అలసంద

అలసందను అలసందులు, బొబ్బర్లు అని కూడా అంటారు.

దీని వృక్ష శాస్త్రీయ నామం Vigna unguiculata. నవ ధాన్యాలలో ఒక రకం అలసంద. ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. ముఖ్యంగా అలసందలు రెండు రకాలుగా అనగా ఒకటి తీగ మాదిరిగా అల్లుకోగా, రెండవది చెట్టు వలె పెరుగుతుంది.

Cow pea
అలసంద
Black-eyed peas
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Vigna
Species:
V. unguiculata
Binomial name
Vigna unguiculata
(L.) Walp.
Synonyms

Vigna sinensis

అలసంద
అలసంద కాయలు

పంటగా

ఇది సుమారు మూడు నెలల పంట. అలసంద తీగను మిశ్రమ పంటగా, అలసంద చెట్టును ప్రత్యేక పంటగా పండిస్తారు. అలసందలు తీయగా, లేదా తక్కువ తీయదనాన్ని కలిగి ఉంటాయి. కాయలు పచ్చిగా ఉన్నప్పుడు విత్తనాలు మెత్తగాను, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. కాయలు గుత్తులు, గుత్తులుగా కాస్తాయి. కాయల నుంచి విత్తనాలు వేరు చేయడానికి కాయలను ఎండ బెట్టి కల్లంలో ట్రాక్టర్ చేత తొక్కించడం లేదా తుంట కర్రతో బాదడం చేస్తారు. బొబ్బర్లు ఒక రకము చిక్కుడు జాతి గింజలు . వీటిలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. చౌకగా లబించే ప్రోటీన్ ఉన్న శాకాహారము. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి - రుచిగా ఉంటాయి. శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఆహారము. మాంసకృత్తుల లోపము రాకుండా కాపాడుతుంది. చేపనునేలో ఉన్నా గుడ్ఫతి ఆసిడ్స్ దీనిలో ఉన్నాయి. గుండె జబ్బు, మధుమేహము ఉన్నవారికి మంచిది. ఇనుము, మెగ్నీషియం, కాల్సియం, ఫాస్ఫరస్, లాంటి ఖనిజ లవణాలు ఉన్నాయి. థయామిన్, రైబోఫ్లెవిన్, నియాసిన్, లాంటి విటమిన్లు ఉన్నయి .

అలసంద తీగ

అలసంద తీగ కాయలు ఎర్రగా, చెట్టు అలసంద కంటే కొంచెము చిన్నవిగా ఉంటాయి. ఇది నేల మీద పాకుతూ, లేదా ప్రక్కనున్న ఇతర మిశ్రమ పంటలకు అల్లుకుని పెరుగుతుంది. వీటి కాయలు సుమారు జాణ పొడవు ఉంటాయి. ఒక్కొక్క కాయలో 10 నుంచి 20 గింజలుంటాయి. అలసంద తీగ పూర్వం బాగా పండించేవారు, నేడు చెట్టు మాదిరిగా పెరిగే అలసందను పండిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అలసందలను బొబ్బర్లు అని కూడ అంటారు.

అలసంద 
అలసంద గింజలు

అలసంద చెట్టు

చెట్టు అలసందను హైబ్రిడ్ అలసంద అని అంటారు. ఇది మూడు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది. తీగ అలసంద కాయల కంటే వీటి కాయలు కొంచెం పెద్దవిగా, తెల్లగా, జాణ కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. ఒక్కొక్క కాయలో 10 నుంచి 20 గింజలుంటాయి.

నాట్లు, కోతలు

అలసంద విత్తనాలు గోరు ద్వారా విత్తనానికి, విత్తనానికి మధ్య సుమారు అడుగు దూరంలో పడేలా వేస్తారు. అలసంద మెట్ట పైరు, వర్షం ద్వారా పండే పంటలలో రెండు కోతలుగా, నీటి తడులు ఇచ్చే సౌకర్యం ఉన్న పొలల్లో నాలుగు కోతలుగా కాయలు కోస్తారు.

ఉపయోగాలు

  • గుగ్గుళ్ళ తయారీకి, వడల తయారీకి, రసం తయారీకి ఉపయోగిస్తారు.
  • పచ్చి రొట్ట ఎరువు కోసం పండించే పంటలలో అలసంద ఒకటి.
  • అలసంద మిశ్రమ పంటలలో భాగంగా పశుగ్రాసం కొరకు పండిస్తారు.
  • మలబధ్ధకం సమస్యతో ఇబ్బంది పదుతున్నవాళ్ళు రోజూ అలసంద గుగ్గిళ్ళు తింటే సుఖ మల విసర్జనం ఔతుంది (ఆయుర్వేదం).

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

అలసంద పంటగాఅలసంద ఉపయోగాలుఅలసంద ఇవి కూడా చూడండిఅలసంద మూలాలుఅలసంద బయటి లింకులుఅలసంద

🔥 Trending searches on Wiki తెలుగు:

చిరంజీవి నటించిన సినిమాల జాబితాఉండి శాసనసభ నియోజకవర్గంప్రబంధమువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)భారతీయ స్టేట్ బ్యాంకుఅంగారకుడు (జ్యోతిషం)విజయ్ (నటుడు)భారతదేశంలో కోడి పందాలుH (అక్షరం)గంగా నదికొమర్రాజు వెంకట లక్ష్మణరావుతాటి ముంజలుబలి చక్రవర్తివిశాఖ స్టీల్ ప్లాంట్కనకదుర్గ ఆలయంఅమ్మ (1991 సినిమా)పవన్ కళ్యాణ్అల్లసాని పెద్దనటిల్లు స్క్వేర్ఉలవలుఅమిత్ షాఘిల్లివిశ్వామిత్రుడుమాళవిక శర్మఓటుసిరికిం జెప్పడు (పద్యం)పటికజీమెయిల్మహేంద్రగిరిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డివ్యాసుడుఅమెజాన్ ప్రైమ్ వీడియోరేణూ దేశాయ్రాజనీతి శాస్త్రముసమ్మక్క సారక్క జాతరవిటమిన్ బీ12తొట్టెంపూడి గోపీచంద్ఆశ్లేష నక్షత్రముఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్2014 భారత సార్వత్రిక ఎన్నికలుచోళ సామ్రాజ్యంభలే మంచి రోజుపురుష లైంగికతభారతీయ జనతా పార్టీఆర్టికల్ 370పెమ్మసాని నాయకులుతెలుగు కవులు - బిరుదులుభారత జాతీయ కాంగ్రెస్తెలుగు భాష చరిత్రఆల్ఫోన్సో మామిడి2024 భారతదేశ ఎన్నికలునరసింహావతారంఒక చిన్న ఫ్యామిలీ స్టోరీఅనసూయ భరధ్వాజ్మాచెర్ల శాసనసభ నియోజకవర్గంభారతదేశంతెలుగు సినిమాకీర్తి సురేష్నీ మనసు నాకు తెలుసుతెలుగుదేశం పార్టీవిజయ్ దేవరకొండతెలంగాణ ప్రభుత్వ పథకాలుయేసుమిథునరాశిబౌద్ధ మతంజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్హైదరాబాదుచార్మినార్భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుసప్త చిరంజీవులుకర్కాటకరాశిధర్మంపల్లెల్లో కులవృత్తులుసంగీత వాద్యపరికరాల జాబితాబోనాలుఉత్పలమాలవంగవీటి రాధాకృష్ణ🡆 More