శైలి వ్యాస పరిచయం భాష మార్గదర్శక, విధాన నిర్ణయాలు సినిమా వ్యాసం
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
వికీపీడియా శైలి సహాయం |
---|
దిద్దుబాటు మార్గదర్శకాలు |
వర్గీకరణ |
ఇతర మార్గదర్శకాలు |
పదకోశం |
రచనలను ఒక క్రమపద్ధతిలో, చదవడానికి వీలయ్యే విధంగా రాయడానికి అవసరమైన మార్గదర్శకాల సమాహారమే ఈ శైలి మాన్యువల్. కింది నియమాలు చివరి మాటేమీ కాదు. ఒక పద్ధతి ఇతర పద్ధతి లాగే బాగుండవచ్చు, కానీ అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తే, వికీపీడియా చదవడానికి సులభంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక వ్యాఖ్యను గమనిద్దాం:
ప్రధాన వ్యాసం: నామకరణ విధానం
వీలయినంత వరకు వ్యాసం పేరు ఆ వ్యాసం మొదటి వాక్యం లోనే వచ్చేలా ఉండాలి. పేరు మొదటిసారి వ్యాసంలో కనిపించేటపుడు, దానిని బొద్దుగా చెయ్యండి. ఉదాహరణ చూడండి: '''వ్యాసం పేరు'''
ఇది ఇలా కనిపిస్తుంది వ్యాసం పేరు. పేరులో లింకులు పెట్టరాదు.
పేరును ఇటాలిక్స్ లో పెట్టదలిస్తే, పేరు మొత్తాన్ని పెట్టాలా లేక కొంత భాగాన్ని మాత్రమే పెట్టాలా అనే విషయమై ఇటాలిక్స్ నియమాలను పాటించండి.
వికీపీడియా వ్యాసంలో ప్రవేశిక (పరిచయం లేదా ఉపోద్ఘాతం) విషయసూచికకు, పేజీ శీర్షికకు ముందు వస్తుంది. ఇది వ్యాసానికి పరిచయంగానూ, వ్యాసంలోని అత్యంత ముఖ్యమైన అంశాల సంగ్రహం/సారాంశం గానూ ఉపయోగపడుతుంది. ఇది వార్తా కథనాల శైలిలోని లీడ్ పేరాగ్రాఫ్ కాదు. ప్రవేశిక, వ్యాసంలో ఎక్కువశాతం పాఠకులు మొట్టమొదటగా చదివే విభాగం. పాఠకుల్లో చాలామంది ఈ పరిచయం మాత్రమే చదువుతారు. మంచి పరిచయం మిగతా వ్యాసాన్ని చదివేందుకు గాను వ్యాస పాఠకులకు ఆసక్తి రేకెత్తిస్తుంది. పరిచయం విభాగాన్ని స్పష్టంగా, సులభ గ్రాహ్యమైన శైలిలో తటస్థ దృక్కోణంతో రాయాలి.
మందార మకరంద మాధుర్యమును బోలు అన్న తెలుగు వాక్యాన్ని అనుసరించి, మీకు తెలిసినంతలో చక్కటి తెలుగు పదాలతో వ్యాసం రాయండి. మాట్లాడే శైలి కాకుండా రాసే శైలిని అవలంబించండి. తెలుగు వికీపీడియాలోని వ్యాసాలు తెలుగు భాషలోనే రాయాలి,కానీ ఆంగ్లంలో, లేదా ఏ ఇతర భాషలలో రాయటం సమంజసం కాదు. మా, మన అనే పదాలు లేదా అక్షరాలు ఉపయోగించరాదు.ఉదా:మా ఊరు, మా జిల్లా, మన ప్రాంతవాసులు మొదలగునవి.
వ్యక్తులు, సంస్థలు, ఊళ్ళు మొదలైన వాటి పేర్లు రాసేటపుడు కింది పద్ధతులను పాటించాలి.
గమనిక: ఏ పేరు వాడాలనే విషయంలో సందిగ్ధత ఉంటే ఒకపేరుతో పేజీ సృష్టించి, రెండో దానితో దారిమార్పు పేజీని సృష్టించండి.
వ్యక్తుల గురించి రాసేటపుడు, శ్రీ, గారు వంటి గౌరవ వాచకాలు ఉపయోగించవద్దు. వచ్చారు, అన్నారు, చెప్పారు వంటి పదాలను కాక వచ్చాడు, అన్నాడు, చెప్పాడు అని రాయాలి.
