ప్రమాణం

ఒక భౌతిక రాశిని దేనితో నయినా సరి పోల్చేందుకు వాడే, అదే భౌతిక రాశియొక్క ప్రామాణిక నిర్దేశాన్ని ఆ భౌతికరాశిని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం (Unit) అంటారు.

పొడవును కొలవడానికి వినియోగించే ప్రమాణం పేరు మీటర్. కాలాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం పేరు సెకండ్.

ప్రమాణం
లండన్ లో సెవెన్ సిస్టర్స్ ప్రాంతంలోని తూనికలు, కొలతల కార్యాలయం

ప్రాథమిక, ఉత్పన్న ప్రమాణాలు

భౌతిక రాశులు రెండు విధాలు.

  • ప్రాథమిక భౌతిక రాశులు (Fundamental physical quantities) - ఇతర భౌతిక రాశులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా మనగలిగేవి. వీటిని ఆధార రాశులు అని కూడా అంటారు. ఉదాహరణకు పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత, కాలం వంటివి. ఒకదానినుండి మరొకటి ఉత్పాదించడానికి వీలు లేకుండా వాటిని వేరు వేరు ప్రమాణాలుగా విడగొట్టడానికి వీలు లేని ప్రమాణాలు ప్రాథమిక ప్రమాణాలు
  • ఉత్పన్న భౌతిక రాశులు (derived physical quantities) - ప్రాథమిక భౌతిక రాశూలనుండి ఉత్పాదించగలిగేవి. ఉదాహరణకు వైశాల్యం (పొడవు నుండి ఉత్పన్నం), వడి (పొడవు, కాలం నుండి ఉత్పన్నం). బలం, సాంద్రత వంటివి కూడా ఉత్పన్న భౌతిక రాశులే. ఉత్పన్న భౌతిక రాశుల ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలు అంటారు.

ప్రమాణాల వ్యవస్థలు

ప్రాథమిక రాశులు అయిన పొడవు, ద్రవ్యరాశి, కాలం కొలిచేందుకు మూడు ప్రమాణ వ్యవస్థలున్నాయి. అవి "F.P.S. వ్యవస్థ" (బ్రిటిష్ పద్ధతి), "C.G.S. వ్యవస్థ" (మెట్రిక్ పద్ధతి), "M.K.S. వ్యవస్థ". ఈ వ్యవస్థలలో ప్రాథమిక ప్రమాణాలు క్రింది పట్టికలో చూపబడినాయి.

వ్యవస్థ పొడవు ప్రమాణం ద్రవ్యరాశి ప్రమాణం కాలం ప్రమాణం
F.P.S. అడుగు పౌండ్ సెకన్
C.G.S. సెంటీమీటర్ గ్రాము సెకన్
M.K.S. మీటర్ కిలోగ్రాము సెకన్

వినియోగంలోని సౌకర్యం కోసం, సమాచార సౌలభ్యం కోసం, అయోమయానికి తావులేకుండా ఉండడానికి అంతర్జాతీయంగా ప్రమాణాలను నిర్దేశించడానికి Gerneral COnference on Weights and Measures (GCGPM) అనే సంస్థకు అధికారం ఇచ్చారు. ఈ సంస్థ 1971లో ఒక "ప్రామాణిక వ్యవస్థ"ను రూపొందించింది. దీనినే అంతర్జాతీయ ప్రామాణిక వ్యవస్థ అంటారు. ఫ్రెంచి భాషలో ఈ వ్యవస్థ పేరు Le Systeme International d' units. దానిని క్లుప్తంగా SI వ్యవస్థ అంటారు.

ప్రాథమిక ప్రమాణాలు

SI వ్యవస్థలో మొత్తం ఏడు ప్రాథమిక భౌతిక రాశులను ప్రాథమిక (ఆధార) రాశులుగా తీసుకొన్నారు. అవి పొడవు, ద్రవ్యరాశి, కాలం, విద్యుత్ ప్రవాహం, ఉష్ణగతిక ఉష్ణోగ్రత, కాంతి తీవ్రత, పదార్ధరాశి. ఇవి కాకుండా మరో రెండు రాశులను "సంపూరక ప్రాథమిక రాశులు"గా తీసుకొన్నారు. అవి సమతల కోణం, ఘనకోణం.

