బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం

బ్రిటిష్ ఇండియాలో, 1911 వరకూ కలకత్తా భారత రాజధాని కావడం చేత బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రభావం దేశం మొత్తంపై ఉంది.

19వ శతాబ్దం, 20 వ శతాబ్దపు మొదటి భాగంలో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్) ప్రాంతంలో జరిగిన సామాజిక విప్లవాలను కలిపికట్టుగా బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం ఆంటారు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం రాజా రామ్మోహన్ రాయ్ (1775-1833) తో మొదలై రవీంద్రనాథ్ టాగోర్ (1861-1941) తో అంతమైంది అని చెప్పవచ్చు. టాగోర్ తరువాత దిగ్గజాల వంటి మహానీయులు పుట్టి కళలను, సృజనాత్మకతను ప్రోత్సహించారు. 19వ శతాబ్దపు బెంగాల్ మత, సామాజిక ఉద్దారకులు, పండితులు, సాహిత్యకారులు, పాత్రికేయులు, దేశభక్తి ప్రాసంగీకులు, శాస్త్రవేత్తల మిశ్రమం

బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం
రవీంద్రనాథ్ టాగోర్

నేపథ్యం

ఈ కాలంలో బెంగాల్ లో రెనైసాన్స్ వలే బుద్ధి జాగరణ జరిగిందని చెప్పవచ్చు. ఐరోపా వాసులకు బెంగాల్ వాసుల వలే బ్రిటిష్ వారి వంటి ఆక్రమణ దారులను ఎదిరించవలసిన అవసరం రాలేదు. ఈ బుద్ధి జాగరణ మహిళలు, పెళ్ళి, కట్నం, కులం, మతం వంటి సంప్రదాయాలలో చాదస్తాలను ప్రశ్నించింది. మొదట ప్రారంభమైన యువ బెంగాల్ ఉద్యమం, విద్యావంతులైన హిందువులలో వివేకం, నాస్తికత్వం (శూన్య వాదం) లను పౌర నడవడికకు సాధారణ హారంగా పరిగణించింది.

సమాంతరంగా నడిచిన సామాజిక-రాజకీయ గమనం, బ్రహ్మ సమాజం, ఈ కాలంలో బాగా అభివృద్ధి చెంది బెంగాల్ పునరుజ్జీవనంలో ఎంతోమంది నాయకులను తీర్చిదిద్ది తనతో కలుపుకుంది[1]. పునరుజ్జీవన కాలంలో బుద్ధి జాగరణకు మూలం ఉపనిషత్తులుగా భావించినప్పటకీ బ్రహ్మ సమాజం తొలి రోజులలో (జమిందారీ-బ్రిటిష్ కాలం) మిగతా భారతదేశంవలే, స్వతంత్ర భారత దేశాన్ని వ్యక్తీకరించలేక పోయింది. వారి హిందూ మతం విశ్వజనీనమైంది. ఆ కాలంలో మహ్మదీయుల పాలన వలన హిందూ మతంలో దూరిపోయిన సతీ సహగమనం, పర్దా, బహుభార్యాత్వం వంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడింది. కేశబ్ చంద్ర సేన్ వంటి నాయకులు బ్రహ్మ, కృష్ణ, బుద్ధ దేవులకు భక్తులైనట్లే యేసు క్రీస్తు నకు భక్తులు కూడా. బ్రహ్మ సమాజ సంస్కరణలు సమాజమంతా ఆదరించబడ్డాయి. బ్రహ్మ సమాజ నాయకులు ఆ తరువాత జరిగిన స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు.

1857 తిరుగుబాటు తరువాత బెంగాలీ సాహిత్యం వెల్లి విరిసింది. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్లు ఆద్యులు కాగా బంకిమ్ చంద్ర చటర్జీ విస్తరించారు. బెంగాల్లో పునరుజ్జీవనం భారత జాతీయభావాన్ని తెచ్చిపెట్టింది బంకిమ్ చంద్ర చటర్జీ రచనలు అని చెప్పవచ్చు.