తేదీ ఆకృతి తెలుగు భాషకు సహజమైన yyyy month dd రూపంలో రాయాలి. ఉదాహరణకు, 1980 మే 12న అని రాయాలి. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.
సా.శ. (సామాన్య శకంకి పొడి అక్షరాల రూపం), సా.శ.పూ. (సామాన్య శక పూర్వంకి పొడి అక్షరాల రూపం) అన్నవి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వానికి బదులుగా వినియోగించడం అలవాటు చేసుకోవాలి. అయితే క్రీ.శ., క్రీ.పూ. అన్నది పూర్తిగా శైలి విరుద్ధం కాదు. క్రీ.శ., క్రీ.పూ. అన్న పద్ధతి నుంచి ఏదైనా వ్యాసంలో సా.శ., సా.శ.పూ. పద్ధతిలోకి మార్చదలుచుకుంటే వ్యాసం మొత్తంలో ఈ మార్పులు చేయండి. వ్యాసంలో కొంత ఒక పద్ధతిలో, కొంత మరో పద్ధతిలో ఉండడం ఆమోదయోగ్యం కాదు. ఆంగ్ల అక్షరాల్లో కానీ, తెలుగు లిపిలో కానీ బీసీ, ఏడీ, సీఈ, బీసీఈ వంటివి నేరుగా రాయడం శైలీ విరుద్ధం.
ఇంగ్లీషు నెలల పేర్లను తెలుగు సహజమైన అజంత రూపంలో రాయాలి. ఏప్రిల్ జూన్ నెలలు దీనికి మినహాయింపు. నెలల పేర్లు ఇలా ఉండాలి: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.
కిలోమీటర్లు వంటి కొలమానాల పొట్టి పదాలను కింది విధంగా రాయాలి కిలోమీటర్లు: కి.మీ. మీటర్లు: మీ. లీటర్లు: లీ. మిల్లీ లీటర్లు:మి.లీ. మిల్లీ మీటర్లు: మి.మీ.
గమనిక: పొట్టిపదాల్లో చుక్కలున్నాయి. చుక్క ముందు, తరవాతా కూడా స్పేసు ఇవ్వలేదు. ఈ విషయమై రచ్చబండలో జరిగిన చర్చను చూడండి.
వ్యాసాల్లో నిష్పాక్షికత కోసం ఏకవచనాన్ని వాడాలని నియమం ఉంది. చేశారు, వచ్చారు అన్న రూపాలు కాక చేశాడు, వచ్చాడు అన్న రూపాలు వాడాలి. వ్యక్తిని ఉద్దేశించే సర్వనామాల విషయంలో వికీ విధానం కింది విధంగా ఉండాలని సముదాయం చర్చించి నిర్ణయించింది.
ప్రధాన వ్యాసం: శైలి మాన్యువల్
విభాగాల శీర్షికల కొరకు ==
వాడండి, '''
(బొద్దు) వాడవద్దు. ఉదాహరణ:
==ఇది విభాగం శీర్షిక==
ఈ వాక్యం ఇలా కనపడుతుంది..
శీర్షికలను ఇలా పెడితే, విషయ సూచిక ఆటోమాటిక్‌గా వచ్చేస్తుంది. అభిరుచులలో నిశ్చయించుకోవడం ద్వారా విభాగాలకు సంఖ్యలు వచ్చే విధంగా చేసుకోవచ్చు. శీర్షికల వలన వ్యాసాన్ని చదవడం తేలికగా ఉంటుంది.
;
") ను వాడవద్దు.సాంకేతిక సమస్యలు తెలెత్తకుండా ఉండేందుకు ఈ సాంకేతిక పరిమితులు అవసరం. స్థానిక ఏకాభిప్రాయం ద్వారా వీటిని అతిక్రమించే వీలు లేదు.
ఒక ఏకరూప శైలి కోసం, విభాగాల శీర్షికలు ఇలా ఉండాలి:
శీర్షిక ఉన్న పంక్తి లోనే కనబడని వ్యాఖ్యను చేర్చాలంటే దాన్ని == ==
మార్కప్కు లోపలే చేర్చాలి: శీర్షిక ఉన్న పంక్తి లోనే ఉంటూ,
సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలను శీర్షికకు దిగువన పెడతారు.
