క్రియేటివ్ కామన్స్

క్రియేటివ్ కామన్స్ (సీసీ) అమెరికాకు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ.

సృజనాత్మక రచనలను ప్రోత్సహించి వాటిని మరింతమందికి చేరేలా చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని. ఈ సంస్థ పలు కాపీరైట్ సంబంధిత లైసెన్సులను జనసామాన్యానికి ఉచితంగా అందుబాటులో తెచ్చింది. ఈ లైసెన్సులను వాడి రచయితలు వారి కృతులపై కొన్ని హక్కులను సడలించి సాధారణ జనాలకు అందుబాటులోకి తేవచ్చును. ఏ హక్కులను సాధారణ ప్రజలకోసం సడలిస్తున్నారో, ఏ హక్కులను తమ వద్దనే ఉంచేసుకుంటున్నారో వేరు వేరుగా తెలపవచ్చు. ఈ విషయాలను తెలిపేందుకు విశేష చిహ్నాలతో కూడిన బొమ్మలు లేదా ఆయా హక్కులను తెలిపే పొడి అక్షరాలను వాడవచ్చు. క్రియేటివ్ కామన్స్ రచయితకున్న కాపీ హక్కులను తొలగించదు, ఆ హక్కులను మరింత వివరిస్తుంది. సర్వ స్వామ్యహక్కులు అన్న పదానికి తెర తీస్తూ, లిఖిత పూర్వక ముందస్తు అనుమతి అన్న పంథాను మార్చివేస్తూ; రచయితకూ-రచనను వాడుకునే వ్యక్తికి మధ్య సంబంధాన్ని విస్తృత పరుస్తుంది. అనగా రచనను వాడుకోవాలనుకునే వ్యక్తి అవసరమున్నపుడు రచయితను సంప్రదించి అనుమతి తీసుకునే పద్ధతి కాకుండా, రచయితే తన రచనను స్వయంగా వాడుకోవచ్చు అని ముందస్తుగా ప్రకటన చేయడం. ఇందువలన అనవసరపు ఖర్చు, అనవసరపు సంప్రదింపులు తొలగిపోతాయి. తద్వారా రచయితకూ, వాడుకుంటున్న వ్యక్తికీ ఇద్దరికీ లాభం చేకూరుతుంది. వికీపీడియా ఈ లైసెన్సుల్లో ఒకదాన్ని వాడుతుంది.

క్రియేటివ్ కామన్స్
Wiki తెలుగుCreative Commons logo
స్థాపన2001; 23 సంవత్సరాల క్రితం (2001)
వ్యవస్థాపకులులారెన్స్ లెస్సీగ్
కేంద్రీకరణనకలు హక్కులను మరింత విస్తృత పరచడం
పద్ధతిక్రియేటివ్ కామన్స్ లైసెన్సు
ముఖ్యమైన వ్యక్తులురయాన్ మర్క్లీ, సీఈఓ
జాలగూడుhttp://creativecommons.org

ఈ సంస్థ 2001లో, సెంటర్ ఫర్ పబ్లిక్ డొమెయిన్ అనే సంస్థ సహాయంతో, లారెన్స్ లెసీగ్, హాల్ ఏబెల్సన్, ఎరిక్ ఎల్డ్రెడ్ ద్వారా స్థాపించబడింది. ఫిబ్రవరి 2002లో క్రియేటివ్ కామన్స్ గురించిన మొట్టమొదటి వ్యాసం వెలువడింది. ఇది హాల్ ప్లాట్కిన్ అనే వ్యక్తి వ్రాసారు. డిసెంబరు 2002 లో మొదటి దఫా లైసెన్సులను జారీ చేసారు. మనకు ఈనాడు తెలిసిన క్రియేటివ్ కామన్స్ లైసెన్సులను రూపొందించిన వారిలో మోలీ షాఫర్ వాన్ హౌవెలింగ్, గ్లెన్ ఓటిస్ బ్రౌన్, నీరు పహాడియా, బెన్ అడీడా ఉన్నారు. 2003లో అంతకుముందు 1998 నుండి నడపబడుతున్న ఓపెన్ కంటెంట్ ప్రాజెక్టును డేవిడ్ ఎ వైలీ క్రియేటివ్ కామన్స్ లో విలీనం చేసి, క్రియేటివ్ కామన్స్ ను పాత ప్రాజెక్టుకు రూపాంతరం అని తెలుపుతూ ఆ సంస్థ నిర్దేశకుడిగా చేరారు. మాథ్యూ హాఘే, ఆరన్ ష్వార్జ్ కూడా ఈ సంస్థ తొలినాళ్ళలో తమ వంతు సహకారం అందించారు.

