బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ

సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బ్రిటిషు భారతదేశంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క దిగువ సభ.

మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలను అమలు చేస్తూ భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా దీన్ని ఏర్పాటు చేసారు. దీనిని ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా పిలుస్తారు. ఎగువ సభ పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్. భారత స్వాతంత్ర్యం తరువాత, 1947 ఆగస్టు 14 న శాసనసభ రద్దైంది. దాని స్థానంలో భారత రాజ్యాంగ సభ ఏర్పడింది.

కేంద్ర శాసనసభ
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్
Star of India
Star of India
రకం
రకం
ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో దిగువ సభ
చరిత్ర
స్థాపితం1919 డిసెంబరు 23 (1919-12-23)
తెరమరుగైనది1947 ఆగస్టు 14
తరువాతివారురాజ్యంగ పరిషత్
నాయకత్వం
President
ఫ్రెడరిక్ వైట్ (మొదటి)
గణేష్ వాసుదేవ్ మావ్‌లాంకర్ (చివరి)
సీట్లు375
ఎన్నికలు
ఓటింగ్ విధానం
మొదట అడంగుకు చేరిన వారు
మొదటి ఎన్నికలు
1920 భారత సార్వత్రిక ఎన్నికలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
1945 భారత సార్వత్రిక ఎన్నికలు
నినాదం
Heaven's Light Our Guide
సమావేశ స్థలం
బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ
సన్సద్ భవన్, న్యూ ఢిల్లీ

కూర్పు

కొత్త శాసనసభ, రెండు సభల పార్లమెంటు లోని దిగువ సభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఎగువ సభగా ఉండేది. అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను ఈ ఎగువసభ సమీక్షిస్తుంది. అయితే, దాని అధికారాలు, దాని ఓటర్లు రెండూ పరిమితం గానే ఉండేవి.

అసెంబ్లీలో 145 మంది సభ్యులు ఉన్నారు, వారు ప్రావిన్సుల నుండి నామినేట్ లేదా పరోక్షంగా ఎన్నికయ్యారు.

నామినేటెడ్ సభ్యులు

నామినేట్ చేయబడిన సభ్యులు అధికారులు లేదా అనధికారులు. వీరిని భారత ప్రభుత్వం, ప్రావిన్సులూ నామినేట్ చేసేవారు.

అధికారులు

మొత్తం 26 మంది నామినేట్ చేయబడిన అధికారులు ఉన్నారు, వారిలో 14 మందిని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ స్టేట్, సెక్రటేరియట్ నుండి భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. మిగతా 12 మంది ప్రావిన్సుల నుంచి వచ్చారు. మద్రాస్, బొంబాయి, బెంగాల్ లు ఇద్దరేసి అధికారులను నామినేట్ చేయగా, యునైటెడ్ ప్రావిన్సులు, పంజాబ్, బీహార్ & ఒరిస్సా, సెంట్రల్ ప్రావిన్సులు, అస్సాం, బర్మా ఒక్కొక్కరిని నామినేట్ చేసేవి. 

అధికారులు కానివారు

మొత్తం 15 మంది నామినేట్ చేయబడిన నాన్-అఫీషియల్స్ ఉన్నారు, వారిలో 5 మందిని భారత ప్రభుత్వం నామినేట్ చేసింది, అవి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండియన్ క్రిస్టియన్లు, కార్మిక సంబంధితాలు, ఆంగ్లో-ఇండియన్లు, అణగారిన తరగతులు అనే ఐదు ప్రత్యేక ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇతర 10 మంది నాన్-అఫీషియల్‌లు ప్రావిన్సుల నుండి నామినేట్ అయ్యారు. వీరిలో బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, పంజాబ్ నుండి ఇద్దరేసి, బొంబాయి, బీహార్ & ఒరిస్సా, బెరార్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుండి ఒక్కొక్కరు ఉండేవారు.

