ప్రారంభించారు. 2013 ఫిబ్రవరిలో కొల్హాపూర్ ఎడిషన్‌ను ప్రారంభించారు.

సంచికలు, ప్రచురణలు

ది టైమ్స్ ఆఫ్ ఇండియా 
TOI ' మొదటి కార్యాలయం అది స్థాపించబడిన ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఎదురుగా ఉంది.

TOI మీడియా గ్రూప్ బెన్నెట్, కోల్‌మన్ & కో. లిమిటెడ్ ప్రచురిస్తుంది. ది టైమ్స్ గ్రూప్ అని పిలువబడే దాని ఇతర కంపెనీల సమూహంతో పాటు కంపెనీ, అహ్మదాబాద్ మిర్రర్, బెంగుళూరు మిర్రర్, ముంబై మిర్రర్, పూణే మిర్రర్ ; ఎకనామిక్ టైమ్స్ ; ET పనాచే (ముంబయి, ఢిల్లీ, బెంగళూరు ల నుండి సోమవారం నుండి శుక్రవారం వరకు వెలువడుతుంది), ET పనాచే (ప్రతి శనివారం పూణె, చెన్నైలలో); ఈ సమయ్ సంగ్బద్పాత్ర (బెంగాలీ దినపత్రిక), మహారాష్ట్ర టైమ్స్ (ఒక మరాఠీ దినపత్రిక); నవభారత్ టైమ్స్ (ఒక హిందీ దినపత్రిక) లను కూడా ప్రచురిస్తుంది.

ముంబై, ఆగ్రా, అహ్మదాబాద్, అలహాబాద్, ఔరంగాబాద్, బరేలీ, బెంగుళూరు, బెల్గాం, భోపాల్, భువనేశ్వర్, కోయంబత్తూర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గోరఖ్పూర్, గుర్గావ్, గువహాటి, గ్వాలియర్, హుబ్లీ, హైదరాబాద్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కొచ్చి, కొల్హాపూర్, కోల్‌కతా, లక్నో, లూథియానా, మదురై, మలబార్, మంగళూరు, మీరట్, మైసూర్, నాగ్‌పూర్, నాసిక్, నవీ ముంబై, నోయిడా, పాట్నా, పూణే, నోయిడా, పనాజీ, రాయ్పూర్, రాజ్కోట్, రాంచీ, సిమ్లా, సూరత్, థానే, తిరుచిరాపల్లి, త్రివేండ్రం, వడోదర, వారణాసి, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో TOI ఎడిషన్లున్నాయి.