జనవరి 2016 నాటికి 110 కోట్ల కృతులు వివిధ రకాల క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల్లో అందుబాటులో ఉన్నాయి. మార్చి 2015 కి ఫ్లికర్ లో 30.6 కోట్ల ఫోటోలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో ఉన్నాయి. క్రియేటివ్ కామన్స్ నిర్వహణ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద్వారా జరుగుతుంది. రచయితలు వారి సొంత రచనలపై గల నకలు హక్కులను మరింత ప్రభావవంతంగా వాడటానికి ఈ లైసెన్సులు దోహదపడటం వలన ఎందరో ఈ లైసెన్సులను ఆదరిస్తున్నారు.

లక్ష్యం, ప్రభావం

క్రియేటివ్ కామన్స్ 
లారెన్స్ లెసీగ్ (January 2008)
క్రియేటివ్ కామన్స్ 
క్రియేటివ్ కామన్స్ జపాన్ సెమినార్, టోక్యో (2007)
క్రియేటివ్ కామన్స్ 
సీసీ కొన్ని హక్కుల భద్రం
క్రియేటివ్ కామన్స్ 
గ్రనాడాలోని ఒక పబ్ లో ఉన్న ఒక నోటీస్. ఆ పబ్ లో వినబడే సంగీతం క్రియేటివ్ కామన్స్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉందని తెలుపుతోంది.

క్రియేటివ్ కామన్స్ కాపీలెఫ్ట్ ఉద్యమ స్ఫూర్తిని అందిపుచ్చుకోవటంలో ముందంజలో ఉందని పరిగణిస్తారు. కాపీలెఫ్ట్ అంటే సర్వస్వామ్యహక్కులు నిర్బంధించే కాపీరైట్ అనే ధోరణికి విరుద్ధంగా మొదలైన ఒక ఉద్యమం.

మూలాలు

బయటి లంకెలు

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

క్రియేటివ్ కామన్స్  [[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
క్రియేటివ్ కామన్స్  [[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
క్రియేటివ్ కామన్స్  [[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
క్రియేటివ్ కామన్స్  [[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
క్రియేటివ్ కామన్స్  [[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
క్రియేటివ్ కామన్స్  [[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

Tags:

వికీపీడియాసంస్థహక్కు

🔥 Trending searches on Wiki తెలుగు:

అంగారకుడు (జ్యోతిషం)కేంద్రపాలిత ప్రాంతంలైంగిక విద్యసిద్ధార్థ్తిరుమలఅమెరికా సంయుక్త రాష్ట్రాలుపంచారామాలుచిలుకూరు బాలాజీ దేవాలయంఖండంద్వంద్వ సమాసమురైతురత్నంశ్రీలలిత (గాయని)మహేంద్రసింగ్ ధోనివిజయవాడశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)యాదవపూర్వాభాద్ర నక్షత్రముక్రికెట్విటమిన్ బీ12తొలిప్రేమదశావతారములుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్విష్ణువుదొమ్మరాజు గుకేష్సుడిగాలి సుధీర్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంకె. విజయ భాస్కర్పాండవులునాగార్జునకొండగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంసవర్ణదీర్ఘ సంధినారా చంద్రబాబునాయుడుశివుడుచిరంజీవులుసౌందర్యమంగళవారం (2023 సినిమా)నువ్వుల నూనెవిజయ్ దేవరకొండభారత జాతీయ కాంగ్రెస్ఉపనయనముపక్షవాతంపిత్తాశయమువై.యస్. రాజశేఖరరెడ్డినానార్థాలుఅమ్మసచిన్ టెండుల్కర్తెలుగుదేశం పార్టీషారుఖ్ ఖాన్కొమర్రాజు వెంకట లక్ష్మణరావుఆహారంబాలకాండఝాన్సీ లక్ష్మీబాయికొణతాల రామకృష్ణసెక్స్ (అయోమయ నివృత్తి)గజము (పొడవు)అంగన్వాడితమన్నా భాటియామధుమేహంభారత జాతీయగీతంసీ.ఎం.రమేష్వినోద్ కాంబ్లీకోదండ రామాలయం, ఒంటిమిట్టసంభోగంబెంగళూరుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోరకుల్ ప్రీత్ సింగ్నాని (నటుడు)నువ్వు నేనుట్విట్టర్ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాధర్మవరం శాసనసభ నియోజకవర్గంపద్మశాలీలుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుట్రూ లవర్కాళోజీ నారాయణరావువై.ఎస్.వివేకానందరెడ్డిఈనాడు🡆 More