ఆరు

2016(ఆరు) ఐదు తరువాత, ఏడుకు ముందూ వచ్చే సంఖ్య.

0 | 1 | 2| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 100 | 108 | 1000 | 1116

ఈ అంకె గురించి



కార్డినల్ 6
six
ఆర్డినల్ 6th
sixth
సంఖ్యా పద్ధతి senary
Factorization
Divisors 1, 2, 3, 6
రోమను సంఖ్య VI
రోమను సంఖ్య (Unicode) Ⅵ, ⅵ
జపనీసు సంఖ్య
prefixes hexa-/hex- (from Greek)

sexa-/sex- (from Latin)

Binary 110
Octal 6
Duodecimal 6
Hexadecimal 6
Hebrew ו (Vav)

0 | 1 | 2| 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 100 | 108 | 1000 | 1116

ఈ అంకె గురించి



భాషలో ఆరు

శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందసాం చయః |
జ్యోతిషామయనం చైవ వేదాంగాని షడేవతు ||

శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం - ఈ ఆరింటిని వేదాంగములు అంటారు.

  • శిక్ష వేద మంత్రాలని ఎలా పలకాలో చెబుతుంది. ఛందస్సు (prosody) వేద మంత్రాల రచనా విధానాన్ని వివరిస్తుంది. వ్యాకరణం వేద మంత్రాలలో పాటించిన వ్యాకరణ సూత్రాలని చెబుతుంది. నిరుక్తం వైదిక శబ్దాల వ్యుత్పత్తిని (etymological meaning) వివరిస్తుంది. జ్యోతిషం ఖగోళశాస్త్ర (astronomy) సంబంధిత విషయాలని వివరిస్తుంది. కల్పం యజ్ఞయాగాదుల నిర్వహణలో వేద మంత్రాలని ఎలా ఉపయోగపరచుకోవాలో చెబుతుంది.
  • అధ్యాపనము అంటే వేదాలు, ఇతర శాస్త్రాలు బోధించడం. అధ్యయనం అంటే తాము చదువుకోవడం, యజనం అంటే యజ్ఞములు చేయటం, యాజనము అంటే యజ్ఞములను చేయంచడం, దానం అంటే ఇతరులకు దానం చేయడం, ప్రతిగ్రహం అంటే ఇతరుల నుంచి దానములు స్వీకరంచడం - ఈ ఆరంటినీ షట్కర్మలు అంటారు.
  • కామ, క్రోధ, లోభ. మోహ, మద, మాత్సర్యాలు అరిషడ్వర్గాలు – అంటే ఈ ఆరూ శత్రు గణం.
  • సనాతన ధర్మానికి మూలాధారమైన షడ్దర్శనాలని మూడు జంటలుగా చెప్పడం ఆచారం: న్యాయ-వైశేషికాలు, సాంఖ్య-యోగాలు, పూర్వ మీమాంశ-ఉత్తర మీమాంశలు.
  • షడ్రసాలు కూడా మూడు జంటలే: ఉప్పు-పులుపు, తీపి-కారం, చేదు-ఒగరు. “రసాలు (రుచులు) అయిదా? ఆరా? అన్న ప్రశ్నకి ఇంతవరకు నికరమైన సమాధానం దొరకలేదు” అంటున్నారు శాస్త్రవేత్తలు. తీపి, పులుపు, చేదు, ఉప్పన, ఉమామి అనేవి ప్రాథమిక రుచులు అని ఆధునిక శాస్త్రం చెబుతోంది. ఉమామి అన్నది మనకి పరిచయం లేని రుచి. చైనా, జపాను వారి వంటకాలలో ఈ రుచి తగులుతుంది.
  • అతివృష్టి, అనావృష్టి, మిడుతలు, పందికొక్కులు, చిలుకలు, చేరువరాజులు – ఈ ఆరు ఈతి బాధలు అని అంటారు కాని, చేరువరాజులుకి బదులు రాజకీయ నాయకులు అని ఉంటే బాగుంటుందేమో.
  • ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, క్రోపరభాగ్యోపజీవి అనువారారుగురు దుఃఖభాగులని నీతి కోవిదులు చెప్పుదురు.
  • ఆరు ముఖాలు ఉన్న కుమారస్వామి షడాననుడు.
  • షష్ఠి అంటే ఆరు, షష్టి అంటే అరవై అని గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
  • షట్పదం అంటే ఆరు కాళ్లు కలది అని అర్థం. నిఘంటువులో దీని అర్థం తుమ్మెద అని ఉంటుంది. కాని, ఆరు కాళ్లు కల ఏ కీటకాన్నయినా ఈ పేరుతో పిలవచ్చు.
  • క్రైస్తవులు ఈ సృష్టి ఆరు రోజులలో జరిగిందనిన్నీ, ఏడవ దినాన్న సృష్టికర్త విశ్రాంతి తీసుకున్నాడని నమ్ముతారు.

