బయటి లింకులు

వికీపీడియా వ్యాసాల్లో వికీపీడియా నుండి బయటి పేజీలకు తీసుకుపోయే లింకులు పెట్టవచ్చు.

సదరు పేజీలు వ్యాస విషయానికి సంబంధించినవి గాను, ఆ విషయంపై ఖచ్చితమైన సమాచారం అందించేవి గాను ఉండాలి; కాపీహక్కుల కారణంగా వ్యాసం పేజీలో పెట్టలేని విషయాన్ని కలిగి ఉండాలి (క్రీడా గణాంకాలు, ఆన్ లైను టెక్స్టు పుస్తకాలు మొదలైనవి); లేదా ఇతర అర్థవంతమైన, సంబంధిత విషయాన్ని కలిగి ఉండాలి.

బయటి లింకులు కొన్ని పెట్టడం మంచిదే. కానీ ప్రతీ విషయానికీ చెందిన బయటి లింకుల జాబితా ఒకదాన్ని పెద్దయెత్తున తయారుచేసి పెట్టాలన్నది వికీపీడియా ఉద్దేశ్యం కాదు. వికీపీడియా వ్యాసానికి సంబంధించని పేజీ దేనికీ లింకు ఇవ్వరాదు. వికీపీడియా అనుసరించవద్దు విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడి నుండి బయటి పేజీలకు ఇచ్చే లింకుల వలన ఆయా పేజీల సెర్చి ఇంజను ర్యాంకుల్లో మార్పులేమీ జరగవు.

మీరు లింకు ఇవ్వదలచిన పేజీ లోని సమాచారం ఇంకా మీ వ్యాసంలో చోటు చేసుకోకపోతే, ప్రస్తుతానికి ఆ లింకును మీ మూలం/వనరుగా ఉదహరించండి.

గుర్తుంచుకోదగ్గ ముఖ్యాంశాలు

  1. లింకులు వీలైనంత తక్కువ సంఖ్యలో ఉండాలి. బయటి లింకులు అసలు లేవనో, తక్కువగా ఉన్నాయనో భావించి, లింకులు చేర్చరాదు.
  2. ఒకే వెబ్ సైటులోని వివిధ పేజీలకు లింకులు ఇవ్వకండి. సరైన పేజీ ఏదో చూసి, దానికే లింకు ఇవ్వండి.

లింకులు ఇవ్వడంలో కట్టుబాట్లు

విధాన, సాంకేతిక కారణాల వలన కింది వాటికి లింకులు ఇవ్వడం నిరోధించబడింది.

  1. ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే సైట్లకు లింకులు ఇవ్వరాదు. కాపీహక్కులు కలిగిన కంటెంటును చూపించే వెబ్ సైట్లకు లింకు ఇవ్వడం తప్పేమీ కాదు, అయితే ఆ కంటెంటు పెట్టేందుకు వారికి లైసెన్సు ఉండాలి. కాపీహక్కులు ఉల్లంఘిస్తున్నారని తెలిసీ ఆ సైటుకు లింకు ఇవ్వడమంటే ఆ ఉల్లంఘనలో పాలు పంచుకున్నట్టే. అలాంటి వెబ్ సైట్లకు లింకు ఇవ్వకండి. ఇతరులు చేసిన పనిని చట్టవిరుద్ధంగా పంపిణీ చేసే సైట్లకు లింకులు ఇస్తే వికీపీడియాకు, వికీపీడియనులకు చెడుపేరు వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ లాంటి సైట్ల విషయంలో మరీను.
  2. బ్లాక్ లిస్టులో పెట్టిన సైట్లకు, అవి వైట్ లిస్టు లోకి రాకుండానే, లింకులు ఇవ్వరాదు. అలాంటి లింకులున్న పేజీలు భద్రం కావు.

దేనికి లింకు ఇవ్వవచ్చు

బయటి లింకు ఇచ్చేముందు, అనేక విషయాలను పరిగణించాలి.

  • అది పాఠకుడికి అందుబాటులో ఉందా?
  • అది వ్యాస విషయానికి సంబంధించిందేనా (ఉపయోగకరం, మంచి అభిరుచితో కూడుకున్నదా, సమాచారసహితం, నిజాలు చూపించేది, మొద..)?
  • ఆ లింకు పని చేస్తోందా? ఇక ముందు కూడా పని చేస్తుందా?