ఎన్నికైన సభ్యులు

ప్రారంభంలో, దాని 142 మంది సభ్యులలో, 101 మంది ఎన్నికయ్యారు.41 మంది నామినేట్ అయ్యారు. ఎన్నికైన 101 మంది సభ్యులలో 52 మంది సాధారణ నియోజకవర్గాల నుండి వచ్చారు, 29 మంది ముస్లింలు, ఇద్దరు సిక్కులు, 7 గురు యూరోపియన్లు, 7 గురు భూస్వాములు, 4 గురు వ్యాపారవేత్తలూ ఎన్నికయ్యారు. తర్వాత, ఢిల్లీ, అజ్మీర్-మెర్వారా, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లకు ఒక్కో సీటు జోడించబడింది. 

ప్రావిన్స్ సీట్లు నియోజకవర్గాల పేర్లు
అస్సాం 4 జనరల్ (2): అస్సాం వ్యాలీ, షిల్లాంగ్‌తో కూడిన సుర్మా వ్యాలీ
ముస్లిం: అస్సాం ముహమ్మద్
అస్సాం యూరోపియన్
బెంగాల్ 16 జనరల్ (6): కలకత్తా అర్బన్ (1), కలకత్తా ఉపనగరాలు (హూగ్లీ, హౌరా, 24 పరగణా జిల్లా మునిసిపల్) (1), కలకత్తా రూరల్, ప్రెసిడెన్సీ డివిజన్ (1), బుర్ద్వాన్ డివిజన్ (హూగ్లీ, హౌరా జిల్లా మినహా) (1), డాకా డివిజన్ (1), చిట్టగాంగ్ రాజ్‌షాహి డివిజన్ (1)
ముస్లిం (5): కలకత్తా, శివారు ప్రాంతాలు (హూగ్లీ, హౌరా, 24 పరగణా జిల్లా) (1), బుర్ద్వాన్, కలకత్తా ప్రెసిడెన్సీ డివిజన్ (1), డక్కా డివిజన్ (1), చిట్టగాంగ్ డివిజన్ (1), రాజ్‌షాహి డివిజన్ (1)
బెంగాల్ ప్రెసిడెన్సీలో యూరోపియన్లు (2)
భూస్వాములు బెంగాల్ (1)
వాణిజ్యం (2): ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ (1), రొటేషన్: బెంగాల్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ లేదా మార్వాడీ అసోసియేషన్ లేదా బెంగాల్ మహాజన్ సభ (1)
బీహార్, ఒరిస్సా 12 జనరల్ (8): తిర్హట్ డివిజన్ (2), ఒరిస్సా (2), షహాబాద్‌తో పాట్నా (1), గయాతో మోంఘైర్ (1), భాగల్పూర్ పూర్నియా, సంతాల్ పరగణాలు (1), చోటా నాగ్‌పూర్ డివిజన్ (1)
ముస్లిం (3): పాట్నా, చోటా నాగ్‌పూర్ కమ్ ఒరిస్సా (1), భాగల్పూర్ డివిజన్ (1), తిర్హట్ డివిజన్ (1)
బీహార్, ఒరిస్సా భూస్వాములు (1)
బొంబాయి 16 జనరల్ (8): బాంబే సిటీ అర్బన్ (2), సింధ్ (1), నార్తర్న్ డివిజన్ (2), సదరన్ డివిజన్ (1), సెంట్రల్ (2)
ముస్లిం (4): బొంబాయి సిటీ అర్బన్ (1), సింధ్ అర్బన్ (1), సింద్ రూరల్ రొటేషన్‌లో నార్తర్న్ డివిజన్ (1), సెంట్రల్ డివిజన్‌తో రొటేషన్‌లో సదరన్ డివిజన్ (1)
ప్రెసిడెన్సీలో యూరోపియన్లు (1)
వాణిజ్యం (2) ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ (1), ది బాంబే మిల్లోనర్స్ అసోసియేషన్ లేదా ది అహ్మదాబాద్ మిల్లోనర్స్ అసోసియేషన్ (1)
ల్యాండ్‌హోల్డర్ల రొటేషన్ (1): సింద్ జాగీర్దార్లు & జమీందార్లు లేదా గుజరాత్ & దక్కన్ సర్దార్లు & ఇనామ్దార్లు
బర్మా 4 జనరల్ (3)
యూరోపియన్ (1)
సెంట్రల్ ప్రావిన్సులు 5 జనరల్ (3): నాగ్‌పూర్ డివిజన్ (1), సెంట్రల్ ప్రావిన్సెస్ హిందీ డివిజన్ (ది నర్మద, జబల్‌పూర్, ఛత్తీస్‌గఢ్ డివిజన్లు) (2)
ముస్లిం (1)
భూస్వాములు (1)
మద్రాసు 16 జనరల్ (11): మద్రాస్ సిటీ అర్బన్ (1), మద్రాస్ జిల్లాలు రూరల్ (1), గంజాం కమ్ వైజాగపట్నం (1), గోదావరి కమ్ కృష్ణా (1), గుంటూరు కమ్ నెల్లూరు (1), చిత్తూరు కమ్ సీడెడ్ జిల్లాలు (అనంతపురం, బళ్లారి, కడప, కర్నూలు) (1), సేలం, కోయంబత్తూర్ కమ్ నార్త్ ఆర్కాట్ (1), చింగిల్‌పుట్ కమ్ సౌత్ ఆర్కాట్ (1), తంజోర్ కమ్ ట్రిచినోపోలీ (1), మధురై, రామనాడ్ కమ్ తిన్నెవెల్లి (1), నీలగిరి, వెస్ట్ కోస్ట్ (మలబార్, అంజెంగో, S. కెనరా) (1)
ముస్లిం (3): ఉత్తర మద్రాసు (గంజాం, విజగపట్నం, గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, బళ్లారి, కడప, కర్నూలు, చిత్తూరు) (1), దక్షిణ మద్రాసు (చింగ్లెపుట్, మద్రాసు, ఆర్కాట్, ఉత్తర & దక్షిణ కోయంబత్తూరు, తంజావూరు, ట్రిచినోపోలీ, మధురై) (1), నీలగిరి, W. కోస్ట్ (మలబార్, S. కెనరా) (1)
ప్రెసిడెన్సీలో యూరోపియన్లు (1)
ప్రెసిడెన్సీలో భూస్వాములు (1)
పంజాబ్ 12 జనరల్ (3): అంబాలా డివిజన్ (1), జుల్లుందూర్ డివిజన్ (1), పశ్చిమ పంజాబ్ (లాహోర్, రావల్పిండి, ముల్తాన్) డివిజన్ (1)

