సోమవారం

సోమవారము లేదా ఇందువారము (ఆంగ్లం:Monday) (/ˈmʌndeɪ/ ( listen) లేదా /ˈmʌndi/) అనేది వారములో రెండవ రోజు.

ఇది ఆదివారమునకు, మంగళవారమునకు మధ్యలో ఉంటుంది.సాంప్రదాయంగా క్రైస్తవ కాలెండరు, ఇస్లామీయ కాలెండరు, హిబ్రూ కాలెందరులలో ఈ దినం వారంలో రెండవ రోజుగా పరిగణింపబడుతున్నది. అంతర్జాతీయ ప్రామాణిక కాలెండరు ISO 8601 లో ఈ దినం వారంలో మొదటి రోజుగా పరిగణింపబడుతున్నది. ఈ దినానికి ఆంగ్లంలో పేరు మండే (Monday) అనునది పాత ఆంగ్లం భాషలో "మొనాండే(Mōnandæg)", మధ్య కాలపు ఆంగ్ల భాషలో "మొనెన్‌డే (Monenday)" నుండి వచ్చింది. దానిఅర్థము చంద్రుని రోజు. హిందువులు సోమవారాన్ని శివునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.

సోమవారం
1616 లో గెలీలియో గీచిన చంద్రుని కళల చిత్రాలు. చంద్రుని పేరుతో సోమవారాన్ని అనేక భాషలలో నామకరణం చేయబడింది.

భారతదేశంలోని అనేక భాషలలో సోమవారం అనేది సంస్కృతం భాషలోని "సోమవార (सोमवार)" నుండి ఉత్పత్తి అయినట్లు తెలుస్తుంది. హిందూ మతంలో సోముడు అనగా చంద్రుడు అని అర్థం. భారతదేశంలోనికొన్ని భాషలలో ఈ రోజును చంద్రవారం గా పిలుస్తారు. సంస్కృత భాషలో చంద్ర అనగా చంద్రుడు అని అర్థము. థాయిలాండ్ లో ఈ దినాన్ని "వాన్ జాన్" అని పిలుస్తారు. దీని అర్థము " చంద్రుని యొక్క రోజు".

హిందూ మత పరంగా అర్థం

"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు.పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .

శివునికి ప్రీతికరమైన రోజు

హిందూ మతంలో సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతనిస్తాయి. అయితే "శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారాధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.అయితే సోమవారం " సౌమ్యప్రదోషం"గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రథమని పురాణాది శాస్త్రాల వచనం. స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు. దీని ప్రకారం సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు. ఈ నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.

కార్తీక సోమవారం

హిందూ మతంలో కార్తీకమాసం ప్రత్యేకమైనది. సాక్షాత్తు భగవంతుడు శివునికి పరమపవిత్రమైన మాసం ఇది. ఈ నెలలో సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు. కార్తీక మాసం సోమవారం నాడు ప్రారంభం అయితే అది ఒక విశేషం. సోమవారం పూట కార్తీక మాస ప్రారంభం శుభఫలితాలకు సంకేతమని పురోహితులు చెబుతున్నారు. అందుచేత కార్తీక సోమవారం శివాలయాలను దర్శించడం చాలా మంచిది.

జ్యోతిషం

సోమవారం అనునది ఖగోళ వస్తువు అయిన చంద్రునికి సంకేతం. దీని యొక్క జ్యోతిష రాశి "కర్కాటకం". దీనిని చంద్రుని యొక్క గుర్తు అయిన తో సూచిస్తారు.

ప్రముఖుల జననమరణాలు

  • కైప మహానందయ్య - అనంతపురం జిల్లాకు చెందిన సాహితీకారుడు 1984 ఫిబ్రవరి 27వ తేదీన ఏకాదశి పర్వదినాన పరమపదించాడు.

ఇతర విశేషాలు

స్వకులసాలి కులం వారి నమ్మకం ప్రకారం, ఆదిమయ అనే వాడు అందరికీ వస్త్రాలను అందిచే పుణ్య పురుషుడిని సృష్టించాల్సిందిగా శివుణ్ణి ప్రార్థించాడు. ఆదిమయ యొక్క సూచనల మేరకు శివుడు అతని నాలుక నుండి (జిహ్వ) ఒక శిశువును శ్రావణ శుద్ధ త్రయోదశి, సోమవారం నాటి ఉదయం సృష్టించాడు.

మూలాలు

ఇతర లింకులు

  • Barnhart, Robert K. (1995). The Barnhart Concise Dictionary of Etymology. Harper Collins. ISBN 0-06-270084-7

Tags:

సోమవారం హిందూ మత పరంగా అర్థంసోమవారం శివునికి ప్రీతికరమైన రోజుసోమవారం కార్తీక సోమవారం జ్యోతిషంసోమవారం ప్రముఖుల జననమరణాలుసోమవారం ఇతర విశేషాలుసోమవారం మూలాలుసోమవారం ఇతర లింకులుసోమవారంEn-us-Monday.oggen:ISO 8601ఆంగ్లంఆదివారముదస్త్రం:En-us-Monday.oggమంగళవారమురోజువారముశివుడుహిందువులు

🔥 Trending searches on Wiki తెలుగు:

కామసూత్రవిశాల్ కృష్ణప్రేమంటే ఇదేరాసౌందర్యరాశిమారేడుమీనరాశివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లక్ష్మిఅన్నమయ్యతెలుగు అక్షరాలుగొట్టిపాటి నరసయ్యతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాసెక్యులరిజంరక్తపోటువై.యస్.భారతిదగ్గుబాటి వెంకటేష్ఆంధ్రప్రదేశ్ మండలాలువిశాఖపట్నంవంగవీటి రంగాకుక్కశ్రీకాంత్ (నటుడు)మూలా నక్షత్రంచోళ సామ్రాజ్యంకర్మ సిద్ధాంతంఉత్తరాషాఢ నక్షత్రముకావ్యముబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంనువ్వు వస్తావనిఊరు పేరు భైరవకోనధనూరాశిక్రిక్‌బజ్పూరీ జగన్నాథ దేవాలయంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీపరిపూర్ణానంద స్వామిమమితా బైజుకందుకూరి వీరేశలింగం పంతులుకర్కాటకరాశిమర్రిపెరిక క్షత్రియులుశని (జ్యోతిషం)నానార్థాలుమానవ శరీరముజీమెయిల్మదన్ మోహన్ మాలవ్యాకాశీమా తెలుగు తల్లికి మల్లె పూదండపక్షముపల్లెల్లో కులవృత్తులుకౌరవులుశోభన్ బాబుఇండియా గేట్వై. ఎస్. విజయమ్మతాజ్ మహల్వృషణంపరిటాల రవిశ్రీకాళహస్తిమఖ నక్షత్రమునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ద్వాదశ జ్యోతిర్లింగాలునాగార్జునసాగర్రెడ్డిమిథాలి రాజ్గ్రామంఎన్నికలుచాట్‌జిపిటికుమ్మరి (కులం)హార్దిక్ పాండ్యాఇత్తడిరోహిత్ శర్మఎస్.వీ.ఎస్.ఎన్. వర్మకడియం కావ్యఅమెరికా రాజ్యాంగంకనకదుర్గ ఆలయంసీతాదేవిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలునీతి ఆయోగ్నందమూరి తారక రామారావు🡆 More