ఫైర్‌ఫాక్స్

'మొజిల్లా ఫైర్‌ఫాక్స్' ఒక ఉచిత, మూలాల అందుబాటుకల వెబ్ విహరిణి.

దీనిని మొజిల్లా సంస్థ నిర్వహిస్తుంది. ఫైర్‌ఫాక్స్ 20.78 శాతం మందిచే వాడబడుతూ, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తర్వాత రెండవ స్థానంలో ఉంది.వెబ్ పేజీలు రూపుదిద్దటానికి గెకో అనే లేయవుటు ఇంజిన్ వాడుతుంది. దీని ఆకర్షణలలో ముఖ్యమైనవి టాబుల వీక్షణం, అచ్చుతప్పులు ఉపకరణము, దింపుకోళ్ళ నిర్వాహకి, శోధన పరికరము, వాడుకరి మలచుకోదగినఇంకా మరిన్ని ఆకర్షణలకొరకు ఇతరులు తయారుచేసిన యాడాన్లు ఉన్నాయి. వీటిలో లినక్సు వాడే తెలుగు వారికి తెలుగు వార్తాపత్రికలు చూపటానికి ఉపయోగపడే ముఖ్యమైన పద్మ ప్లగ్ ఇన్. ఫైర్‌ఫాక్స్ అన్నిరకాల నిర్వాహణ వ్వవస్థలు అనగా మైక్రోసాఫ్ట్ విండోస్, మేకింతోష్ ఓయస్ ఎక్స్, లినక్స్, యునిక్స్ లాంటి వాటిపై పనిచేస్తుంది. ప్రస్తుత విడుదల సంఖ్య 10.0.2. దీని మూలపు కోడ్ జిపిఎల్/ ఎల్‌జిపిఎల్/ఎమ్‌పిఎల్ లైసెన్సుల ద్వారా లభ్యమవుతుంది.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్
ఫైర్‌ఫాక్స్
లినక్స్ లో ఫైర్‌ఫాక్స్
లినక్స్ లో ఫైర్‌ఫాక్స్
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుమొజిల్లా ఫౌండేషన్, సహాయకులు
మొజిల్లా కార్పోరేషన్
ప్రారంభ విడుదలసెప్టెంబరు 23, 2002; 21 సంవత్సరాల క్రితం (2002-09-23)
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిC++, JavaScript, C, Cascading Style Sheets, XUL, XBL
సాఫ్టువేరు ఇంజను లుగెకో, స్పైడర్​మంకీ
ఆపరేటింగ్ సిస్టంవిండోసు, OS X, లినక్స్, ఆండ్రాయిడ్, ఫైర్‌ఫాక్స్ ఓయస్, ఫ్రీబీయస్డీ, నెట్​బీయస్డీ, ఓపెన్​బీయస్డీ, ఓపెన్​ఇండియానా
ఫైల్ పరిమాణం22 MB: Windows
44 MB: OS X
27–28 MB: Linux
22 MB: Android
510 MB: source code (uncompressed)
సాంకేతిక స్టాండర్డ్HTML5, CSS3, RSS, Atom
అందుబాటులో ఉంది90 భాషలు
రకంజాల విహారకం
ఫీడు రీడరు
మొబైలు జాల విహారకం
లైసెన్సుMPL
జాలస్థలిwww.mozilla.org/zh-TW/firefox/new/ Edit this on Wikidata

తెలుగు ఫైర్‌ఫాక్స్

ఫైర్‌ఫాక్స్ 
ఫైర్ఫాక్స్ 3.0.2 తెలుగు ప్రారంభ తెరపట్టు

2008 సెప్టెంబరు 23న ఫైర్‌ఫాక్స్ 3.0.2 ఆధికారిక తెలుగు బీటా విడుదల అయ్యింది. తెలుగు అనువాదం సమన్యయం మెయిలింగ్ లిస్టు, ప్రత్యేక జాలస్థలం దీనికి కొత్తపల్లి కృష్ణబాబు ముఖ్య అనువాదకర్త. దీనికి ముందు చాలా మంది పనిచేసారు. 1.5 వర్షన్ కోసం స్వేచ్ఛ జట్టు (సునీల్ మోహన్),, 2.0 వర్షన్ కోసం సి-డాక్ సంస్థ (RKVS రామన్) పనిచేశారు. అయితే 3.0.2కు ముందు అధికారికంగా విడుదలకాలేదు.