బయటి లింకును చేర్చే ముందు ఒక ప్రశ్న వేసుకోండి: దీన్ని వ్యాసానికి మూలం/వనరుగా ఎందుకు వాడలేదు? "ఆధారపడదగ్గ వనరుగా దీన్ని వాడలేము" అనేది మీ సమాధానమైతే, లింకు ఇవ్వకండి. "అది మంచి వనరు" అనేది మీ సమాధానమైతే, లింకు ఇవ్వండి. "ఆ లింకులోని కంటెంటు మరీ విస్తృతంగా ఉంది, దాని సారాంశాన్ని గ్రహించి రాయడం అంత తేలికైన పని కాదు. కానీ అది ఆధారపడదగ్గ వనరు" అనేది మీ సమాధానమైతే కూడా లింకు ఇవ్వవచ్చు. ఫలానా లింకు ఇవ్వవచ్చో లేదో చర్చాపేజీలో చర్చిస్తే మరీ మంచిది.

ఏ విషయాలకు లింకు ఇవ్వాలి

  1. ఏదైనా సంస్థ, వ్యక్తి, వెబ్ సైటు వంటి వ్యాసాల విషయంలో అధికారిక సైటుకు లింకు ఇవ్వాలి.
  2. పుస్తకం, సంగీతం, ఇతర మీడియా విషయంలో వాటి కాపీకి - "ఇవ్వకూడని లింకులు" జాబితాలో లేకుంటేనే.
  3. ఖచ్చితమైన, తటస్థమైన విషయం - కాపీ హక్కుల వలన గానీ, మరొకందుకు గానీ వికీపీడియాలో వాడుకోలేని విషయం - కలిగి ఉండే సైట్లకు లింకు ఇవ్వవచ్చు.
  4. అర్థవంతమైన ఉపయోగకరమైన విషయాన్ని కలిగి ఉండే ఇతరత్రా సైట్లు - సమీక్షలు, ఇంటర్వ్యూలు వగైరా.

ఇవ్వదగ్గ మరికొన్ని లింకులు

  1. సంగీత ఆల్బములు, సినిమాలు, పుస్తకాలు, ఇతర సృజనాత్మక పనులకు సంబంధిత సమీక్షలకు లింకు ఇవ్వవచ్చు.
  2. మరీ పెద్ద పేజీలకు లింకు ఇచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ స్పీడు కనెక్షను వాడేవారికి అలాంటి పేజీలు ఇబ్బంది కలిగిస్తాయి. అలాంటి పేజీలకు లింకు ఇచ్చేటపుడు ఆ విషయాన్ని రాయాలి.
  3. కొన్ని సైట్లు ఆధారపడదగ్గ వనరుల జాబితాలో లేకపోయినా, వ్యాస విషయానికి సంబంధించి వాటిలో మంచి సమాచారం దొరకవచ్చు. అలాంటి వాటికి లింకు ఇవ్వవచ్చు. ఉదాహరణకు, జీవిత కథ వ్యాసం రాసిన వ్యక్తి యొక్క స్వంత బ్లాగు.

