కాక్టేసి

కాక్టేసి (plural: cacti) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబము.

వీటిని ఎక్కువగా ఎడారి బీడు భూములలో చూస్తాము. ఇవి అమెరికా ఖండానికి చెందినవిగా భావిస్తారు. వీటిని ఎక్కువగా అలంకరణ కోసం పెంచితే, కొన్ని పంటలుగా పండిస్తున్నారు.

కాక్టేసి
కాక్టేసి
Ferocactus pilosus (Mexican Lime Cactus) growing south of Saltillo, Coahuila, northeast Mexico
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Caryophyllales
Family:
కాక్టేసి

Juss.
ఉపకుటుంబాలు
  • Cactoideae
  • Maihuenioideae
  • Opuntioideae
  • Pereskioideae

See also taxonomy of the Cactaceae

కాక్టై అసాధారణమైన మొక్కలు. ఇవి తేమలేని ఎడారి భూములలో జీవించడానికి అనుగుణంగా తమ నిర్మాణాన్ని మార్చుకొని నీరు లేని ప్రాంతాలలో జీవనం సాగిస్తాయి. వీని కాండాలు రసభరితంగా మారి, పత్రహరితం కలిగివుంటాయి. ఆకులు ముళ్ళుగా మార్పుచెంది బాష్పోత్సేకాన్ని తగ్గించుకుంటాయి.

కాక్టై వివిధ పరిమాణాలలో ఆకారాలలో ఉంటాయి. అన్నింటికన్నా పొడుగైన Pachycereus pringlei అత్యధికంగా 19.2 మీటర్లుంటే, అతి చిన్నవి Blossfeldia liliputiana సుమారు 1 సెం.మీ. మాత్రమే పెరుగుతుంది. కొన్ని కాక్టై చిన్నగా గుండ్రంగా ఉంటే మరికొన్ని పొడవుగా స్తంభాకారంగా ఉంటాయి. వీని పువ్వులు పెద్దవిగా ఉండి రాత్రి సమయంలో వికసిస్తాయి. పరాగసంపర్కం నిశాచరులైన కీటకాలు, చిన్న జంతువుల ద్వారా జరుగుతుంది.

ఉపయోగాలు

  • ప్రపంచ వ్యాప్తంగా కాక్టై పూలకుండీలలో పెంచబడి, ఇంట్లో అలంకరణ కోసం ఉంచుతారు. ఇవి ఎక్కువగా ఎడారి మొక్కలుగా బీడు భూములు, కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. నీటి కొరత ఎక్కువగా ఉండే దేశాలు, ప్రాంతాలలో ఇవి జీవించగలవు.
  • కాక్టై సాధారణంగా పంటపొలాల చుట్టు కంచెగా పెంచుతారు. ప్రకృతి వనరులు లేని ప్రాంతాలలో ఎక్కువ ఖర్చుతో కూడిన కంచెలు కట్టించుకోలేనివారు పొలాల చుట్టూ వీటిని పెంచుతారు. ఈ విధమైన కాక్టస్ కంచెను కొన్ని పల్లెలలో ఇండ్ల చుట్టూ కూడా పెంచుతారు. వీటికుండే మొనదేలిన ముల్లు దొంగలు,, పశువుల నుండి రక్షణ కల్పిస్తాయి.
  • కొన్ని కాక్టస్ మొక్కలు ఆర్థిక ప్రాముఖ్యత కలిగివున్నాయి. కొన్ని ముఖ్యంగా నాగజెముడు కండ కలిగిన పండ్లు కాస్తాయి. పిటాయ జాతి మొక్కలు డ్రాగన్ కాయలను ఇస్తాయి. వీటిని తినవచ్చును.
  • కొన్ని కాక్టస్ మొక్కలు Peyote లేదా Lophophora williamsii, Echinopsis మొదలైన వాటిని అమెరికా ఖండాలలో కొన్ని మానసిక రుగ్మతలకు మందుగా ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

కాక్టేసి ఉపయోగాలుకాక్టేసి ఇవి కూడా చూడండికాక్టేసి మూలాలుకాక్టేసి బయటి లింకులుకాక్టేసి

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతీయ ప్రజాస్వామ్య కూటమిషాహిద్ కపూర్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంసరోజినీ నాయుడుతమిళ భాషచతుర్వేదాలుకందుకూరి వీరేశలింగం పంతులుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరుక్మిణీ కళ్యాణంఅమెరికా రాజ్యాంగం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుతెలుగు భాష చరిత్రద్వాదశ జ్యోతిర్లింగాలుఏప్రిల్దొమ్మరాజు గుకేష్విజయనగర సామ్రాజ్యంతెనాలి రామకృష్ణుడుపూర్వాభాద్ర నక్షత్రమువడదెబ్బబోయపాటి శ్రీనువాసుకి (నటి)తిక్కనవృశ్చిక రాశిసుందర కాండబుధుడుఅన్నప్రాశనఫేస్‌బుక్అండాశయముశక్తిపీఠాలుహను మాన్వేయి స్తంభాల గుడిపులివెందులగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుకస్తూరి రంగ రంగా (పాట)ఆర్టికల్ 370ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాబి.ఆర్. అంబేద్కర్అ ఆకరోనా వైరస్ 2019భారతీయ స్టేట్ బ్యాంకుశ్రవణ కుమారుడుఘట్టమనేని మహేశ్ ‌బాబుమహేంద్రగిరికృతి శెట్టిసమాసంభారత ప్రధానమంత్రుల జాబితారోహిత్ శర్మముదిరాజ్ (కులం)ఆరుద్ర నక్షత్రముమియా ఖలీఫాగొట్టిపాటి నరసయ్యక్రికెట్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమంజుమ్మెల్ బాయ్స్అశ్వని నక్షత్రముపాముఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంనవగ్రహాలునామనక్షత్రముటిల్లు స్క్వేర్నామవాచకం (తెలుగు వ్యాకరణం)తెలుగుదేశం పార్టీమహాసముద్రంఅల్లూరి సీతారామరాజుతెలంగాణ ఉద్యమంపవన్ కళ్యాణ్నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంశోభితా ధూళిపాళ్లప్రకాష్ రాజ్పాలకొండ శాసనసభ నియోజకవర్గంసముద్రఖనిశ్రీ కృష్ణదేవ రాయలుసప్తర్షులుఅడాల్ఫ్ హిట్లర్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఎయిడ్స్పొడుపు కథలుసంక్రాంతిఅభిమన్యుడు🡆 More