కానుపు: ప్రసూతి

మహిళ గర్భాశయం నుండి ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది శిశువులు బయటికి రావటం అనేది గర్భం ముగింపు దశ.

దీన్ని శిశుజననం అని అంటారు. దీనిని కాన్పు, ప్రసవం అని కూడా పిలుస్తారు. 2015 లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 135 మిలియన్ల జననాలు సంభవించాయి. 42 వారాల తరువాత 3 నుండి 12% మంది పుడుతుండగా, గర్భావది కాలానికి 37 వారాల ముందు [నెలలు తక్కువ కాన్పు] సుమారుగా 15 మిలియన్లు మంది జన్మించారు. అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో సాంప్రదాయ మంత్రసాని సహాయంతో చాలా జననాలు ఇంటిలో జరుగుతుండగా, అభివృద్ధి చెందిన ప్రపంచంలో చాలా ప్రసవాలు ఆసుపత్రులలో జరుగుతున్నాయి

శిశు జననం
పర్యాయపదాలుప్రసవం, జననం
కానుపు: ప్రసూతి
మావితో కప్పబడిన నవజాత శిశువుతో తల్లి
ప్రత్యేకతప్రసూతి శాస్త్రం, మిడ్‌వైఫరీ
ఉపద్రవాలుప్రసవం అడ్డుకోవడం, ప్రసవానంతర రక్తస్రావం, ఎక్లాంప్సియా, ప్రసవానంతర సంక్రమణం, జనన అస్ఫిక్సియా, నియోనాటల్ అల్పోష్ణస్థితి
రకాలుయోని ద్వారా జననం, సి-సెక్షన్
కారణాలుగర్భధారణ
నివారణజనన నియంత్రణ, ఎలెక్టివ్ అబార్షన్
తరచుదనం135 మిలియన్ (2015)
మరణాలు500,000 maternal deaths a year

యోని ద్వారా ప్రసవం అనేది అతి సాధారణ కాన్పుగా ఉంది. దీనిలో మూడు దశల ప్రసవం ఉంటుంది: కుదించుకు పోవటం, గర్భాశయం తెరచుకోవటం, బిడ్డ క్రిందకు జారటం, జననం, మాయను బయటకు తొయ్యటం. మొదటి దశకు సాధారణంగా పన్నెండు నుండి పందొమ్మిది గంటలు పడుతుంది, రెండవ దశకు ఇరవై నిమిషాల నుండి రెండు గంటలు పడుతుంది, మూడవ దశకు ఐదు నుండి ముప్పై నిమిషాలు పడుతుంది. మొట్టమొదటి దశ అర నిమిషం పాటు ఉండే పొత్తికడుపు బిగదీయటం ద్వారా లేదా వీపు నొప్పులతో ప్రారంభమవుతుంది ప్రతి పది నుంచి ముప్పై నిమిషాలకు ఇవి వస్తుంటాయి. ఈ బిగదీసిన నొప్పులు సమయం గడిచే కొద్దీ బాగా ఎక్కువగా, త్వరత్వరగా వస్తాయి. రెండవ దశలో అవయవం ముడుచుకుపోవటంతో బిడ్డ బయటికి నెట్టబడటం సంభవించవచ్చు. మూడవ దశలో ఆలస్యంగా బొడ్డు త్రాడును కత్తిరించటం అనేది సాధారణంగా సిఫార్సు చేయబడుతుంది. నొప్పికి ఉపశమన పద్ధతులు వంటివి, ఒపియోడ్లు, వెన్నెముక అనస్థీషియాలైన అనేక పద్ధతులు సహాయపడవచ్చు.