ముస్లిం (6): తూర్పు పంజాబ్ (అంబాలా, కాంగ్రా, హోషియార్‌పూర్, జుల్లుందర్, లూథియానా) (1), తూర్పు మధ్య పంజాబ్ (ఫిరోజ్‌పూర్, లాహోర్, అమృత్‌సర్, గురుదాస్‌పూర్) (1), పశ్చిమ మధ్య పంజాబ్ (సియాల్‌కోట్, గుజ్రాన్‌వాలా, షేఖుపురా, లియాల్‌పూర్) (1), ఉత్తర పంజాబ్ (గుజరాత్, జీలం, రావల్పిండి) (1), వాయవ్య పంజాబ్ (అటాక్, మియాన్‌వాలి, షాపూర్, జాంగ్) (1), నైరుతి పంజాబ్ (ముల్తాన్, మోంట్‌గోమేరీ, ముజఫర్‌ఘర్, డేరా ఘాజీ ఖాన్) ( 1)
సిక్కు (2): తూర్పు పంజాబ్ (అంబలా, జుల్లుందూర్ డివిజన్) (1), పశ్చిమ పంజాబ్ (లాహోర్, రావల్పిండి, ముల్తాన్) (1)
పంజాబ్ భూస్వాములు (1)
యునైటెడ్ ప్రావిన్స్ 16 సాధారణ (8) UP నగరాలు (ఆగ్రా, మీరట్, కాన్పూర్, బెనారస్, అలహాబాద్, బరేలీ, లక్నో) (1), మీరట్ డివిజన్ (మున్సిపాలిటీ, కంటోన్మెంట్ మినహా) (1), ఆగ్రా డివిజన్ (1), రోహిల్‌ఖండ్, కుమావోన్ డివిజన్ (1 ), అలహాబాద్ ఝాన్సీ డివిజన్ (1), బెనారస్ గోరఖ్‌పూర్ డివిజన్ (1), లక్నో డివిజన్ (1), ఫైజాబాద్ డివిజన్ (1)
ముస్లిం (6): UP నగరాలు (1), మీరట్ డివిజన్ (1), ఆగ్రా (1), రోహిల్‌ఖండ్, కుమాన్ డివిజన్ (1), లక్నో, ఫైజాబాద్ (1), దక్షిణ డివిజన్ (అలహాబాద్, బెనారస్, గోరఖ్‌పూర్) (1)
యూరోపియన్ UP (1)
భూస్వాములు UP (1)