ఆ తరువాత రామకృష్ణ పరమహంస అన్ని మతాలలో నిగూఢమైన సత్యాన్ని గ్రహించి, పరస్పర విరుద్దాలైన హిందూ శాఖలను (శక్త, తంత్ర, అద్వైత వేదాంత, వైష్ణవ), ఇస్లాం, క్రైస్తవ మతాలను సంధానం చెందించినట్లుగా గుర్తించబడ్డాడు. రామకృష్ణుని శిష్యుడు మహర్షి స్వామి వివేకానంద వలన వేదాంత మార్పు అభివృద్ధి చెందింది. వివేకానంద 1893 లో షికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ లో ఉపన్యాసం వలన దేశవ్యాప్తంగా ఖ్యాతిని గడించాడు. భారతీయులను ఆక్రమణకారుల బంధముల నుండి విముక్తి పొందమని, భారతీయ వేదాంత మతములో మానవ సేవ యే అత్యంత సత్యమని ఉద్బోధించారు. మానవ సేవయే మాధవ సేవ అనేదే వివేకానందుని నినాదం. పూర్తిగా స్వతంత్రమై, అభివృద్ధి గతిని నడిచే శక్తివంతమైన భారతదేశాన్ని ఊహించి వ్యక్తపరిచినవారిలో వివేకానందుడు ప్రథముడు. భారతదేశం తన ఘన సాంస్కృతిక గతముతో, భవిష్యత్తు లోకి ధైర్యంగా ముందడుగు వెయ్యగలుగుతందని తెలియజెప్పారు. వివేకానందుడు స్థాపించిన రామకృష్ణ మిషన్ రాజకీయరహితమైంది.

టాగోర్ కుటుంబం, రవీంద్రనాథ్ టేగోర్ తో పాటు ఈ కాలం లోని నాయకుల విద్యాసంస్కరణల పై ప్రత్యేక ఆసక్తిని చూపించారు [2]. 1901లో రవీంద్రనాథ్ టేగోర్ రచించిన నాస్తానీర్ నవల పునరుజ్జీవనం ఉపాయాలను ఉపన్యసించి, వాటిని తమ కుటుంబాలలో పాటించని ఒక వ్యక్తిని తూర్పార పడుతుంది.

యూరోపియన్ సాంస్కృతిక పునరుజ్జీవనంతో తులనాత్మక పరిశోధన

ఐరోపాలో "రెనైసాన్స్" అనే పదానికి అర్థం పునర్జన్మ. సుమారు వెయ్యిసంవత్సరాల మధ్యయుగపు చీకటి తరువాత 15,16 వ శతాబ్దాలలో తిరిగి గ్రీకు-రోమన్ కాలంలో మొదలైన శాస్త్ర పరిజ్ఞానంను పునరుద్దరించుట. కేశవ్ చంద్ర సేన్, బిపిన్ చంద్ర పాల్, ఎం.ఎన్.రాయ్ వంటి ముఖ్య సూత్రధారులు బెంగాల్ పునరుజ్జీవనంను ఐరోపా రెనైసాన్స్ తో పోల్చడం మొదలు పెట్టారు. సుమారు ఒక శతాబ్దం పాటు మారుతున్న బయటి ప్రపంచాన్ని బెంగాల్, మిగతా భారతదేశం కంటే బాగా అర్థం చేసుకొంది. భారతదేశాన్ని జాగృతం చెయ్యడంలో బెంగాల్ ప్రభావం ఐరోపాను జాగృతం చెయ్యడంలో ఇటలీ ప్రభావం వంటిదని చెప్పవచ్చు. ఇటలీ రెనైసాన్స్ కుడా సమాజంలో కొన్ని వర్గాల వారికే పరిమితమైంది. (సామాన్య జనులలో కాకుండా). "బెంగాల్ పునరుజ్జీవనం హుస్సేన్ షా ఆకాలంలో మొదలైన బెంగాలీ ప్రజల సాంస్కృతిక లక్షణాల సమ్మేళనం పునరుజ్జీవనం అని చెప్పవచ్చు.".

బంగ్లాదేశ్ లోని కొంతమంది పండితులు ఈనాడు బెంగాల్ పునరుజ్జీవనంను కొత్త కోణంలో చూస్తున్నారు. ప్రొఫెసర్ ముయునిద్దీన్ అహ్మద్ ఖాన్, ఇస్లాం చరిత్ర సంస్కృతి, చిట్టగాంగ్ విశ్వవిద్యాలయం, ఇలా అన్నాడు.

19వ శతాబ్దము లో బెంగాల్ అనేక సమాజ సంస్కరణలు ప్రారంభించింది. ఇవి హిందువులు, ముస్లిమ్ ల లో కూడా ఉన్నాయి. ముస్లిం సంస్కరణ ఉద్యమాలైన ఫరియాజీ,తారీఖ్-ఈ-మహ్మాదీయా వాటి లో భూమిక లు వహించాయి. ఈ ఉద్యమాలకు కారణమైన సమాజము లో పరిస్థితులు హిందువులలో ఆర్యసమాజ్, బ్రహ్మోసమాజ్ పుట్టుకకు కారణమయి అన్ని రకాల ఉద్యమాలు పక్క పక్కనే నడిచాయి. రాజా రామ్మోహన్ రాయ్ ఉద్యమ్మాన్ని సాధారణంగా రెనైసాన్స్ ఉద్యమము అంటారు. కొంతమంది దీనిని హిందూ రెనైసాన్స్ అని కొంతమంది బెంగాలీ రెనైసాన్స్ అని అంటారు. దీనిని చాలామటుకు ఐరోపా రెనైసాన్స్ తో తులన చెయ్యవచ్చును. రాజా రామ్మోహన్ రాయ్ రెనైసాన్స్ పవిత్రమైన ఆర్యుల 'డేవుడు ఒక్కడే' అనే భావనను నవీన పాశ్చాత్య హేతువాద దృక్పధములో జాగృతము చేసింది.

