అజర్‌బైజాన్

అజర్‌బైజాన్ (ఆంగ్లం : Azerbaijan) అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్ దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అతి పెద్ద దేశం అలాగే అత్యధిక జనాభాగల దేశం.

ఇది పాక్షికంగా తూర్పు ఐరోపా లోనూ, పాక్షికంగా పశ్చిమ ఆసియా లోనూ ఉంది. దీని సరిహద్దులు తూర్పున కాస్పియన్ సముద్రం, దక్షిణాన ఇరాన్, పశ్చిమాన ఆర్మేనియా, వాయువ్యాన జార్జియా, ఉత్తరాన రష్యా. ఈ దేశానికి చెందిన అనేక దీవులు కాస్పియన్ సముద్రంలో గలవు. అజర్‌బైజాన్ లోని నఖ్చివన్ అటానిమస్ రిపబ్లిక్ ఎక్స్‌క్లేవ్ ఉత్తర, తూర్పు దిశలలో ఆర్మేనియా, దక్షిణ, పశ్చిమంలో ఇరాన్ పరివృతమై ఉంటాయి. వాయవ్యంలో అతిస్వల్పంగా టర్కీ సరిహద్దు ఉంటుంది.

Azərbaycan Respublikası
రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్
Flag of అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ యొక్క చిహ్నం
నినాదం
Bir kərə yüksələn bayraq, bir daha enməz!
The flag once raised will never fall!
జాతీయగీతం

అజర్‌బైజాన్ యొక్క స్థానం
అజర్‌బైజాన్ యొక్క స్థానం
రాజధానిబాకు (నగరం)
40°22′N 49°53′E / 40.367°N 49.883°E / 40.367; 49.883
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు అజర్‌బైజాని
ప్రజానామము అజర్‌బైజానీ
ప్రభుత్వం గణతంత్రం
 -  రాష్ట్రపతి ఇల్హామ్ అలియేవ్
 -  ప్రధానమంత్రి అర్తూర్ రసీజాదే
స్వతంత్రం సోవియట్ యూనియన్ నుండి 
 -  ప్రకటించుకున్నది ఆగస్టు 30 1991 
 -  సంపూర్ణమైనది డిసెంబరు 25 1991 
విస్తీర్ణం
 -  మొత్తం 86,600 కి.మీ² (114వ)
33,436 చ.మై 
 -  జలాలు (%) 1,6%
జనాభా
 -  ఏప్రిల్, 2011 అంచనా 9,165,000 (92వ)
 -  జన సాంద్రత 106 /కి.మీ² (89వ)
274 /చ.మై
జీడీపీ (PPP) 2011 అంచనా
 -  మొత్తం $94.318 బిలియన్లు (86వ)
 -  తలసరి $10,340 (97వ)
జినీ? (2001) 36.5 (54వ)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.736 (medium) (99వ)
కరెన్సీ మనాత్ (AZN)
కాలాంశం (UTC+4)
 -  వేసవి (DST)  (UTC+5)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .az
కాలింగ్ కోడ్ +994

1918లో అజర్‌బైజాన్ రిపబ్లిక్ స్వతంత్రం ప్రకటించి మొదటి ముస్లిం ఆధిక్యత కలిగిన లౌకిక రాజ్యంగా అవతరించింది. ఒపేరాలు, దియేటర్లు, అధునిక విశ్వవిద్యాలయాలు ఉన్న ముస్లిం దేశాలలో అజర్‌బైజాన్ ద్వితీయస్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఈజిప్ట్ ఉంది. 1920లో అజర్‌బైజాన్ సోవియట్ యూనియన్‌లో విలీనం చేయబడింది. సోవియట్ యూనియన్ పతనం కావడానికి ముందు అజర్‌బైజాన్ 1991 ఆగస్టు 31న స్వతంత్రం ప్రకటించింది. 1991 సెప్టెంబరులో ఆర్మేనియన్లు ఆధిక్యత కలిగిన " నగొర్నొ- కారాబాఖ్ " ప్రత్యేక దేశం (నగొర్నొ- కారాబాఖ్ రిపబ్లిక్) కావాలని వత్తిడి చేసింది. 1991 లో నగొర్నొ- కారాబాఖ్ యుద్ధం వరకు ఈ ప్రాంతం స్వతంత్రంగా ఉంది. ఒ.ఎస్.చి.ఈ మధ్యవర్తిత్వం వహించి చివరి తీర్మానం చేసేవరకు ఇది అంతర్జాతీయంగా అజర్‌బైజాన్ ప్రాంతంగానే గుర్తించబడింది. అజర్‌బైజాన్ " యూనిటరీ కంస్టిట్యూషనల్ రిపబ్లిక్ " విధానం కలిగి ఉంది. అజర్‌బైజాన్ " కౌంసిల్ ఆఫ్ యూరప్ ", ది ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో- ఆపరేషన్ ఇన్ ఐరోపా " , ది నేటో పార్టనర్‌షిప్ ఫర్ పీస్ సభ్యత్వం కలిగి ఉంది. టర్కీ భాష వాడుక భాషగా ఉన్న 6 దేశాలలో అజర్‌బైజాన్ ఒకటి. అజర్‌‌బైజాన్ టర్కిక్ కౌంసిల్‌లో , జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ టర్కిక్ ఆర్ట్ అండ్ కల్చర్ యాక్టివ్ మెంబర్‌గా ఉంది. అజర్‌బైజాన్ 158 దేశాలతో దౌత్యసంబంధాలు కలిగి ఉంది. 38 అంతర్జాతీయ ఆర్గనైజేషన్‌లో సభ్యత్వం కలిగి ఉంది. గి.యు.ఎం. ఆర్గనైజేషన్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎకనమిక్ డెవెలెప్మెంటు, ది కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంటు స్టేట్స్, " ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వీపంస్ " ఫండింగ్ మెంబర్లలో అజర్‌బైజాన్ ఒకటి. 1992 నుండి ఇది ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కలిగి ఉంది. 2006 మే 9న అజర్‌బైజాన్ కొత్తగా రూపొందించబడిన " హ్యూమన్ రైట్స్ కౌంసిల్ " సభ్యత్వం కొరకు ఎన్నిక చేయబడింది. అలీన ఉద్యమ ఉద్యమంలో అజర్‌బైజాన్ సభ్యత్వం కలిగి ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణ , ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ కరెస్పాండెంటు అంతస్థు కలిగి ఉంది. అజర్‌బైజాన్ రాజ్యాంగంలో అధికారికమతం ఏదీ ప్రకటించబడలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ లౌకికవాదానికి మద్దతు ఇస్తున్నప్పటికీ అల్పసంఖ్యాక ప్రజలు, కొన్ని ప్రతిపక్ష ఉద్యమాలు సున్నీ ముస్లింను ఆదరిస్తున్నాయి. అజర్‌బైజాన్ హ్యూమన్ డెవెలెప్మెంటు జాబితాలో ఉన్నత స్థాయిలో ఉంది. ఇది అత్యధిక తూర్పు, ఐరోపా దేశాలకంటే ముందు ఉన్నది. ఇది ఆర్థికాభివృద్ధి , అక్షరాస్యతలో ఉన్నత స్థాయిలో ఉంది. అలాగే నిరుద్యోగుల శాతంలో దిగువన ఉంది. అయినప్పటికీ లంచగొండితనం దేశం అంతటా వ్యాపించి ఉంది. ప్రత్యేకంగా ప్రభుత్వ సేవారంగంలో అధికంగా ఉంది. అధికార పార్టీ " న్యూ అజర్‌బైజాన్ పార్టీ " నిరంకుశత్వం , మానహక్కుల ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

పేరు వెనుక చరిత్ర

ఆధునిక ఆధారాలు అజర్‌బైజాన్ పదానికి అట్రోపేటస్(పర్షియన్ ప్రజలు) మూలమని భావిస్తున్నారు. అచమెనిద్ సాంరాజ్యం తరఫున సత్రప్ అలెగ్జాండర్ గ్రేట్ ఆధ్వర్యంలో సత్రప్ ఆఫ్ మెడెస్ స్థాపించాడు. పురాతన ఆధారాలను అనుసరించి ఈ పేరుకు మూలం జొరాష్ట్రియన్ మతం అని భావిస్తున్నారు. అవెస్టా, ఫ్రావార్డిన్ యాష్త్ (హైమన్ టు ది గార్డియన్ ఏంజిల్స్). అట్రోపేట్లు అట్రోపనెటే (ప్రస్తుత ఇరానియన్ అజర్‌బైజాన్) ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. ఆట్రోపేట్ పేరుకు గ్రీకు భాష మూలంగా ఉంది. పురాతన ఇరానియన్ అట్రోపనేట్ అనే పదానికి " పవిత్ర అగ్నితో రక్షించబడుతున్న ప్రాంతం " లేక పవిత్రాగ్ని భూమి అని అర్ధం అని అనువదించాడు. గ్రీక్ పేరును దియోడొరస్ , స్త్రాబొ సూచించారని భావిస్తున్నారు. 1000 సంవత్సరాల కాలంలో ఈ పేరు అతుర్పతకన్ తరువాత అధర్బధగన్, అధర్బయగన్, అజర్బయద్జాన్ , ప్రస్తుత అజర్‌బైజాన్ గా రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. ఆర్మేనియాలో ఈ దేశం అద్ర్‌బెజాన్ అని పిలువబడుతుంది. అజర్‌బైజాన్ పేరుకు అజర్- పయగన్ నుండి వచ్చిందని భావిస్తున్నారు. ఈ పదాన్ని పర్షియన్ భాషలో " అగ్ని సంరక్షకుడు" , నిక్షేపం , నిక్షేపాధికారి అని లేక అగ్నిభూమి అని అనువదిస్తున్నారు. 7వ శతాబ్దంలో అరేబియన్లు ఈ ప్రాంతం మీద విజయం సాధించిన తరువాత ఈ ప్రాంతం పేరు " అజర్‌బైజాన్" అని మార్చబడింది.

