ఎర్ర రక్త కణం: ఆక్సిజన్ పంపిణీ చేసే

ఎర్ర రక్త కణాలు (Red blood cells) రక్తంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే రక్తకణాలు.

ఒక మిల్లీలీటరు రక్తంలో ఎర్ర రక్త కణాలు ఐదు మిలియన్ల వరకు ఉంటాయి

ఎర్ర రక్త కణం: కంటి ముందు బుడగలు, హిమోగ్లోబిన్ అవసరం, ఇవి కూడా చూడండి
మానవ రక్తంలో ఎర్ర రక్తకణాలు

మన రక్తంలో ప్రతి ఒక్క తెల్ల కణానికి జవాబుగా దరిదాపు 600 ఎర్ర కణాలు ఉంటాయి. నిర్ధిష్టమైన ఆకారం లేని తెల్ల కణం కైవారం 10-20 మైక్రానులు ఉంటే గుండ్రటి బిళ్లలులా ఉన్న ఎర్రకణం వ్యాసం 7 మైక్రానులు ఉంటుంది. (ఒక మైక్రాను అంటే మీటరులో మిలియనవ వంతు!) ఎర్ర కణాలు ద్విపుటాకారపు (bi-concave) ఆకారంలో ఉంటాయి; అనగా, మధ్యలో చిన్న లొత్త ఉంటుంది.

ఎర్ర కణాలు వాటి జీవితకాలంలో మనకి ఎనలేని సేవ చేస్తాయి. సంతర్పణలో పరిచారకులు వంటశాల నుండి వడ్డన గది వరకు - ముందుకి, వెనక్కి - తిరిగినట్లు ఎర్ర కణాలు ఊపిరితిత్తులనుండి జీవకణాల వరకు - ముందుకీ, వెనక్కీ - పుట్టిన దగ్గరనుండి గిట్టే దాకా 75,000 సార్లయినా తిరుగుతాయి. ఇలా నాలుగు నెలలపాటు శ్రమించి జీవితం చాలిస్తాయి.

ఒకొక్క ఎర్ర కణంలో సుమారు 270 మిలియన్ల హిమోగ్లోబిన్ బణువులు ఉంటాయి. ఒకొక్క బణువు (molecule) ఎన్నో అణువుల (atoms) సముదాయం. ఒక బణువు ఎంత పెద్దదో చెప్పాలంటే దాని బణు భారం (en: molecular mass) చెబుతాం. ఒక ఉదజని బణువులో రెండు ఉదజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 2. ఒక ఆమ్లజని బణువులో రెండు ఆమ్లజని అణువులు ఉంటాయి; దాని బణు భారం 32. అదే విధంగా హిమోగ్లోబిన్ బణు భారం 64,000 డాల్టనులు ఉంటుంది. అనగా, ఒక మోల్ హిమోగ్లోబిన్ ఉరమరగా 64,000 గ్రాములు తూగుతుంది.

ఒకొక్క హిమోగ్లోబిన్ బణువు కేవలం నాలుగు ఆమ్లజని అణువులని ఊపిరితిత్తుల దగ్గర సంగ్రహించి శరీరంలోని జీవకణాలకి అందజేస్తుంది. ఎర్ర కణాలు వాటి జీవితకాలంలో మనకి విశేషమైన సేవ చేస్తాయి. ఇవి పుట్టిన దగ్గరనుండి గిట్టే దాకా సుమారు 75,000 సార్లు ఊపిరితిత్తుల నుండి జీవకణాలకి ఆమ్లజనిని అందజేసి, సుమారు నాలుగు నెలలపాటు విశ్రాంతి లేకుండా పని చేసి, అవసాన కాలానికి తమ జన్మస్థానమైన మజ్జ (en:marrow) లోకి చేరుకుంటాయి. అక్కడ ఉన్న తెల్ల కణాలు వీటిని కబళించి మింగెస్తాయి.