విమర్శలు, వివాదాలు

చెల్లింపు వార్తలు

రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, కార్పొరేషన్‌లు, ప్రముఖులు వార్తాపత్రికకు డబ్బులు చెల్లిస్తే, దాని జర్నలిస్టులు చెల్లింపుదారు కోసం కావలసిన వార్తలను ప్రచురించడమనే చెల్లింపు వార్తల అభ్యాసాన్ని భారతదేశంలో సంస్థాగతీకరించిన మొదటి పత్రిక TOI అని విమర్శలు వచ్చాయి. చెల్లింపు వార్తలకు వార్తాపత్రిక ప్రాముఖ్యతను, చెల్లింపు మొత్తం ఆధారంగా ప్రదర్శించబడే పేజీని ఇస్తుంది. ఈ అభ్యాసం ప్రకారం, చెల్లించే మొత్తాన్ని బట్టి వార్తా ఫీచర్‌ను ప్రచురించేందుకు హామీ ఇస్తుంది. చెల్లింపుదారుకు సానుకూల కవరేజీ ఉండేలా చూస్తుంది. 2005లో, TOI "బ్రాండ్ క్యాపిటల్" అని కూడా పిలవబడే "ప్రైవేట్ ఒప్పందాల" అభ్యాసాన్ని ప్రారంభించింది. Bennett, Coleman & Company, Ltdకి షేర్లు లేదా ఇతర రకాల ఆర్థిక లాభాలను అందిస్తే అందుకు ప్రతిగా, కొత్త కంపెనీలు, వ్యక్తులు లేదా భారీ కవరేజీని కోరుకునే చలనచిత్రాలు, పబ్లిక్ రిలేషన్స్, ప్రధాన బ్రాండ్‌లు, సంస్థలకు స్థిరమైన సానుకూల కవరేజీని అందించింది. BCCL, దాని "ప్రైవేట్ ఒప్పందాలు" ప్రోగ్రామ్‌తో, 350 కంపెనీలలో వాటాలను పొందింది. 2012 నాటికి దాని ఆదాయాలలో 15% ఈ విధంగా సంపాదించింది. ది న్యూయార్కర్‌లోని ఒక క్లిష్టమైన కథనం ప్రకారం. TOI ప్రారంభించిన "చెల్లింపు వార్తలు", "ప్రైవేట్ ఒప్పందాలు" పద్ధతులను అప్పటి నుండి ది హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్, ఇండియా టుడే గ్రూప్, ఔట్‌లుక్ గ్రూప్, ఇతర భారతీయ టెలివిజన్ ఛానెల్‌లతో సహా భారతదేశంలోని ఇతర ప్రధాన మీడియా సమూహాలు కూడా అనుసరించాయి. కంపెనీ లోని ఈ విభాగానికి ఆ తర్వాత బ్రాండ్ క్యాపిటల్‌ అని పేరు మార్చారు. విభిన్న రంగాలలోని అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.

"చెల్లింపు వార్తలు", "ప్రైవేట్ ఒప్పందాల"లో భాగంగా, పత్రికలో పనిచేసే స్టాఫ్ రిపోర్టర్‌లు వ్రాసే అనుకూలమైన కవరేజీ కారణంగా కంటెంటుకూ ప్రకటనలకూ మధ్య విభజన రేఖ మసకబారింది. 2012లో తాను అవలంబిస్తున్న ఈ విధానాన్ని పత్రిక సమర్థించుకుంది. పాఠకులకు దీన్ని తెలుపుతూ ఒక గమనికను - చిన్న ఫాంట్‌లో ఉన్నప్పటికీ - వేసేది. ఆయా వార్తలు "అడ్వర్టోరియల్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రమోషనల్ ఫీచర్" అని, ఆదాయాన్ని సంపాదించడానికి దీన్ని చేస్తున్నామనీ అందులో పేర్కొనేవారు. TOI యజమానుల ప్రకారం "ప్రపంచంలోని వార్తాపత్రికలన్నీ అడ్వర్టోరియల్స్ వేస్తాయి". మాయా రంగనాథన్ ప్రకారం, వార్తాపత్రికకు మార్కెటింగ్, ప్రకటనల ఆదాయాన్ని సంపాదించే వ్యక్తిగా వ్యవహరించే పాత్రికేయుని పనితీరులో ఈ వ్యాపారాసక్తి వివాదాస్పద ప్రశ్నలను లేవనెత్తుతుంది. భారతదేశంలో ఈ సమస్య ఎదుగుతూ పెద్ద స్థాయికి చేరింది. 2009 జూలైలో దీన్ని SEBI అధికారికంగా గుర్తించింది.