చరిత్ర

పూర్వీకత

అజర్‌బైజాన్ 
Petroglyphs in Gobustan dating back to 10,000 BC indicating a thriving culture. It is a UNESCO World Heritage Site considered to be of "outstanding universal value"

అజర్‌బైజాన్ ప్రాంతంలో మానవులు నివసించిన ఆరంభకాల ఆధారాలను అనుసరించి రాతి యుగం నుండి ఇక్కడ మానవులు నివసించారని భావిస్తున్నారు. అజిక్ గుహలో లభుంవిన ఆధారాలు వీరు గురుచే సస్కృతికి చెందినవారని భావిస్తున్నారు. ఎగువ పాలియోలిథిక్, కంచు యుగ సంస్కృతికి చెందిన ఆధారాలు తగిలర్, దాంసిలి, జార్ (అజర్‌బైజన్), యతక్వి- యెరి, నెక్రొపోలిస్, సరయ్తెపి గుహలలో లభిస్తున్నాయి. ఆరంభకాల మనవనివాసాలు క్రీ.పూ 9వ శతాబ్ధకాలం నాటివని భావిస్తున్నారు. సిథియన్ల తరువాత ఇరానియన్లు మెడే ప్రజలు ఈ ప్రాంతంలోని దక్షిణప్రాంత అరాస్ నదీతీర ప్రాంతం మీద ఆధుఖ్యత సాధించారు. . మెడే ప్రజలు క్రీ.పూ 900-700 మద్య విస్తారమైన సామ్రాజ్య స్థాపన చేశారు. క్రీ.పూ 500 లలో ఇది అచమెనిద్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. ఈ ప్రంతం మీద అచమెనిద్ విజయం జొరాష్ట్రియన్ల వ్యాప్తికి దారితీసింది. తరువాత ఈ ప్రాంతం మహావీరుడు అలెగ్జాండర్ ఆధీనంలో మెసెడన్ సామ్రాజ్యం తరువాత సెల్యూసిడ్ సామ్రాజ్యంలో భాగం అయింది. ఈ సమయంలో జొరాష్ట్రియన్లు కౌకాసస్, ఆట్రోపటెనే వరకు విస్తరించారు. కౌకాసియన్ అజర్‌బైజాన్లు ఈశాన్య అజర్‌బైజాన్ స్థానిక ప్రజలు భావించబడుతున్నారు. వీరు ఈ ప్రాంతాన్ని క్రీ.పూ 4వ శతాబ్దం నుండి పాలిస్తూ స్వతంత్రరాజ్యాన్ని స్థాపించారు. తరువాత ఈ ప్రాంతంలో ఆర్మేనియన్ల సంస్కృతి బలంపుంజుకుంది. క్రీ.పూ 4-3 శతాబ్ధాలలో అచమెనిద్ సామ్రాజ్యాన్ని త్రోసివేసిన తరువాత ఆధునిక అజర్‌బైజాన్ నైరుతీ భూభాగం ఆర్మేనియన్ రాజ్యంలో (ఒరంతిద్ రాజవంశం పాలనలో) భాగం అయింది. క్రీ.పూ 189, సా.శ. 428 వరకు ఆధునిక అజర్‌బైజాన్ పశ్చిమార్ధ భూభాగం, నఖ్చివన్ అటానిమస్ రిపబ్లిక్ ఎంక్లేవ్‌తో చేర్చి ఆర్మేనియా రాజ్యంలో భాగం (అత్రాసిద్, అర్సాసిద్ పాలన) అయింది. తరువాత ఈ ప్రాంతం పార్థియన్ సామ్రాజ్యం (అరాదిద్ రాజవంశం) లో భాగం అయింది. పార్థియన్ల తరువాత ఆర్మేనియా రాజ్యాన్ని పర్షియన్లు, బైజాంటిం ఆధీనం (సా.శ. 387లో ) అయింది. సంప్రదాయ ఐక్యత కలిగిన అర్థ్సక్, యుతిక్ ప్రాంతం కౌకాసియన్ అల్బేనియా వశం అయింది.

అజర్‌బైజాన్ 
The Maiden Tower in Old Baku is a UNESCO World Heritage Site built in the 11th–12th century.

భూస్వామ్య వ్యవస్థ

సా.శ. 252 లో పర్షియన్ సస్సనిద్ సామ్రాజ్యం కౌకాసియన్ అల్బేనియాను సామంత రాజ్యంగా చేసుకుంది. సా.శ. 4వ శతాబ్దంలో రాజా ఉమయ్ర్ క్రైస్తవ మతాన్ని దేశాధికార మతం చేసాడు. 9వ శతాబ్దంలో అల్బేనియాలో సస్సనిద్ పాలన కొనసాగింది. సా.శ. 7వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఇస్లామిక్ ఉమయద్ కాలిఫేట్ క్రైస్తలను అడ్డగించి కౌకాసియన్ పాలనలో ఉన్న సస్సనిద్, బైజాంటైన్ ప్రాంతాలను. (రాజా జవంషిర్ సా.శ. 667) స్వాధీనం చేసుకుని కౌకాసియన్ అల్బేనియాను సామంతరాజ్యంగా చేసాడు. ముస్లిములు పర్షియాను జయించిన తరువాత కౌకాసియన్ అల్బేనియా ముస్లిం పాలనకు మార్చబడింది. అబ్బాసిద్ కాలిఫేట్ ఆధికారం ముగింపుకు వచ్చిన తరువాత సల్లరిద్, సజిద్, సద్దాదిద్లు, రావద్దీలు, బుయిద్ రాజవంశీయులు వంటి పలువురు ప్రాంతీయ పాలకులు ఈ ప్రాంతాన్ని పాలించారు.11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని మద్య ఆసియా నుండి వచ్చిన టర్కీ ప్రజలు, ఒఘుజ్ టర్కీ తెగలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా టర్కిక్ రాజవంశీయులు సెల్జుగ్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. 1067 నాటికి మొత్తం ప్రాంతం అజర్‌బైజన్ అని పిలువబడింది. ట్ర్కీ కంటే ముందు ఈ ప్రాంతంలో (ఆధునిక అజర్‌బైజాన్ రిపబ్లిక్) ప్రజలలో పలు ఇండో - యురేపియన్, కౌకాసియన్ భాషలు వాడుకభాషగా ఉన్నాయి. వాటిలో ఆర్మేనియన్ భాష, ఇరానియన్ భాష (ఓల్డ్ అజరి భాష) ఉన్నాయి. అవి క్రమంగా మరుగై టర్కీ భాష ఈ ప్రాంతంలో ఆధిక్యత సాధించింది. ప్రస్తుత అజర్‌బైజాన్ భాషకు మూలం ఇదే. టర్కిక్ అజర్‌బైజానీ (అజరి) అనబడే ఇరానీ భాష అజరి (ఓల్డ్ అజరి భాష) భాషగా రూపొందించబడింది. టర్కిక్ ప్రజలు అంతకుముందుగా అజరీ భాషను పర్షియన్ భాష ఆధారితంగా రూపొందించారు. ప్రాంతీయంగా సెల్జుక్ సామ్రాజ్యం ఎల్దిగుజిదీల చేత పాలించబడింది. వాస్తవానికి వీరు సెల్జుక్ సుల్తానులకు సామంతులుగా ఉన్నారు. ప్రస్తుత అజర్‌బైజానీ ప్రాంతంలో సెల్జుక్ పాలనలో నజామీ గంజవి వంటి ప్రాంతీయ కవి, ఖక్వాని షిర్వాని పర్షియన్ భాషలో పాండిత్యం గడించారు. తరువాత పాలించిన జలయుర్దీల పాలన తైమూర్ విజయంతో స్వల్పకాలంలో ముగింపుకు వచ్చింది.

ప్రాంతీయ ష్రివంషాహ్ రాజవంశీయులు తిమురుద్ సామ్రాజ్యంలో సామతులై తైమూర్ యుద్ధాలలో సలహాసహకారాలు అందించారు. తైమూర్ మరణం తరువాత రెండు స్వంత్రదేశాలు (కారా కొయున్లు, అక్ కొయిన్లు) అవతరించాయి. ష్రివంషాహ్‌లు తిరిగి శక్తివంతులై స్వయంప్రతిపత్తి కలిగి సామంతులుగా 861-1539 వరకు పాలించారు. సఫావిద్ ఇరానియన్ షియాగా మారుతున్న సమయంలో సఫానిదులు అఫర్‌బైజానీ, ఇరానీ దేశాలకు పునాదులు వేసారు. అప్పటి నుండి ఈ ఇరుదేశాలు షియా ఆధిక్యదేశాలుగా గుర్తించబడుతున్నాయి. సఫావిదుల ప్రయత్నాలను అధిగమిస్తూ ఓట్టామన్లు స్వాథ్స్‌ను (ప్రస్తుత అజర్‌బైజాన్) ఆక్రమించుకున్నారు. బకు పరిసరాలు రష్యా అధీనంలో ఉన్నాయి. రష్యన్లు రుస్సో - పర్షియన్ యుద్ధం (1722-23) తరువాత బకును స్వాధీనం చేసుకున్నారు. స్వల్పకాలం సాగిన రష్యా, ఓట్టామన్ పాలన తరువాత సఫానిదులు తిరిగి శక్తి పుంజుకుని ఈ ప్రాంతాన్ని (ప్రస్తూ అజర్‌బైజానీ) 19వ శతాబ్దం వరకు ఆధిక్యత కలిగి ఉన్నారు.

