ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ (ఆంగ్లం : Ernest Rutherford, 1st Baron Rutherford of Nelson), ఆర్డర్ ఆఫ్ మెరిట్, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (ఆగస్టు 30 1871 – అక్టోబరు 19 1937) న్యూజీలాండ్కు చెందిన ఒక రసాయనిజ్ఞుడు, ఇతనికి అణు భౌతిక శాస్త్ర పితామహుడు అనే బిరుదు గలదు.

అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు,, అణువు యొక్క రూథర్‌ఫోర్డ్ నమూనా (లేదాగ్రహ మండల నమూనా, ఇదే సిద్దాంతం ఆ తరువాత బోర్ నమూనా లేదా కక్ష్యా నమూనాగా ఏర్పడడానికి దోహదపడింది) ను ప్రతిపాదించాడు. ఇతడు రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ ప్రయోగాన్ని బంగారు రేకుగుండా α-కణ పరిక్షేపణ ప్రయోగంచేసి కెంద్రకం యొక్క ఉనికిని కనిపెట్టాడు. ఇతడికి 1908లో రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్
ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్
జననం(1871-08-30)1871 ఆగస్టు 30
బ్రైట్‌వాటర్, న్యూజీలాండ్
మరణం1937 అక్టోబరు 19(1937-10-19) (వయసు 66)
కేంబ్రిడ్జి, ఇంగ్లాండు, యునైటెడ్ కింగ్ డం
జాతీయతన్యూజీలాండర్
రంగములుభౌతిక రసాయనిక శాస్త్రం
వృత్తిసంస్థలుమాక్‌గిల్ విశ్వవిద్యాలయం
మాంచెస్టర్ విశ్వవిద్యాలయం
చదువుకున్న సంస్థలుసెంటర్‌బరీ విశ్వవిద్యాలయం
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం
విద్యా సలహాదారులుఅలెగ్జాండర్ బిక్కెర్టన్
జే.జే. థాంసన్
ముఖ్యమైన విద్యార్థులుమార్క్ ఒలిఫాంట్
పాట్రిక్ బ్లాకెట్
హాన్స్ గీగర్
en:నీల్స్ బోర్
ఒట్టో హాన్
సెసిల్ పావెల్
టెడ్డీ బుల్లార్డ్
ప్యాట్ర్ కపిస్టా
జాన్ కాక్‌క్రాఫ్ట్
ఎర్నెస్ట్ వాల్టన్
ఛార్లెస్ డ్రమ్మాండ్ ఎల్లిస్
జేమ్స్ చాడ్విక్
ఎర్నెస్ట్ మార్స్‌డెన్
ఎడ్వర్డ్ అండ్రాడె
ఫ్రెడరిక్ సాడ్డి
ఎడ్వర్డ్ విక్టర్ అప్పెల్టన్
బెర్ట్‌రామ్ బోల్ట్‌వుడ్
కాజీమిర్జ్ ఫజాన్స్
ఛార్లెస్ గాల్టన్ డార్విన్
హెన్రీ మోస్లీ
ఏ.జే.బీ. రాబర్ట్‌సన్
జార్జి లారెన్స్
రాబర్ట్ విలియం బోయెలె
ప్రసిద్ధిఅణుభౌతిక శాస్త్ర పితామహుడు
రూథర్‌ఫోర్డ్ నమూనా
రూథర్‌ఫోర్డ్ α-కణ పరిక్షేపణ
రూథర్‌ఫోర్డ్ బ్యాక్‌స్కాటరింగ్ స్పెక్ట్రోస్కోపీ
ప్రోటాన్ ఆవిష్కరణ
రూథర్‌ఫోర్డ్ యూనిట్
'ఆర్టిఫీషియల్ డిజ్‌ఇంటిగ్రేషన్' పద ఆవిష్కర్త
ముఖ్యమైన పురస్కారాలురసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి (1908)
సంతకం
ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్

బాల్యం

న్యూజిలాండ్ లోని నెల్సన్ లో 1871 ఆగస్టు 30న ఓ వ్యవసాయదారుడి 12 మంది సంతానంలో నాలుగో వాడిగా పుట్టిన రూథర్‌ఫర్డ్‌కి చిన్నతనంలోనే సైన్స్‌ పట్ల అభిరుచి ఏర్పడింది. పదేళ్లకే ఎలిమెంటరీ ఫిజిక్స్‌ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివేశాడు. న్యూజిలాండ్‌ విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్‌తో చేరిన అతడు బీఏ, ఎమ్‌ఏ, బీఎస్సీ డిగ్రీలు సాధించాడు.

పరిశోధనలు

ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే అత్యంత వేగంగా ప్రయాణించే విద్యుదయస్కాంత తరంగాలను కనిపెట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఇరవై ఏడేళ్ల వయసులోనే కెనడాలోని మెగిల్‌ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే యురేనియం, థోరియంలాంటి రేడియోధార్మిక పదార్థాలు వెలువరించే ఆల్ఫా, బీటా వికిరణాలను ఆవిష్కరించాడు. రేడియో ధార్మిక విఘటనం (Radio active decay) నియమాలను ప్రతిపాదించాడు. ఒక రేడియో ధార్మిక పదార్థంలో ఉండే సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే 'అర్థ జీవిత కాలం' (Half Life Period) ను నిర్వచించాడు. ఈ సూత్రం ప్రకారం రేడియో డేటింగ్ పద్ధతి ద్వారక్వ భూమి వయస్సును కూడా కనుగొనవచ్చని చెప్పాడు. అలాగే కృత్రిమ మూలకాల పరివర్తన ద్వారా నైట్రోజన్‌ను, ఆక్సిజన్‌గా మార్చవచ్చని తెలిపాడు. ఈ పరిశోధనలకు 1908లో నోబెల్‌ అందుకున్నాడు.