చాలామంది పిల్లలు మొదటిగా తల వచ్చేలా జన్మిస్తారు; అయితే సుమారు 4% మంది ముందుగా పాదాలు లేదా పిరుదులు ముందుగా వచ్చేలా పుడతారు, దీన్ని ఎదురుకాళ్ళతో పుట్టటం అని పిలుస్తారు. ప్రసవ సమయంలో సాధారణంగా మహిళ తనకు నచ్చినట్లుగా తినవచ్చు, అటూ ఇటూ తిరగవచ్చు, మొదటి దశలో లేదా తల ముందుగా వచ్చే కాన్పు జరుగుతున్న సమయంలో బిడ్డను ముందుకు నెట్టటం అనేది సిఫార్సు చేయబడలేదు, ఎనిమాలు సిఫారసు చేయబడలేదు. ఎపిసియోటమీ అని పిలవబడే యోనిని కత్తిరించి తెరిచే విధానం సాధారణంగా జరుగుతున్నప్పటికీ, దీని అవసరం సాధారణంగా రాదు. 2012లో, సిజేరియన్ ఆపరేషన్ అని పిలవబడే శస్త్రచికిత్స పద్ధతి ద్వారా 23 మిలియన్ ప్రసవాలు జరిగాయి. కవల పిల్లలు, శిశువుకు ప్రమాద సంకేతాలు, లేదా పిరుదులు, ఎదురుకాళ్ళతో పుట్టే స్థితి కోసం సిజేరియన్ శస్త్రచికిత్స సిఫార్సు చేయబడవచ్చు. ఈ ప్రసవ విధానం కారణంగా నయం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది.

ప్రతి సంవత్సరం దాదాపు 500,000 ప్రసూతి మరణాలకు గర్భం, శిశు జననంతో వచ్చే సమస్యలు కారణమవుతున్నాయి, 7 మిలియన్ల మహిళలు తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కొంటున్నారు, ప్రసవం తరువాత 50 మిలియన్ల మంది మహిళలకు ప్రతికూల ఆరోగ్య ఫలితాలు సంభవిస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతాయి. ప్రత్యేక సమస్యలలో కష్టంతో కూడిన ప్రసవం, ప్రసవానంతర రక్తస్రావం, ప్రసూతి వాతం, ప్రసవానంతర ఇన్ఫెక్షన్ ఉంటాయి. శిశువుకు గల సమస్యలలో పుట్టుకతో వచ్చే శ్వాసావరోధం ఉంటుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

బాహ్య లంకెలు

కానుపు: ప్రసూతి 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

గర్భంగర్భాశయం

🔥 Trending searches on Wiki తెలుగు:

కూన రవికుమార్నరసింహ శతకముఘిల్లిఏడు చేపల కథధర్మవరం శాసనసభ నియోజకవర్గంనర్మదా నదివిభక్తిధనిష్ఠ నక్షత్రముపంచారామాలుఆప్రికాట్గంజాయి మొక్క2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుభారత కేంద్ర మంత్రిమండలిఎస్. జానకివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)కాలేయంవాసిరెడ్డి పద్మ2019 భారత సార్వత్రిక ఎన్నికలునల్లమిల్లి రామకృష్ణా రెడ్డిఅనుపమ పరమేశ్వరన్బి.ఆర్. అంబేద్కర్కిలారి ఆనంద్ పాల్సంధిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిప్రధాన సంఖ్యఊరు పేరు భైరవకోనపమేలా సత్పతిమృణాల్ ఠాకూర్నందమూరి తారక రామారావువల్లభనేని బాలశౌరిబ్రహ్మంగారి కాలజ్ఞానంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్భారత రాజ్యాంగ పీఠికఆంధ్రప్రదేశ్శోభితా ధూళిపాళ్లపక్షవాతం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపొంగూరు నారాయణసామెతల జాబితాఉస్మానియా విశ్వవిద్యాలయంజార్ఖండ్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుభారతదేశంలో మహిళలుడి. కె. అరుణనవగ్రహాలువికీపీడియాదువ్వాడ శ్రీనివాస్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్వంగవీటి రాధాకృష్ణఏప్రిల్ 25వంగవీటి రంగాశోభన్ బాబుపులిఓం భీమ్ బుష్బైబిల్రుక్మిణీ కళ్యాణంలలితా సహస్ర నామములు- 1-100వృశ్చిక రాశిపొట్టి శ్రీరాములుస్టాక్ మార్కెట్కుమ్మరి (కులం)భారత జాతీయపతాకంశ్రీరామనవమిఢిల్లీ డేర్ డెవిల్స్అనూరాధ నక్షత్రంసౌరవ్ గంగూలీపేర్ని వెంకటరామయ్యపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెలుగు సినిమాలు 2023కాకతీయులురవితేజతహశీల్దార్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిప్రభాస్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముపుచ్చప్రదీప్ మాచిరాజుస్వాతి నక్షత్రము🡆 More