విభాగ శీర్షికను మార్చేముందు, దానికి ఈసరికే ఉన్న లింకులను చెడగొడుతున్నారేమో పరిశీలించండి. పాత పేరుకు చాలా లింకులు ఉన్నట్లైతే, ఆ పేరుతో ఒక యాంకరును సృష్టించండి. తద్వారా, పేరు మార్చాక కూడా ఆ లింకులు పనిచేస్తాయి. అలాగే, ఏదైనా విభాగానికి లింకు ఇచ్చేటపుడు, లక్షిత విభాగపు శీర్షికలో, అక్కడికి లింకు ఇచ్చిన వ్యాసాలను పేర్కొంటూ, ఒక కనబడని వ్యాఖ్యను చేర్చండి. దానివలన, ఆ తరువాత శీర్షిక పేరును మార్చినా, ఆ లింకులను సరిచేయవచ్చు. ఈ రెంటినీ చూపించే ఉదాహరణ:
వ్యాసంలో ఇది, ఇలా భద్రపరచబడుతుంది:
ఇన్లైనులో మూలాలను ఉల్లేఖించేందుకు, గమనికలను చేర్చేందుకూ Ref ట్యాగులు (<ref>...ref>
) వాడతారు. ref ట్యాగులన్నీ పాఠ్యానికి వెనువెంటనే ఆనుకుని, స్పేసు లేకుండా ఉండాలి. పాఠ్యంలో మూలాన్ని చేర్చే దగ్గర విరామ చిహ్నమేమైనా ఉంటే Ref లను ఆ విరామ చిహ్నం తరువాత చేర్చాలి తప్ప, ముందు చేర్చకూడదు (కింద చూపిన కొన్ని మినహాయింపులున్నాయి). పక్కపక్కనే ఉన్న ref ట్యాగుల మధ్య స్పేసు ఉండరాదు. అలాగే ref ట్యాగుకు, ఏవైనా శుద్ధి మూసలకూ మధ్య కూడా స్పేసు ఉండకూడదు.
ref ట్యాగులను వాడినపుడు, తప్పనిసరిగా మూలాల జాబితా మూసను చేర్చాలి. సాధారణంగా దీన్ని, వ్యాసానికి దిగువన ఉండే మూలాలు విభాగంలో చేర్చుతారు.
మినహాయింపులు: Ref ట్యాగులను డ్యాష్ల తరువాత పెట్టాలి, ముందు కాదు. మూలం బ్రాకెట్లలోని సమాచారానికి సంబంధించినదైతే, ref ట్యాగును మూసే బ్రాకెట్టు కంటే ముందు పెట్టాలి.
ఈ విధంగా రాయాలి: ''
. ఉదాహరణ:
''ఇది ఇటాలిక్.''
ఇది ఇలా కనిపిస్తుంది
కొన్ని పదాలను నొక్కి చెప్పేందుకు ఇటాలిక్స్ ను వాడతాము. ఈ కింది సందర్భాలలో కూడా వీటిని వాడవచ్చు.
కింది వాటి పేర్లకు ఇటాలిక్స్ ను వాడాలి:
సాధారణంగా పెద్ద వాటికి ఇటాలిక్స్ ను వాడతారు. చిన్న వాటికి డబల్ కొటేషను గుర్తులు వాడాలి. ఉదాహరణకు:
కొన్ని సందర్భాలలో పేర్లు ఇటాలిక్స్ లో గాని, డబల్ కొటేషను గుర్తుల్లో గాని ఉండకూడదు. అవి:
పదాల గురించి పదాల లాగా, అక్షరాల గురించి అక్షరాల లాగా రాస్తున్నపుడు ఇటాలిక్స్ వాడండి. ఉదాహరణకు:
ఇతర భాషల నుండి తెలుగులోకి తెచ్చిన పదాలను ఇటాలిక్స్ లో రాయాలి. అయితే తెలుగులో ఒదిగిపోయిన రైలు వంటి పదాలకు ఇటాలిక్స్ వాడరాదు. ఇటాలిక్స్ అనే పదాన్ని గమనించండి, ఇది ప్రతిచోటా ఇటాలిక్స్ లోనే ఉంది. ఆది అరువు పదం కనుక అలా ఉంది. గొప్ప వ్యాసం రాయడం ఎలా ప్రకారం, ఇతర భాషా పదాలు అరుదుగా, వేరే పదం లేనప్పుడు మాత్రమే వాడాలి.