ఆధునిక యుగం

అజర్‌బైజాన్ 
Territories of the Northern and Southern Khanates (and Sultanates) within Iran in the 18th–19th centuries.

సఫావిద్ తరువాత ఈ ప్రాంతాన్ని అఫ్షరిద్ రాజవంశం, జంద్ రాజవంశం, స్వల్పకాలంగా క్వాజర్ రాజవంశం మొదలైన ఇరానియన్ రాజవంశాలు పాలించాయి. 19వ శతాబ్దంలో ఈ ప్రాంతం బలవంతంగ రష్యాకు స్వాధీనం చేయబడింది. జంద్ రాజవంశం, క్వాజర్ పాలన పతనం తరువాత కౌకాసియస్ కనాటేలు ఈ ప్రాంతంలో తలెత్తారు. కనాటేలు ఇరానియన్ షాహ్ సామతులుగా స్వయంప్రతిపత్తితో పాలించారు. 18వ శతాబ్దం చివరిలో రష్యా పొరుగున ఉన్న టర్కీ, ఇరాన్ ప్రాంతాల మీద ఆధిక్యత సాధించడానికి తీవ్రత ప్రదర్శించింది. తరువాత రష్యా కౌకాసియన్ ప్రాంతాల మీద ఆధిక్యత సాధించడానికి యుద్ధాలు కొనసాగించింది. విజయవంతంగా సాగిన రష్యా యుద్ధాలు రుస్సో - పర్షియన్ యుద్ధం (1804-1813) తరువాత ట్రీటీ ఆఫ్ గులిస్తాన్‌ ఒప్పందం చేయబడింది.

అజర్‌బైజాన్ 
The siege of Ganja Fortress in 1804 during the Russo-Persian War (1804-1813) by the Russian forces under leadership of general Pavel Tsitsianov.

1804-1813 యుద్ధంలో క్వాజర్ ఇరాన్ నష్టపోయిన తరువాత గులిస్తానీ ఒప్పందం కారణంగా కనాటే భూభాగాన్ని (జార్జిజియా, దగెస్తాన్‌తో కలిసిన) రష్యన్ సామ్రాజ్యానికి వదలవలసిన అవసరం ఏర్పడింది. 19వ శతాబ్దంలో అరాస్ నది ఉత్తరభూభాగ ప్రాంతాన్ని (అజర్‌బైజాన్) రష్యా ఆక్రమించింది. " ట్రీటీ ఆఫ్ తుర్క్మెంచే " ద్వారా " రుస్సో- పర్షియన్ యుద్ధం " ముగింపుకు వచ్చింది. క్వాజర్ రాజవంశం బలవంతంగా యెర్వన్ కనాటే, నఖ్చివన్, మిగిలిన లంకరన్ కనాటే భూభాగల మీద రష్యన్ ఆధిపత్యాన్ని అంగీకరించవలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుత అజర్‌బైజని రిపబ్లిక్‌తో కూడిన భూభాగం ఇరాన్ స్వాధీనంలోనే ఉంది. ఇబ్రహీం ఖాలిల్ ఖాన్ (ట్రీటీ ఆఫ్ కురక్చే) హ్యూసెంగులు ఖాన్ (బకు కనాటేని వదులుకున్నాడు), ముస్తాఫా ఖాన్ అజరీ ఖాన్ (ష్రివన్ కనాటేను వదులుకున్నాడు) మొదలైన ఖాన్‌లు ఒప్పందంలో ప్రత్యేకంగా సంతకం చేసారు. కౌకాసియన్ భూభాగాలు ఇరాన్ నుండి రష్యా వీలీనం చేసుకున్న తరువాత కొత్త అరాస్ నదీతీరంలో సరిహద్దులు ఏర్పాటు చేయబడ్డాయి. సోవియట్ యూనియన్ పతనం తరువాత ఈ సరిహద్దు ఇరాన్, అజర్‌బైజాన్ రిపబ్లిక్ సరిహద్దుగా మారింది. 19వ శతాబ్దంలో క్వాజర్ ఇరాన్ కౌకాసియన్ భూభాగాలను బలవంతంగా రష్యాకు వదులుకున్నది. అందులో ఆధునిక అజర్‌బైజాన్ రిపబ్లిక్ భాగంగా ఉంది. ఫలితంగా అజర్‌బైజాన్ స్థానిక ప్రజలు ప్రస్తుత ఇరాన్, అజర్‌బైజాన్ దేశాలలో విభజించబడ్డారు. మొదటి ప్రంపంచ యుద్ధం తరువాత రష్యన్ సామ్రాజ్యం పతనం తరువాత అజర్‌బైజాన్ ఆర్మేనియా, జార్జియాలతో చేర్చి స్వల్పకాలం ఉనికిలో ఉన్న " ట్రాంస్‌కౌకాసియన్ డెమొక్రటిక్ ఫెడరేటివ్ రిపబ్లిక్ "లో భాగం అయింది. తరువాత మార్చి మూకుమ్మడి హత్యలు జరిగాయి. హత్యలు 1918 మార్చ్ 30 , ఏప్రెల్ 2 మద్య కాలంలో బకు నగర ప్రాంతాలలో జరిగాయి. రిపబ్లిక్ 1918 మే మాసంలో విచ్ఛిన్నం అయింది. అజర్‌ బైజాన్ " అజర్‌బైజాన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ "గా స్వతంత్రం ప్రకటించింది. ముస్లిం ప్రపంచంలో అజర్‌బైజాన్ మొదటి ఆధునిక పార్లమెంటరీ రిపబ్లిక్‌గా అవతరించింది. అజర్‌బైజాన్ పార్లమెంటు స్త్రీలకు ఓటు హక్కు కల్పించి అజర్‌బైజాన్ స్త్రీలకు సమాన రాజకీయాధికారం ఇచ్చిన మొదటి ముస్లిం దేశంగా గుర్తింపు పొందింది. అదనంగా " బకు స్టేట్ యూనివర్శిటీ స్థాపించి మరొక సాధన చేసింది. తూర్పు ముస్లిం దేశాలలో ఇది మొదటి ఆధునిక విశ్వవిద్యాలయంగా గుర్తించబడుతుంది.

అజర్‌బైజాన్ 
Map presented by delegation from Azerbaijan to Paris Peace Conference in 1919.

1920 మార్చి సోవియట్ రష్యా బకు మీద దాడి చేస్తుందని స్పష్టం అయింది. వ్లాదిమిర్ లెనిన్ సోవియట్ రష్యా దాడి చేయడానికి నిర్ణయించుందని బకు పెట్రోలియం సోవియట్ ఉనికికి అత్యవసరం అని చెప్పాడు. అజర్‌బైజాన్ స్వతంత్రం 23 మాసాలతరువాత ముగింపుకు వచ్చింది. బోల్షెవిక్ నాయకత్వంలో " 11వ సోవియట్ రెడ్ ఆర్మీ" దాడి తరువాత1920 ఏప్రిల్ 28న " అజర్‌బైజాన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ " అవతరించింది. కొత్తగా రూపొందించబడిన అజర్‌బైజన్ సైనికదళం కారాబాఖ్‌లో తలెత్తిన ఆర్మేనియన్ తిరుగుబాటును అణచడానికి నియోగించబడింది. 1918-20 వరకు అనుభవించిన స్వతంత్రం వదలలి లొంగిపోవడానికి అజరీలు ఇష్టపడక రష్యన్ విజయాన్ని అడ్డగిస్తూ పోరాడారు. పోరాటంలో దాదాపు 20,000 మంది అజర్‌బైజాన్ సైనికులు ప్రాణాలు వదిలారు.

1921 అక్టోబరు 13న సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ రష్యా, ఆర్మేనియా,అజర్‌బైజాన్, జార్జియా దేశాలు టర్కీతో " ట్రీ టీ ఆఫ్ కార్స్" ఒప్పదం మీద సంతకం చేసాయి. ట్రీటీ ఆఫ్ కార్స్ ఆధారంగా అప్పటికి స్వతంత్రంగా ఉన్న నక్సిసివన్ ఎస్.ఎస్.అర్ అజర్‌బైజాన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్‌లో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా వీలీనం చేయబడింది. అలాగే ఆర్మేనియాలో సియునిక్ ప్రాంతం విలీనం చేయబడింది. టర్కీ గుంరి (అప్పుడు అలెగ్జాండ్రోపొలో) అని పిలువబడింది.