ఇవ్వకూడని లింకులు

  1. ఏదైనా వెబ్ సైటు ప్రచారం కోసం ఇచ్చే లింకులు.
  2. అమ్మకాలు జరిపే వెబ్ సైటులు. ఉదాహరణకు పుస్తకాలు అమ్మే దుకాణానికి లింకు ఇచ్చే బదులు ఆ పుస్తకం ISBN కు లింకు ఇవ్వాలి.
  3. వ్యాపార ప్రకటనలు మరీ ఎక్కువగా ఉండే వెబ్ సైటులు.
  4. డబ్బు కట్టి నమోదు చేసుకోందే కంటెంటు చూసేందుకు వీలు లేని వెబ్ సైట్లు.
  5. ఎక్కువ మందికి అందుబాటులో లేని సైట్లు. ఉదాహరణకు, కేవలం ఒక బ్రౌజరుతో మాత్రమే పనిచేసే సైట్లు.
  6. కంటెంటును చూసేందుకు ప్రత్యేక అప్లికేషన్లు (Flash, Java ఇలాగ) అవసరమయ్యే పేజీలకు లింకులు ఇవ్వరాదు. అలా ఇవ్వవలసి వస్తే లింకు పక్కనే ఒక సూచన పెట్టండి.
  7. అన్వేషణ యంత్రాలకు, అన్వేషణ ఫలితాలకు లింకులు ఇవ్వరాదు.
  8. నెట్వర్కు సైట్లకు (usenet, myspace వంటివి) లింకులు ఇవ్వరాదు.
  9. బ్లాగులకు, వ్యక్తిగత వెబ్ పేజీలకు - ప్రముఖుల పేజీలకైతే తప్ప - లింకులు ఇవ్వరాదు.
  10. ఓ మాదిరి పెద్దవైతే తప్ప ఇతర వికీలకు లింకులు ఇవ్వరాదు
  11. వ్యాస విషయానికి సూటిగా సంబంధం లేని సైట్లకు లింకు ఇవ్వరాదు: వ్యాస విషయంతో పాటు అనేక ఇతర సాధారణ విషయాలతో కూడుకున్న సైటుకు లింకు ఇవ్వరాదు. అలా ఇవ్వవలసి వస్తే ఆ సైటులోని వ్యాస విషయపు పేజీకి నేరుగా లింకు ఇవ్వవచ్చు.

వ్యాపార ప్రకటనలు, దృక్పథాల ఘర్షణ

వికీపీడియాకి ఉన్న ఆదరణను గమనించి దాన్ని సొమ్ము చేసుకుందామనే ఆలోచనతో ఇక్కడ దొడ్డిదారిన వ్యాపార ప్రకటనలు పెట్టుకుందామనే ఆలోచనలు చేసే అవకాశం ఉంది. మీది, మీరు మెయింటైను చేసేది, మీరు ప్రాతినిధ్యం వహించేది అయిన సైటుకు మీరు లింకు ఇవ్వకండి. వికీపీడియా మార్గదర్శకాల ప్రకారం ఆ సైటుకు లింకు ఇవ్వాల్సినంత అవసరం ఉన్నా సరే! ఆ లింకు అంత అవసరమైనదైతే ఆ విషయాన్ని వ్యాసపు చర్చాపేజీలో పెట్టి, తటస్థ సభ్యులను దాని సంగతిని తేల్చనివ్వండి.

వికీపీడియా బయటి లింకులు ఇచ్చే సమీక్షణలో వ్యాపార దృష్టితో ప్రారంభమైన వెబ్‌సైట్లను, ఉద్దాత్త భావనతో లేదా ప్రజోపయోగ దృష్టితో ప్రారంభమైన వెబ్‌సైట్లను సమదృష్టితోనే చూస్తుంది మరియు ప్రమాణాలను ఒకేలా వర్తింపజేస్తుంది. వికీపీడియా నుండి లింకు ఇవ్వటం వలన ఆ బయటి సైటు ప్రకటనలు, అమ్మకాలు మరియు డొనేషన్ల (స్వచ్ఛంద సంస్థల విషయంలో) ద్వారా ఆర్ధికంగా లాభం పొందే అవకాశం ఉన్నా కూడా అలాంటి సైట్లకు లింకులు ఇవ్వటాన్ని నిరోధించదు. లింకు ఇచ్చిన వెబ్‌సైటు సంస్థ యొక్క టాక్సు స్టేటసు లేదా ఆ లింకు వళ్ల వెబ్‌సైటు యజమానికి లాభం చేకూరుతుందేమోనన్న భావనతో కాకుండా, లింకును నొక్కిన వికీపీడియా పాఠకునికి వెంటనే ఒనగూడే ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని బయటి లింకులను ఎంచుకోవాలి.

బాటు ద్వారా వ్యాసాల్లో బయటి లింకులను చొప్పించే స్పాము పద్ధతులు ఉన్నాయి. అలాంటి బాటు చర్యలను మీరు గమనిస్తే, ఇతర వికీల్లో కూడా అది జరుగుతుందేమో గమనించండి. అలా అయితే మెటా-వికీ లోని నిర్వాహకుణ్ణి సంప్రదించండి; వాళ్ళు వికీ వ్యాప్త హెచ్చరికలను విడుదల చేస్తారు. నిర్వాహకులు అలాంటి బాట్లను నిషేధిస్తారు.