ముఖ్యులు

తోడ్పడిన సంస్థలు

  • ఆసియాటిక్ సొసైటీ (స్థా.1784)
  • ఫోర్ట్ విలియం కళాశాల (1800)
  • శ్రీరాంపూర్ కళాశాల (1817)
  • హిందూ కళాశాల (1817) (ఆ తరువాత దీన్నే ప్రెసిడెన్సీ కళాశాలగా పేరు మార్చారు)
  • సంస్కృత కళాశాల (1824)
  • జనరల్ శాసనసభస్ ఇన్స్టిట్యూషన్ (ప్రస్తుత స్కాటిష్ చర్చి కళాశాల) (1830)
  • కలకత్తా పాఠశాల పుస్తక సంఘం (1817)
  • కలకత్తా వైద్య కళాశాల (1835)
  • కలకత్తా విశ్వవిద్యాలయం (1857)
  • విద్యాసాగర్ కళాశాల (1872)
  • బెతునే కళాశాల (1879)
  • విశ్వభారతి విశ్వవిద్యాలయం (1921)
  • ఢాకా విశ్వవిద్యాలయం (1921)

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు


Tags:

బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం నేపథ్యంబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం యూరోపియన్ సాంస్కృతిక పునరుజ్జీవనంతో తులనాత్మక పరిశోధనబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం ముఖ్యులుబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం తోడ్పడిన సంస్థలుబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం ఇవి కూడా చూడండిబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం మూలాలుబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం బయటి లింకులుబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంకలకత్తాపశ్చిమ బెంగాల్బంగ్లాదేశ్బెంగాల్భారతదేశంరవీంద్రనాథ్ టాగోర్రాజా రామ్మోహన్ రాయ్

🔥 Trending searches on Wiki తెలుగు:

వర్ధమాన మహావీరుడుగద్వాల విజయలక్ష్మిజాతీయములుపాల కూరవ్యాసుడువిభక్తిమఖ నక్షత్రముఉస్మానియా విశ్వవిద్యాలయంకన్యారాశిబేటి బచావో బేటి పడావోఇజ్రాయిల్ట్విట్టర్బి.ఆర్. అంబేద్కర్ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామరణానంతర కర్మలుకె. అన్నామలైదానం నాగేందర్శతక సాహిత్యముఆర్యవైశ్య కుల జాబితారాశిఅపోస్తలుల విశ్వాస ప్రమాణంవంగవీటి రంగాపొడుపు కథలుపిచ్చిమారాజుసిరికిం జెప్పడు (పద్యం)చార్మినార్అనపర్తి శాసనసభ నియోజకవర్గంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభారతీయ శిక్షాస్మృతికిరణజన్య సంయోగ క్రియజయప్రదవై.యస్.భారతితమిళనాడుచరవాణి (సెల్ ఫోన్)భారత జాతీయపతాకంపాండవులుజగ్జీవన్ రాంనవధాన్యాలుప్రజా రాజ్యం పార్టీPHగోదావరిఅరుణాచలంనితిన్భారతదేశంలో కోడి పందాలువై.ఎస్. జగన్మోహన్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థసింహరాశిసోరియాసిస్రావణుడుఉప్పెన (సినిమా)భారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్టైటన్గర్భాశయముభారత ఎన్నికల కమిషనుబండ్ల కృష్ణమోహన్ రెడ్డిపాలక్కాడ్ జిల్లాఆంధ్రప్రదేశ్పరకాల ప్రభాకర్సర్వనామముఎస్. శంకర్మగధీర (సినిమా)షిర్డీ సాయిబాబామిఖాయిల్ గోర్బచేవ్ఉసిరిరజాకార్లుఅమ్మల గన్నయమ్మ (పద్యం)శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం (కాణిపాకం)సుకన్య సమృద్ధి ఖాతాతెలుగు నాటకరంగంయేసు శిష్యులుచోళ సామ్రాజ్యంనల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితెలంగాణ జిల్లాల జాబితాపసుపురేవతి నక్షత్రంశాతవాహనులు🡆 More