తెలుగు ముద్రాక్షరాల తనిఖీ విస్తరణ

ఫైర్‌ఫాక్స్ 
ముద్రాక్షరాల తనిఖీ

ఫైర్‌ఫాక్స్‌లో సాధారణంగా ఇంగ్లీషు స్పెల్‌చెకర్ స్థాపితమై ఉంటుంది. తెలుగు వాడుకరులు "తెలుగు ముద్రాక్షరాల తనిఖీ" (స్పెల్ చెకర్) విస్తరణను అభివృద్ధి సైట్ నుండి పొంది స్థాపించుకోవాలి. ఇలా చేస్తే తెలుగులో టైపు చేసేటప్పుడు దొర్లే అచ్చుతప్పులను కనుగొనటం, అది యిచ్చే సలహాలను అవసరమైతే వాడుకొని మార్చటం సులభం అవుతుంది. ఇది తొలిసారిగా 2011 జనవరి 1న విడుదలయ్యింది.

వికీపీడియా ప్రయోగశాలలో ఎలా వాడవచ్చో తెలుసుకొనుటకు తెరపట్టు చూడండి. దీనికోసం మీరు ఏదేని ఒక వెబ్సైట్లో సమాచారం ప్రవేశపెట్తున్నప్పుడు, మౌస్ పై కుడివైపు మీటని నొక్కి భాషను తెలుగుగా ఎంచుకొని, స్పెల్లింగు తనిఖీ చేతనం చేయవలసి ఉంటుంది. తరువాత, మీరు టైపు చేస్తున్నప్పుడే, ఒకవేళ ఆ నిఘంటువులో పదం లేకపోయినట్లయితే, పదం టైపు చేయడం పూర్తయిన వెంటనే దాని కింద ఎర్రని తరంగపు గీతని ఈ "తెలుగు ముద్రాక్షర తనిఖీ" (స్పెల్ చెకర్) చేరుస్తుంది. టరంగపుగీత ఉన్నపదం మీద మరల మౌస్ పై కుడివైపు మీటని నొక్కితే, నిఘంటువు, స్పెల్ చెకర్ నియమాల ప్రకారం సలహా పదాలను సూచిస్తుంది. వాటిలో తగిన పదముంటే దానిని ఎంచుకోవడం ద్వారా దోషాన్ని దిద్దవచ్చు. టైపు చేసిన పదం దోషం లేనిదైతే దానిని నిఘంటువులో చేర్చవచ్చుకూడా!

లక్షణాలు

గూగుల్ సర్వీస్పై ఆధారపడిన ట్యాబ్డ్ బ్రౌజింగ్, స్పెల్ చెకింగ్, ప్రోమ్మెంటల్ ఫైండ్, లైవ్ బుక్మార్కింగ్, స్మార్ట్ బుక్మార్క్లు, డౌన్ మేనేజర్, ప్రైవేట్ బ్రౌజింగ్, నగర-అవేర్ బ్రౌజింగ్ ("జియోలొకేషన్" అని కూడా పిలుస్తారు) మొదలైన లక్షనాలు ఇందులో ఉన్నాయి.

