షేక్ అబ్దుల్ ఖాదిర్ అల్-జీలానీ Shaikh 'Abd al-Qadir al-Jilani (పర్షియన్, ఉర్దూ : عبد القادرگیلانی, అరబ్బీعبد القادر الجيلانى ) (ఇంకనూ 'అబ్దుల్ ఖాదర్', 'అబ్ద్ అల్-ఖాదిర్', - జీలానీ, జిలానీ, గీలానీ, గిలానీ, జైలానీ, గైలానీ, అనీ పలుకుతారు) (1077 - 1166), ఇతను ప్రఖ్యాత సున్నీ ముస్లిం, సూఫీ, షేఖ్, సయ్యద్, హంబలీ పండితుడు.
ఇతను ఖాదరియా పాఠశాలను (పీఠం) స్థాపించాడు. భారతదేశంలో ఈ పాఠశాలకు చెందినవారు కోట్లకొలదీ గలరు. ఇతను ఇరాన్ లోని గీలాన్ అనే పట్టణంలో రంజాన్ నెలలో జన్మించాడు. గీలాన్ లో పుట్టాడు కావున గీలానీ అనే పేరూ వచ్చింది. ఇతను జునైద్ బగ్దాదీ ఆత్మజ్ఞాన పరంపరకు చెందినవాడు.
అబ్దుల్ ఖాదిర్ ఇస్లామీయ ప్రవక్త ఐన మహమ్మదు ప్రవక్త వంశానికి చెందినవాడు. తల్లి పెంపకంలో పెద్దవాడయ్యాడు. ఇతని తండ్రి అబూ సాలెహ్, హసన్ ఇబ్న్ అలీ వంశంనుండి, తల్లి హుసేన్ ఇబ్న్ అలీ వంశంనుండి వచ్చారు. తన 18వ ఏట 1095 లో బాగ్దాద్కు విద్యార్జన కొరకు బయలు దేరాడు. అబూ సయ్యద్ అలీ అల్-ముకర్రమీ నుండి ఫిఖహ్ జ్ఞానాన్నీ, అబూబక్ర్ బిన్ ముజప్ఫర్ నుండి హదీసుల జ్ఞానాన్నీ, అబూ ముహమ్మద్ జాఫర్ నుండి తఫ్సీర్ జ్ఞానాన్నీ అర్జించాడు.
సూఫీ తత్వంలో ఇతని గురువు షేక్ అబుల్-ఖైర్ హమ్మాద్ బిన్ ముస్లిం అల్-దబ్బస్. ఇతని ద్వారా తత్వజ్ఞానం పొందిన తరువాత తన సూఫీ యాత్రను కొనసాగించాడు. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత బాగ్దాదు నగరాన్ని వదలి, ఇరవై ఐదు సంవత్సరాలు ఇరాక్ లోని ఎడారి ప్రాంతాలలో తిరుగుతూ అల్లాహ్ను పొందే మార్గాలను అన్వేషించసాగాడు. తన యాభై అయిదవ యేట తిరిగి బాగ్దాదు నగరానికి వచ్చాడు. ప్రజలలో తిరుగుతూ, ఇస్లాం తత్వాన్ని, సూఫీ తత్వాన్ని ప్రజలకు బోధించసాగాడు. తన గురువుగారి పాఠశాలలో ప్రవేశించి బోధించసాగాడు. ఉదయసమయాన హదీసులు, తఫ్సీర్ లను, మధ్యాహ్న సమయాలలో ఖురాన్లో గల 'తసవ్వుఫ్' (దివ్యజ్ఞానాన్ని) బోధించ సాగాడు.
హి.శ. 521 నుండి 561 వరకూ ఇస్లాం సేవలో గడిపాడు. తాను ఎన్నో సమూహాలను తయారుచేసి ఇతర ప్రదేశాలకు తబ్లీగ్ కొరకు పంపాడు. 1128 లోభారత ఉప ఖండాన్ని సందర్శించాడు. ప్రస్తుత పాకిస్తాన్ లోని ముల్తాన్ లోనూ బస చేశాడు.
సా.శ. 1156 లో, (హి.శ. రబీఉల్ అవ్వల్ నెల, 8వ తేదీన, శనివారం రాత్రి), 89 సంవత్సరాల వయస్సులో మరణించాడు, ఇతనిని బాగ్దాదు లోని తన మదరసా లోనే ఖననం చేశారు.
ఇతని ముఖ్యమైన రచనలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఇతని సంస్మరణార్థం, ప్రపంచంలోని పలు దేశాలలోని ముస్లింలు, ఇతని పేరుతో ఉర్స్ కార్యక్రమాలు, "గ్యారహ్-వీం ఫాతెహా"లు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ముఖ్య ఘట్టాలు, గొర్రెలు లేదా మేకలను కోసి, చక్కటి ఆహార పదార్థాలను తయారు చేసి, పేదలతో సహపంక్తి భోజనాలు, అన్నదాన కార్యక్రమాలు, బంధుమిత్ర సమీకరణలూ , ఫాతెహా విందు కార్యక్రమాలూ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక విశేషమేమనగా ఈ ఉత్సవాలలో హిందూ-ముస్లిం సోదరులు కలసి ఈ ఫాతెహా కార్యక్రమాలను అమిత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. హిందూ-ముస్లిం తారతమ్యత అసలే కనపడని "సమైక్యతా" కార్యక్రమాలివి.
Author: Muhtar Holland (1935-) Year: 1994, Publisher: Kuala Lumpur : S. Abdul Majeed & Co, ISBN 1-88221-603-2
Author: ʿAlāʾ al-Dīn ʿAlī b. ʿAbd al-Malik al- Muttaqī al-Hindī (ca1480-1567) ; Muhtar Holland (1935-) Year: c1997 Edition: 1st ed Publisher: Hollywood, Fla : Al-Baz Pub ISBN 1-88221-616-4
Jalā al-Khawātir Author: Muhtar Holland (1935-) Year: c1997 Publisher: Ft. Lauderdale, Fla : Al-Baz Pub Extent: xxiii, 308 p Size: 22 cm ISBN 1-88221-613-X
Author: Muhammad Riyaz Qadiri Year: 2000, Publisher: Gujranwala : Abbasi Publications, Size: 22 cm, ISBN 969-851016-8
Year: 1998 Edition: 2nd ed, Publisher: Ft. Lauderdale : Al-Baz Publishing, ISBN 1-88221-602-4
'మీర్' వంశాలు, 'హబష్' వంశాలు, కుటుంబాలు ప్రపంచంలో పలుచోట్ల గలవు.
This article uses material from the Wikipedia తెలుగు article అబ్దుల్ ఖాదిర్ జీలాని, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.