రిజిస్ట్రేషను అవసరమైన సైట్లు

రిజిస్ట్రేషను అవసరమైన సైట్లు, డబ్బు కట్టి మాత్రమే ఉపయోగించుకోగలిగే సైట్లు ఎక్కువ మంది పాఠకులకు ఉపయోగపడవు. అలాంటి వాటికి లింకులు ఇవ్వకండి. వ్యాసం సదరు వెబ్ సైటు గురించే అయితే తప్ప రిజిస్ట్రేషను లేదా చందా అవసరమయ్యే సైటుకు లింకు ఇవ్వకండి.

ఇతర భాషా లింకులు

తెలుగు భాషా సైట్లకు లింకు ఇవ్వడం అభిలషణీయం. అయితే తెలుగులో తగినంత సమాచారం లభ్యం కానందు వలన ఇతర భాషా సైట్లకు లింకులు ఇవ్వక తప్పదు. అయితే ఆ లింకులు ఇంగ్లీషు భాషకు మాత్రమే పరిమితం చెయ్యాలి. తప్పనిసరి అయితే - అధికారిక సైటు ఇంగ్లీషులో లేకపోతేనో, మ్యాపులు, బొమ్మలు, పట్టికలు మొదలైనవి ఉంటేనో - తప్ప ఇతర భాషా సైట్లకు లింకులు ఇవ్వకూడదు.

సదరు లింకు పక్కనే ఆ భాషకు చెందిన రెండక్షరాల భాషా కోడును గానీ, లేదా ఆ భాష పేరును గానీ రాయండి.

దారిమార్పు సైట్లు

దారిమార్పు URLలు కలిగి ఉండే సైట్లను వాడరాదు. ఉదాహరణలు: tinyurl.com, makeashorterlink.com. ఇలాంటి సైట్లు m:Spam blacklist జాబితాలో చేరి ఉన్నాయి.

purl.org లాంటి శాశ్వత URL సైట్లు మాత్రం దీనికి మినహాయింపు. ఒక్కోసారి సూటి url కంటే ఇలాంటి PURL url నే అధికారికంగా సైటు స్వంతదారు కూడా భావించవచ్చు. అలాంటపుడు లింకు purl కే ఇవ్వాలి.

లింకును నేరుగా లక్ష్యం పేజీకే ఇవ్వాలి. ఉదాహరణకు example.com అనే లింకు tripod.com/example కు దారిమార్పు చెందుతుంటే, మొదటిదే అధికారికమైనప్పటికీ లింకు రెండోదానికే ఇవ్వాలి.

మీడియా

మీరు లింకిచ్చే పేజీలో కేవలం మామూలు HTML లేదా కేవలం టెక్స్టు ఉండేలా చూడండి. లింకు ఇస్తున్న పేజీ కంటెంటు టైపు "text/html" గానీ, "text/plain" గానీ, లేదా "application/xhtml+xml" గానీ ఉండాలి. పేజీలోని కంటెంటును చూడాలంటే ప్రత్యేక సాఫ్టువేరు లేదా బ్రౌజరు అదనాలు అవసరమయ్యే పేజీలకు నేరుగా లింకు ఇవ్వవద్దు.

అలాంటి మీడియా ఉన్న పేజీలకు లింకులు ఇవ్వక తప్పనపుడు ఆ విషయాన్ని లింకు పక్కనే రాస్తూ ఆ మీడియా ఫైళ్ళను పని చేయించాలంటే ఏయే సాఫ్టువేర్లు కావాలో కూడా రాయాలి.

YouTube, Google Video వంటి సైట్లకు లింకు ఇవ్వడం

ఈ సైట్లకు లింకు ఇవ్వడంపై నిషేధమేమీ లేదు. సదరు లింకులు ఈ పేజీలో సూచించిన మార్గదర్శకాలకు లోబడి ఉంటే చాలు.