రెండవప్రంపంచ యుద్ధం అజార్‌బైజాన్ సోవియట్ యూనియన్ వ్యూహాత్మక ఎనర్జీ విధానం ద్వారా ప్రధాన పాత్ర వహించింది. రెండవ ప్రంచయుద్ధంలో ఈస్టర్న్ ఫ్రంటుకు అవసరమైన అత్యధిక విద్త్యుచ్ఛక్తి ఉతపత్తికి బకు నుండి అందించబడింది. 1942 ఫిబ్రవరిలో సోవియట్ యూనియన్ పెట్రీలియం పరిశ్రమలో పనిచేస్తున్న 500 కంటే అధికమైన అజర్‌బైజాన్‌ శ్రామికులు, ఉద్యోగులకు పతకాలు, ఆర్డర్లను ఇచ్చి సత్కరించింది. జర్మన్లు వెహ్ర్‌మచ్త్ నాయకత్వం ఆపరేషన్ ఎడెల్విసిస్ పేరిట బకును (ఎనర్జీ డైనమో (పెట్రోలియం) ఆఫ్ ది యు.ఎస్.ఎస్.ఆర్) లక్ష్యంగా చేసుకుని దాడి చేసారు.. రెండవ ప్రపంచ యుద్ధంలో 1941-1945 మద్య అజర్‌బైజాన్‌లు 5 యుద్ధాలలో పాల్గొన్నారు. యుద్ధంలో 1,00,000 మంది స్త్రీలతో చేర్చి మొత్తం 6,81,000 మంది ప్రజలు (అప్పటి అజర్‌బైజాన్ మొత్తం ప్రజలసంఖ్య 3.4 మిలియన్లు) యుద్ధకార్యాలయాలలో పాల్గొన్నారు. యుద్ధంలో అజర్‌బైజాన్ ప్రజలలో 2,50,000 మంది మరణించారు. 130 మంది కంటే అధికమైన అజర్‌బైజాన్లు " హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ " గుర్తించబడ్డారు. అజర్‌బైజానీ మేజర్ - జనరల్ " అజి అస్లనోవ్ " రెండు మార్లు " హీరో ఆఫ్ ది సోవియట్ యూనియన్ "గా గుర్తించబడ్డాడు.

రిపబ్లిక్ శకం

అజర్‌బైజాన్ 
Red Army paratroops during the Black January tragedy in 1990.

మిఖైల్ గార్బోచేవ్ ఆరంభించిన " గ్లాస్నోస్ట్ " తరువాత సోవియట్ యూనియన్ లోని పలుప్రాంతాలలో సంప్రాదాయ సమూహాల కలహాలు , సాంఘిక అశాంతి చెలరేగింది. అజర్‌బైజాన్ రిపబ్లిక్ లోని స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతాలలో ఒకటైన నగొర్నొ - కారాబాఖ్ వాటిలో ఒకటి. అజర్‌బైజాన్ కల్లోలం మాస్కో వివక్ష కారణంగా స్వంతంత్రం కొరకు పోరాటం మొదలైంది. తరువాత 1990 లో " సుప్రీం సోవియట్ ఆఫ్ అజర్‌బైజాన్ " అజర్‌బైజాన్ రిపబ్లిక్ " సార్వభౌమత్వాన్ని ప్రకటించింది. అలాగే అజర్‌బైజాన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ దేశపతాకం చేయబడింది. 1991 అక్టోబరు 18న సుప్రీం కౌంసిల్ ఆఫ్ అజర్‌బైజాన్ స్వతంత్రం ప్రకటించింది. 1991 లో సోవియట్ యూనియన్ అధికారికంగా పతనం అయింది. స్వతంత్రం పొందిన ఆరంభకాలం నగొర్నొ- కారాబాఖ్ యుద్ధం కారణంగా దేశం కల్లోలితం అయింది. 1914లో ప్రతీకారం ముగింపుకు వచ్చిన తరువాత ఆర్మేనియా 14-16% అజర్‌బైజాన్ భూభాగాన్ని (నగొర్నొ- కారాబాఖ్‌తో చేర్చిన) స్వాధీనం చేసుకుంది. గుష్చులార్, మలిబేలి మూకుమ్మడి హత్యలు, గరదఘీ మూకుమ్మడి హత్యలు, అగ్దబన్ మూకుమ్మడి హత్యలు, ఖొజలి మూకుమ్మడి హత్యలు మొదలైన పలు హింసాత్మక చర్యలు చోటుచేసుకున్నాయి. అల్లర్ల కారణంగా 30,000 మంది మరణించారు, 1 మిలియన్ కంటే అధికమైన వారు నివాసాలను వదిలి వెళ్ళారు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌంసిల్ రిసొల్యూషంస్ 822, ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌంసిల్ రిసొల్యూషంస్ 853, ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌంసిల్ రిసొల్యూషంస్ 874, ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌంసిల్ రిసొల్యూషంస్ 884 ఆక్రమిత అజర్‌బైజాన్ భూభాగాల నుండి ఆర్మేనియన్ సైనికులను వెను తీసుకోవాలని పట్టుబట్టాయి. పలువురు రష్యన్లు, ఆర్మేనియన్లు 1990 లో అజర్‌బైజాన్ విడిచి వెళ్ళారు. 1970 గణాంకాలను అనుసరించి 5,10,000 మంది సంప్రదాయ రష్యన్లు, 4,80,000 మంది ఆర్మేనియన్లు అజర్‌బైజాన్‌లో ఉన్నారని అంచనా. 1993 లో ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికైన " అబ్దుల్ఫాజ్ ఎల్విబే " త్రోసివేయబడి కలనల్ సూరత్ హుసెనోవ్ నాయకత్వంలో సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఫలితంగా అజర్‌బైజాన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ నాయకుడైన హైదర్ అలియేవ్ అధికారం అధికరించింది. 1994 లో ప్రధానమంత్రి సూరత్ హుసెయేవ్ హైదర్ అలియేవ్ వ్యతిరేకంగా మరొక సైనిక చర్య తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ హుసెనోవ్ ఖైదు, దేశద్రోహ ఆరోపణ చేయబడింది. 1995 లో అలియేవ్‌కు వ్యతిరేకంగా అజర్‌బైజాని సైనికచర్య జరిగింది. ఈ సారి సైనిక చర్యకు అజర్‌బైజాన్ ఓమన్ స్పెషల్ యూనిట్ రొవ్షన్ జవదోవ్ సైనికచర్యకు నాయకత్వం వహించాడు. అదేసమయం అజర్‌బైజాన్‌ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ తీవ్రమైన లంచగొండితనంతో కళంకితం అయింది. 1998 అక్టోబరులో అలియేవ్ రెండవసారి ఎన్నికచేయబడ్డాడు. అజరి- చిరాగ్ గునేష్లి ఆయిల్ ఫీల్డ్, షాహ్ డెనిజ్ గ్యాస్ ఫీల్డ్ నుండి వెలికితీయబడ్తున్న ఆదాయం కారణంగా అజర్‌బైజాన్ ఆర్థికంగా అభివృద్ధి చెందింది. ఓట్ల లెక్కింపు అక్రమాలు, లంచగొండితనం అధికరించడం కారణాలుగా అలియేవ్ ప్రభుత్వం విమర్శించబడింది. హైదర్ అలియేవ్ కుమారుడు ఇల్హాం అలియేవ్ అజర్‌బైజాన్ పార్టీకి చైర్మన్‌గా ఎన్నిక చేయబడ్డాడు. 2003 లో ఆయన తండ్రి మరణం తరువాత అధ్యక్షకార్యాలం ఆధిపత్యం పొందాడు. 2013 అజర్‌బైజాన్ ఎన్నికలలో ఇల్హాం అలియేవ్ మూడవసారి అధ్యపీఠం అధిరోహించాడు.

భౌగోళికం

అజర్‌బైజాన్ 
Caucasus Mountains in northern Azerbaijan.

అజర్‌బైజాన్ యుఏషియా దక్షిణ కౌకాసస్ ప్రాంతంలో ఉంది. నైరుతీ ఆసియా, తూర్పు ఐరోపా‌ల మద్య ఉంది. ఇది 38-42 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 44-51 తూర్పు రేఖాంశంలో ఉంది. అజర్‌బైజాన్ మొత్తం పొడవు 2648 కి.మీ. ఇది ఆర్మేనియాతో 1007 కి.మీ, ఇరాన్తో 756 కి.మీ, జార్జియాతో 480కి.మీ, రష్యాతో 390కి.మీ, టర్కీతో 15కి.మీ పొడవైన సరిహద్దును పంచుకుంటున్నది. The coastline stretches for 800 km (497 mi), and the length of the widest area of the Azerbaijani section of the Caspian Sea is 456 km (283 mi). అజర్‌బైజాన్ భూభాగం ఉత్తర దక్షిణాలుగా 400 కి.మీ, తూర్పు పడమరలుగా 500 కి.మీ విస్తరించి ఉంది. అజర్‌బైజన్‌ భూభాన్ని నైసర్గికంగా మూడు విషయాలు ఆధిక్యత చేస్తున్నాయి. కాస్పియన్ సముద్రం తీరం దేశం తూర్పు సరిహద్దును ఏర్పరుస్తుంది. గ్రేట్ కౌకాసస్ పర్వతశ్రేణి ఉత్తర సరిహద్దును ఏర్పరుస్తుంది. అలాగే దేశం మద్యలో విస్తారమైన చదునైన భూభాగం ఉంది. దేశంలో మూడు మూడు పర్వతశ్రేణులు ఉన్నాయి; గ్రేటర్, లెస్సర్ కౌకాషియస్, తల్యష్ పర్వతశ్రేణి ఉన్నాయి. పర్వతశ్రేణి దేశంలోని 40% భూభాగాన్ని ఆక్రమించుకుని ఉన్నాయి. అజర్‌బైజన్ అత్యున్నత శిఖరంగా బజర్దుజు (4,466 మీ) గుర్తించబడుతుంది. లోతైన ప్రాంతంలో కాస్పియన్ సముద్రం ఉంది (సముద్రమట్టానికి -28 మీ). భూమిలోని మొత్తం " మడ్ ఓల్కొనోస్ "లో సగం అజర్‌బైజన్ భూభాగంలో ఉన్నాయి. అజర్‌బైజాన్ మడ్ వాల్కనోస్ " కొత్త 7 వండర్స్ ఆఫ్ నేచుర్ "గా ప్రతిపాదించబడింది. దేశానికి ఉపరితల జలాలు ప్రధాన జలవనరుగా ఉన్నాయి. అయినప్పటికీ దేశంలో ప్రవహిస్తున్న 8,350 నదులలో 100 కి.మీ కంటే పొడవైన నదులు 24 మాత్రమే ఉన్నాయి. నదులన్ని తూర్పున ఉన్న కాస్పియన్ సముద్రంలో సంగమిస్తున్నాయి. 67కి.మీ పొడవైన సరిసు సరోవరం అతిపెద్ద సరోవరంగా గుర్తించబడుతుంది. 1,515 కి.మీ పొడవైన కుర నది అత్యంత పొడవైన నదిగా గుర్తించబడుతుంది. కాస్పియన్ సముద్రంలోని 4 అజర్‌బైజాన్ ద్వీపాల వైశాల్యం 30 చ.కి.మి.

