జీతూ రాయ్

జీతూ రాయ్ ఒక భారతీయ షూటింగ్ క్రీడాకారుడు.అతను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో పాల్గొన్నాడు.

2014 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి స్వర్ణపతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు.దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో జరిగిన 17వ ఆసియా క్రీడలలో ప్రపంచ ఐదో నంబర్ క్రీడాకారుడుగా జీతూ రాయ్ భారత్ కు తొలి స్వర్ణం అందించాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జీతూ రాయ్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత ప్రభుత్వం అతనికి ఖేల్ రత్న అవార్డును 2016 లో ప్రకటించింది. 2020 లో భారత ప్రభుత్వం రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ఇచ్చి సత్కరించింది.

జీతూ రాయ్
జీతూ రాయ్
వ్యక్తిగత సమాచారం
జాతీయతభారతీయుడు, నేపాలీ
జననం1987 ఆగష్టు 26
సంఖువాసభ జిల్లా, నేపాల్
ఎత్తు5 అ. 10 అం.
బరువు170
క్రీడ
దేశంభారతదేశం
క్రీడషూటింగ్
ర్యాంకు1 (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) 4 (50 మీటర్ పిస్టల్)
పోటీ(లు)10 మీటర్ల ఎయిర్ పిస్టల్
50 మీటర్ల పిస్టల్

బాల్యం

జీతూరాయ్ నేపాల్‌లోని శంఖవాసాభ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో 1987 ఆగస్టు 26 న జన్మించాడు.ఇతను ఐదుగురు తోబుట్టువులలో నాల్గవవాడు.జీతూ తన బాల్యం నేపాల్‌లోని అడవులు, వరి పొలాలలో గడిచింది. అతని గ్రామం చుట్టూ అడవి ఉన్నందున, క్రీడా సౌకర్యాలు అంతగా లేవు.అతనిది మధ్యతరగతికి చెందిన కుటుంబం.తండ్రిని కోల్పోవడం వలన అతనికి  ఏదో చేయాలనే అభిరుచి మనసులో రేకిత్తింది.అతని బాధ్యత తీసుకొని తన కుటుంబాన్ని ఆదుకున్నాడు.

అతను 2007 లో భారతీయ పౌరుడుగా ఆర్మీలో చేరాడు.జీతూ రాయ్ భారతీయ భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నందున అతను ఒక భారతీయ పౌరుడు.అతను ఉత్తరప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన 2011జాతీయ క్రీడలలో పాల్గొన్న ధ్రువీకరణ పత్రం కూడా ఉంది.

“ఆయనకు చెల్లుబాటు అయ్యే భారతీయ పాస్‌పోర్ట్ ఉంది. పౌరసత్వ చట్టం 1955 ప్రకారం అతను భారతీయ పౌరుడు ”అని లక్నోకు చెందిన 11 జిఆర్‌సిసి-రాయ్ రెజిమెంట్ కమాండెంట్ అముల్ అస్తానా అన్నారు.

భారత సైన్యంలో చేరిన తరువాత కూడా అతనికి ఎప్పుడూ షూటింగ్ పట్ల అంత ఆసక్తి లేదు. అతని ఆర్మీ కోచ్ జి.ఆర్. గర్బరాజ్ రాయ్, సీనియర్స్ కారణంగానే అతను దానిని తీవ్రంగా పరిగణించాడు.జీతూ ఒక షూటింగ్ చేసినతరువాత అతని కోచ్ జి.ఆర్. గర్బరాజ్ రాయ్, మెరుగైన ప్రదర్శన కోసం జీతూను నెట్టాడు

అతను షూటింగ్ ప్రారంభించిన తర్వాత, అదే తన జీవిత పరమావధిగా మారిందని అతను గ్రహించలేదు.అతనని ఆ వైపు మరలిస్తుందని కూడా గ్రహించలేదు. గ్రహించనప్పటికీ అతను అప్పటికే ఆ మార్గంలో నడవడం ప్రారంభించాడు. గ్రహించిన తరువాత అప్పుడు అతను నిజంగా కోరుకుంది ఇదేనని అతను పూర్తిగా అర్థం చేసుకున్నాడు.బహుశా  విధి అలా చేయించిఉంటుందని గ్రహించాడు.

