గెలీలియో గెలీలి

గెలీలియో గెలీల ఇటలీకు చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త.

టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.

గెలీలియో గెలీలి
గెలీలియో గెలీలి
Portrait of Galileo Galilei by Giusto Sustermans
జననం(1564-02-15)1564 ఫిబ్రవరి 15
పిసా, టుస్కానీ - ఇటలీ
మరణం1642 జనవరి 8(1642-01-08) (వయసు 77)
అర్సెట్రీ, టుస్కానీ - ఇటలీ
నివాసంGrand Duchy of Tuscany
రంగములుఖగోళ శాస్త్రము, భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము
వృత్తిసంస్థలుపాడువా యూనివర్శిటీ
చదువుకున్న సంస్థలుపిసా యూనివర్శిటీ
ప్రసిద్ధిKinematics
టెలీస్కోపు
సౌరమండలము
గెలీలియో గెలీలి

గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.

అరిస్టాటిల్ తో విభేదం

గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును. ప్రయోగాల ప్రమేయం ఏ మాత్రం అవసరం లేదన్నది అరిస్టాటిల్ సిద్ధాంతాల్లోని పెద్ద లోపం. ఉదాహరణకు: అరిస్టాటిల్ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు బరువులు గల రెండు వస్తువులను కొంత ఎత్తు నుంచి స్వేచ్ఛగా వదిలితే ఎక్కువ బరువు గల వస్తువు తక్కువ కాలంలో భూమిని చేరుకుంటుంది. దీనితో ఏకీభవించని గెలీలియో పీసా గోపురం 180 అడుగుల ఎత్తు పైనుంచి 100 పౌండ్లు, 1 పౌండు బరువు గల రెండు ఇనప గుండ్లను ఒకేసారి క్రిందికి వదలి, అవి రెండూ ఒకే కాలంలో భూమిని చేరుకుంటాయని ప్రయోగం ద్వారా నిరూపించాడు. గురుత్వ త్వరణం గూర్చి ఆ కాలం నాటికే అర్థం చేసుకోగలిగాడు.

గెలీలియో ఎన్నో మూఢ నమ్మకాలను శాస్త్ర వాదనల ద్వారా ప్రయోగాల ద్వారా తొలగించ గలిగాడు. 20 సంవత్సరాల వయస్సప్పుడు ఈయన ఒక రోజు ప్రార్థన కోసం చర్చికి వెళ్ళాడు. చీకటి పడుతున్న వేళ అది. చర్చి సేవకుడు ఒకడు దీపాలు వెలిగిస్తున్నాడు. ఎన్నో దీపాలు చర్చి పైభాగం నుండి వ్రేలాడుతూ ఉన్నాయి. ఈ దీపాలు ఉయ్యాల మాదిరి అటు, యిటూ ఊగటం గమనించాడు. వాటి డోలనా సమయాలు ఒకటేనని లెక్క వేశాడు. గెలీలియో కాలంనాటికి కచ్చితంగా కాల నిర్ణయం చేసే గడియారాలు లేనప్పటికి ఈయన డోలన కాలాలను గణించటం విశేషం. వైద్య విద్యార్థి కాబట్టి, నాడి కొట్టుకోవటం, గుండె కొట్టుకోవటం పై పరిచయం ఉంది కాబట్టి కాలనిర్ణయాన్ని తేలికగా చేయగలిగాడని అనుకోవచ్చు. ఈ పరిశీలన ఆధారంగా గెలీలియో "పల్స్ మీటరు" రూపొందించాడు. ఆ తదుపరి ఆయన కుమారుడు విన్సెన్జీ గోడ గడియారాన్ని తయారు చేశాడు. ఈ వాళ మనం వాడుతున్న పెండులం క్లాక్ కు కూడా మూలసూత్రం యిదే.

గెలీలియో గెలీలి 
1610లో గెలీలియో పరిశీలించిన శుక్రగ్రహ ఉపగ్రహాలు.

పాడువా విశ్వవిద్యాలయం

గెలీలియో గెలీలి 
ఫ్లారెన్స్ లో గెలీలియో శిల్పం.

ఈ ప్రయోగం మూలంగా అరిస్టాటిల్ సిద్ధాంతాల్ని నమ్మే పీసా విద్యాలయ మేధావులను ఇబ్బంది పెట్టింది. అందువలన స్వేచ్ఛ, సౌకర్యాలు కొరవడిన గెలీలియో అక్కడనుండి పాడువా విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా చేరారు. అక్కడే గెలీలియో యాంత్రిక శాస్త్రం రచించారు. ఇది సామాన్యులకు కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడానికి ఉపకరించింది.

పాడువా లోనే గెలీలియోకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో డబ్బుకోసం కొత్త విషయాలను ఆవిష్కరించడం ఒక్కటే అతనికి మార్గంగా కనిపించింది. ఆ సమయంలోనే వాయు థర్మామీటర్ ను, పల్లపు ప్రాంతం నుంచి ఎత్తుకు నీటిని చేరవేసి వ్యవసాయానికి ఉపయోగించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్ పరికరాన్ని కనుగొన్నారు. ఆ సమయంలోనే లోలకాలు, వాయుతలాలపై కూడా కీలకమైన ప్రయోగాలు చేశారు.

