ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ (గతంలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ , విండోస్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, సాధారణంగా IE లేదా MSIE అని సంక్షిప్తీకరించబడింది) అనేది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన గ్రాఫికల్ వెబ్ బ్రౌజర్‌ల శ్రేణి.
ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ శ్రేణికొరకు 1995 కాలంలో తొలిగా విడుదలైంది. ఇది మొదట యాడ్-ఆన్ ప్యాకేజీ 'ప్లస్ ఫర్ విండోస్ 95'లో భాగంగా విడుదల చేయబడింది. తరువాతి సంస్కరణలు ఉచిత దింపుకోళ్లుగా లేదా సేవా ప్యాక్‌లలో లభించాయి. తరువాత విండోస్ 95 యొక్క అసలు పరికరాల తయారీదారు (OEM) సేవా విడుదలలలో, విండోస్ కొత్త రూపాలలో ఇది అందుబాటులోకి వచ్చింది. దీని అభివృద్ధి 2016 లో నిలిపివేయబడింది, కానీ వాడుకరుల సేవలు ఆగస్టు 2020 వరకు కొనసాగాయి. మైక్రోసాఫ్ట్ ఎడ్జి విహరిణి వున్నందున ఆగస్టు 2021 లో సేవలు నిలిపివేయబడతాయని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | థామస్ రియర్డన్ |
---|---|
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | మైక్రోసాఫ్ట్ |
ప్రారంభ విడుదల | ఆగస్టు 16, 1995 [dubious ] |
Final release(s) | |
సాఫ్టువేరు ఇంజను లు | Trident, Chakra |
ఆపరేటింగ్ సిస్టం | విండోస్ (గతంలో: Mac OS X, Solaris, HP-UX) |
ప్లాట్ ఫాం | IA-32, x86-64, ARMv7, IA-64 (గతంలో: MIPS, Alpha, PowerPC, 68k, SPARC, PA-RISC) |
Included with | Windows 95 OSR1 and later Windows NT 4 and later Windows Phone 7 through Windows Phone 8.1 Mac OS 8.1 through Mac OS X 10.2 Zune HD Xbox 360 Xbox One |
సాంకేతిక స్టాండర్డ్ | HTML5, CSS3, WOFF, SVG, RSS, Atom, JPEG XR |
అందుబాటులో ఉంది | 95 భాషలు |
రకం | విహరిణి ఫీడ్ రీడర్ |
లైసెన్సు | హక్కులపై యాజమాన్యం గలది, విండోస్ లైసెన్స్ వుంటే అంతిమ వినియోగదారులు వాడవచ్చు |
జాలస్థలి | support |
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఒకప్పుడు ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్. 2003 నాటికి ఇది 95% వినియోగ వాటాను సాధించింది. 1990 లలో ప్రబలమైన బ్రౌజర్‌గా ఉన్న నెట్‌స్కేప్‌కు వ్యతిరేకంగా మొదటి బ్రౌజర్ యుద్ధాన్ని గెలవడానికి మైక్రోసాఫ్ట్ విండోస్ తో జతగా విడుదలచేసిన తరువాత ఇది జరిగింది. ఫైర్‌ఫాక్స్ (2004), గూగుల్ క్రోమ్ (2008) ప్రారంభించడంతో, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు మద్దతు ఇవ్వని ఆండ్రాయిడ్, ఐఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లకు పెరుగుతున్న ప్రజాదరణతో దీని వినియోగ వాటా క్షీణించింది. అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ యొక్క మార్కెట్ వాటా 2.28% లేదా స్టాట్‌కౌంటర్ సంఖ్యల ద్వారా 7 వ స్థానంలో వుంది. డెస్క్‌టాప్‌లో, మాకోస్ సఫారి తరువాత ఇది 5% వద్ద 4 వ స్థానంలో ఉంది. దీని గణాంకాలను తరువాత విడుదలైన ఎడ్జ్‌తో కలిపినప్పుడు ఇది క్రోమ్ తరువాత రెండవ ర్యాంకును చేరుకుంటుంది (ఇతర అధ్యయనాలలో ఫైర్‌ఫాక్స్ తరువాత, 7.44%తో ఇది 3 వ స్థానంలో ఉన్నట్లు నిర్ణయించారు.) 1990 ల చివరలో మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కోసం సంవత్సరానికి US$10 కోట్లు ఖర్చు చేసింది, 1999 నాటికి ఈ ప్రాజెక్టులో 1,000 మందికి పైగా పాల్గొన్నారు.
మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ తన విండోస్ 10 పరికరాల్లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను అప్రమేయ బ్రౌజర్‌గా మారుస్తుందని 2015 మార్చి 17 న ప్రకటించింది (పాత విండోస్‌కు మద్దతు ప్రకటించినప్పటి నుండి As of 2019[update] ఎడ్జ్ ఇప్పటికీ IE కంటే తక్కువ వాటాను కలిగి ఉంది). ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 ను చివరి విడుదలగా ప్రకటించింది (అయితే IE 8, 9, 10 కూడా 2019 నాటికి భద్రతా నవీకరణలు అందుబా టులో వుంటాయి). ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ విండోస్ 10, విండోస్ సర్వర్ 2019 లో ప్రధానంగా సంస్థల ఉపయోగార్ధం ఉంది. 2016 జనవరి 12 నుండి, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 కి మాత్రమే మద్దతు ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సాంకేతిక సామర్థ్యాలు, దాని మద్దతు జీవితచక్రం ఆధారంగా మద్దతు మారుతుంది.
మూడవ పార్టీ సాంకేతిక పరిజ్ఞానం ( స్పైగ్లాస్ మొజాయిక్ యొక్క సోర్స్ కోడ్, ప్రారంభ సంస్కరణల్లో రాయల్టీ లేకుండా ఉపయోగించబడింది) వలన భద్రత, గోప్యతా దుర్బలత్వం అనే విమర్శలు ఎదుర్కొంది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు,, యూరోపియన్ సమాఖ్య విండోస్‌తో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అందచేయటం సముచితమైన విహరిణిల పోటీకి హాని కలిగించాయని పేర్కొన్నాయి.
This article uses material from the Wikipedia తెలుగు article ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.