ప్రముఖ ఉద్యోగులు

  • షామ్ లాల్, ఎడిటర్
  • గిరిలాల్ జైన్, సంపాదకుడు
  • సమీర్ జైన్, వైస్ చైర్మన్
  • వినీత్ జైన్, MD
  • జగ్ సురయ్య (అసోసియేట్ ఎడిటర్, కాలమిస్ట్, "జుగులార్ వీన్," కార్టూనిస్ట్, దుబ్యామన్ II )
  • స్వామినాథన్ అయ్యర్ (కాలమిస్ట్, "స్వామినామిక్స్")
  • ఆర్‌కె లక్ష్మణ్ (యు సెడ్ ఇట్ ఎడిటోరియల్ కార్టూన్, ప్రముఖ కామన్ మ్యాన్ ఫీచర్)
  • MJ అక్బర్, "ది సీజ్ విత్ ఇన్" కాలమిస్టు, మాజీ ఎడిటోరియల్ టీమ్
  • చేతన్ భగత్, వ్యాసకర్త, ఆదివారం TOI
  • శశి థరూర్, "శశి ఆన్ సన్‌డే" కాలమిస్ట్
  • VD త్రివాడి, హాస్యరచయిత
  • ట్వింకిల్ ఖన్నా, కాలమిస్ట్ "మిసెస్. ఫన్నీబోన్స్"
  • స్వపన్ దాస్‌గుప్తా, వ్యాసకర్త, ఆదివారం TOI

మూలాలు

Tags:

ది టైమ్స్ ఆఫ్ ఇండియా చరిత్రది టైమ్స్ ఆఫ్ ఇండియా సంచికలు, ప్రచురణలుది టైమ్స్ ఆఫ్ ఇండియా విమర్శలు, వివాదాలుది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రముఖ ఉద్యోగులుది టైమ్స్ ఆఫ్ ఇండియా మూలాలుది టైమ్స్ ఆఫ్ ఇండియాఆంగ్ల భాషటైమ్స్ గ్రూప్ సంస్థభారతదేశంలోని వార్తాపత్రికల జాబితా (సర్క్యులేషన్)వార్తాపత్రిక

🔥 Trending searches on Wiki తెలుగు:

వంగ‌ల‌పూడి అనితక్రికెట్చార్మినార్వేంకటేశ్వరుడుదసరా (2023 సినిమా)మఖ నక్షత్రముఆంధ్రజ్యోతికుబేరుడుసతీసహగమనంసమతామూర్తిరక్త పింజరిరాం చరణ్ తేజతెలుగు పదాలుదగ్గుబాటి వెంకటేష్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)మంగ్లీ (సత్యవతి)భారతీయ స్టేట్ బ్యాంకునువ్వు నాకు నచ్చావ్ధర్మవరపు సుబ్రహ్మణ్యంపరిటాల రవికేదార్‌నాథ్ ఆలయంమహాబలిపురంమరియు/లేదావిష్ణువుసుభాష్ చంద్రబోస్సంభోగంఋతుచక్రంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుటి. రాజాసింగ్ లోథ్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంభారత జాతీయగీతంయక్షగానంఘట్టమనేని మహేశ్ ‌బాబుదీపావళిపారిశ్రామిక విప్లవంఅనూరాధ నక్షత్రంఅయ్యప్పవై.యస్.భారతితెలుగు వ్యాకరణం2023 కర్ణాటక శాసనసభ ఎన్నికలుబుధుడు (జ్యోతిషం)సీమ చింతజై శ్రీరామ్ (2013 సినిమా)అల వైకుంఠపురములోనాని (నటుడు)హిందూధర్మంకర్పూరంభారత జాతీయ మానవ హక్కుల కమిషన్లావు శ్రీకృష్ణ దేవరాయలుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంపవన్ కళ్యాణ్నరసింహావతారంతెలంగాణ రాష్ట్ర సమితికావ్య కళ్యాణ్ రామ్పెళ్ళిఛత్రపతి శివాజీప్రధాన సంఖ్యభారతదేశ చరిత్రఆంజనేయ దండకంసుందర కాండరవితేజనడుము నొప్పిభాషా భాగాలుసీతాపతి చలో తిరుపతిఅనంత శ్రీరామ్పూజిత పొన్నాడభారత రాజ్యాంగ పీఠికవిటమిన్మంచు మోహన్ బాబుకర్ణాటకనాగోబా జాతరచిరంజీవి నటించిన సినిమాల జాబితాగర్భంప్రభాస్మండల ప్రజాపరిషత్జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్హోళీతెలుగు సినిమాలు 2023తామర వ్యాధి🡆 More