కనెటికట్

కనెటికట్ అమెరికా లోని రాష్ట్రం.

ఈ రాష్ట్రం ఈశాన్య అమెరికా లోని న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో ఉంది. 1614 లో డచ్ వారి ఆధీనంలో ఉన్నప్పటికీ 1636 వ సంవత్సరానికి కనెటికట్ బ్రిటిషువారి ఏలుబడి లోనికి వచ్చింది. అమెరికా స్వతంత్ర పోరాటంలో బ్రిటిషు వారిపై తిరుగుబాటు చేసిన పదమూడు కాలనీలలో కనెటికట్ కూడా ఒకటి. కనెటికట్ వాసులను నట్ మెగ్గర్లు అని కానీ, యాంకీలు అనిగానీ పిలుస్తారు. అమెరికా జనాభా లెక్కల ప్రకారం కనెటికట్ అమెరికాలోకెల్లా అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. దీని రాజధాని హార్ట్‌ఫోర్డ్.

కనెటికట్
అమెరికా పటంలో కనెటికట్ రాష్ట్రం

దీనికి తూర్పున రోడ్ ఐలండ్, ఉత్తరాన మస్సాచుసెట్స్, పశ్చిమాన న్యూయార్కు, దక్షిణాన లాంగ్ ఐలండ్ సౌండ్ ఉన్నాయి. రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తూ ప్రవహించే కనెటికట్ నది పేరు మీదుగా రాష్ట్రానికి ఈ పేరు వచ్చింది.

విస్తీర్ణం పరంగా కనెటికట్, అమెరికా లోని మూడవ అతిచిన్న రాష్ట్రం. జనాభా పరంగా 29 వ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాల్లో నాలుగవది. రాజ్యాంగ రాష్ట్రం అని, నట్ మెగ్ రాష్ట్రం అనీ, ప్రొవిజన్స్ రాష్ట్రం అనీ, స్థిరమైన అలవాట్లు గల రాష్ట్రం అనీ ఈ రాష్ట్రానికి పేర్లున్నాయి. అమెరికా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను రూపొందించడంలో కనెటికట్ పాత్ర ప్రముఖమైనది.

కనెటికట్‌లో తొలి వలసలను స్థాపించిన ఐరోపావాసులు డచ్చి వారు. రాష్ట్రంలోని సగం డచ్చి వారి వలస, న్యూ నెదర్లాండ్‌లో భాగంగా ఉండేది. 1630 ల్లో ఇంగ్లీషు వారు తమ తొలి వలసను స్థాపించారు.

2019 జూలై 1 నాటికి కనెటికట్ జనాభా 35,65,287. 2010 నుండి ఇది 0.25% తగ్గింది.

రాష్ట్రం లోని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లోని చాలాభాగం న్యూయార్కు నగరంతో ముడిపడి ఉంది. అత్యధికంగా సంపద పోగుపడీన ప్రదేశం. ఆస్తుల ధరలు చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం. 2019 సంవత్సరానికి కనెటికట్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి $289 బిలియన్లు. 2018 లో ఇది $277.9 బిలియన్లు ఉండేది. 2019 లో రాష్ట్ర తలసరి ఆదాయం $79,087. అమెరికాలోనే ఇది అత్యధికం. అయితే వివిధ వర్గాల ప్రజల ఆదాయంలో చాలా పెద్ద అంతరం ఉన్న రాష్ట్రం ఇది. ఆర్థిక సేవల రంగానికి ఈ రాష్ట్రం పేరుపొందింది. హార్ట్‌ఫోర్డ్ లో ఇన్స్యూరెన్సు కంపెనీలు, ఫెయిర్‌ఫీల్డ్ కౌంటీలో హెడ్జి ఫండ్లూ విస్తరించాయి.


మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలున్యూ ఇంగ్లండ్

🔥 Trending searches on Wiki తెలుగు:

పురాణాలుకస్తూరి రంగ రంగా (పాట)అక్కినేని నాగార్జుననవరత్నాలు (పథకం)పసుపు గణపతి పూజసజ్జల రామకృష్ణా రెడ్డిచార్మినార్గోపరాజు సమరంగుంటకలగరపుట్టపర్తి నారాయణాచార్యులుమధుమేహంట్యూబెక్టమీభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారత స్వాతంత్ర్యోద్యమంవృషణంసీతారామ కళ్యాణం (1961 సినిమా)ఆంధ్రప్రదేశ్ శాసనమండలిహైదరాబాదు చరిత్రతెలుగు అక్షరాలుభారతదేశంలో బ్రిటిషు పాలనఛందస్సుపూర్వ ఫల్గుణి నక్షత్రముజన్యుశాస్త్రంరోజా సెల్వమణివిజయవాడతెలంగాణ రాష్ట్ర సమితినువ్వొస్తానంటే నేనొద్దంటానాసరస్వతిపద్మశాలీలుఅన్నమయ్యభారత జాతీయ ఎస్టీ కమిషన్ఆయాసంతెలుగు సినిమావృశ్చిక రాశిఆనందరాజ్అష్ట దిక్కులురాజనీతి శాస్త్రముకుమ్మరి (కులం)శాసన మండలిమక్కాగోదావరిహలో గురు ప్రేమకోసమేకపిల్ సిబల్శతభిష నక్షత్రముకంటి వెలుగురాజమండ్రిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావయ్యారిభామ (కలుపుమొక్క)రంగమర్తాండకళ్యాణలక్ష్మి పథకంసమతామూర్తిమహాత్మా గాంధీఅంబ (మహాభారతం)శ్రీశైల క్షేత్రంతెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాయాగంటినారా చంద్రబాబునాయుడుతెలంగాణా బీసీ కులాల జాబితాపార్శ్వపు తలనొప్పిఆశ్లేష నక్షత్రముమాదయ్యగారి మల్లనతెలుగునాట ఇంటిపేర్ల జాబితాఆల్బర్ట్ ఐన్‌స్టీన్నందమూరి బాలకృష్ణపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)జయలలిత (నటి)సురేఖా వాణిఫ్లిప్‌కార్ట్రాధిక శరత్‌కుమార్వేమూరి రాధాకృష్ణజైన మతంతోట చంద్రశేఖర్గురువు (జ్యోతిషం)ఖమ్మంకరక్కాయబొల్లినరసింహావతారంతిథిధర్మపురి అరవింద్🡆 More