జైన సన్యాసి హేమచంద్ర

హేమచంద్ర ఒక బహుముఖ ప్రజ్ఞాశాలియైన జైన సన్యాసి, కవి.

ఆయన వ్యాకరణము, తత్వశాస్త్రం, ఛందస్సు, చరిత్ర మొదలైన అనేక అంశాల మీద రచనలు చేశాడు. ఆయన కాలంలో మేధావిగా పరిగణించబడ్డాడు. కలికాల సర్వజ్ఞ అనే బిరుదు పొందాడు.

జైన సన్యాసి హేమచంద్ర
విక్రమ్ సంవత్ 1294 తాటి ఆకు ఆధారంగా హేమచంద్ర డ్రాయింగ్

బాల్య జీవితం

హేమచంద్ర ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ధంధూక అనే ప్రాంతంలో కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడు. అతని పుట్టిన రోజు కచ్చితంగా తెలియదు కానీ 1088 వ సంవత్సరం అత్యధికులు ఆమోదించిన సంవత్సరం. అతని తండ్రి చచింగ, మోద్ బనియా కులానికి చెందిన వైష్ణవుడు. తల్లి పాహిని జైనమతానికి చెందినది. హేమచంద్ర జన్మనామం చంగదేవుడు. అతను పిల్లవాడిగా ఉన్నప్పుడు జైన సన్యాసియైన దేవచంద్రసూరి ఒకసారి ధంధూకను సందర్శించి బాలుడైన చంగదేవుని ప్రతిభను గమనించి ఆశ్చర్యపోయాడు. అతని తల్లి, మేనమామ చంగదేవుని దేవచంద్రసూరి శిష్యుడిగా పంపడానికి అంగీకరించారు కానీ తండ్రి ఒప్పుకోలేదు. కానీ దేవచంద్రసూరి, హేమచంద్ర ఖంబాత్ కు వెళ్ళి మాఘ శుద్ధ చవితి నాడు జైన మతంలోకి ప్రవేశించి, సోమచంద్ర అని పేరు మార్చుకున్నాడు. ఖంబాత్ గవర్నరైన ఉదయ మెహతా ఈ ఉత్సవంలో దేవచంద్ర సూరికి సహకరించాడు. అతనికి ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో, తత్వశాస్త్రంలో, తర్క శాస్త్రంలో, వ్యాకరణంలో, అనేక జైన, జైనేతర పురాణాలలో శిక్షణనిచ్చాడు. 21 సంవత్సరాల వయసులో రాజస్థాన్ లోని నాగౌర్ లోని శ్వేతాంబర జైనుల శిక్షణాలయంలో ఆచార్యుడిగా నియమింపబడ్డాడు. అప్పుడే అతని పేరు ఆచార్య హేమచంద్ర సూరిగా మారించి.

రచనలు

హేమచంద్ర సంస్కృతం, ప్రాకృత వ్యాకరణాలు, కవిత్వం, ఛందస్సు, నిఘంటువులు, విజ్ఞానశాస్త్రం, తర్కం, భారతీయ తత్వశాస్త్రం అనే అంశాలపై విస్తృతమైన గ్రంథాలు వ్రాశాడు.

సిద్ధ-హేమ-శబ్దానుశాసనంలో ఆరు భాషలు ఉన్నాయి: సంస్కృతం, ప్రామాణిక ప్రాకృతం, శౌరసేని, మాగాహి, పైశాచి. అతను అపభ్రంశం యొక్క వివరణాత్మక వ్యాకరణాన్ని అందించాడు, మంచి అవగాహన కోసం ఆ కాలపు జానపద సాహిత్యంతో దానిని వివరించాడు. ఇది మాత్రమే తెలిసిన అపభ్రంశ వ్యాకరణం. అతను ఒక సంవత్సరంలో 8 అధ్యాయాలు లతో కూడిన "తత్త్వప్రకాశిక ప్రకాష్ లేదా మహార్ణవ న్యాస్ అనే వ్యాకరణాన్ని వ్రాసాడు. వ్యాకరణాన్ని వివరించడానికి, అతను చౌళుక్య రాజవంశ చరిత్ర ఉద్దేశిస్తూ ద్వయాశ్రయ కావ్యము అనే కవితా రూపక కావ్యాన్ని రూపొందించాడు. ఇది ఆ కాలపు ప్రాంత చరిత్రకు వివరించటానికి ముఖ్యమైన మూలంగా మారింది.1125లో, అతను కుమారపాలకు సలహాదారు అయ్యాడు. అదే సమయంలో అర్హనీతి అనే గ్రంధాన్ని రచించాడు.

