బాలల సాహిత్యాన్ని నిర్వచించడం చాల క్లిష్టమైన పని.
ఎందుకంటే 2 సంవత్సరాల వయస్సు నుండి 16 సంవత్సరాల వారినందరినీ బాలల కిందే పరిగణిస్తారు. భిన్న వయస్సు కల బాలలు భిన్న రకాలైన పుస్తకాలను చదువుతారు. ఉదాహరణకి 2 సంవత్సరాల పిల్లలు చిత్రపటాలు చూస్తూ భాషను నేర్చుకోవదానికి ప్రయత్నం చేస్తారు. కానీ టీనేజి పిల్లలు కాల్పనిక సాహిత్యాన్ని చదవడానికి ఇష్టపడతారు. సాధారణంగా బాలల కోసం వ్రాయబడిన, ప్రచురితమైన సాహిత్యాన్ని బాల సాహిత్యంగా నిర్వచించవచ్చు.
పాల్కురికి సోమనాథుని బసవపురాణంలోని బాల్యం వర్ణనను బాలసాహిత్యంగా చెప్పవచ్చు. నాచన సోమనాథుడు, శ్రీనాథుడు, మొదలైన కవులు కూడా తమ రచనల్లో పిల్లల ఆటలు, పాటలు వర్ణించారు. సుమతి శతకం, వేమన శతకం తదితర శతకాలలో కూడా బాల సాహిత్య ఛాయలు కన్పిస్తాయి.
మహాభారతం, రామాయణం, బసవపురాణం, కేయూర బాహు చరిత్ర. పోతన భాగవతం మొదలైన గ్రంథాలలో బాలసాహిత్యం వికాసదశలు మనకు కనిపిస్తాయి. ఆధునిక తెలుగు బాల సాహిత్యానికి మూలం కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు. ఆధునిక యుగంలో బాల సాహిత్యం ఎన్నెన్నో మార్పులు సంతరించుకున్నది. బాలసాహిత్యం పురోగతి సాధించినది. గేయ, పద్య, గద్య, రూపాలలో బాల సాహిత్యం కన్పిస్తున్నది. చిన్నయ సూరి నీతిచంద్రికలో కథలుగా వ్రాశాడు. కందుకూరి వీరేశలింగం, వెంకటరత్నం పార్వతీశ కవులు బాలసాహిత్యాన్ని వెలువరించారు. నీతి దీపిక, నీతి కథ మంజిరి, బాల గీతావళి ఆ కోవలోకే వస్తాయి. ఆధునికంగా మర్యాదరామన్న కథలు అక్బర్ బీర్బల్ కథలు మొదలైన కథల పుస్తకాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
మొదలైన వారు గేయాలు, కథలు, వ్యాసాలు, నాటికలు మొదలైన ప్రక్రియలలో బాలసాహిత్యాన్ని రచించారు. దాదాపు అన్ని పత్రికలలు బాలలకోసం ప్రత్యేకమైన శీర్షికలను నడుపుతున్నాయి. బాల, బాలమిత్ర, చందమామ, జాబిల్లి, బుజ్జాయి, బాలభారతి, బాబు మొదలైన పత్రికలు ప్రత్యేకంగా పిల్లలకోసం వెలువడ్డాయి.
స్టోరీవీవర్ జాలస్ఖలిలో చాలా భాషలలో పిల్లల పుస్తకాలు చదువుకోవటానికి, అనువాదం చేయటానికి, కొత్తవి తయారుచేయటానికి అందుబాటులో ఉన్నాయి.
కాశీ విశ్వనాధం పట్రాయుడు (2020-03-02). "బాలసాహిత్యంలో కాల్పనిక కథ పాత్ర". ఆంధ్రభూమి దినపత్రిక సాహిత్యం.
కాశీ విశ్వనాధం పట్రాయుడు (2020-05-03). "బాలసాహిత్యంలో బాలగేయాల పాత్ర". ప్రజాకాంక్ష దినపత్రిక మిణుగురు.
This article uses material from the Wikipedia తెలుగు article బాల సాహిత్యం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.