అక్కడ నుండి అతని జీవితం పూర్తిగా భిన్నమైన మలుపు తీసుకుంది.అతను ఆర్మీలో చేరిన రెండు సంవత్సరాల తరువాత 2009 లో మొదట తుపాకీ 9 మి.మీ పిస్టల్ ఉపయోగించాడు.దురదృష్టవశాత్తు, జీతూను భారత సైన్యం మార్క్స్ మ్యాన్షిప్ యూనిట్లో ఎంపిక చేయలేదు. అతనిని తిరిగి లక్నో యూనిట్కు పంపబడ్డాడు. అయినా నిరాశ, నిరుత్సాహపడలేదు.ఈ సంఘటనే జీతూ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. అతను కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. పగలు, రాత్రి షూటింగ్ ప్రాక్టీస్ చేసి చివరకు 2014 లో 10 మీ. ఉచిత పిస్టల్ కోటాను గెలుచుకున్నాడు.

ఒత్తిడితో వ్యవహరించడం

అతను “అవును నేను కొన్ని సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొన్నాను.కానీ నా సాధన తయారీలో ఎప్పుడూ బాధపడలేదు. అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడి గెలిచిన తరువాత ఇది ఒక అలవాటులా అనిపించింది.కానీ నేను సరైన మార్గంలో ఉన్నానని, పతకం సాధించడమే నా లక్ష్యం ”అని జీతూ ఇఎస్‌పిఎన్‌తో అన్నాడు.జీతూ ఎప్పుడూ ఒత్తిడిని సానుకూలంగా తీసుకున్నాడు.ఈ సామర్థ్యం అంతర్జాతీయ టోర్నమెంట్లలో సమర్థవంతంగా షూటింగ్  చేయడానికి అతనికి సహాయపడింది.

మంచి ప్రారంభం

అతను తన షూటింగ్ కెరీర్‌కు అద్భుతమైన ఆరంభం ఇవ్వడంతో  కృషి, అంకితభావం రెండూ ఫలించినవి. 2014 ఆసియా క్రీడల్లో 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించాడు. ఇంచియాన్ ఆటల విజయం అతని కెరీర్‌ను ఆకర్షించింది.అతని కొత్తగా వచ్చిన కలను వెంటాడుకునే విశ్వాసాన్ని ఇచ్చింది.అదే సంవత్సరం, అతను కామన్వెల్త్ క్రీడలలో 194.1 పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని సాధించాడు. అర్హతల సమయంలో అతను 562 పాయింట్లతో చరిత్రను స్క్రిప్ట్ చేయడంతో ఈ విజయం మరింత ప్రత్యేకమైంది.అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి, అతనికి రియో ఒలింపిక్స్ స్పాట్ లభించింది. ఒలింపిక్ బెర్త్ బుక్ చేసుకోవడానికి ఇది మొదటి అవకాశంగా అతనికి లభించింది.

వివాహం

అక్టోబర్ 2018 లో జీతూ జీవితంలో మరో ఉత్తేజకరమైన దశను ప్రారంభించాడు.సిక్కింలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో కిక్‌బాక్సర్ సుష్మితా రాయ్‌ను వివాహం చేసుకున్నాడు. సుష్మిత అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కిక్‌బాక్సింగ్ టోర్నమెంట్లలో పతకాలు సాధించింది.వాటిలో వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్స్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం, ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.

2016 రియో ఒలింపిక్స్ తరువాత…

జియో రియో ఒలింపిక్స్లో పతకంతో జీతూ రాయ్ తిరిగి వస్తాడని బాగా ప్రచారం పొందాడు.అతను దానిని ఒక సవాలుగా స్వీకరించి ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడ్డాడు. ప్రముఖ పిస్టల్ షూటర్ జస్పాల్ రాణా ఇఎస్‌పిఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "జితుకు రియోలో పతకం సాధించే అవకాశం ఉంది.అతను ఒలింపిక్స్‌లో గరిష్ట స్థాయికి చేరుకోవలసి వస్తే, దానికి దారితీసిన నెలలలో పేలవమైన ఫలితాల వల్ల అతను ప్రభావితం కాలేడు. అది సరైన సమయంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది.ఒత్తిడి అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అది సరైన అథ్లెట్లగా వ్యవహరించడానికి శిక్షణ ఇస్తుంది.లోపానికి తావు లేదు ” అని ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

జీతూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో ప్రవేశించినప్పటికీ పోడియం ముగింపులో విజయం సాధించలేకపోయాడు.తత్ఫలితంగా, ఎంతో ముందుగా ఉహించిన ప్రయాణం హృదయ విదారకంతో నెరవేరలేదు.2018 సంవత్సరం జీతూ షూటింగ్ గట్టి బాదు (heavy blow), తో  ప్రారంభమైంది. గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ క్రీడలలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల ఈవెంట్‌లో అతను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అయినప్పటికీ, అతను ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు.