భారత ప్రభుత్వ చట్టం 1935 కొన్ని సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఢిల్లీ కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఇండియన్ పార్లమెంట్‌లో దిగువ సభగా అసెంబ్లీ కొనసాగింది. బ్రిటీష్ ఇండియాలోని నియోజకవర్గాల ద్వారా ఎన్నుకైన సభ్యుల సంఖ్య 250 సీట్లకు పెరిగింది. అలాగే భారత సంస్థాన రాష్ట్రాలకు మరో 125 సీట్లు వచ్చాయి. అయితే, ఈ సంస్కరణల తరువాత శాసనసభకు ఎన్నికలు అసలు జరగనే లేదు.

ప్రారంభోత్సవం

కేంద్ర శాసనసభ కౌన్సిల్ హాల్‌లో సమావేశమైంది. తరువాత పాత ఢిల్లీలోని వైస్రాయి లాడ్జ్‌లో సమావేశమైంది. ఈ రెండూ ప్రస్తుతం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. భవిష్యత్ శాసనసభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ యొక్క స్థానంగా 1919లో కొత్త "కౌన్సిల్ హౌస్" రూపొందించారు. 1921 ఫిబ్రవరి 12న దీనికి పునాది రాయి వేసారు. వైస్రాయి, గవర్నర్ జనరల్ అయిన లార్డ్ ఇర్విన్ 1927 జనవరి 18న ఈ భవనాన్ని ప్రారంభించాడు. ఈ కౌన్సిల్ హౌస్ పేరును తరువాతి కాలంలో పార్లమెంట్ హౌస్ లేదా సంసద్ భవన్‌గా మార్చారు. ఇదే ప్రస్తుత భారత పార్లమెంటు భవనం.

ఎన్నికలు

కొత్త శాసనసభకు మొదటి ఎన్నికలు 1920 నవంబరులో జరిగాయి. ఎన్నికలలో మితవాదులకు, ఎన్నికల ప్రక్రియను విఫలం చెయ్యడమే లక్ష్యంగా ఉన్న సహాయ నిరాకరణ ఉద్యమానికీ మధ్య మొదటి పోటీ అది. సహాయ నిరాకరణవాదులు ఇందులో విజయం సాధించారు. దాదాపు పది లక్షల మంది ఓటర్లలో కేవలం 1,82,000 మంది మాత్రమే ఓటు వేశారు.

సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరించుకున్న తరువాత, భారత జాతీయ కాంగ్రెస్‌లోని ఒక సమూహం స్వరాజ్ పార్టీని స్థాపించి 1923, 1926 ఎన్నికలలో పోటీ చేసింది. మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలోని స్వరాజ్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ ఆర్థిక బిల్లులు, ఇతర చట్టాలను ఓడించడమో లేదా కనీసం జాప్యం చెయ్యడమో చెయ్యగలిగింది. అయితే, 1926 తర్వాత, స్వరాజ్ పార్టీ సభ్యులు ప్రభుత్వంలో చేరడమో, శాసనోల్లంఘన ఉద్యమం సమయంలో శాసనసభను బహిష్కరించిన కాంగ్రెసుతో చెయ్యి కలపడమో చేసారు.

1934లో, కాంగ్రెస్ చట్టసభల బహిష్కరణను ముగించి, ఆ సంవత్సరం జరిగిన ఐదవ కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో పోటీ చేసింది.

శాసనసభకు చివరిసారిగా 1945లో ఎన్నికలు జరిగాయి.

శాసనసభ ఓటర్లు భారతదేశ మొత్తం జనాభాలో చాలా కొద్ది భాగమే ఉండేది. 1942 నవంబరు 10 న బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో, లేబర్ ఎంపీ సేమౌర్ కాక్స్ భారతదేశానికి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ లియో అమెరీని "ప్రస్తుత కేంద్ర శాసనసభకి ఓటర్లు ఎంత మంది?" అని అడగ్గా ప్రభుత్వం "కేంద్ర శాసనసభకి గత సాధారణ ఎన్నికల (1934) మొత్తం ఓటర్లు 14,15,892" అని వ్రాతపూర్వక సమాధానం ఇచ్చింది..

ముఖ్యమైన సంఘటనలు

  • 1926 మార్చిలో, మోతీలాల్ నెహ్రూ భారతదేశానికి పూర్తి డొమినియన్ హోదాను కల్పించే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఒక ప్రతినిధుల సమావేశం జరపాలని కోరాడు. ఈ డిమాండ్‌ను శాసనసభ తిరస్కరించడంతో నెహ్రూ, ఆయన సహచరులూ సభ నుంచి వాకౌట్ చేశారు.
  • వర్తక వివాదాల బిల్లు, ప్రజా భద్రత బిల్లును రూపొందించాలనే బ్రిటిషు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ అసంతృప్తిని, నిరాశనూ ప్రదర్శించడానికి విప్లవకారులు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ లు 1929 ఏప్రిల్ 8 న శాసనసభ కారిడార్‌లపై బాంబు విసిరారు. తమ భావజాలాన్ని పేర్కొంటూ కరపత్రాల వర్షం కురిపించారు. " విప్లవం వర్థిల్లాలి!" అని అరుస్తూ గాలిలో కొన్ని తుపాకీ కాల్పులు జరిపారు. జార్జ్ ఎర్నెస్ట్ షుస్టర్ (వైస్రాయి కార్యనిర్వాహక మండలి ఫైనాన్స్ సభ్యుడు), సర్ బొమంజి ఎ. దలాల్, పి. రాఘవేంద్రరావు, శంకర్ రావు, ఎస్ఎన్ రాయ్ వంటి కొంతమంది సభ్యులు గాయపడ్డారు. విప్లవకారులు తప్పించుకునే బదులు ప్రణాళిక ప్రకారం ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఆయుధాలతో సహా లొంగిపోయారు. 1929 జూన్ 12 న వారికిద్వీపాంతరవాస శిక్ష విధించారు.
  • 1934లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికవడంతో శాసనసభలో ప్రభుత్వ పరాజయాల సంఖ్య బాగా పెరిగింది. 1935 ఏప్రిల్ 4 న బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ చర్చలో, భారతదేశ కార్యదర్శి శామ్యూల్ హోరే ఇలా పేర్కొన్నాడు, "ఇటీవలి ఎన్నికల తరువాత మార్చి 25 వరకు ప్రభుత్వం విజయం సాధించిన ఘటనలు 5. అదే కాలంలో ఓడిన ఘటనల సంఖ్య పదిహేడు." హెన్రీ పేజ్ క్రాఫ్ట్ అప్పుడు "నామినేటెడ్ సభ్యుల మద్దతు లేకుండా ఏ సందర్భంలోనైనా ప్రభుత్వం విజయవంతం అయ్యేదా అని చెప్పగలరా?" అని అడిగాడు. హోరే బదులిస్తూ "నేను ఆ ప్రశ్నకు గణాంకాలను పరిశీలించకుండా సమాధానం చెప్పలేను, అయితే ఒక సభ్యుడికీ మరొక సభ్యుడికీ మధ్య తేడా చూడడానికి నాకు కారణమేమీ కనిపించడం లేదు." అన్నాడు
  • 1936 లో పాలస్తీనాలో అరబ్బుల తిరుగుబాటు సమయంలో భారత సైన్యాన్ని అక్కడికి పంపారు. పాలస్తీనాలో అరబ్బుల స్థితి గురించి భారతీయ ముస్లింల ఆందోళనను వ్యక్తం చేయమని కోరిన ప్రశ్నలు తీర్మానాలను వైస్రాయ్, లార్డ్ లిన్లిత్‌గో, అనుమతించలేదు.
  • 1942 ఫిబ్రవరి 27 న రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, యుద్ధ పరిస్థితిని చర్చించడానికి శాసనసభ రహస్య సమావేశాన్ని నిర్వహించింది.