ఏదైనా ఒక దృక్కోణానికి అవసరమైన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వకండి

వివిధ దృక్కోణాలు కలిగి ఉన్న వ్యాసపు బయటి లింకుల్లో కూడా అన్ని దృక్కోణాలను ప్రతిబింబించే విధంగా లింకులను ఇవ్వండి. ఒక దృక్కోణానికి చెందిన లింకులు మిగతా వాటికంటే బాగా ఎక్కువగా ఉండరాదు. అల్పదృక్కోణాలకు అనవసరమైన ప్రాముఖ్యత ఇవ్వకండి. ఈ లింకుల పక్కనే అవి ఏ దృక్కోణాన్ని ప్రతిబింబిస్తాయో రాయండి.

లింకుల జీవితకాలం

మీరిచ్చే లింకు భవిష్యత్తులో ఎన్నాళ్ళు చురుగ్గా ఉంటుందో, ఎన్నాళ్ళు వ్యాస విషయానికి దగ్గరగా ఉంటుందో కూడా చూడాలి. ఉదాహరణకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఏదైనా వార్తాపత్రికకు లింకు ఇచ్చారనుకోండి.. ఒక్కరోజులోనో, ఒక వారంలోనో ఆ లింకుకు కాలదోషం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మురిగిపోయిన బయటి లింకునేం చెయ్యాలి

చచ్చిపోయిన url లకిచ్చే లింకుల వలన వికీపీడియా వ్యాసాలకు ప్రయోజనమేం లేదు. అలాంటి మురిగిపోయిన లింకులను తీసెయ్యాలి, లేదా కొత్త url లకు మార్చాలి.

దుశ్చర్యల కారణంగా కూడా మురిగిపోయిన లింకులు ఏర్పడవచ్చు. తమకిష్టం లేని వెబ్ సైట్లకిచ్చే లింకులను దుష్టులు తప్పుగా రాసి, కావాలని తప్పు url కు దారిచూపెట్టొచ్చు. ఇదొక ప్రత్యేక రకం దుశ్చర్య.

హైజాక్ అయిన సైట్లు

అప్పుడప్పుడు కొన్ని సైట్లు హైజాక్ అవుతూ ఉంటాయి. అలాంటి సైట్లకు ఇచ్చిన లింకులు సంబంధం లేని వేరే సైటుకు వెళ్తాయి. దీనికి ఒక కారణం.. ఆ సైటు డొమెయిను పేరుకు కాలదోషం పట్టడంతో, ఆ డొమెయినుకు వెళ్ళే లింకులను వేరే సైటుకు, ముఖ్యంగా బూతు సైట్లకు, దారిమారుస్తారు. హైజాకు అయిన సైట్లకు ఇచ్చిన లింకులను మురిగిపోయిన లింకుల లాగానే చూడాలి.

లింకు ఇవ్వడం ఎలా

టెక్స్టేమీ లేకుండా లింకు (కోడు, నమూనా ఫలితం):

[http://example.com/]  [1] 

టెక్స్టుతో కూడిన లింకు:

[http://example.com/ ఉదాహరణ.కామ్ వెబ్సైటు]  ఉదాహరణ.కామ్ వెబ్సైటు 

ఖాళీ (స్పేసు) తరువాత వచ్చే టెక్స్టు నంతా లింకు టెక్స్టుగా చూపిస్తుంది. లింకు టెక్స్టులో వికీ లింకులను చేర్చరాదు. వాటిని ఆ టెక్స్టు బయట ఉంచాలి.

"[http://example.com/ ఉదాహరణ.కామ్] [[వెబ్సైటు]]".   "ఉదాహరణ.కామ్ వెబ్సైటు". 

బయటి లింకుల విభాగం

బయటి లింకుల కోసం రెండు పద్ధతులున్నాయి. మొదటిది బయటి లింకులన్నిటినీ వ్యాసం చివర ఒక జాబితాగా రాయడం. ఈ జాబితాను "బయటి లింకులు" అనే 2వ స్థాయి శీర్షికగా కింద (అంటే == శీర్షిక ==) పెట్టి బులెట్ల జాబితాగా ఏర్పాటు చెయ్యాలి. ఉన్న లింకు ఊకటే అయినా "బయటి లింకులు" అని బహువచనమే ఉండాలి.

వేరే వెబ్ సైటుకు లింకు ఇచ్చేటపుడు ఆ సైటుకు సంబంధించి చిన్న సారాంశాన్ని కూడా రాయండి. అది ఈ వ్యాసానికి ఏ విధంగా సంబంధిస్తుందో కూడా రాయండి. వేరే ఆన్లైను వ్యాసాన్ని ఉదహరిస్తుంటే దాని గురించి కూడా క్లుప్తంగా రాయండి.

