మహాదేవి వర్మ: రచయిత మరియు కవి

మహాదేవి వర్మ (ఏప్రిల్ 27, 1907 - సెప్టెంబర్ 11, 1987) ఆధునిక హిందీ కవయిత్రులలో ఒకరు.

హిందీ సాహిత్యంలో ఛాయవాద యుగానికి మూల స్తంభాలుగా భావించబడే నలుగురు సాహిత్యకారులలో ఆమె ఒకరు. ఆధునిక హిందీ కవిత్వంలో ఆమె సేవలకు గాను ఆమెను ఆధునిక మీరా అని కూడా అంటారు. కవి సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా ఈమెను విశాల హిందీ మందిరపు సరస్వతి గా అభివర్ణించాడు.

మహాదేవి వర్మ
మహాదేవి వర్మ: రచయిత మరియు కవి
రచయిత మాతృభాషలో అతని పేరుमहादेवी वर्मा
పుట్టిన తేదీ, స్థలం(1907-03-26)1907 మార్చి 26
ఫారుఖ్రాబాద్ , బ్రిటిష్ ఇండియా
మరణం1987 సెప్టెంబరు 11(1987-09-11) (వయసు 80)
అలహాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
వృత్తినవల రచయిత , కవయిత్రి
భాషHindi
జాతీయతభారతీయురాలు
విద్యఎం ఏ సంస్కృతం , అలాహాబాద్ యూనివర్సిటీ
సాహిత్య ఉద్యమంచయవాడ్
గుర్తింపునిచ్చిన రచనలుయమ
మేరా పరివార్
పాత్ కె సాథీ
పురస్కారాలు
జీవిత భాగస్వామిడా. స్వరూప్ నారాయణ్ వర్మ

స్వాతంత్ర్యానికి పూర్వపు భారతదేశంలోనూ, స్వతంత్ర భారతదేశంలోనూ నివసించిన ఈమె బహుళ సమాజంలో పనిచేస్తూనే భారతదేశంలో అంతర్లీనంగా ఉన్న ఉద్వేగాలను, ఆక్రోదనలను చూసి, పరిశీలించి, అంధకారాన్ని పోగొట్టే దృష్టిని ఇవ్వటానికి ప్రయత్నించిన కవుల్లో ఒకర్తె. ఈమె కవితలే కాకుండా ఈమె చేపట్టిన సమాజోద్ధరణా పనులు, మహిళాచైతన్యం కోసం చేసిన కృషి ఈ దృష్టితోనే ప్రభావితమైనవి. ఈమె మానసిక క్షోభను ఎంత హృద్యంగా వర్ణించిందంటే దీపశిఖలో అది ప్రతి మనిషి యొక్క వేదనగా అందరి హృదయాలను హత్తుకుంది. అది పాఠకులనే కాకుండా సమీక్షకులను కూడా లోతుగా ప్రభావితం చేసింది.

ఈమె ఖరీబోలీ హిందీ మాండలికంలో వ్రాసిన కవితల్లో అప్పటివరకు కేవలం భృజ్‌ భాషలోనే సంభవమని అనుకొన్నంత మృదువైన శబ్దాలను పలికించింది. దీని కోసం ఆమె తన సమయంలో వాడకంలో ఉన్న సంస్కృత, బెంగాలీ భాషలలోని మృదువైన పదాలను ఎన్నుకొని వాటికి హిందీ తొడుగులు తొడిగింది. సంగీతంతో పరిచయముండటం వల్ల ఈమె పాటల నాథ సౌందర్యం, లయబద్ధమైన వ్యంజనాల శైలి అనితరసాధ్యమైనది. అధ్యాపకురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి పదవీ విరమణ చేసే కాలానికి ప్రయాగ మహిళా విద్యాపీఠం యొక్క ప్రధానాచార్యులైంది. ఈమెకు బాల్యవివాహమైనా జీవితం మొత్తం అవివాహిత మాదిరిగానే గడిపింది. ప్రతిభావంతమైన కవయిత్రి, గద్య రచయితైన మహాదేవి వర్మ సాహిత్య, సంగీతాల్లో నైపుణ్యంతో పాటు చక్కటి చిత్రకారిణి, సృజానాత్మక అనువాదకురాలు కూడా. ఈమెకు హిందీ సాహిత్యంలోని అన్ని ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలను అందుకొన్న గౌరవము దక్కింది. భారత సాహిత్యాకాశంలో మహాదేవివర్మ ధ్రువతారగా వెలుగుతున్నది. గత శతాబ్దంలో అత్యంత లోకప్రియమైన మహిళా సాహిత్యకారిణిగా మహాదేవివర్మ వెలుగొందింది. 2007లో ఈమె జన్మ శతాబ్ది ఉత్సవాలు జరుపబడినవి.

పోస్టల్ స్టాంప్

మహాదేవి వర్మ: రచయిత మరియు కవి 
1991లో మహాదేవి వర్మ, జైశంకర్ ప్రసాద్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్ విడుదల చేయబడింది

1991, సెప్టెంబరు 16న ఆమె పేరుమీద భారత ప్రభుత్వం రూ. 2 విలువగల పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.

మూలాలు


Tags:

19071987మార్చి 26సరస్వతిసెప్టెంబర్ 11హిందీహిందీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంసత్యనారాయణ వ్రతంపెళ్ళి (సినిమా)సీ.ఎం.రమేష్యోనితెలుగు సినిమాలు 2022గరుత్మంతుడువెంట్రుకగౌడయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్అమెరికా రాజ్యాంగంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంభారతీయ స్టేట్ బ్యాంకునరసింహావతారంవై.యస్.రాజారెడ్డిసెక్యులరిజంతులారాశితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్హార్దిక్ పాండ్యావాస్తు శాస్త్రంజిల్లేడురామాయణంతెలుగు పదాలునువ్వులుమహేశ్వరి (నటి)నందమూరి తారక రామారావుసంధితెలుగు వ్యాకరణంవై.యస్.భారతిభారత పార్లమెంట్సూర్య (నటుడు)శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభారతీయ సంస్కృతికోవూరు శాసనసభ నియోజకవర్గంఆవేశం (1994 సినిమా)శాతవాహనులురామ్ చ​రణ్ తేజవృశ్చిక రాశినువ్వు నాకు నచ్చావ్తెలుగు విద్యార్థికడప లోక్‌సభ నియోజకవర్గంఏప్రిల్ఎస్. జానకిబాలకాండయతిఉదగమండలంతెలుగు సినిమాల జాబితాఅల్లసాని పెద్దనఓటుఉత్తరాభాద్ర నక్షత్రముశ్రీలలిత (గాయని)అగ్నికులక్షత్రియులునోటాటంగుటూరి ప్రకాశంనువ్వు వస్తావనిసమ్మక్క సారక్క జాతరరామావతారంనువ్వు నేనువిశాఖపట్నంభగత్ సింగ్ఐడెన్ మార్క్‌రమ్నారా బ్రహ్మణిప్రేమలునవగ్రహాలుఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఅంగారకుడు (జ్యోతిషం)చిరుధాన్యంనవధాన్యాలువందే భారత్ ఎక్స్‌ప్రెస్షణ్ముఖుడుదశదిశలుమెరుపునామనక్షత్రముఆహారంభారతీయ తపాలా వ్యవస్థఅనిఖా సురేంద్రన్భూమన కరుణాకర్ రెడ్డి🡆 More