శాసనసభ అధ్యక్షులు

శాస్నసభ నేతను ప్రెసిడెంట్ అని పిలుస్తారు. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం ప్రెసిడెంటును ఎన్నుకోవలసి ఉండగా, మొదటి ప్రెసిడెంటు విషయంలో మినహాయింపు ఇచ్చి, ప్రభుత్వమే నియమించింది. విన్‌స్టన్ చర్చిల్‌కు పార్లమెంటరీ ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ మాజీ లిబరల్ సభ్యుడు ఫ్రెడరిక్ వైట్‌ను ప్రెసిడెంటుగా గవర్నర్-జనరల్ నియమించాడు. సచ్చిదానంద సిన్హా 1921 లో శాసనసభ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.

1947 ఆగస్టు 14న శాసనసభ జీవితకాలం ముగిసే వరకు గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ చివరి అధ్యక్షుడిగా ఉన్నాడు. అతను భారత రాజ్యాంగ సభకు మొదటి స్పీకర్ అయ్యాడు. 1952 లో భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్ సభకు మొదటి స్పీకరు కూడా ఆయనే.

సంఖ్య చిత్రం అధ్యక్షుడు పదవీకాలం
1 ఫ్రెడరిక్ వైట్ 1921 ఫిబ్రవరి 3 – 1925 ఆగస్టు 23
2 విఠల్ భాయ్ పటేల్ 1925 ఆగస్టు 24 - 1930 ఏప్రిల్
3 ముహమ్మద్ యాకూబ్ 1930 జూలై 9 – 1931 జూలై 31
4 ఇబ్రహీం రహీంతూలా 1931 జనవరి 17 – 1933 మార్చి 7
5 ఆర్కే షణ్ముఖం చెట్టి 1933 మార్చి 14 – 1934 డిసెంబరు 31
6 సర్ అబ్దుర్ రహీం 1935 జనవరి 24 – 1945 అక్టోబరు 1
7 గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ 1946 జనవరి 24 – 1947 ఆగస్టు 14
సంఖ్య చిత్రం ఉపాధ్యక్షుడు పదవీకాలం
1 సచ్చిదానంద సిన్హా 1921 ఫిబ్రవరి - 1921 సెప్టెంబరు
2 సర్ జమ్‌సెట్జీ జేజీబోయ్ 1921 సెప్టెంబరు – 1923
3 టి.రంగాచారి 1924 ఫిబ్రవరి – 1926
4 ముహమ్మద్ యాకూబ్ 1927 జనవరి – 1930
5 హరి సింగ్ గౌర్ 1930 జూలై
6 ఆర్కే షణ్ముఖం చెట్టి 1931 జనవరి - 1933 మార్చి
7 అబ్దుల్ మతీన్ చౌదరి 1933 మార్చి – 1934
8 అఖిల చంద్ర దత్తా 1934 ఫిబ్రవరి – 1945
9 ముహమ్మద్ యామిన్ ఖాన్ 1946 ఫిబ్రవరి – 1947

