బ్రహ్మ సమాజం

బ్రహ్మ సమాజం (ఆంగ్లం : Brahmo Samaj) (బెంగాలీ ব্রাহ্ম সমাজ బ్రహ్మో షొమోజ్) బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం.

నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనికూడా గుర్తిస్తారు. రాజారాం మోహన్ రాయ్ ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి 'పితామహుడి'గా పిలువబడుతాడు, ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా, హిందూ సమాజంలో మతపరమైన, విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశంగా పనిచేసింది. భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ఉంది. బెంగాల్ లోనే గాక, పొరుగుదేశమైన బంగ్లాదేశ్ లోనూ దీని ప్రభావం స్ఫూర్తిదాయకమైనది. ఈ సమాజపు సిద్ధాంతాలలో హిబ్ర్యూ, ఇస్లామీయ సిద్ధాంత సాంప్రదాయలను జోడించడం కానవస్తుంది. సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ సివిల్ సర్వీస్ (ఐసిఎస్) మొదటి భారతీయ అధికారి బ్రహ్మ సమాజంలో సభ్యుడిగా ఉండి , సమాజ సేవలలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి.

అర్థాలు , పేర్లు

బ్రహ్మో (ব্রাহ্ম bramho) సాహితీపరంగా అర్థం "బ్రహ్మన్ ను పూజించేవాడు",, సమాజ్ (সমাজ shômaj) అనగా "మానవ సంఘం".

బ్రహ్మ సమాజం 
రాజారాం మోహన్ రాయ్

ఆగస్టు 20 1828 న, బ్రహ్మసమాజానికి చెందిన మొదటి సమావేశం, ఉత్తర కలకత్తాలోని ఫిరంగీ కమల్ బోస్ ఇంట్లో జరిగింది. ఈ దినాన్ని, భద్రోత్సబ్ ( ভাদ্রোৎসব ) లేదా తెలుగులో "భద్రోత్సవం" అనే పేరుతో జరుపుకుంటారు.

సమాజ స్థాపన

7వ పౌస్ 1765 శకము (1843) న దేవేంద్రనాథ్ టాగూర్, ఇతర 20 మంది తత్వబోధిని అనుయాయులు సమావేశమైనారు. బ్రహ్మ సభ ట్రస్టుకు పండిట్ విద్యాబగీష్, వీరిని ఆహ్వానించారు. శాంతినికేతన్ లో పౌస్ మేళా ఇదే రోజున ప్రారంభమవుతుంది. ఈ సమావేశాన్నే, బ్రహ్మ సమాజపు ఆరంభం అని భావింపవచ్చు. ఈ సమాజం 'కలకత్తా బ్రహ్మ సమాజం' అనికూడా పిలువబడుతుంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర బ్రాహ్మణులు:-

  • శ్రీధర్ భట్టాచార్య
  • శ్యాంచరణ్ భట్టాచార్య
  • బ్రజేంద్రనాథ్ టాగూర్
  • గిరీంద్రనాథ్ టాగూర్, ఇతను దేవేంద్రనాథ్ టాగూరుకు అన్న, గణేంద్రనాథ్ టాగారుకు తండ్రి.
  • ఆనందాచార్య భట్టాచార్య.
  • తారకనాథ్ భట్టాచార్య.
  • హరదేవ్ చటోపాధ్యాయ
  • శ్యామచరణ్ ముఖోపాధ్యాయ
  • రామనారాయణ్ చటోపాధ్యాయ
  • శశిభూషణ్ ముఖోపాద్యాయ

సామాజిక & మతపర సంస్కరణలు

సామాజిక సంస్కరణల మైదానాలైనటువంటి, కుల సిద్ధాంతం, వరకట్నం, స్త్రీ విమోచన ఉద్యమం,, విద్యావిధానాలను మెరుగుపరచడం లాంటివి, బ్రహ్మ సమాజం బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం నుండి గ్రహించింది. బెంగాల్ పునరుజ్జీవన ప్రభావం దీనిపై ఎక్కువగా వుండినది. వరకట్న నిషేధాల విషయాలపై చర్చలు శరత్ చంద్ర చటోపాధ్యాయ బెంగాలీ భాషలో రచించిన నవల పరిణీత నుండి సంగ్రహించారు.