మూడవ పక్ష డెవలపర్లు సృష్టించిన యాడ్-ఆన్ల ద్వారా విధులు జతచేయబడవచ్చు.యాడ్-ఆన్లు ప్రధానంగా హేచ్.టి.ఏం.ఏల్ (HTML), జావాస్క్రిప్ట్ API ను ఉపయోగించి పొడిగింపులుగా పిలువబడతాయి, ఇవి గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ లాగానే రూపొందించబడింది.ఫైర్ఫాక్స్ దానికి జోడించిన ఇతివృత్తాలను కలిగి ఉంటుంది, ఇది వినియోగదారుడు బ్రౌజర్ రూపాన్ని మార్చడానికి మూడవ పార్టీల నుండి సృష్టించవచ్చు లేదా డౌన్లోడ్ చేయవచ్చు. ఫైర్ఫాక్స్ యాడ్-ఆన్ వెబ్సైట్ కూడా వినియోగదారులు ఇతర అనువర్తనాలను ఆటలను, ప్రకటన-బ్లాకర్ల, స్క్రీన్షాట్ అనువర్తనాలు, అనేక ఇతర అనువర్తనాలను జోడించే సామర్థ్యాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చూడండి

వనరులు

Tags:

ఫైర్‌ఫాక్స్ తెలుగు ఫైర్‌ఫాక్స్ తెలుగు ముద్రాక్షరాల తనిఖీ విస్తరణఫైర్‌ఫాక్స్ లక్షణాలుఫైర్‌ఫాక్స్ ఇవి కూడా చూడండిఫైర్‌ఫాక్స్ వనరులుఫైర్‌ఫాక్స్ఉచిత ఆపరేటింగు సిస్టములుతెలుగుపద్మ ప్లగ్ ఇన్వార్తాపత్రికలు

🔥 Trending searches on Wiki తెలుగు:

తాజ్ మహల్భారతీయ రైల్వేలుసన్నాఫ్ సత్యమూర్తిప్రకాష్ రాజ్కనకదుర్గ ఆలయంఆహారంజ్యేష్ట నక్షత్రంమహాత్మా గాంధీయాదవవందే భారత్ ఎక్స్‌ప్రెస్సంధితెలుగు నెలలువిరాట్ కోహ్లిజ్యోతీరావ్ ఫులేఎయిడ్స్తెలుగు కథనారా చంద్రబాబునాయుడుహార్సిలీ హిల్స్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుభలే అబ్బాయిలు (1969 సినిమా)రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్రామోజీరావుఉష్ణోగ్రతసరోజినీ నాయుడుఇంగువభారతదేశంరాజ్యసభసత్యనారాయణ వ్రతంపర్యాయపదంచిరుధాన్యంబొడ్రాయిఅమెజాన్ (కంపెనీ)కింజరాపు అచ్చెన్నాయుడుజీమెయిల్భారత జాతీయ మానవ హక్కుల కమిషన్పెంటాడెకేన్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరక్తంపూర్వ ఫల్గుణి నక్షత్రముస్వామి రంగనాథానందజగ్జీవన్ రాంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపుష్యమి నక్షత్రముశ్రవణ కుమారుడుమాధవీ లతరామరాజభూషణుడుజవాహర్ లాల్ నెహ్రూబాలకాండనయన తారపురాణాలుభాషా భాగాలుతోట త్రిమూర్తులుఅచ్చులులోక్‌సభ నియోజకవర్గాల జాబితాశ్రీ గౌరి ప్రియఅక్కినేని నాగార్జునఆంధ్రప్రదేశ్ చరిత్రఫహాద్ ఫాజిల్వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యగైనకాలజీనారా లోకేశ్పేరుభారతీయ స్టేట్ బ్యాంకుఅలంకారంఎల్లమ్మతీన్మార్ మల్లన్నమహాకాళేశ్వర జ్యోతిర్లింగంశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)నువ్వు వస్తావనిహైదరాబాదుభారత ఎన్నికల కమిషనుమేరీ ఆంటోనిట్టేసుడిగాలి సుధీర్కొమురం భీమ్భారతదేశంలో సెక్యులరిజంశ్రీశైల క్షేత్రంకోల్‌కతా నైట్‌రైడర్స్సిరికిం జెప్పడు (పద్యం)🡆 More