శుక్రవారం

శుక్రవారం (Friday) అనేది వారంలో ఆరవ రోజు.

ఇది గురువారంనకు, శనివారంనకు మధ్యలో ఉంటుంది.భారత పురాణాలలోని శుక్రదేవుని పేరుమీదుగా ఇది శుక్రవారం అని పిలువబడుతుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు.శుక్రవారం ముస్లింలకు శుభదినంగా భావిస్తారు. క్రిష్టియన్లుకు ఈష్టర్ పండగకు ముందు వచ్చే శుక్రవారంనాడు ప్రత్యేక ప్రార్థనా రోజుగా గుడ్ ఫ్రైడే అనే పేరుతో పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున కొత్తపనులు ప్రారంభిస్తారు. తెలుగు చలన చిత్రసీమలో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు, విడుదలలు శుక్రవారం రోజునే జరుగుతాయి.తెలుగువారికి (ముఖ్యంగా మహిళలకు) మంగళకరమైన శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

శుక్రవారం
శుక్రుడు ప్రతిరూపం

ప్రాముఖ్యత

శుక్రవారం 
శక్తికి మారుపేరు దుర్గాదేవి ప్రతిరూపం

హిందూ మతంలో, వారంలోని ప్రతి రోజు ఒక నిర్దిష్ట దేవునికి లేదా దేవతలకు అంకితం చేయబడింది. శుక్రవారం అన్ని మతాలవారు పవిత్రమైన రోజుగా భావిస్తారు.హిందూ పురాణాల ప్రకారం  “అంతిమ స్త్రీత్వం” చిహ్నంగా భావించే శుక్రుడికి అంకితం చేసిన రోజు అని స్త్రీలు మంగళకరమైన వారంగా పరిగణిస్తారు. శుక్రవారం తల్లిలాగే ప్రేమ, సంరక్షణ ఇస్తుందని కొంత మంది నమ్ముతారు. వీనస్ దేవతను ప్రజలకు అందం, మనోహరంగా ఉంటుందని భావిస్తారు.అందువలన దీనిని శృంగార దినంగా చెప్పుకుంటారు. హిందువులు శుక్రవారం “దేవీ”ని ఆరాధిస్తారు.దేవీ విశ్వాన్ని శాసించే “పరశక్తి” అని నమ్ముతారు. ఖురాన్, బైబిల్ మతాలకు చెందిన వారు శుక్రవారానికి ప్రాముఖ్యత ఇస్తారు.ఆరోజు ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవడానికి ఉత్తమ రోజుగా భావిస్తారు.

శుక్రవారం తల్లిగా భావించే దేవతలు సంతోషి మాత, మహాలక్ష్మీ, మాతా అన్నపూర్ణేశ్వరీ, దుర్గా మాత దేవీకి అంకితం చేయబడింది.ఆ రోజున మహిళలు ఆదేవతలుకు వ్రతాలు చేసి తీపి పదార్థాలు పంపిణీచేసే సంప్రదాయం ఆచరిస్తారు. కొంత మంది భక్తులు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం ఉంటారు.శుక్రవారం తెలుపు రంగుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.శుక్రవారానికి ప్రతినిధిగా మరొక దేవత శుక్రా, అతను ఆనందం  భౌతిక సంపదను సమకూరుస్తాడు.జ్యోతిషశాస్త్ర పటంలో శుక్రా కాలం చాలా ఉత్పాదక, అదృష్ట కాలంగా పరిగణించబడుతుంది.భారతదేశంలోని శక్తి దేవాలయాలు, శక్రవారం రోజున అధిక సంఖ్యలో భక్తులు దర్శిస్తారు. శుక్రవారం ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఉపవాసం ఉన్న వ్యక్తి సాయంత్రం మాత్రమే భోజనం చేస్తాడు. తెలుపు రంగుతో శక్తితో చాలా దగ్గరి సంబంధం ఉన్నందున, సాయంత్రం భోజనం సాధారణంగా పాలు, బియ్యంతో చేసిన ఖీర్ లేదా పాయసం వంటి తెల్లని ఆహారాన్ని తీసుకుంటారు.