టెలిస్కోప్

గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.

విశ్వ రహస్యాలు

ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు. బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపు ద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధ్రువీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. సా.శ. 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని నిర్ధ్వందంగా ప్రకటించాడు. Jai hind

మతాధికారుల ఆగ్రహం

అప్పటికే మత గ్రంథాలలో ప్రముఖ స్థానాన్ని పొందిన భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కోపర్నికస్ సిద్ధాంతాన్ని నిషేధించి, కొందరు మతాధికారులు గెలీలియో ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. తన ప్రయోగాలను ఎన్నటికీ బహిర్గతం చేయనని ప్రమాణం తీసుకున్నారు. ఈ ప్రకటనకు ఆగ్రహం చెందిన చర్చి మతాధికారులు గెలీలియో ఎటువంటి ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 1623లో గెలీలియో స్నేహితుడు మతాధికారి పదవిని స్వీకరించినా, తనపై మోపబడిన అభియోగాన్ని రద్దుచేయబడలేదు. ఐతే రెండు సిద్ధాంతాలపై గ్రంథాన్ని రాయడానికి అనుమతి సంపాదించాడు. దీంతో సా.శ.1630 వరకు గెలీలియో నోరు విప్పలేక పోయాడు. అయినా ఆయన తన వాదాలను విడిచి పెట్టలేదు. వాటిని పుస్తక రూపంలో వెలువరించాడు. 1632లో వెలువడిన ఈ "Dialogues concerning the two chief world systems" అనే గ్రంథం ఐరోపా ఖండంలో సారస్వత వేదాంత గ్రంథానికి ఉదాహరణగా పేర్కొంటారు. నిర్భయంగా తాను వాస్తవమని నమ్మిన శాస్త్రీయ విషయాలను వెల్లడించాడు. అయితే ఈ గ్రంథాన్ని ప్రజలు కోపర్నికస్ సిద్ధాంతాన్ని సమర్ధించేదిగా భావిస్తున్నారని తెలుసుకున్న మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. సా.శ. 1637 లో పాపం గెలీలియో గ్రుడ్డివాడయ్యాడు. ఇంతటి మహానుభావుడు శిక్షను అనుభవిస్తూనే 1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను తెలియజేసి ఈ ప్రపంచమంతా వెలుగులు నింపాలని ప్రయత్నించిన ఒక మహా మనిషిని మూర్ఖత్వం బలిగొంది.

మూలాలు

బయటి లింకులు

Tags:

గెలీలియో గెలీలి అరిస్టాటిల్ తో విభేదంగెలీలియో గెలీలి పాడువా విశ్వవిద్యాలయంగెలీలియో గెలీలి టెలిస్కోప్గెలీలియో గెలీలి విశ్వ రహస్యాలుగెలీలియో గెలీలి మతాధికారుల ఆగ్రహంగెలీలియో గెలీలి మూలాలుగెలీలియో గెలీలి బయటి లింకులుగెలీలియో గెలీలిఇటలీటెలీస్కోపుతత్వవేత్త

🔥 Trending searches on Wiki తెలుగు:

అశ్వని నక్షత్రముఅల్లసాని పెద్దనరైతుబంధు పథకంహను మాన్పులివెందుల శాసనసభ నియోజకవర్గంకాపు, తెలగ, బలిజకృతి శెట్టిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంవేమన శతకమురామావతారంరాజమండ్రిసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుమర్రిభారతీయ రిజర్వ్ బ్యాంక్తెలుగు పత్రికలుదానం నాగేందర్శ్రీముఖిమలబద్దకంపరీక్షిత్తుమహాసముద్రంశ్రీ కృష్ణుడుఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుశ్రీలలిత (గాయని)ఎన్నికలునానార్థాలుతమన్నా భాటియాఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుపామురామ్ పోతినేనిపంబన్ వంతెనచతుర్వేదాలుతెలుగు అక్షరాలుతెలుగు కథపాడ్యమివిశ్వబ్రాహ్మణభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలునక్షత్రం (జ్యోతిషం)కొంపెల్ల మాధవీలతసూర్య నమస్కారాలుఢిల్లీ డేర్ డెవిల్స్రమ్య పసుపులేటితిరుపతిబంగారు బుల్లోడుపెమ్మసాని నాయకులుస్వామి వివేకానందగ్యాస్ ట్రబుల్సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుమంజుమ్మెల్ బాయ్స్పూరీ జగన్నాథ దేవాలయంరేవతి నక్షత్రంబి.ఆర్. అంబేద్కర్గ్రామంఉపద్రష్ట సునీతపాములపర్తి వెంకట నరసింహారావుభూమికుమ్మరి (కులం)వృషభరాశిఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీమంతెన సత్యనారాయణ రాజుజనసేన పార్టీగంగా నదిఉపనిషత్తుఅపర్ణా దాస్పోలవరం ప్రాజెక్టురమణ మహర్షిశ్రీనాథుడుపల్లెల్లో కులవృత్తులుభారతీయ రైల్వేలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅనసూయ భరధ్వాజ్ఘట్టమనేని కృష్ణమారేడుశుక్రాచార్యుడుపెరిక క్షత్రియులుధనిష్ఠ నక్షత్రముప్రధాన సంఖ్యపుష్ప🡆 More