1991లో అజర్‌బైజాన్ స్వతంత్రం పొందాక అజర్‌బైజాన్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. అయినప్పటికీ జాతీయ పర్యావరణ పరిరక్షణలో వాస్తవమైన అభివృద్ధి 2001 లో ఆరంభం అయింది. బకు- త్బిల్సి- చెహన్ పైప్ లైన్ నుండి సరికొత్తగా లభించిన ఆదాయం కారణంగా ప్రభుత్వం బడ్జెట్‌లో పర్యావరణ పరిరక్షణకు నిధి మంజూరైన తరువాత ఈ అభివృద్ధి సాధ్యమైంది. 4 సంవత్సరాల వ్యవధిలో సంరక్షిత ప్రాంతాలు రెండింతలై ప్రస్తుతం దేశవైశాల్యంలో 8% నికి చేరుకుంది. 2001 నుండి ప్రభుత్వం 7 పెద్ద సంరక్షిత ప్రాంతాలు ఏర్పాటు చేయబడ్డాయి.

నైసర్గికం

అజర్‌బైజాన్ 
Mount Bazarduzu, the highest peak of Azerbaijan, as seen from Mount Shahdagh
అజర్‌బైజాన్ 
The landscape of Khinalug valley.

అజర్‌బైజాన్‌లో విస్తారమైన ప్రకృతిదృశ్యాలు ఉన్నాయి. అజర్‌బైజన్ భూభాగంలో అర్ధభాగాన్ని ప్రత్వత చీలికలు, క్రెస్టులు, యైలాస్ , పీఠభూములు ఆక్రమిస్తున్నాయి. తాలిస్, జయ్రంచోల్-అజినోహర్ , లంగబిజ్ - అలత్ ఫొరెంజస్ ప్రాంతాలలో భూభాగం సముద్రమట్టాని కంటే 100-120 మీ ఎత్తులో ఉన్నాయి. క్వబుస్థాన్, అబ్షెరాన్ ప్రాంతాలు 0-50 మీ ఉన్నాయి. మిగిలినవి అజర్‌బైజన్ మైదానాలు , దిగువభూములుగా ఉన్నాయి. కౌకాసియన్ తీరభూములు సముద్రమట్టానికి - 28 మీ ఉంటుంది. అజర్‌బైజన్ వాతావరణం మీద ఆర్కిటిక్ " ఎయిర్ మాసెస్ "లో భాగం వహిస్తున్న స్కాండినవియన్ యాంటీ సైక్లోన్, సైబీరియన్ యాంటీసైక్లోన్ , సెంట్రల్ ఆసియన్ యాంటీ సైక్లోన్ శీతలవాయువులు ప్రభావం చూపుతున్నాయి. అజర్‌బైజన్ వైవిధ్యమైన ప్రకృతి ఎయిర్ మాస్ దేశంలో ప్రవేశించడాన్ని అడ్డగిస్తూ ఉంటుంది. గ్రేటర్ కౌకాసస్ దేశాన్ని ఉత్తర దిశ నుండి వీచే శీతలవాయువుల తీవ్రప్రభావం నుండి రక్షిస్తూ ఉన్నాయి. అందువలన దేశంలోని పర్వతపాదా ప్రాంతాలు , మైదానాలలో ఉప ఉష్ణమడల వాతావరణం ఏర్పడుతుంది. మరొక వైపు పర్వత పాద ప్రాంతాలు , మైదానాలు " సన్లైట్ (సోలార్ రేడియేషన్) " ప్రాంతాలుగా వర్గీకరించబడుతున్నాయి. ప్రపంచం లోని 11 కోపెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ జోంస్ అజర్‌బైజాన్‌లో ఉన్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రత -33 సెల్షియస్ (జుల్ఫా ) , అత్యధిక ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్షియస్ (ఒర్దుబాద్) ఉంటుంది. అత్యధిక వార్షిక వర్షపాతం (లంకరన్) 600-1800 మి.మీ , అత్యల్ప వర్షపాతం (అబ్షెరాన్) లో 250-300 మి.మీఉంటుంది.

జలవనరులు

అజర్‌బైజాన్ 
Murovdag is the highest mountain range in the Lesser Caucasus.

నదులు , సరసులు అజర్‌బైజాన్ ప్రధాన జలవనరులుగా ఉన్నాయి. అవి భౌగోలికంగా పురాతన కాలంలో రూపొంది గణనీయంగా మార్పులు చెందాయి. పురాతన నదులకు ఇవి సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇవి ప్రకృతి ప్రభావం , మానవులు ఏర్పరుస్తున్న పారిశ్రామిక ప్రభావానికి లోనౌతున్నాయి. అజర్‌బైజాన్ జలవినియోగ విధానంలో కాలువలు , నీటి మడుగులు భాగస్వామ్యం వహిస్తున్నాయి. జలవనరులు , నీటి సరఫరాలో అజర్‌బైజాన్ సరాసరి కంటే దిగువన ఉంది. పెద్ద వాటర్ రిజర్వార్లు అన్నీ కుర్‌లో నిర్మించబడ్డాయి. అజర్‌బైజాన్ నదుల మొత్తం పొడవు 8,350 కి.మీ. 100 కి.మీ కంటే అధికమైన పొడవు కలిగిన నదులు 24 మాత్రమే ఉన్నాయి. కురా నది , ఆరిస్ నది అజర్‌బైజాన్ నదులలో ప్రధానమైనవి. అవి కురా- అరాస్ దిగువ భూములలో ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు నేరుగా కాస్పియన్ సముద్రంలో సంగమిస్తున్నాయి. నదులు అధికంగా ఈశాన్య భాగంలోని కౌకాసస్ , తాలిష్ పర్వతాలలో జనించి సమర్- దెవెచి , లంకరన్ దిగువభూముల గుండా ప్రవహిస్తున్నాయి. యానర్ డాగ్ (రగులుతున్న పర్వతం) సహజవాయు అగ్నిపర్వతం. ఇది కాస్పియన్ సముద్రంలో ఉన్న అబ్షెరాన్ ద్వీపకల్పం (బకు సమీపంలో) ఉంది. దీనిని " లాండ్ ఆఫ్ ఫైర్ " అని పిలుస్తుంటారు. బకు ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు ఇది ఒక పర్యాటక ఆకర్షణగా ఉంది.

పర్యావరణం

అజర్‌బైజాన్ 
The Karabakh horse is the national animal of Azerbaijan.

అజర్‌బైజాన్ జంతుజాల సంపన్నత , వైవిధ్యం తూర్పు పర్యాటకుల పర్యాటక వ్రాతలలో లభిస్తుంది. ఆర్కిటెచురల్ స్మారకచిహ్నాలు, పురాతన శిలలు , ఇప్పటి వరకూ సజీవంగా ఉన్న రాళ్ళు మీద జంతువుల చెక్కడాలు ఇక్కడ జీవించిన జంతువుల ఉనికికి ఆధారాలుగా ఉన్నాయి. అజర్‌బైజాన్ జంతుప్రంపంచం గురించిన మొదటి సమాచారం 17వ శతాబ్దంలో అజర్‌బైజాన్‌ను సందర్శించిన ప్రకృతిప్రేమికుల చేత సేకరించబడింది. అజర్‌బైజాన్‌లో అనేక ప్రత్యేక జాతి జంతువులు ఉన్నాయి. 106 జాతుల జంతువులు, 97 జాతుల చేపలు, 363 జాతుల పక్షులు, 10 జాతుల ఉభయచరాలు , 52 జాతుల సరీసృపాలు నమోదు చేయబడి వర్గీకరించబడ్డాయి.

జాతీయజంతువు

అజర్‌బైజాన్ జాతీయ జంతువు కారాబాక్ గుర్రం. ఇది స్వారీచేయడానికి , గుర్రపుపందాలకు సహకరిస్తుంది. కారాబాక్ గుర్రం ఆవేశానికి, వేగానికి, సౌందర్యాకి , మేధాశక్తికి ఖ్యాతి గాంచాయి. పురాతన ఆశ్వసంతతిలో ఇది ఒకటి. అయినప్పటికీ ప్రస్తుతం ఇది అంతరించిపోతున్న గుర్రపు జాతిగా ఉంది.

వృక్షజాలం

అజర్‌బైజాన్ వృక్షజాలంలో 4,500 జాతుల కంటే అధికంగా ఎత్తైన వృక్షజాతులు ఉన్నాయి. వైవిధ్యమైన వాతావరణం కారణంగా దక్షిణ కౌకాసస్ రిపబ్లిక్కులలో అన్నింటి కంటే అధికమైన వృక్షజాతులు అజర్‌బైజాన్‌లో ఉన్నాయి. కౌకాదియన్ ప్రాంతం మొత్తంలోని వృక్షజాతులలో 67% అజర్‌బైజాన్‌లో ఉన్నాయి.