కేంద్రక ఆవిష్కరణ

కెనడా నుంచి ఇంగ్లండ్‌ తిరిగి వచ్చిన తర్వాత పలుచటి బంగారు రేకుపై ధనావేశమున్న ఆల్ఫాకిరణాలను ప్రసరింపజేసినప్పుడు 20000 కణాలలో ఒకటి వెనక్కి తిరిగి రావడాన్ని గమనించాడు. అందుకు కారణం పరమాణువులో ధనావెశమున్న కేంద్రకం ఉండుటవలన.ఈ కారణంగా కేంద్రకంలో ఉండే ప్రోటాన్లు వాటిని వికర్షించడమేనని కనుగొన్నాడు. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టే, పరమాణువుల్లోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ప్రతిపాదించాడు. ఇదే రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనాగా పేరొందింది. దీనినే గ్రహమండల నమూనా అంటారు. ఆ తర్వాత కేంద్రకంలో ప్రోటాన్లతో పాటు న్యూట్రాన్లు ఉంటాయని ఊహించాడు. ఆయన శిష్యుల్లో చాలా మంది నోబెల్‌ బహుమతులు సాధించడం విశేషం. అనేక అవార్డులు సాధించిన ఆయన గౌరవార్థం 104 అణుసంఖ్య ఉన్న మూలకానికి రూథర్‌ఫోర్డియం అని పేరు పెట్టారు.

ప్రచురణలు

  • Radio-activity (రేడియో ధార్మికత) (1904), 2nd ed. (1905), ISBN 978-1-60355-058-1
  • Radioactive Transformations (రేడియోధార్మిక పరివర్తన) (1906), ISBN 978-1-60355-054-3
  • Radiations from Radioactive Substances (రేడియోధార్మిక పదార్థాల నుండి వెలుపడు వికిరణాలు) (1919)
  • The Electrical Structure of Matter (పదార్థం యొక్క విద్యుత్ వ్యవస్థ) (1926)
  • The Artificial Transmutation of the Elements (మూలకాల కృత్రిమ పరివర్తనం) (1933)
  • The Newer Alchemy (1937)

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ బాల్యంఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ పరిశోధనలుఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ కేంద్రక ఆవిష్కరణఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ ప్రచురణలుఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ ఇవీ చూడండిఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ మూలాలుఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ బయటి లింకులుఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్187119081937en:Bohr modelen:Geiger-Marsden experimenten:Nobel Prize in Chemistryen:Order of Merit (Commonwealth)en:Royal Societyen:Rutherford modelen:Rutherford scatteringen:atomic nucleusen:chemisten:nuclear physicsఅక్టోబరు 19అణువుఆంగ్లంఆగస్టు 30న్యూజీలాండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆరోగ్యం2024భారత జాతీయ చిహ్నంమట్టిలో మాణిక్యంఅనుపమ పరమేశ్వరన్ఉదయం (పత్రిక)శ్రీ చక్రంపరిపూర్ణానంద స్వామిభారతీయ రైల్వేలుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిక్షయక్రికెట్చతుర్వేదాలుమంగళవారం (2023 సినిమా)యమధీరకులంజే.సీ. ప్రభాకర రెడ్డిరాశిపాల్కురికి సోమనాథుడువై.యస్. రాజశేఖరరెడ్డిలగ్నంద్విగు సమాసమువాతావరణంస్వామి వివేకానందఐక్యరాజ్య సమితి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుట్రైడెకేన్పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంఆర్టికల్ 370 రద్దుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసీ.ఎం.రమేష్కుంభరాశికడియం శ్రీహరిమొదటి ప్రపంచ యుద్ధంగన్నేరు చెట్టుడీజే టిల్లు2019 భారత సార్వత్రిక ఎన్నికలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలు1వ లోక్‌సభ సభ్యుల జాబితాసుడిగాలి సుధీర్ఉత్తరాభాద్ర నక్షత్రముకాళోజీ నారాయణరావుబ్లూ బెర్రీపూజా హెగ్డేవిడాకులువేమిరెడ్డి ప్రభాకరరెడ్డియాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంశ్రీశైలం (శ్రీశైలం మండలం)ఇజ్రాయిల్వంగవీటి రంగాకందుకూరి వీరేశలింగం పంతులుసుధ (నటి)కామాక్షి భాస్కర్లతాటి ముంజలుతెలంగాణవెలిచాల జగపతి రావుకింజరాపు రామ్మోహన నాయుడుభారత రాజ్యాంగ సవరణల జాబితామృణాల్ ఠాకూర్రైలుతోటపల్లి మధుమంగళగిరి శాసనసభ నియోజకవర్గంవినాయకుడుసాయి సుదర్శన్కె.బాపయ్యరియా కపూర్తోట త్రిమూర్తులుకమ్మరెండవ ప్రపంచ యుద్ధంకాశీఆంధ్రప్రదేశ్ మండలాలుజాతీయ విద్యా విధానం 2020భారత రాష్ట్రపతుల జాబితాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకాజల్ అగర్వాల్🡆 More