ప్రముఖ సభ్యులు

రద్దు

భారత స్వాతంత్ర్య చట్టం 1947 ప్రకారం, కేంద్ర శాసనసభ, రాజ్యాల మండలి రద్దయ్యాయి. భారత రాజ్యాంగ సభ కేంద్ర శాసనసభగా మారింది.

ఇవి కూడా చూడండి

  • వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
  • కౌన్సిల్ ఆఫ్ స్టేట్ (భారతదేశం)
  • ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్
  • భారత తాత్కాలిక ప్రభుత్వం

మూలాలు

Tags:

బ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ కూర్పుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ ప్రారంభోత్సవంబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ ఎన్నికలుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ ముఖ్యమైన సంఘటనలుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ శాసనసభ అధ్యక్షులుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ ప్రముఖ సభ్యులుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ రద్దుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ ఇవి కూడా చూడండిబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభ మూలాలుబ్రిటిషు భారతదేశ కేంద్ర శాసనసభభారత రాజ్యాంగ పరిషత్భారత స్వాతంత్ర్య చట్టం 1947

🔥 Trending searches on Wiki తెలుగు:

మాగుంట శ్రీనివాసులురెడ్డిగొట్టిపాటి రవి కుమార్శాంతిస్వరూప్భారతదేశంలో సెక్యులరిజంప్రశాంత్ నీల్వసంత వెంకట కృష్ణ ప్రసాద్మహాసముద్రంప్రధాన సంఖ్యతిక్కనఐక్యరాజ్య సమితిఅమిత్ షాతెలంగాణ గవర్నర్ల జాబితాఇంగువఆర్టికల్ 370గౌడజాతీయ విద్యా విధానం 2020పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినామనక్షత్రముతెలుగు సినిమాలు 2022వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికేతిరెడ్డి పెద్దారెడ్డిహరే కృష్ణ (మంత్రం)రాహువు జ్యోతిషంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాచంద్రయాన్-3మ్యాడ్ (2023 తెలుగు సినిమా)గోదావరినామినేషన్సూర్యుడుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలువేయి స్తంభాల గుడిఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలునవధాన్యాలుఅనాసవర్షంసునాముఖివై. ఎస్. విజయమ్మనవలా సాహిత్యముఘట్టమనేని కృష్ణశ్రావణ భార్గవిమొదటి ప్రపంచ యుద్ధంసెక్స్ (అయోమయ నివృత్తి)కర్కాటకరాశితమన్నా భాటియాఫజల్‌హక్ ఫారూఖీప్రపంచ మలేరియా దినోత్సవంద్రౌపది ముర్మువస్తు, సేవల పన్ను (జీఎస్టీ)క్లోమముపరీక్షిత్తుఆంధ్రప్రదేశ్ మండలాలుఅన్నప్రాశనకందుకూరి వీరేశలింగం పంతులుభారతీయుడు (సినిమా)పెరిక క్షత్రియులుతెలుగు సినిమాలు డ, ఢతోటపల్లి మధువిరాట్ కోహ్లిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఅంగారకుడు (జ్యోతిషం)ఇందిరా గాంధీరామ్ చ​రణ్ తేజఅనుపమ పరమేశ్వరన్శ్రీ కృష్ణదేవ రాయలుతెలుగు వికీపీడియాపుచ్చనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిచార్మినార్అవకాడోశార్దూల విక్రీడితముఛత్రపతి శివాజీఅష్ట దిక్కులుఅష్టదిగ్గజములునిర్వహణపరిటాల రవి🡆 More