ఆర్ధికరంగం

1991లో స్వతంత్రం లభించిన తరువాత అజర్‌బైజాన్ " ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ", వరల్డ్ బ్యాంక్, యురేపియన్ బ్యాంక్ ఫర్ రీకంస్ట్రక్షన్ , డెవెలెప్మెంటు, ఇస్లామిక్ డెవెలెప్మెంటు బ్యాంక్ , ఆసియన్ డెవెలెప్మెంట్ బ్యాంక్ సభ్యత్వం కలిగిన దేశం అయింది.

బ్యాంకింగ్ విధానం

అజర్‌బైజాన్ బ్యాంకింగ్ విధానంలో " సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అజర్‌బైజాన్, కమర్షియల్ బ్యాంక్, నాన్ బ్యాంకింగ్ క్రెడిట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయి. 1992 ది నేషనల్ బ్యాంక్ (ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్) స్థాపించబడింది, ఇది అజర్‌బైజాన్ స్టేట్ సేవింగ్ బ్యాంక్‌గా పనిచేస్తుంది. ఇది మునుపటి స్టేట్ సేవింగ్ బ్యాంక్ ఆఫ్ ది యు.ఎస్.ఎస్.ఆర్. అనుబంధంగా ఉండేది. సెంట్రల్ బ్యాంక్ అజర్‌ బైజాన్ సెంట్రల్ బ్యాంకుగా జాతీయ కరెంసీ ముద్రించే అధికారం కలిగి ఉంది. అలాగే అజర్‌బైజాన్ కమర్షియల్ బ్యాంకుల అన్నింటినీ పర్యవేక్షించే బాధ్యత కూడా వహిస్తుంది. ప్రభుత్వానికి స్వంతమైన కమర్షియల్ బ్యాంకులలో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ అజర్‌బైజాన్ (జహంగీర్ హజియేవ్ నిర్వహణలో), ది యూనియన్ బ్యాంక్ ప్రధానమైనవి.

డచ్ డిసీస్

అజర్‌బైజాన్ ఆర్థికరంగంలో " డచ్ డిసీస్ " కనిపిస్తుంది. అత్యంత వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ద్రవ్యోల్భణానికి దారితీస్తూ నాన్- ఎనర్జీ ఎగుమతులు అధికవ్యయం కలిగిస్తుంది. ఈ శతాబ్దం ఆరంభంలో అధికంగా ఉన్న ద్రవ్యోల్భణం నియత్రించబడింది. అది 2006 జనవరి 1 న సరికొత్త అజర్‌బైజనీ కరెంసీ (మనాత్) రూపొందించడానికి దారితీసింది. ఆర్ధికసంస్కరణలు ఆర్థికరంగంలో అస్థిరత తొలగించాయి. 2008లో వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ నివేదిక ఆర్థికసంస్కరణలు అత్యున్నతంగా అమలుచేసిన 10 దేశాలలో అజర్‌బైజాన్ ఒకటి అని తెలియజేస్తుంది.

Azerbaijan led the world as the top reformer in 2007/08, with improvements on seven out of 10 indicators of regulatory reform. Azerbaijan started operating a one-stop shop in January 2008 that halved the time, cost and number of procedures to start a business. Business registrations increased by 40% in the first six months. Azerbaijan also eliminated the minimum loan cutoff of $1,100, more than doubling the number of borrowers covered by the credit registry. Also, taxpayers can now file forms and pay their taxes online. Azerbaijan's extensive reforms moved it far up the ranks, from 97 to 33 in the overall ease of doing business.

గ్లోబల్ కాంపిటీటివ్ రిపోర్ట్ నివేదిక అనుసరించి అజర్‌బైజాన్ అంతర్జాతీయంగా 57వ స్థానంలోఉంది (2010-2011). అజర్‌బైజాన్ జి.డి.పి. 1995 నుండి 2012 నాటికి 20 రెట్లు అధికం అయింది.

విద్యుత్తు

అజర్‌బైజాన్ 
A pumping unit for the mechanical extraction of oil on the outskirts of Baku.

అజర్‌బైజాన్‌లో మూడింట రెండు వంతులు ఆయిల్, గ్యాస్‌లతో సుసంపన్నమై ఉంది. లెస్సర్ కౌకాసస్ ప్రాంతంలో బంగారం, ఇనుము, వెండి,రాగి, టైటానియం, క్రోమియం, మాంగనీస్, కొబాల్ట్, మొలిబ్దెనం, ఓర్, యాంటిమోని లభిస్తుంది. 1994 సెప్టెమర్ స్టేట్ ఆయిల్ కంపనీ ఆఫ్ అజబైజనీ రిపబ్కిక్ మరియూ,కొ,,బి.పి,ఎక్సాన్మొబిల్, ల్కొయిల్, స్టాటోలీ మొదలైన 13 ఆయిల్ కంపెనీలతో ఒప్పదం కుదిర్చుకుంది. హైడ్రోకార్బన్ అణ్వేషణకు అజర్‌బైజాన్ ఆయిల్ ఫీల్డులు ప్రధానకేంద్రం అయ్యాయి. స్టేట్ ఆయిల్ ఫండ్ ఆఫ్ అజర్బైజాన్ స్థాపించబడింది.

వ్యవసాయం

అజర్‌బైజాన్ ఈ ప్రంతంలో అతిపెద్ద వ్యవసాయక్షేత్రం కలిగి ఉంది. దేశంలో 54.9% వ్యవసాయభూములు ఉన్నాయి. 2007 గణాంకాలను అనుసరించి 4,755,100 చ.హె.వ్యవసాయ భూములు ఉపయోగంలో ఉన్నాయని అంచనా. అదే సమయంలో వృక్షవనరులు 136 మిలియన్ల చ.మీ విస్తరించి ఉన్నాయి. అజర్బైజాన్ అగ్రికల్చురల్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్స్ పశ్చికమైదానాలు, హార్టీ కల్చర్, ఉపౌష్ణమండల పంటలు, గ్రీన్ వెజిటబుల్స్, విటి కల్చర్, అజర్‌బైజాన్ వైన్ తయారీ, పతీ పంట, ఔషధ మొక్కల పెంపకం మీద దృష్టికేంద్రీకరించారు. కొన్ని వ్యవసాయ భూములలో ధాన్యం,,ఉర్లగడ్డలు, చెరకు, పత్తి, పొగాకు పండించబడుతున్నాయి. పశుపోషణ, పాల సంబంధిత వస్తు ఉత్పత్తి, వైన్ ఉత్పత్తి ప్రధాన ఉత్పత్తులుగా ఉన్నాయి. కాస్పియన్ చేపలపరిశ్రమ క్షీణించిపోతున్న స్టర్గియాన్, బెల్గుయా జాతి మీద దృష్టికేంద్రీకరించింది. అజర్‌బైజాన్ మర్చంట్ మేరిన్‌లో 54 షిప్పులు ఉన్నాయి. విదేశాల నుండి దిగుమతి చేయబడుతున్న విలువైన వస్తువులు ప్రస్తుతం దేశంలోనే ఉత్పత్తి చేయబడుతున్నాయి. కొకా కొలా బాటిలర్ నుండి కొకా కొలా, బకి- కాస్టెల్ నుండి బీర్, నేహర్ నుండి పర్క్వెట్, ఇ.యు.పి.ఇ.సి పైప్ కోటింగ్ అజర్‌వైజాన్ నుండి ఆయిల్ పైప్స్ ఉత్పత్తి ఔతున్నాయి.

పర్యాటకం

అజర్‌బైజాన్ 
Shahdag Mountain Resort is the country's largest winter resort.

పర్యాటకం అజర్‌బైజాన్ ఆర్థికరంగంలో ప్రధానపాత్ర వహిస్తుంది. 1980లో దేశం ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ఉండేది. అయినప్పటికీ సోవియట్ యూనియన్ పతనం, 1990 నగొర్నొ - కరాబాక్ యుద్ధం ఫలితంగా పర్యాటకరంగం దెబ్బతిన్నడమేగాక పర్యాటకకేంద్రంగా అజర్బైజాన్ ఆకర్షణ కూడా తగ్గింది. 2000 వరకు పర్యాటకపరిశ్రమ కోలుకోలేదు. తరువాత పర్యాటకుల సంఖ్యలో క్రమాభివృద్ధి కొనసాగింది. సమీపకాలంగా అజర్‌బజాన్ మతం, ఆరోగ్యసంరక్షణలకు ప్రముఖ పర్యాటకగమ్యంగా శీతాకాలంలో " షహ్డాగ్ మౌంటెన్ రిసార్ట్ " స్కీయింగ్ వసతులు కల్పిస్తూ ఉంది. అజర్‌బైజాన్ ప్రభుత్వం అజర్‌బైజాన్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేయడానికి కృషిచేస్తుంది. పర్యాటక ఆదాయం అజర్‌ బైజాన్ ఆర్థికరంగానికి ప్రధాన వనరుగా చేయాలని దేశం కృషిచేస్తుంది, అజర్‌బైజాన్ మినిస్టరీ ఆఫ్ కల్చర్, పర్యాటకం శాఖ పర్యాటకరంగాన్ని క్రమపరచడానికి బాధ్యత వహిస్తుంది.