ప్రయత్నాలలో ముందుకు

జీతూకు ఆసియా క్రీడల అర్హతలను కోల్పోవడం పెద్ద దెబ్బగా భావించాడు. అతను అనుకోకుండా తరువాత కొద్దికాలానికే జరిగిన ప్రభుత్వ టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (TOP) నుండి తప్పుకున్నాడు. అతను నిరాశ చెందినప్పటికీ,  నిస్సందేహంగా ఉన్నాడు. అతను పునరాగమనం గురించి సానుకూలంగా అలోచించి కష్టపడి పనిచేసాడు.

"నేను ఇప్పుడు నా శిక్షణపై దృష్టి పెడతాను. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం బెర్త్ సంపాదించడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ టార్గెట్ ఒలింపిక్ పోడియం (TOP) పథకం, కచ్చితంగా ఒక అథ్లెట్‌కు ఆర్థిక ప్రేరణను ఇస్తుంది. ఇది పరికరాలు, మందుగుండు సామగ్రి ఖరీదైనందున స్కోర్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.నా ప్రారంభ సంవత్సరాల నుండి భారత సైన్యం నాకు మద్దతు ఇస్తోంది. అందుకే నేను చాలా సాధించగలిగాను ”అని జీతూ ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్ (ANI) కు జరిగిన ఒక టెలిఫోన్  ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఆసక్తికరమైన నిజాలు

  • జీతూ అభిమాన నటుడు అమీర్ ఖాన్.
  • భారత సైన్యంలో చేరడానికి ముందు అతను తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసేవాడుట
  • జీతూ తండ్రి కూడా ఆర్మీలో పనిచేసాడు
  • అతని షూటింగ్ కీర్తి తరువాత, అతను భారత సైన్యంలో సిపాయిగా పదోన్నతి పొందాడు.అతను ప్రస్తుతం (2018 చివరినాటికి) 11 గూర్ఖా రైఫిల్స్‌లో నాయబ్-సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. జీతూ తన విజయాలతో భారత సైన్యానికి ఘనత కల్పించాడు.
  • రైఫిల్స్ భారీగా ఉంటాయి. విస్తృతమైన కిట్‌లను కలిగి ఉన్నందున అతను పిస్టల్‌ను రైఫిల్ షూటింగ్‌కు ఇష్టపడతాడు.

ఈ ప్రయాణం కోసం జీతూ అనేక విపరీతమైన ఒత్తిడిలకు గరైయ్యాడు. ఆర్మీ తిరస్కరించడం నుండి తిరిగి బౌన్స్ అవ్వడం, ఒలింపిక్స్ అర్హత రికార్డులను బద్దలు కొట్టడం, చివరిగా 2018 వరకు సిడబ్ల్యుజి స్వర్ణం సాధించడం, ఆసియా గేమ్స్ 2018 లో అనర్హతకు గురికావడం. జీవితం అంతా అతనిని క్రిందికి లాగడానికి ప్రయత్నించింది. అతను వెనుకకు బౌన్స్ అయ్యాడు. జితుకు చాలా సామర్థ్యం ఉందని తెలుసు.

పురస్కారాలు

విజయాలు

  • కామన్వెల్త్ గేమ్స్
  • ఇయర్ ప్లేస్ ఈవెంట్ మెడల్
  • 2014 గ్లాస్గో, స్కాట్లాండ్ 50 మీ పైలట్లు (బంగారు పతకం)
  • 2018 గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా 10 మీ పిస్టల్ గోల్డ్

ఆసియా క్రీడలు

  • ఇయర్ ప్లేస్ ఈవెంట్ మెడల్
  • 2014 ఇంచియాన్, దక్షిణ కొరియా 50 మీ పిస్టల్ బంగారం.
  • 2014 ఇంచియాన్, దక్షిణ కొరియా 10 మీ టీం ఎయిర్ పిస్టల్ కాంస్య

ప్రపంచ కప్

  • ఇయర్ ప్లేస్ ఈవెంట్ మెడల్
  • 2014 మ్యూనిచ్, జర్మనీ 10 మీ. ఎయిర్ పిస్టల్ సిల్వర్
  • 2014 మారిబోర్, స్లోవేనియా 10 మీ. ఎయిర్ పిస్టల్ గోల్డ్
  • 2014 మారిబోర్, స్లోవేనియా 50 మీ పిస్టల్ సిల్వర్
  • 2015 చాంగ్వాన్, దక్షిణ కొరియా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్య
  • 2016 బాకు, అజర్‌బైజాన్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సిల్వర్
  • 2017 న్యూ డిల్లీ, ఇండియా 10 మీ మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ గోల్డ్
  • 2018 గ్వాడాలజారా, మెక్సికో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కాంస్య

