సర్వనామము

నామవాచకం (Noun) కు బదులుగా వాడబడేది సర్వనామము (Pronoun).

సర్వము అంటే అన్నీ, అంతా అని అర్ధము.

    ఉదాహరణలు
    అతడు - ఇతడు - అది - ఇది - ఆమె - ఈమె - అన్ని - ఇన్ని - ఎన్ని - కొన్ని - కొంత - ఆ - ఈ - ఏ - నీవు - నేను - మీరు - మేము - మనము - వారు - ఎవరు - ఏది - తమరు - తాము - తాను - వాడు - వీడు.you------

రకాలు

    1. సంబంధ సర్వనామము
    సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం "సంబంధ సర్వనామం".

ఉదాహరణ : ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి. ఇందులో ఎవడు-వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. కనుక ఇవి, ఇలాంటివి సంబంధ సర్వనామాలు.

    2. విశేషణ సర్వనామము
    సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు "విశేషణ సర్వనామాలు".

ఉదాహరణ : అందరు అందరు కారు. ఇందులో అందరు అనేది విశేషణ రూపంలో ఉన్న సర్వనామం.

    3. సంఖ్యావాచక సర్వనామము
    సంఖ్యలను తెలియజేసే సర్వనామాలు "సంఖ్యావాచక సర్వనామాలు".

ఉదాహరణ : ఒకరు - ఇద్దరు - ముగ్గురు - నలుగురు మొదలైనవి సంఖ్యావాచక సర్వనామాలు.

    4. సంఖ్యేయవాచక సర్వనామము
    ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి. కాని, నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు. కనుక "సంఖ్యేయవాచక సర్వనామం".

ఉదాహరణ : వారు ముగ్గురూ వీరే. ఇందులో ఆ ముగ్గురూ పురుషులా, స్త్రీలా అనేది చెప్పబడనందున ఇది సంఖ్యేయవాచక సర్వనామం.

    5. పురుషలకు సంబంధించిన సర్వనామం
    ప్రథమ, మధ్యమ, ఉత్తమ పురుషలు మూడు. వాటికి సంబంధించిన సర్వనామాలు కనుక ఇవి "పురుషలకు సంబంధించిన సర్వనామాలు".

ఉదాహరణ : ప్రథమ పురుష : వాడు - వారు; మధ్యమ పురుష : నీవు - మీరు; ఉత్తమ పురుష : నేను - మేము - మనము

    6. నిర్దేశాత్మక సర్వనామము
    నిర్దేశించటం అంటే ఇది అని నిర్దేశించి చెప్పటం - అలాంటి సర్వనామాలు "నిర్దేశాత్మక సర్వనామాలు".

ఉదాహరణ : ఇది - ఇవి - అది - అవి

    7. అనిర్ధిష్టార్థక సర్వనామాలు
    నిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పటం. అనిర్దిష్టం అంటే నిర్దేశించి చెప్పకపోవటం. ఇంత లేదా ఇన్ని లేదా ఇవి అని చెప్పకుండా ఎంతో కొంతను తెలియజేసే సర్వనామ పదాలు ఈ "నిర్ధిష్టార్థక సర్వనామాలు".

ఉదాహరణ : అన్ని - ఇన్ని - కొన్ని - ఎన్ని - కొంత - పలు - పెక్కు - బహు

    8. ప్రశ్నార్థక సర్వనామము
    ప్రశ్నించేటట్టుగా అడుగబడే సర్వనామాలు "ప్రశ్నార్థక సర్వనామాలు". ప్రశ్నించడం అంటే అడగడం అని అర్ధం.

ఉదాహరణ : ఎవరు? - ఎందుకు? - ఏమిటి? - ఎవతె? - ఎలా?

Tags:

నామవాచకం

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణకస్తూరి రంగ రంగా (పాట)యేసు శిష్యులుఒగ్గు కథశింగనమల శాసనసభ నియోజకవర్గంపేరువిరాట్ కోహ్లిశ్రీ కృష్ణుడుఅ ఆబి.ఆర్. అంబేద్కర్లోక్‌సభ నియోజకవర్గాల జాబితానన్నయ్యరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్శక్తిపీఠాలురిషబ్ పంత్శ్రీముఖిగౌడకంప్యూటరుఉమ్రాహ్తమన్నా భాటియాకోవూరు శాసనసభ నియోజకవర్గంపార్వతిఅలంకారంరక్త పింజరిడీజే టిల్లురామ్ చ​రణ్ తేజరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంరేవతి నక్షత్రంభారత జాతీయ చిహ్నంభాషా భాగాలుతామర పువ్వుదశరథుడురెండవ ప్రపంచ యుద్ధంక్రికెట్జూనియర్ ఎన్.టి.ఆర్ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాజీలకర్రసమాసంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థసింహరాశిఉత్తరాషాఢ నక్షత్రముఅన్నప్రాశనకమల్ హాసన్హస్త నక్షత్రమునితీశ్ కుమార్ రెడ్డిన్యుమోనియానవరసాలురాబర్ట్ ఓపెన్‌హైమర్వందేమాతరంటంగుటూరి సూర్యకుమారిలైంగిక విద్యఇన్‌స్టాగ్రామ్దక్షిణామూర్తి ఆలయంఅమెరికా రాజ్యాంగంగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువిశ్వామిత్రుడుఆశ్లేష నక్షత్రముమానవ శరీరముజనసేన పార్టీమా తెలుగు తల్లికి మల్లె పూదండవిద్యుత్తుమారేడుబలి చక్రవర్తిశివుడుపంచారామాలువేమనప్రకృతి - వికృతిమేరీ ఆంటోనిట్టేమెదక్ లోక్‌సభ నియోజకవర్గంయతిఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుసరోజినీ నాయుడుతెలుగు విద్యార్థిదివ్యభారతిసిద్ధు జొన్నలగడ్డగూగుల్🡆 More