== బయటి లింకులు == * [http://example.com/link_1 లింకు 1] * [http://example.com/link_2 లింకు 2] 

మూలాలు, వనరులు

వ్యాసాన్ని రాయడంలో ఉపయోగపడిన సైట్లను "మూలాలు" లేదా "వనరులు" అనే విభాగంలో చేర్చాలి. వాటిని బయటి లింకులు విభాగంలో చేర్చరాదు.

బయటి లింకుల కోసం వెతకడం

వికీపీడియా నుండి బయటికి వెళ్ళే లింకుల కోసం వెతికేందుకు Special:Linksearch ఒక పరికరం. ఉదాహరణకు, ఈ లింకు యాహూ.కామ్ కు వెళ్ళే అన్ని లింకులను చూపిస్తుంది.

ఇవి కూడా చూడండి

Tags:

బయటి లింకులు గుర్తుంచుకోదగ్గ ముఖ్యాంశాలుబయటి లింకులు లింకులు ఇవ్వడంలో కట్టుబాట్లుబయటి లింకులు దేనికి లింకు ఇవ్వవచ్చుబయటి లింకులు ఇవ్వకూడని లింకులుబయటి లింకులు ఏదైనా ఒక దృక్కోణానికి అవసరమైన దానికంటే ఎక్కువ విలువ ఇవ్వకండిబయటి లింకులు లింకుల జీవితకాలంబయటి లింకులు లింకు ఇవ్వడం ఎలాబయటి లింకులు బయటి లింకుల కోసం వెతకడంబయటి లింకులు ఇవి కూడా చూడండిబయటి లింకులు

🔥 Trending searches on Wiki తెలుగు:

అంగచూషణగోవిందుడు అందరివాడేలేసమంతతెలుగు నాటకరంగంషర్మిలారెడ్డిశోభితా ధూళిపాళ్లశుభాకాంక్షలు (సినిమా)లలితా సహస్ర నామములు- 1-100వికీపీడియాజాషువామర్రివై.యస్. రాజశేఖరరెడ్డిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థప్రకృతి - వికృతికృత్తిక నక్షత్రముఋతువులు (భారతీయ కాలం)సవర్ణదీర్ఘ సంధితెలంగాణ చరిత్రనీ మనసు నాకు తెలుసురాహువు జ్యోతిషంరేవతి నక్షత్రంవందే భారత్ ఎక్స్‌ప్రెస్జోల పాటలునువ్వులుహస్త నక్షత్రముఐడెన్ మార్క్‌రమ్రుక్మిణి (సినిమా)వర్షం (సినిమా)స్టాక్ మార్కెట్అక్కినేని నాగార్జునతిరుమలక్రిక్‌బజ్దాశరథి కృష్ణమాచార్యతిరుపతిఆరోగ్యంఅగ్నికులక్షత్రియులుకస్తూరి రంగ రంగా (పాట)విష్ణువు వేయి నామములు- 1-1000పచ్చకామెర్లుభగత్ సింగ్సంధినువ్వొస్తానంటే నేనొద్దంటానాపెద్దమనుషుల ఒప్పందంరాహుల్ గాంధీచే గువేరాపెమ్మసాని నాయకులుబాల కార్మికులునందిగం సురేష్ బాబుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్వడదెబ్బబద్దెనసమాచార హక్కుతాజ్ మహల్నాగార్జునసాగర్మహర్షి రాఘవభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుఆటవెలదిలగ్నంవిడదల రజినిబలి చక్రవర్తిమృణాల్ ఠాకూర్ప్రపంచ మలేరియా దినోత్సవంతమన్నా భాటియాతాన్యా రవిచంద్రన్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుతాటిజాతిరత్నాలు (2021 సినిమా)శివ కార్తీకేయన్భరణి నక్షత్రముభూమిరష్మి గౌతమ్తేటగీతిమంగళవారం (2023 సినిమా)2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువరల్డ్ ఫేమస్ లవర్చాట్‌జిపిటిఆవేశం (1994 సినిమా)టెట్రాడెకేన్🡆 More