సంస్కృతి

సంస్కృతి (లాటిన్, స్పానిష్, పోర్చుగీస్ Cultura, ఫ్రెంచ్, ఆంగ్లం Culture, జర్మన్, స్వీడిష్ Kultur) అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం.

దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ (సంస్కృతి) లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి.

సంస్కృతి
ప్రాచీన ఈజిప్ట్ కళ.
సంస్కృతి
అజర్‌బైజాన్‌లో క్రీ.పూ. 10,000 సంవత్సరాలనాటి రాతి చెక్కడాలు - గోబుస్తాన్

ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే మార్పులు, తరాల మధ్య వారసత్వంగా కొనసాగే విధానాలు అన్నీ కలిపి "సంస్కృతి" అంటారు. ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతి అని నిర్వచింపవచ్చును. ఆ సమాజంలో పాటించే ఆచారాలు, పద్ధతులు, అభివాదాలు, వస్త్రధారణ, భాష, మతం, ఆటలు, విశ్వాసాలు, కళలు - అన్నీ కలిపి సంస్కృతి అవుతాయి. గతించిన కాలం గురించి భవిష్యత్ తరాలకు అందించే వారధి సంస్కృతి

సంస్కృతి నిర్వచనం

ఒక సమాజం చేసిన, వాడిన పరికరాలు, నిర్మించిన కట్టడాలు, వారి సంగీత, కళ, జీవన విధానం, ఆహారం, శిల్పం, చిత్రం, నాటకం, నాట్యం, సినిమా - ఇవన్నీ ఆ సమాజపు సంస్కృతిని సూచిస్తాయి. ఒక సమాజంలో ఉన్న వస్తు వినియోగం, సంపన్నత, జానపద వ్యవహారాలు కూడా సంస్కృతిగా భావింపబడుతాయి. వస్తువుల వినియోగమే కాకుండా ఆటి ఉత్పత్తి విధానం, వాటిని గురించిన దృక్పధం, సమాజంలో ఆ వస్తువులతోపాటు పెనవేసుకొని పోయిన సంబంధాలు, ఆచారాలు కూడా సంస్కృతిలోనివే అని మానవ శాస్త్రజ్ఞులు భావిస్తారు. కనుక కళలు, విజ్ఞానం, నైతికత కూడా సంస్కృతేనని వీరి అభిప్రాయం.

1874లో సామాజిక పురా శాస్త్రము గురించి వ్రాస్తూ టైలర్ సంస్కృతిని ఇలా వర్ణించాడు - "సంస్కృతి" లేదా "నాగరికత"ను విస్తారమైన జాతిపరమైన అంశంగా భావిస్తే, ఆ జాతి లేదా సమాజపు సంక్లిష్టమైన జ్ఞానం, విశ్వాసాలు, కళలు, నైతికత, చట్టం, ఆచారాలు , సమాజంలో భాగస్తుడైనందున వ్యక్తికి సంక్రమించే అలవాట్లు, నైపుణ్యత, అవకాశం - అన్నింటినీ కలిపి సంస్కృతి అనవచ్చును. ("సంస్కృతి లేదా నాగరికత, దాని విస్తృత ఎథ్నోగ్రాఫిక్ కోణంలో తీసుకున్న, జ్ఞానం, నమ్మకం, కళ, నీతులు, చట్టం, ఆచారం కలిగి సంక్లిష్ట మొత్తంగా ఉంటుంది , ఏ ఇతర సామర్థ్యాలు , అలవాట్లు సమాజంలో సభ్యుడిగా మనిషికి సొంతం")

ఐక్య రాజ్య సమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారు సంస్కృతిని ఇలా వర్ణించారు - ఒక సమాజానికి లేదా సమూహానికి చెందిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక, బావోద్వేగ అంశాలు ఆ సమాజపు (సమూహపు) సంస్కృతి అవుతాయి. కళలు, జీవన విధానం, సహజీవనం, విలువలు, సంప్రదాయాలు, విశ్వాసాలు ఈ సంస్కృతిలోని భాగాలే. ఇంకా సంస్కృతిని చాలా విధాలుగా విర్వచించారు. 1952లో ఆల్ఫ్రెడ్ క్రోబర్, క్లైడ్ క్లుఖోన్ అనే రచయితలు తమ సంకలనంలో "సంస్కృతి"కి 161 నిర్వచనాలను సేకరించారు

సంస్కృతి, నాగరికత

సంస్కృతిలో మార్పులు

భారతీయ సంస్కృతి

ప్రపంచదేశాలలో భారతీయ సంస్కృతికి విశిష్టమైన స్థానం ఉంది. భారతీయ సంస్కృతి సనాతనమైనది

తెలుగువారి సంస్కృతి (తెలుగుదనం)

సంస్కృతి 
పుట్టింటి సారె
    తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న కొన్ని పండుగలు

వినాయకచవితి, ఉగాది, ఏరువాక, అట్ల తద్దె, భోగి, సంక్రాంతి, కనుమ, బోనాలు, bathukamma, graama devathala poojalu, తెలుగు నెలలు పండుగలు, దీపావళి

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

సంస్కృతి నిర్వచనంసంస్కృతి , నాగరికతసంస్కృతి లో మార్పులుసంస్కృతి భారతీయ సంస్కృతి తెలుగువారి (తెలుగుదనం)సంస్కృతి ఇవి కూడా చూడండిసంస్కృతి మూలాలుసంస్కృతి బయటి లింకులుసంస్కృతిఆంగ్లంజర్మన్ఫ్రెంచి భాషలాటిన్స్పానిష్ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

టమాటోఉల్లిపాయఆది శంకరాచార్యులునందిగం సురేష్ బాబువిలియం షేక్‌స్పియర్రామ్ మనోహర్ లోహియాపిఠాపురంజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవందగ్గుబాటి వెంకటేష్శ్రీలలిత (గాయని)వింధ్య విశాఖ మేడపాటిగరుడ పురాణంకృత్తిక నక్షత్రముసురేఖా వాణియువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఅచ్చులుజయలలిత (నటి)గురువు (జ్యోతిషం)వాయు కాలుష్యంఆంధ్రజ్యోతివిద్యార్థిజమ్మి చెట్టుకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలుగుYఅ ఆజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్తమలపాకురజాకార్కౌరవులురజినీకాంత్చార్మినార్నామవాచకం (తెలుగు వ్యాకరణం)మతీషా పతిరనాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివిశాఖపట్నంఋగ్వేదంనువ్వు నేనుఉత్పలమాలవాణిశ్రీగజేంద్ర మోక్షంకాశీమహాసముద్రంఆశ్లేష నక్షత్రముపెళ్ళివిజయవాడడీహైడ్రేషన్భారత జాతీయ కాంగ్రెస్నామనక్షత్రముక్రిక్‌బజ్హస్తప్రయోగంఅరుణాచలంపంచముఖ ఆంజనేయుడుసాయి ధరమ్ తేజ్శుక్రుడుకొండా విశ్వేశ్వర్ రెడ్డిభారతదేశంలో సెక్యులరిజంపల్నాడు జిల్లాతిరువణ్ణామలైమంతెన సత్యనారాయణ రాజుఅమెరికా సంయుక్త రాష్ట్రాలువేమన శతకముగంగా నదితోట త్రిమూర్తులుటంగుటూరి ప్రకాశంఅష్టదిగ్గజములుపునర్వసు నక్షత్రముమానవ శరీరముఇంద్రుడునువ్వు లేక నేను లేనునవధాన్యాలురష్మి గౌతమ్భూమిఅశోకుడుహిందూధర్మంసింహరాశిమెరుపు🡆 More