వనరులు

గణితంలో ఆరు

  • గణితంలో ఆరుకి ఒక విశిష్ట స్థానం ఉంది; ఎందుకంటే, 6 యొక్క కారణాంకాలు 1, 2, 3. అనగా 1 నీ, 2 నీ, 3 నీ వేసి గుణిస్తే 6 వస్తుంది. తమాషా ఏమిటంటే 1 నీ, 2 నీ, 3 నీ కలిపినా 6 వస్తుంది. ఈ లక్షణం ఉన్న సంఖ్యలని పరిపూర్ణ సంఖ్యలు (perfect numbers) అంటారు. పరిపూర్ణ సంఖ్యలలో 6 అతి చిన్నది; తరువాత పరిపూర్ణ సంఖ్య 28 అని నిర్ధారించుకోవడం పాఠకులకి వదలిపెడుతున్నాను. అటుపైన వచ్చే పరిపూర్ణ సంఖ్యలని నిర్ధారించడం అంత తేలికైన పని కాదు.
  • గణితంలో ఒక శాఖ అయిన త్రిగుణమాత్రుకంలో ఆరు ప్రధాన ప్రమేయాలు ఉన్నాయి. వాటి పేర్లు: సైను, కోసైను, టేంజెంటు, కోసీకెంటు, సీకెంటు, కోటేంజెంటు.
  • గ్రీకు భాషలో అరుని సూచించడానికి “హెక్స్” అనే పూర్వప్రత్యయాన్ని వాడతారు, లాటిన్ లో “సెక్స్” అనే పూర్వప్రత్యయాన్ని వాడతారు. కనుక ఇంగ్లీషులో “హెక్సగన్” షడ్భుజం అవుతుంది. అంటే ఆరు భుజాలు కల రేఖాకృతి. దీనినే షట్కోణి అని కూడా అంటారు.
  • సముద్రంలో పడవ ఎక్కడుందో తెలుసుకోడానికి వాడే పరికరం వృత్తంలో ఆరో భాగం ఆకారంలో ఉంటుంది కనుక దానికి “సెక్స్‌టెంట్” అని పేరు పెట్టేరు. దీనికి “షడ్భాగి” అని తెలుగులో పేరు పెట్టుకోవచ్చు.
  • ఆరుగురు ఆసామీలు ఉన్న వాద్య బృందాన్ని ఇంగ్లీషులో “సెక్స్టెట్” అంటారు. ఆరుగురు పిల్లలు ఒకేసారి ఒకే గర్భం నుండి పుడితే వారిని కవలలు అనకూడదు; “సెక్స్త్యుప్లెట్స్” అనాలి. ఈ మాటకి తెలుగు మాట తెలియక ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటని వాడేను.
  • విశ్వవిద్యాలయాల్లో వాడే “సెమెస్టర్” అన్న మాట “సెమెస్ట్రిస్” అనగా “ఆరు నెలలు” అన్న లేటిన్ మూలం నుండి వచ్చింది.

సామాన్య శాస్త్రంలో

వనరులు

Tags:

ఆరు భాషలో ఆరు వనరులుఆరు గణితంలో ఆరు సామాన్య శాస్త్రంలోఆరు వనరులుఆరు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉండి శాసనసభ నియోజకవర్గంతెలుగు సినిమాడి. కె. అరుణచంద్రుడువిరాట్ కోహ్లిఇక్ష్వాకులుబుధుడు (జ్యోతిషం)కామాక్షి భాస్కర్లమా తెలుగు తల్లికి మల్లె పూదండఆంధ్రప్రదేశ్ చరిత్రతీన్మార్ సావిత్రి (జ్యోతి)మంతెన సత్యనారాయణ రాజుఎల్లమ్మరంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)రాకేష్ మాస్టర్శ్రీనివాస రామానుజన్మీనరాశిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిరావణుడునామనక్షత్రమువిడదల రజినిపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంవిశాఖ నక్షత్రముతెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితాషిర్డీ సాయిబాబాగొట్టిపాటి నరసయ్యతెలుగు భాష చరిత్రరజినీకాంత్మేషరాశిసోరియాసిస్సంకటహర చతుర్థికాజల్ అగర్వాల్గోత్రాలు జాబితాత్రిఫల చూర్ణంవ్యాసం (సాహిత్య ప్రక్రియ)రాహువు జ్యోతిషం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిచిలుకూరు బాలాజీ దేవాలయంవైజయంతీ మూవీస్నువ్వు నేనుమాచెర్ల శాసనసభ నియోజకవర్గంఇత్తడిప్రియురాలు పిలిచిందిఆప్రికాట్కర్ర పెండలంఅక్షరమాలకుమ్ర ఈశ్వరీబాయిఅక్కినేని నాగేశ్వరరావుహనుమంతుడుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅలంకారంసిద్ధు జొన్నలగడ్డయనమల రామకృష్ణుడుటిల్లు స్క్వేర్తెలుగు నెలలుకీర్తి సురేష్తెలుగుఉత్పలమాలకుటుంబంశాతవాహనులుతెలంగాణ చరిత్రవంగా గీతశ్రీ కృష్ణదేవ రాయలుమాళవిక శర్మరామ్ చ​రణ్ తేజఅక్కినేని నాగ చైతన్యపిత్తాశయముపంచారామాలుశెట్టిబలిజరాజీవ్ గాంధీదసరామహాభాగవతంమానవ శాస్త్రందగ్గుబాటి వెంకటేష్దువ్వూరి రామిరెడ్డిత్రిష కృష్ణన్భారతీయ తపాలా వ్యవస్థకృష్ణా నదిగురువు (జ్యోతిషం)🡆 More