జైన చరిత్రలో త్రిషష్టిసలకపురుషచరిత్ర లేదా "అరవై మూడు గొప్ప పురుషుల జీవితాలు" అనేది ఇరవై నాలుగు తీర్థంకరుల, ఇతర ముఖ్యమైన వ్యక్తుల యొక్క చారిత్రిక గ్రంథము, ఇది ఇప్పటికీ జైనమతం యొక్క ప్రారంభ చరిత్రకు ప్రామాణిక సంశ్లేషణా గ్రంథముగా పిలువబడుచున్నది. ఈ రచనకు అనుబంధముగా హేమచంద్రుడు పరిశిష్టపర్వన్ లేదా స్థవిరావళిచరిత్ర అనే స్వంత వ్యాఖ్యానాన్ని రచించాడు. దీనినే ది లైవ్స్ ఆఫ్ ది జైన్ ఎల్డర్స్ గా ఆంగ్లంలోకి అనువదించబడింది. హేమచంద్రుడు ద్రౌపది యొక్క బహుభార్యాత్వాన్ని అంగీకరిస్తాడు. ద్రౌపది తన పూర్వ జన్మలలో ఒకదానిలో నాగస్త్రీ అని, ఒక జైన సన్యాసికి విషప్రయోగం చేసిందని సూచించాడు. అందువల్ల, ఆమె తరువాత జైన సన్యాసినిగా మారికమునుపు అనేక జీవితాల పాటు నరకం, జంతు అవతారాలలో బాధపడవలసి వచ్చింది. ఆమె మరణం తరువాత, ఆమె ద్రౌపదిగా పునర్జన్మ పొందింది, ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది. అతని కావ్యానుప్రకాశం మమ్మటుని కావ్య-ప్రకాశం యొక్క నమూనాను అనుసరిస్తుంది. అతను ఆనందవర్ధన, అభినవగుప్త వంటి ఇతర పండితులను తన రచనలలో ఉటంకించాడు.

హేమచంద్రుడు వ్రాసిన అభిధాన-చింతామణి ఇది ఒక పదకోశం. ఇందులో అనేక అర్థాలను కలిగి ఉండే పదాల నిఘంటువు. హేమచంద్రుడు ఛందోనుశాసన అనే ఛందస్సుపై వ్యాఖ్యానం చేశాడు. హేమచంద్ర దాదాపు యాభై సంవత్సరాల ముందు 1150లో ఫైబొనాక్సీ క్రమాన్ని (1250) వివరించాడు.

అతని ఇతర రచనలు అలంకార చూడామణి, అభిధాన-చింతామణి, ప్రమాణ-మీమాంస (తర్కం), వితరాగ-స్తోత్ర (ప్రార్థనలు) అనే ఇతర అలంకార శాస్త్ర గ్రంథాలు కూడా రచించాడు.

మూలాలు

Tags:

చరిత్రఛందస్సుజైన మతముతత్వశాస్త్రంవ్యాకరణము (వేదాంగము)

🔥 Trending searches on Wiki తెలుగు:

నికరాగ్వాభారతదేశంలో మహిళలుభారతదేశంకాళోజీ నారాయణరావుఉయ్యాలవాడ నరసింహారెడ్డికుక్కకెఫిన్ఉపనయనముక్రిక్‌బజ్పాములపర్తి వెంకట నరసింహారావుజ్యేష్ట నక్షత్రంచైనాఅన్నమయ్యఓం నమో వేంకటేశాయగోవిందుడు అందరివాడేలేతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్పౌరుష గ్రంథితిరుమలశుభాకాంక్షలు (సినిమా)జవాహర్ లాల్ నెహ్రూపాట్ కమ్మిన్స్దగ్గుబాటి పురంధేశ్వరిచర్మముమొదటి పేజీఅనిష్ప సంఖ్యగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంముఖేష్ అంబానీకుప్పం శాసనసభ నియోజకవర్గంఊరు పేరు భైరవకోనభారతీయ శిక్షాస్మృతిఅగ్నికులక్షత్రియులుఓం భీమ్ బుష్తెలుగు సినిమాల జాబితాచంద్రయాన్-3ముదిరాజ్ (కులం)పంచారామాలుభారతీయ స్టేట్ బ్యాంకురక్తపోటురామదాసుగన్నేరు చెట్టుసౌందర్యలహరినల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిరెండవ ప్రపంచ యుద్ధంసంభోగంభీమా (2024 సినిమా)మానుషి చిల్లర్సైంధవుడుతెలంగాణ శాసనసభ నియోజకవర్గాల జాబితాపొట్టి శ్రీరాములువంగా గీతభారత జాతీయ కాంగ్రెస్జ్యోతీరావ్ ఫులేతిలక్ వర్మపది ఆజ్ఞలుకల్వకుంట్ల తారక రామారావువై.యస్.భారతిసుమ కనకాలవై.యస్.రాజారెడ్డిసుందర కాండవనపర్తి సంస్థానంసౌందర్యరాహువు జ్యోతిషంచెక్ రిపబ్లిక్రేవతి నక్షత్రంకంగనా రనౌత్గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిఢిల్లీ మద్యం కుంభకోణంవినుకొండభారత స్వాతంత్ర్యోద్యమంకామినేని శ్రీనివాసరావుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంశ్రీశైలం (శ్రీశైలం మండలం)శ్రీదేవి (నటి)వర్షంకిరణజన్య సంయోగ క్రియఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాకొల్లేరు సరస్సు🡆 More