వరలక్ష్మీ వ్రతం

శుక్రవారం 
వరలక్ష్మీ వ్రతం మందిరంలో శక్తి దేవత

హిందూ సంప్రదాయంలో వివాహమైన స్త్రీలు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంరోజు వరలక్ష్మీ వ్రతం అత్యంత ఇష్టంగా నోచుకుంటారు. వరలక్ష్మీ దేవత విష్ణు మూర్తి భార్య. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.ఆ రోజున చేసే వ్రతం  అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకం ఉంది. అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి వరలక్ష్మీ వ్రతం వల్ల లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.

శుక్రవారం పాటించని పనులు

  • నావికులు నెలలో 13 రోజున శుక్రవారం వస్తే నావికులు సముద్రంలోకి వెళ్ళడానికి "చెడ్డ రోజు"గా భావిస్తారు. కొంతమంది సముద్రంలోకి వెళ్లటానికి భయపడతారు.దీనిని "బ్లాక్ ఫ్రైడే"గా భావిస్తారు.
  • శుక్రవారం కొంత మంది ధనం అప్పుగా ఇవ్వటానికి ఇష్టపడరు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

శుక్రవారం ప్రాముఖ్యతశుక్రవారం పాటించని పనులుశుక్రవారం మూలాలుశుక్రవారం వెలుపలి లంకెలుశుక్రవారంగుడ్ ఫ్రైడేగురువారంముస్లింరోజుశనివారంశ్రావణ శుక్రవారం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమాలు 2023తెలుగు నాటకరంగంగైనకాలజీతిథిఉత్తరాషాఢ నక్షత్రముక్రిక్‌బజ్దసరాపర్యాయపదంకమ్మనామవాచకం (తెలుగు వ్యాకరణం)అగ్నికులక్షత్రియులుపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంభారత జాతీయ కాంగ్రెస్అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంజోకర్మియా ఖలీఫావిడాకులుబ్రాహ్మణ గోత్రాల జాబితానల్లమిల్లి రామకృష్ణా రెడ్డిచే గువేరాసింహంతోటపల్లి మధుజే.సీ. ప్రభాకర రెడ్డిసిరికిం జెప్పడు (పద్యం)చోళ సామ్రాజ్యంభీమసేనుడుశతభిష నక్షత్రమునరసింహ (సినిమా)చిరంజీవి నటించిన సినిమాల జాబితాఆంగ్ల భాషహనుమాన్ చాలీసాశ్రీశ్రీమంగళసూత్రంఅమిత్ షామృణాల్ ఠాకూర్రైతుఓం భీమ్ బుష్ఆవర్తన పట్టికగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంవల్లభనేని బాలశౌరిఅర్జునుడుఆరూరి రమేష్మారేడుసత్య సాయి బాబాకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంమలబద్దకంకోణార్క సూర్య దేవాలయంహర్భజన్ సింగ్ఉప్పు సత్యాగ్రహంవిశ్వామిత్రుడుపుష్కరంకింజరాపు రామ్మోహన నాయుడుతీన్మార్ సావిత్రి (జ్యోతి)జానకి వెడ్స్ శ్రీరామ్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంవిశ్వనాథ సత్యనారాయణధనూరాశిగౌతమ బుద్ధుడుతోడికోడళ్ళు (1994 సినిమా)హనుమజ్జయంతిPHసాయి సుదర్శన్అనూరాధ నక్షత్రంపిఠాపురంప్రకృతి - వికృతిలలితా సహస్రనామ స్తోత్రంవృషభరాశిదానం నాగేందర్వంగవీటి రాధాకృష్ణవిష్ణువు వేయి నామములు- 1-1000యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅష్టదిగ్గజములుమృగశిర నక్షత్రముఇన్‌స్పెక్టర్ రిషిఈశాన్యంవేంకటేశ్వరుడునిజాం🡆 More