ప్రయాణసౌకర్యాలు

సిల్క్ రోడ్డు, సౌత్ - నార్త్ కారిడర్ అంతర్జాతీయ రహదార్లకూడలి దేశంగా అజర్బైజాన్ రవాణా రగం వ్యూహత్మక రూపకల్పనలో ప్రధానపాత్ర వహిస్తుంది. దేశరవాణా రంగంలో రహదారి, అవియేషన్, నౌకాయానం భాగస్వామ్యం వహిస్తున్నాయి. అజర్‌బైజాన్ ముడిసరుకు రవాణా కేంద్రంగా ప్రాముఖ్యత వహిస్తుంది. ది బకు- చేతన్ పైప్‌లైన్ 2006 మే నుండి పనిచేయడం ప్రారంభించి 1774 కి.మీ (అజర్‌బైజాన్, జార్జియా, టర్కీ) విస్తరించింది. ది బకు- చేతన్ పైప్‌లైన్ వార్షికంగా 50 టన్నుల క్రూడ్ ఆయిల్‌ను కాస్పియన్ సముద్రం నుండి అంతర్జాతీయ మార్కెట్‌కు రవాణాచేసేలా రూపొందించబడింది. ది సౌత్ కాస్పియన్ పైప్ లైన్ కూడా అజర్‌వైజన్‌, జార్జియా, టర్కీల మీదుగా నిర్మించబడింది. ఇది 2006లో నుండి పనిచేయడం ఆరంభించింది. ఇది షాహ్ డెంజ్ గ్యాస్ ఫీల్డ్ నుండి యురేపియన్ మార్కెట్‌కు గ్యాస్ సరఫరా చేస్తుంది. షాహ్ డెంజ్ గ్యాస్ ఫీల్డ్ నుండి వార్షికంగా 296 బిలియంక్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉతపత్తి ఔతుందని అంచనా. అజర్‌బైజాన్ సిల్క్ రోడ్డు ప్రాజెక్టులో ప్రధానపాత్ర వహిస్తుంది. 2002 లో అజర్‌బైజాన్ ప్రభుత్వం " మినిస్టరీ ఆఫ్ ట్రాంస్ పోర్ట్ "ను స్థాపించింది. " రోడ్డు ట్రాఫిక్ " వియన్నా కాంవెంషన్‌లో అజర్‌బైజాన్ సభ్యదేశం అయింది. రవాణా సౌకర్యాల ఆధునికీకరణ , రవాణాసేవలను కీలకమైన దేశతులనాత్మక ప్రయోజనాలలో ఒకటిగా మార్చడం ప్రధానాంశంగా రవాణారంగం అభివృద్ధి రూపకల్పన చేయబడింది. ఇది ఆర్ధికరంగానికి సహకరించగలదని అంచనా. 2012 లో నిర్మించబడిన " కారాస్- బకు- రైల్వే " ఆసియా , ఐరోపా కలుపుతూ కజకస్తాన్, టర్కీ (మర్మరే) , చైనా రైలుమార్గంతో అనుసంధానం చేయగలదని భావిస్తుంది.2010లో రష్యన్ రైలు మార్గం 2918 కి.మీ విస్తరించబడి అందులో 1278 కి.మీ విద్యుదీకరణ చేయబడింది. 2010 లో గణాంకాలు అనుసరించి దేశంలో 35 విమానాశ్రయాలు , 1 హెలి పోర్ట్ ఉన్నాయని తెలుస్తుంది.

సైంస్ , సాంకేతికం

అజర్‌బైజాన్ 
Shamakhi Astrophysical Observatory

21వ శతాబ్దంలో సరికొత్తగా ఆయిల్ , సహవాయువు సంభవించిన అనూహ్యమైన అభివృద్ధి అజర్‌బైజాన్ సైన్సు , టెక్నాలజీ రంగంలో అభివృద్ధికి దోహదం చేసింది. ప్రభుత్వం ఆధునికీకరణ , పరిశోధనలు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి కృషిచేస్తుంది. ప్రభుత్వం ఇంఫర్మేషన్ టెక్నాలజీ , కమ్యూనికేషన్ పరిశ్రమ అభివృద్ధి చెంది దాని నుండి ఆదాయం లభిస్తుందని భావిస్తున్నారు. అజర్‌బైజన్ అతిపెద్ద , క్రమంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ సెక్టర్‌ను కలిగి ఉంది. 2007-2012 అంతర్జాతీయ ఆర్ధిక సంక్షోభం దీని వేగవంతమైన అభివృద్ధి మీద ప్రభావం చూపలేదు. టెల్కాం రంగంలో కూడా దేశం అభివృద్ధి సాధించింది. ది మినిస్టరీ ఆఫ్ కమ్యూనికేషన్ & ఇంఫర్మేషన్ టెక్నాలజీస్ పనిచేయడం ఆరంభించింది. ఇది అజ్టెలికాం ద్వారా టెలికాంరంగానికి అవసరమైన విధానాలు రూపొందించడం , నియంత్రణ బాధ్యతలు వహిస్తుంది. పబ్లిక్ ఫోన్ ద్వారా లోకల్ కాల్స్ వసతికల్పిస్తుంది. ఇందుకు అవసరమైన కార్డులను టెలిఫోన్ ఎక్ష్చేంజ్ , షాపులు , కియీస్క్‌లలో విక్రయిస్తారు. 2009 గణాంకాలను అనుసరించి దేశంలో ప్రధానంగా 13,97,000 టెలిఫోన్ లైన్లు , 1,485,000 ఉన్నాయని అంచనా. అజర్‌బైజాన్‌లో అజర్‌సెల్, బ్యాక్‌సెల్, అజర్‌ఫన్ (నార్‌మొబైల్), నఖ్తె మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్స్ , సి.డి.ఎం.ఎ సంస్థలు ఉన్నాయి. 21వ శతాబ్దంలో పలు అజర్‌బైజాన్ జియోడైనమిక్ , జియోటెక్టోనిక్స్ పరిశోధకులు ఎల్చిన్ ఖలిలోవ్ , ఇతర సంథల పని వలన ప్రేరణ పొందారు.ఎర్త్‌క్వేక్ ప్రెడిక్షన్ స్టేషన్లు , ఎర్త్‌జ్వేక్ - రెసిస్టెంస్ భవనాలు సెసొమిక్ సేవలు అందిస్తున్నాయి. అజర్‌బైజాన్ నేషనల్ ఎయిరోస్పేస్ ఏజెంసీ తన మొదటి శాటిలైట్‌ (అజర్ శాట్) ను 2013 ఫిబ్రవరి 7 న ఫ్రెంచ్ దేశంలోని " గయానా స్పేస్ సెంటర్ నుండి భూమికక్ష్యలో (ఆర్బిటల్ పొసిషంస్ 46 డిగ్రీలు) ప్రవేశపెట్టింది. శాటిలైట్ ఐరోపా, ఆసియన్ దేశాలు,, ఆఫ్రికా దేశాల నుండి టి.వి ప్రసారాలు, రేడియోరసారాలు, అంతర్జతీయ ప్రసారాలు అందిస్తుంది.

గణాంకాలు

Ethnic composition (2009)
91.60%
2.02%
1.35%
1.34%
1.26%
2.43%

2011 గణాంకాలను అనుసరించి మొత్తం జనసంఖ్య 9,165,000. వీరిలో 52% నగరప్రాంత వాసితులు. మిగిలిన 48% గ్రామీణ వాసితులు. వీరిలో 51% స్త్రీలు, స్త్రీ పురుషుల నిష్పత్తి 1000:970. జనసఖ్యాభివృద్ధి 0.8% (అంతర్జాతీయ జనసంఖ్యాభివృద్ధి 1.09%) అధికసంఖ్యలో వలసలు సంభవించినందున జనసంఖ్యాభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది. అజర్‌బైజాన్ విదేశీ ఉద్యోగులు 42 దేశాలలో పనిచేస్తున్నారు. అజర్‌బైజాన్‌లో జర్మనులు అధికంగా నివసిస్తున్న ప్రాంతం కరేల్హౌస్, స్లావిక్ ప్రజల సాంస్కృతిక కేంద్రం, అజర్‌బైజాన్ - ఇజ్రేలి ప్రజలు, కుర్దిష్ సాంస్కృతిక కేంద్రం, అంతర్జాతీయ తాలిష్ అసోసియేషన్, లెజింస్ నేషనల్ సెంటర్ (సామూర్), అజర్‌బైజాన్ - తాతర్ సాంస్కృతిక ప్రజలు, క్రిమీన్ తాతర్ సొసైటీ ఉన్నాయి.

2009 గణాంకాలు అనుసరించి జనసంఖ్యలో 91.60% అజర్‌బైజానీ ప్రజలు, 2.02% లెగ్జియనులు, 1.35% ఆర్మేనియన్ ప్రజలు (ఆర్మేనియన్ ప్రజలు అధికంగా నగొర్నొ- కారాబాఖ్‌లో నివసిస్తున్నారు), 1.34% రష్యన్లు, 1.26% తాలిష్ ప్రజలు, 0.56% కౌకాసియన్ 0.43% టర్కిష్ ప్రజలు, 0.29% తాతర్లు, 0.28% తాట్ ప్రజలు, 0.24% ఉక్రెయినియన్లు, 0.15% త్సాఖూర్ ప్రజలు, 0.11% జార్జియన్లు, 0.10% యూదులు, 0.7% కుర్దిష్ ప్రజలు, 0.21% ఇతరులు ఉన్నారు.

ఇరానియన్ అజర్‌బైజాన్ ఇరాన్లో నివసుస్తున్న మైనారిటీ ప్రజలలో ప్రథమ స్థానంలో ఉన్నారు. సి.ఐ.ఎ వరల్డ్ ఫేస్ బుక్ అంచనాల ఆధారంగా ఇరాన్ జనసంఖ్యలో అజర్‌బైజానీ ప్రజలు 16% ఉన్నారని భావిస్తున్నారు.

