కృతవర్మ

కృతవర్మ యాదవ యోధుడు, సైన్యాధ్యక్షుడు.

ఈయన కృష్ణుని సమకాలికుడు. మహాభారతం, విష్ణుపురాణము, భాగవతం, హరివంశము వంటి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో కృతవర్మ ప్రసక్తి కనిపిస్తుంది.

కృతవర్మ యాదవకులంలోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. శమంతకమణి వ్యవహారములో కృష్ణుని మామ అయిన సత్రాజిత్తును హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో, కృతవర్మ కౌరవుల పక్షాన చేరి పాండవులకు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం కౌరవ సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో అశ్వత్థామకు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నునితో పాటు శిఖండి, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము మహాభారతంలోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది. మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ ద్వారకలో సాత్యకి చేతిలో మరణించాడు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

Tags:

కృష్ణుడుభాగవతంమహాభారతంసంస్కృతము

🔥 Trending searches on Wiki తెలుగు:

వృషణంప్రభాస్మానుషి చిల్లర్సౌర కుటుంబంగరుడ పురాణంఅశోకుడుసురేఖా వాణిసుభాష్ చంద్రబోస్నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిఎన్నికలుస్త్రీమనుస్మృతిసాక్షి (దినపత్రిక)Aనువ్వు నేనుఇండియన్ ప్రీమియర్ లీగ్గ్రామ సచివాలయంవిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంతమన్నా భాటియాఫ్లిప్‌కార్ట్నర్మదా నదిఅయ్యప్పసుఖేశ్ చంద్రశేఖర్రాజమండ్రిస్టార్ మాసింహరాశివరిబీజంనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డివిభక్తికామాక్షి భాస్కర్లట్విట్టర్ఇందుకూరి సునీల్ వర్మకామసూత్రగోదావరిపావని గంగిరెడ్డికిరణజన్య సంయోగ క్రియసజ్జా తేజన్యుమోనియాలోక్‌సభ స్పీకర్మిరపకాయకాలుష్యంచాట్‌జిపిటిమండల ప్రజాపరిషత్అలంకారంతెలుగు కవులు - బిరుదులుచిత్త నక్షత్రముమొదటి పేజీసన్ రైజర్స్ హైదరాబాద్భాగ్యరెడ్డివర్మవై.ఎస్.వివేకానందరెడ్డివృశ్చిక రాశిగంజాయి మొక్కస్వామి వివేకానందభారత జాతీయ ఎస్సీ కమిషన్PHస్వామియే శరణం అయ్యప్పమార్చి 28ఆహారంబౌద్ధ మతంశివ కార్తీకేయన్పరశురాముడుగుండెమెదడుమెయిల్ (సినిమా)ఆలివ్ నూనెజే.రామేశ్వర్ రావుకింజరాపు అచ్చెన్నాయుడుమగధీర (సినిమా)వందే భారత్ ఎక్స్‌ప్రెస్జె. చిత్తరంజన్ దాస్పాల కూరకలబందయజుర్వేదంసమాసంరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)వై. ఎస్. విజయమ్మమకరరాశిభారత జాతీయపతాకం🡆 More