ప్రాథమిక భౌతిక రాశి ప్రమాణం ప్రమాణ సంకేతం
పొడవు మీటరు m
ద్రవ్యరాశి కిలోగ్రాము kg
కాలం సెకను s
విద్యుత్ ప్రవాహం ఆంపియర్ A
ఉష్ణగతిక ఉష్ణోగ్రత కెల్విన్ K
కాంతి తీవ్రత కేండిలా cd
పదార్ధరాశి మోల్ mol
సంపూరక ప్రాథమిక భౌతిక రాశి ప్రమాణం ప్రమాణ సంకేతం
సమతల కోణం రేడియన్ rad
ఘనకోణం స్టెరేడియన్ sr

మరి కొన్ని విశేషాలు

ప్రపంచ ప్రమాణాల దినోత్సవం: ప్రతి సంవత్సరం అక్టోబరు 14న నిర్వహించబడుతుంది.

మూలాలు

వనరులు

బయటి లింకులు

Tags:

ప్రమాణం ప్రాథమిక, ఉత్పన్న ప్రమాణాలుప్రమాణం ప్రమాణాల వ్యవస్థలుప్రమాణం ప్రాథమిక ప్రమాణాలుప్రమాణం మరి కొన్ని విశేషాలుప్రమాణం మూలాలుప్రమాణం వనరులుప్రమాణం బయటి లింకులుప్రమాణంకాలంపొడవుమీటర్సెకండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుకూచిపూడి నృత్యంసమంతమహాత్మా గాంధీరత్నం (2024 సినిమా)న్యుమోనియామహాభాగవతంకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుబైబిల్శ్రీరామనవమివినాయకుడుయువరాజ్ సింగ్వర్షంఆప్రికాట్వై.యస్. రాజశేఖరరెడ్డిరజాకార్సామెతలుఅమిత్ షాఋతువులు (భారతీయ కాలం)కుంభరాశిభారత రాష్ట్రపతిసంక్రాంతిహనుమాన్ చాలీసాపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాఅన్నమయ్య జిల్లానారా చంద్రబాబునాయుడు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపటికరాజనీతి శాస్త్రముఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీచిత్త నక్షత్రముకాజల్ అగర్వాల్మమితా బైజుహనుమంతుడుఇంగువఅరుణాచలంసిరికిం జెప్పడు (పద్యం)ఆరోగ్యంగుంటూరుసీతాదేవిపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరాజమండ్రిLజాతీయ ప్రజాస్వామ్య కూటమిఅడాల్ఫ్ హిట్లర్ఏప్రిల్డి. కె. అరుణబీమావై.యస్.అవినాష్‌రెడ్డిచిరంజీవిడిస్నీ+ హాట్‌స్టార్నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితిరువణ్ణామలైవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిలక్ష్మినవగ్రహాలుతెలంగాణ ఉద్యమంతెలుగు సినిమాలు డ, ఢవేయి స్తంభాల గుడిశ్రీలీల (నటి)రాకేష్ మాస్టర్నందిగం సురేష్ బాబుతెలంగాణముదిరాజ్ (కులం)నువ్వులుభగవద్గీతభారత జాతీయ మానవ హక్కుల కమిషన్భారతీయ స్టేట్ బ్యాంకుపిఠాపురంతులారాశిఎస్. జానకిజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థపన్ను (ఆర్థిక వ్యవస్థ)భారతదేశ జిల్లాల జాబితాసుభాష్ చంద్రబోస్గ్రామ పంచాయతీశాంతిస్వరూప్భారతదేశ పంచవర్ష ప్రణాళికలు🡆 More