నగరీకరణ

అజర్‌బైజాన్‌లో 77 నగరాలు, 64 చిన్న తరహా నగరాలు (రాయన్), ఒక లీగల్ అంతస్తు కలిగిన నగరం ఉన్నాయి. వీటిలో 257 అర్బన్- టైప్ సెటిల్మెంట్లు, 4,620 గ్రామాలు ఉన్నాయి.

భాష

అజర్‌బైజానీ భాష అధికార భాషగా ఉంది. ఇది దాదాపు 92% ప్రజలకు మాతృభాషగా ఉంది. ఇది టర్కీ భాషాకుటుంబానికి చెందినది. ఆంగ్లం, రష్యా భాషలు విద్య, కమ్యూనికేషన్ లలో రెండవ భాషగా ఉన్నాయి. దేశంలో ఒక డజన్ స్థానిక భాషలు వాడుకలో ఉన్నాయి. ఆర్మేనియన్ భాష, అవార్ భాష, బుదుఖ్ భాషలు వాడుకలో ఉన్నాయి. జార్జియన్ భాష, జుహురి భాష Khinalug, క్రిత్స్ భాష, లెజ్గియన్ భాష, రుతుల్ భాష, తాలిష్ భాష, తాత్ (కౌకసస్)భాష,, త్సఖూర్ భాష,, and Udi భాషలు అల్పసఖ్యాక ప్రజలలో వాడుకలో ఉన్నాయి. వీరిలో కొన్ని జాతులకు చెందిన ప్రజలు సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అంతేకాక వీరి సంఖ్య క్రమంగా క్షీణిస్తూ ఉంది. ఆర్మేనియన్ అధికంగా నగొర్నొ- కారాబాఖ్ ప్రాంతంలో వాడుకలో ఉంది.

మతం

అజర్‌బైజాన్ 
The Bibi-Heybat Mosque before its destruction by the Bolsheviks in 1936. The mosque was built over the tomb of a descendant of Muhammad.

అజర్‌బైజాన్ ప్రజలలో 95% ముస్లిములు ఉన్నారు. వీరిలో 85% ముస్లిములు షియా ఇస్లాములు, 15% సున్ని ముస్లిములు ఉన్నారు. అంతేకాక అజర్‌బైజాన్ రిపబ్లిక్‌లో షియా ముస్లిముల సంఖ్యలో అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉంది. మిగిలిన వారు ఇతర వైవిధ్యమైన సంప్రదాయాలకు చెందినవారుగా ఉన్నారు. అజర్‌బైజాన్ లౌకిక రాజ్యంగా అజర్‌బైజాన్ ప్రజలు మతస్వాతంత్ర్యం కలిగి ఉన్నారు. 2006-2008 మద్య కాలంలో గల్లప్ పోల్ ఆధారితంగా 21% అజర్‌బైజానీయులకు వారి దైనందిక జీవితంలో మతానికి అత్యంత ప్రాధాన్యత ఉందని వెల్లడైంది. మతపరంగా అల్పసంఖ్యాకులైన చైనీయులు 280,000 (3.1%) ఉన్నారు. రష్యన్ ఆర్థడాక్స్, జార్జియన్ ఆర్థడాక్స్, ఈస్టర్న్ ఆర్థడాక్స్, ఆర్మేనియన్ అపొస్టొలిక్ క్రైస్తవులు ఉన్నారు. ఆర్మేనియన్లు అధికంగా నగొర్నొ- కారాబాఖ్‌లోని బ్రేక్- అవే ప్రాంతంలో నివసిస్తున్నారు. 2003 లో 250 రోమన్ కాథలిక్కులు ఉన్నారని అంచనా. 2002 గణాంకాలను అనుసరించి ఇతర క్రైస్తవులలో లూథరనిజం, బాప్టిస్ట్, మొలోకంస్ అనుయాయులు ఉన్నారు. . అజబైజానీకి చెందిన ప్రొటెస్టెంట్లు అల్పసంఖ్యలో ఉన్నారు. దేశంలో అదనంగా యూదులు, బహై, హరేకృష్ణ, జెహోవా విట్నెస్ అనుయాయులు అలాగే ఇతర మతస్తులు స్వల్పంగా ఉన్నారు.

విద్య

అజర్‌బైజానీయులలో అధికసంఖ్యలో ఉన్నత విద్యాభ్యాసం చేసినవారు ఉన్నారు. ప్రత్యేకంగా వీరిలో అత్యధికులు సైన్సు, సాంకేతిక విద్యను అభ్యసిస్తున్నారు. సోవియట్ శకంలో అనూహ్యంగా అక్షరాస్యత, సరాసరి విద్యా అత్యంత దిగువ నుండి ఉన్నత స్థితికి చేరుకుంది. అయినప్పటికీ 1920లో లిపి పరంగా విద్యాబోధన పర్సో- అరబిక్ లిపి నుండి లాటిన్‌కు, 1930లో రోమన్ నుండి సిరిలిక్ మార్చబడింది. 1970లో సోవియట్ గణాంకాల ఆధారితంగా అజర్‌బైజాన్ ప్రజలలో 100% పురుషులు, స్త్రీలు (9-40 వయసు) అక్షరాశ్యులుగా ఉన్నారని భావిస్తున్నారు. 2009 యునైటెడ్ డెవెలెప్మెంటు ప్రోగ్రాం నివేదిక ఆధారితంగా అజర్‌బైజాన్ అక్షరాస్యత 99,5% అంచనావేయబడింది. స్వతంత్రం వచ్చిన తరువాత అజర్‌బైజాన్ పార్లమెంటు నెరవేర్చిన ఒక చట్టం ద్వారా విద్యాబోధన సోవియట్ యూనియన్ రూపొందించిన లాటిన్ లిపి స్థానంలో తిరిగి సిరిలిక్ భాషను ప్రవేశపెట్టారు. అదనంగా అజర్‌బైజాన్ విద్యావిధానంలో కొంత మార్పులు తీసుకురాబడ్డాయి. సోవియట్ పాలనలో నిషేధించబడిన మతవిద్యను తిరిగి ప్రవేశపెట్టడం, కరికులంలో (విద్యాప్రణాళిక) మార్పులు మార్పులలో ఒకటి. అదనంగా ప్రాథమిక పాఠశాలలు, విద్యాసంస్థలు (వేలాది ప్రిస్కూల్స్), సాధారణ మాద్యమిక పాఠశాలలు, ఒకేషనల్ స్కూల్స్, స్పెషలైజ్డ్ సెకండరీ స్కూల్స్, టెక్నికల్ స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. ఎనిమిదో తరగతి వరకు నిర్భంద విద్యా విధానం కొనసాగించబడింది.

మూలాలు

Tags:

అజర్‌బైజాన్ పేరు వెనుక చరిత్రఅజర్‌బైజాన్ చరిత్రఅజర్‌బైజాన్ భౌగోళికంఅజర్‌బైజాన్ ఆర్ధికరంగంఅజర్‌బైజాన్ వ్యవసాయంఅజర్‌బైజాన్ పర్యాటకంఅజర్‌బైజాన్ ప్రయాణసౌకర్యాలుఅజర్‌బైజాన్ సైంస్ , సాంకేతికంఅజర్‌బైజాన్ గణాంకాలుఅజర్‌బైజాన్ మూలాలుఅజర్‌బైజాన్en:Eastern Europeen:Western Asiaఆర్మేనియాఇరాన్కాకసస్కాస్పియన్ సముద్రంజార్జియా (దేశం)రష్యా

🔥 Trending searches on Wiki తెలుగు:

జాషువాజలియన్ వాలాబాగ్ దురంతంతెలుగురాజశేఖర్ (నటుడు)రాశి (నటి)పాల్కురికి సోమనాథుడుబర్రెలక్కఅమితాబ్ బచ్చన్కార్తెశ్రీకాళహస్తిలలితా సహస్రనామ స్తోత్రంచాట్‌జిపిటిఎఱ్రాప్రగడకేతిక శర్మఫరియా అబ్దుల్లాబోయింగ్ 747పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅండమాన్ నికోబార్ దీవులువర్షం (సినిమా)ఆయాసంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసమంతరఘుపతి రాఘవ రాజారామ్జాతిరత్నాలు (2021 సినిమా)పూరీ జగన్నాథ దేవాలయంతమిళనాడులో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురమ్య పసుపులేటితులసీదాసుకొండగట్టుసామెతలుబౌద్ధ మతంరాకేష్ మాస్టర్మియా ఖలీఫాఅనువాదండోడెకేన్దిల్ రాజునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంఆటలమ్మస్వామి వివేకానందషిర్డీ సాయిబాబానితిన్ద్రోణాచార్యుడుసచిన్ టెండుల్కర్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్గోవిందుడు అందరివాడేలేసమ్మక్క సారక్క జాతరగైనకాలజీతీహార్ జైలుగుంటకలగరసీ.ఎం.రమేష్వాసిరెడ్డి పద్మసరోజినీ నాయుడుఇండియన్ ప్రీమియర్ లీగ్టిల్లు స్క్వేర్కీర్తి సురేష్జగ్జీవన్ రాంఎయిడ్స్రోహిత్ శర్మశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)తామర పువ్వువిజయ్ (నటుడు)సోరియాసిస్భగవద్గీతతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంవిద్యా బాలన్అమ్మల గన్నయమ్మ (పద్యం)నరసింహావతారం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅనూరాధ నక్షత్రంఏప్రిల్చిరంజీవిభారతదేశ చరిత్రశ్రీశ్రీకామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)షర్మిలారెడ్డికృపాచార్యుడు🡆 More