వ్యాఖ్యలను ఉదహరించేటపుడు ఇటాలిక్స్ వాడవలసిన పని లేదు, ఆ వాక్యాలకు ప్రత్యేకంగా అవసరమైతే తప్ప.
మామూలుగా వ్యాకరణ చిహ్నాలను ఎలా వాడుతామో అలాగే వాడండి.
సాధారణంగా డబల్ కొటేషను గుర్తులను వాడండి—చదివేటపుడు సులభంగా ఉంటుంది. — కొటేషన్ల లోపల కొటేషన్లు అవసరమైనపుడు సింగిలు కొటేషను గుర్తులను వాడండి.
గమనిక: ఏదైనా పదం 'ఇలా' సింగిలు కొటేషను గుర్తుల్లో ఉంటే, అన్వేషణ జరిపేటపుడు సింగిలు కొటేషను గుర్తులను కూడా ఆ పదంలో భాగంగానే గుర్తిస్తుంది. అన్వేషణలో పదంతో పాటు కొటేషన్లను కూడా ఇస్తేనే, ఆ పదాన్ని పట్టుకుంటుంది. డబల్ కోట్లను వాడటానికి ఇది మరో కారణం, ఎందుకంటే, దాని విషయంలో ఈ ఇబ్బంది రాదు.
ఈ పేజీలో శైలికి సంబంధించి మీకు అవసరమైన సమాచారం దొరక్కపోతే, మీకు నచ్చిన వ్యాసం ఒకదానికి వెళ్ళి, దాని మార్చు పేజీకి వెళ్ళండి. అక్కడ రచయితల శైలి ఎలా ఉందో చూడండి. తరువాత పేజీని భద్రపరచకుండా వదిలేయండి. దాదాపు ప్రతీ వ్యాసాన్ని కూడా మెరుగుపరచవచ్చు.
మీ వ్యాసంలో మరీ ఎక్కువ మార్కప్ లను వాడకుండా ఉంటే మీకు, వ్యాసం చదివేవారికి కూడా సులభంగా ఉంటుంది. మీరు వ్యాసంలో పెట్టిన మార్కప్ అంతా వ్యాసంలో కనపడుతుందని అనుకోకండి. మార్కప్ లను అవసరమైన మేరకే - వ్యాసాన్ని సులభంగా చదవటానికి అవసరమైనంత వరకే - వాడండి. అతిగా వాడి, క్లిష్టతరం చెయ్యవద్దు. HTML, CSS మార్కప్ లను తక్కువగా వాడండి. విజ్ఞాన సర్వస్వం ఉపయోగకరంగా ఉండాలనేది మొదటి లక్ష్యమైతే, దానిలో దిద్దుబాట్లు చెయ్యడం సులభంగా ఉండటమనేది మరో ముఖ్య లక్ష్యం.
మరీ నిర్దుష్టంగా, float
లేదా line-height
లను వాడితే కొన్ని బ్రౌజర్లు సరిగా చూపించవు.
వ్యాసం అసంపూర్తిగా ఉందనీ, మరింత పని జరగాల్సి ఉందనీ ఎత్తి చూపకండి. అసలు విషయం లేకుండా, ఉత్త శీర్షికలతో పాఠకుడికి ఉపయోగమేమీ ఉండదు.
మామూలు పాఠకుడికి కాకుండా, దిద్దుబాట్లు చేసే సభ్యులకు ఏమైనా సందేశం ఇవ్వదలిస్తే, ఆ సందేశాన్ని కింది గుర్తుల మధ్య పెడితే సరిపోతుంది. .
ఉదాహరణకు:
హలో లోకం
ఇలా కనిపిస్తుంది:
వ్యాఖ్య, దిద్దుబాటు చేసే వారికి మాత్రమే కనిపిస్తుంది.
విజ్ఞాన సర్వస్వంలోని వ్యాసాల్లో మిమ్మల్ని గాని, పాఠకుడిని గాని మీరు సంబోధించరాదు. అంటే - నేను, మేము, మీరు, మనం వంటి పదాలు రాకూడదు. ఉదాహరణకు నేను అనుకునేదాని ప్రకారం.., దాన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు.. వంటి వాక్యాలు రాయకూడదు.
This article uses material from the Wikipedia తెలుగు article వికీపీడియా:శైలి, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.