కామన్వెల్త్ ఛాంపియన్స్

  • ఇయర్ ప్లేస్ ఈవెంట్ మెడల్
  • 2017 బ్రిస్బేన్, ఆస్ట్రేలియా 10 మీ. ఎయిర్ పిస్టల్ కాంస్య
  • 2017 బ్రిస్బేన్, ఆస్ట్రేలియా 50 మీ పిస్టల్ కాంస్య

ప్రపంచ ఛాంపియన్స్

  • ఇయర్ ప్లేస్ ఈవెంట్ మెడల్
  • 2014 గ్రెనడా, స్పెయిన్ 50 మీ పిస్టల్ సిల్వర్

మూలాలు

బయటి లంకెలు

Tags:

జీతూ రాయ్ బాల్యంజీతూ రాయ్ ఒత్తిడితో వ్యవహరించడంజీతూ రాయ్ మంచి ప్రారంభంజీతూ రాయ్ వివాహంజీతూ రాయ్ 2016 రియో ఒలింపిక్స్ తరువాత…జీతూ రాయ్ ప్రయత్నాలలో ముందుకుజీతూ రాయ్ ఆసక్తికరమైన నిజాలుజీతూ రాయ్ పురస్కారాలుజీతూ రాయ్ విజయాలుజీతూ రాయ్ ఆసియా క్రీడలుజీతూ రాయ్ ప్రపంచ కప్జీతూ రాయ్ కామన్వెల్త్ ఛాంపియన్స్జీతూ రాయ్ ప్రపంచ ఛాంపియన్స్జీతూ రాయ్ మూలాలుజీతూ రాయ్ బయటి లంకెలుజీతూ రాయ్ఆసియా క్రీడలుదక్షిణ కొరియాపద్మశ్రీ పురస్కారంబంగారు పతకంభారత దేశం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆలంపూర్ జోగులాంబ దేవాలయంభారతరత్నతామర వ్యాధిచదరంగం (ఆట)తమిళ అక్షరమాలనువ్వు నాకు నచ్చావ్మంతెన సత్యనారాయణ రాజుభగత్ సింగ్కర్బూజగుడ్ ఫ్రైడేమాగుంట శ్రీనివాసులురెడ్డికామాక్షి భాస్కర్లరావణుడువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిరాజస్తాన్ రాయల్స్అష్టవసువులువిశ్వక్ సేన్విరాట్ కోహ్లిభారత ఎన్నికల కమిషనుబ్రిటీష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులుబుడి ముత్యాల నాయుడురంగస్థలం (సినిమా)అనపర్తి శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాల జాబితాఇజ్రాయిల్శాసనసభసత్య సాయి బాబాపిచ్చిమారాజుకడియం శ్రీహరితెలుగు పదాలునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిబరాక్ ఒబామాధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంనంద్యాల శాసనసభ నియోజకవర్గంమకరరాశిసిరికిం జెప్పడు (పద్యం)అమెజాన్ (కంపెనీ)మొలలుకోణార్క సూర్య దేవాలయంగజేంద్ర మోక్షంటైటన్పంచభూతలింగ క్షేత్రాలుపద్మశాలీలుకన్యాశుల్కం (నాటకం)పసుపు గణపతి పూజశాసనసభ సభ్యుడుమార్చి 28జే.సీ. ప్రభాకర రెడ్డిశ్రీవిష్ణు (నటుడు)ఛందస్సువందేమాతరంఓటుసుఖేశ్ చంద్రశేఖర్శకుంతలకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరఘుపతి రాఘవ రాజారామ్ఢిల్లీవిద్యుత్తుఓం భీమ్ బుష్బాలకాండమూర్ఛలు (ఫిట్స్)గురువారంనితిన్అయ్యప్పపరకాల ప్రభాకర్శోభన్ బాబు నటించిన చిత్రాలుమృణాల్ ఠాకూర్ఆయాసంఇస్లాం మతంనోటి పుండుఆటలమ్మహృదయం (2022 సినిమా)భారత పౌరసత్వ సవరణ చట్టంఅలసందహైన్రిక్ క్లాసెన్క్వినోవాఏ.పి.జె. అబ్దుల్ కలామ్🡆 More