బ్రహ్మ సమాజ నవీన సంస్కరణలు

క్రింది విషయాలు నవీన సంస్కరణలు బ్రహ్మ సమాజం వెబ్‌సైటు

  • బహుఈశ్వరవాదాన్ని త్యజించడం.
  • కులవిధానాలను రూపుమాపడం.
  • కట్నకాలుకలను రూపుమాపడం.
  • స్త్రీ విమోచనం.
  • వితంతువుల పునర్వివాహాలు.
  • విద్యావిధానాల సంస్కరణలు.
  • సతీసహగమనాన్ని రూపుమాపటం.
  • జ్ఞానాన్ని విశ్వవ్యాపితం చేయడం.
  • వ్యక్త్గగత, సెక్యులర్ చట్టాలలో చట్టపర సంస్కరణలు తీసుకురావడం.
  • వైయక్తిక, సామాజిక జీవితాలలో సాదాజీవనం, సచ్ఛీలత.
  • లంచగొండితనం రూపుమాపడం, త్రాగుడు, టెలివిజన్, దేవదాసి విధానం, రాజకీయాలను త్యజించడం.

సిద్ధాంతము

క్రింద నుదహరించిన సిద్ధాంతాలు, "హిందూత్వ పునరుజ్జీవనం" లోని భాగాలు, ఈ సిద్ధాంతాలే బ్రహ్మ సమాజ సిద్ధాంతాలకు ఆయువుపట్టు లాంటివి.

  • బ్రహ్మసమాజానికి, గ్రంథాలపై వాటి అధికారికతపై విశ్వాసంలేదు.
  • బ్రహ్మసమాజానికి, దేవుని అవతారాలపై విశ్వాసంలేదు.
  • బ్రహ్మసమాజం, బహుఈశ్వరవాదాన్నీ, విగ్రహారాధనను ఖండిస్తుంది.
  • బ్రహ్మసమాజం, కుల సిద్ధాంతానికి వ్యతిరేకం.
  • బ్రహ్మసమాజంలో కర్మసిద్ధాంతాలు, పునర్జన్మ సిద్ధాంతాలు ఐచ్ఛికం.

ఇవీ చూడండి


మూలాలు , పాదపీఠికలు

బయటి లింకులు

Tags:

బ్రహ్మ సమాజం అర్థాలు , పేర్లుబ్రహ్మ సమాజం సమాజ స్థాపనబ్రహ్మ సమాజం సామాజిక & మతపర సంస్కరణలుబ్రహ్మ సమాజం సిద్ధాంతముబ్రహ్మ సమాజం ఇవీ చూడండిబ్రహ్మ సమాజం మూలాలు , పాదపీఠికలుబ్రహ్మ సమాజం బయటి లింకులుబ్రహ్మ సమాజంబంగ్లాదేశ్బెంగాలీ భాషబెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంరాజారాం మోహన్ రాయ్సత్యేంద్రనాథ్ ఠాగూర్

🔥 Trending searches on Wiki తెలుగు:

పర్యాయపదందశరథుడుమార్చి 30ఆరుద్ర నక్షత్రముఅయోధ్యవిశ్వక్ సేన్భూమా అఖిల ప్రియరావి చెట్టుచిత్త నక్షత్రముఇంద్రజలలితా సహస్ర నామములు- 1-100రూప మాగంటిఅరుణాచలంతట్టుకామాక్షి భాస్కర్లజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసౌదీ అరేబియాతిరుపతికురుమమదర్ థెరీసానరసింహ శతకముశ్రీ కృష్ణదేవ రాయలుఆంధ్రప్రదేశ్ చరిత్రకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసింహరాశిమంగళవారం (2023 సినిమా)రక్తంరామాయణంమహాసముద్రం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపన్ను (ఆర్థిక వ్యవస్థ)భగత్ సింగ్గన్నేరు చెట్టుమెయిల్ (సినిమా)రాయలసీమనమాజ్పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరైలువేయి స్తంభాల గుడిటి.జీవన్ రెడ్డిపరిపూర్ణానంద స్వామిముహమ్మద్ ప్రవక్తధాన్యంప్రజాస్వామ్యంతెలుగు నాటకరంగంఅనుష్క శెట్టిపూజా హెగ్డేసామెతల జాబితాసుందరికందుకూరి వీరేశలింగం పంతులుసర్వనామమురైటర్ పద్మభూషణ్చదలవాడ ఉమేశ్ చంద్రవేంకటేశ్వరుడువందే భారత్ ఎక్స్‌ప్రెస్గోత్రాలుసోరియాసిస్భీష్ముడుఅయ్యప్పన్యుమోనియాAపెరుగుబ్రిటీష్ ఇండియాలోని ప్రెసిడెన్సీలు, ప్రావిన్సులుయవలుధనిష్ఠ నక్షత్రముసూర్యుడు (జ్యోతిషం)అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారత రాజ్యాంగంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువై.యస్.అవినాష్‌రెడ్డిభారత జాతీయ ఎస్టీ కమిషన్తెలంగాణఅభినవ్ గోమఠంశ్రీశైల క్షేత్రం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుదత్తాత్రేయకన్నెగంటి బ్రహ్మానందంకంప్యూటరు🡆 More