కంటి ముందు బుడగలు

సగటు మగవాడి శరీరంలో సుమారు 25 ట్రిలియన్లు ఎర్ర కణాలు, సగటు ఆడదాని శరీరంలో సుమారు 17 ట్రిలియన్లు ఎర్ర కణాలు ఉంటాయి. వీటిలో వెయ్యింటికి ఎనిమిది చొప్పున రోజూ చచ్చిపోతాయి.అనగా, రోజుకి 200 బిలియన్లు చొప్పున (లేదా, సెకండుకి 2,300,000 చొప్పున చచ్చిపోతూ ఉంటాయి. కొన్ని మజ్జ చేరుకోకుండానే, దారిలో, చచ్చిపోయి రక్త ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఇలా చితికి, చివికి పోయిన కణ భాగాలు మన కంటి గుడ్డులోని నేత్రరసంలో చేరి తెప్పలులా తేలియాడుతాయి. అవే మన కంటి ముంది తేలియాడుతూ, బుడగలలా కనిపించే మచ్చలు.

హిమోగ్లోబిన్ అవసరం

ఆమ్లజనిని మోసుకు వెళ్ళడానికి హిమోగ్లోబిన్ అవసరం. ఈ హిమోగ్లోబిన్ ని మొయ్యడానికి ఎర్ర కణాలు అవసరం. హిమోగ్లోబిన్ బణువులే నేరుగా రక్తప్రవాహంలో ప్రయాణించవచ్చు కదా? మధ్యలో ఎర్ర కణాలు ఎందుకు? ఇక్కడ ఒక ఉపమానంతో ఈ ప్రశ్నకి సమాధానం చెప్పవచ్చు. ప్రమిద హిమోగ్లోబిన్ అనిన్నీ, ప్రమిదలో వెలుగుతూన్న దీపం ఆమ్లజని అనీ అనుకుందాం. ఈ ప్రమిదని దేవుడిగది నుండి వాకట్లోకి తీసుకెళ్లాలనుకుందాం. దీపం దారిలో ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతాం. అదే విధంగా రక్త ప్రవాహానికి ఎదురయ్యే అనేక వడపోత ప్రక్రియలకి బలి కాకుండా హిమోగ్లోబిన్ ని కాపాడడానికి ఎర్ర కణాలు "సంచులు" లా పని చేస్తాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

ఎర్ర రక్త కణం కంటి ముందు బుడగలుఎర్ర రక్త కణం హిమోగ్లోబిన్ అవసరంఎర్ర రక్త కణం ఇవి కూడా చూడండిఎర్ర రక్త కణం మూలాలుఎర్ర రక్త కణంరక్తం

🔥 Trending searches on Wiki తెలుగు:

విష్ణువు వేయి నామములు- 1-1000భూకంపంతాజ్ మహల్రక్తపోటుదసరాబ్రాహ్మణులుశతభిష నక్షత్రముథామస్ జెఫర్సన్సావిత్రి (నటి)మకరరాశిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఫేస్‌బుక్రేణూ దేశాయ్ఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజాతీయములుబాల కార్మికులుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిఢిల్లీ డేర్ డెవిల్స్సమాచార హక్కుభారతీయ స్టేట్ బ్యాంకుతెలుగు సినిమాలు 20242009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థఆల్ఫోన్సో మామిడియాదవనిఖిల్ సిద్ధార్థమహాకాళేశ్వర జ్యోతిర్లింగంనరసింహావతారంప్రియురాలు పిలిచిందిభారత రాజ్యాంగ పీఠికజే.సీ. ప్రభాకర రెడ్డిరమణ మహర్షిముదిరాజ్ (కులం)కాకతీయులుసెక్స్ (అయోమయ నివృత్తి)తామర పువ్వుసంధ్యావందనంరావి చెట్టుశ్రీశ్రీఫిరోజ్ గాంధీతెలుగుపన్ను (ఆర్థిక వ్యవస్థ)అయోధ్య రామమందిరంఎయిడ్స్నువ్వులుతెలుగు పదాలుడీజే టిల్లుకుటుంబంనన్నయ్యవడ్డీదినేష్ కార్తీక్సంక్రాంతిరాజ్యసభనోటానిర్మలా సీతారామన్చంపకమాలరావణుడుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంనందిగం సురేష్ బాబువినాయక చవితిమరణానంతర కర్మలుగుంటూరు కారంకస్తూరి రంగ రంగా (పాట)బోయపాటి శ్రీనుత్రిష కృష్ణన్పాలకొండ శాసనసభ నియోజకవర్గంఆటలమ్మతెలుగు వ్యాకరణంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఓటుతిరుపతిఉండి శాసనసభ నియోజకవర్గంగూగుల్గుంటూరు🡆 More