వియత్నాం

వియత్నాం ఆగ్నేయ ఆసియాలోని ఒక దేశం.

2016 జనాభా లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 9 కోట్ల 46 లక్షలు. జనసంఖ్యలో ప్రపంచంలో 15 వ స్థానంలో, ఆసియాలో 9వ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన చైనా, వాయవ్యాన లావోస్, నైరుతిన కాంబోడియా, తూర్పు దిక్కున మలేషియా, ఫిలిప్ఫీన్స్, ఇండోనేషియా సరిహద్దులుగా ఉన్నాయి. 1976 లో ఉత్తర, దక్షిణ వియత్నాంలు కలిసిపోయినప్పటి నుంచి హనోయ్ నగరం రాజధానిగా ఉంది. హోచిమిన్ నగరం అత్యధిక జనాభా గల నగరం.

Cộng hòa Xã hội Chủ nghĩa Việt Nam
సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్‌నామ్
Flag of వియత్నాం వియత్నాం యొక్క Coat of arms
నినాదం
[Độc lập - Tự do - Hạnh phúc] Error: {{Lang}}: text has italic markup (help)
"స్వతంత్రం - స్వేచ్ఛ - సంతోషం"
జాతీయగీతం
Tiến Quân Ca
"పురోగమించే సైన్యం గీతం"

వియత్నాం యొక్క స్థానం
వియత్నాం యొక్క స్థానం
రాజధానిహానోయ్
21°2′N 105°51′E / 21.033°N 105.850°E / 21.033; 105.850
అతి పెద్ద నగరం హొ చి మిన్ సిటీ
అధికార భాషలు వియత్నమీస్
ప్రభుత్వం సోషలిస్ట్ రిపబ్లిక్ 1
 -  ప్రెసిడెంట్ Nguyễn Minh Triết
 -  ప్రధానమంత్రి Nguyễn Tấn Dũng
 -  జనరల్ సెక్రటరీ Nông Đức Mạnh
స్వతంత్ర దేశం ఫ్రాన్స్ నుండి 
 -  తేదీ సెప్టెంబరు2 1945 
 -  గుర్తించబడింది 1954 
విస్తీర్ణం
 -  మొత్తం 331,689 కి.మీ² (65వది)
128,065 చ.మై 
 -  జలాలు (%) 1.3
జనాభా
 -  జూలై 2005 అంచనా 85,238,000 (13వది)
 -  1999 జన గణన 76,323,173 
 -  జన సాంద్రత 253 /కి.మీ² (46వది)
655 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $251.8 billion (36వది)
 -  తలసరి $3,025 (123rd)
జినీ? (2002) 37 (medium) (59వది)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.709 (medium) (109వది)
కరెన్సీ đồng (₫) (VND)
కాలాంశం (UTC+7)
 -  వేసవి (DST)  (UTC+7)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .vn
కాలింగ్ కోడ్ +84
1 1992 రాజ్యాంగం , అధికారిక నామం ప్రకారం.

సా.శ.5వ శతాబ్దిలో ఇండోచైనాలో చంపా, కాంబోజ అనే ప్రాంతాల్లో హిందూ రాజ్యాలు నెలకొన్నాయి. 5వ శతాబ్ది నాటి వ్యు శాసనం నుంచి అంతకు రెండు మూడువందల యేళ్ళకు పూర్వమే హిందూ మతం వ్యాపించిందన్న విషయం తెలుస్తోంది. సంస్కృత, ప్రాకృత భాషల్లోని అనేకమైన పదాలు కూడా ఇక్కడి భాషల్లోకి వచ్చి చేరాయి.

చరిత్ర

పురాతన చరిత్ర

వియత్నాం 
A Đông Sơn bronze drum, circa 800 BC

పురాతత్వ పరిశోధకులు నిర్వహించిన త్రవ్వకాలలో లభించిన పాలియోలిథిక్ కాలం నాటి మానవ అవశేషాలు ప్రస్తుత వియత్నాం ప్రాంతంలో పాలియోలిథిక్ కాలం నుండి మానవులు నివసించారని భావిస్తున్నారు. ఉత్తర వియత్నాంలో ఉన్న " లాంగ్ సొన్ ప్రొవింస్ ", " న్ఘే ఏన్ ప్రొవింస్ " గుహలలో లభించిన " హోమో ఎరెడస్ " శిలాజాలు క్రీ.పూ 5,00,000 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. వియత్నాంలోని " మిడిల్ ప్లెయిస్టోసిన్ ప్రొవింస్ "లో లభించిన హోమోసాపైన్ శిలాజాలు , తాం ఓం , హాంగ్ హం ప్రాంతాలలో లభించిన దంతాల భాగాలు ఈశాన్య ఆసియాలో లభించిన అతిపురాతన శిలాజాలుగా భావిస్తున్నారు. లాటే ప్లెస్యిస్టోసెనె కాలం నాటి హోమోసాపైంస్ దంతాలు డాంగ్ కేన్, కౌంగ్ (1986), వద్ద లభించాయి. ఆరంభకాల హొలోసెనె శిలాజాలు మై డా డియూ, లాంగ్ గావో, కొలానీ (1927) , లాంగ్ కుయోం వద్ద లభించాయి.

క్రీ.పూ. 1000లో మా నది , రెడ్ నది ప్రాంతాలలో వరిపంట అభివృద్ధి , ఇత్తడి పోత పోయడం ఆరంభం అయింది. నదీమైదానాలు డాంగ్ సన్ సంస్కృతి విలసిల్లడానికి సహకారం అందించింది. ఈ సమయంలో రూపొందిచిన డాంగ్ సంగ్ డ్రంస్ గుర్తింపు పొందాయి. ఈ సమయంలో ఆరంభకాల వియత్నాం రాజ్యాలైన " వ్యాన్ లాంగ్ " , ఔ లాక్ రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఈ సంస్కృతి ప్రభావం " మారీటైం సౌత్ ఈస్ట్ ఆసియా " మొదలైన ఈశాన్య ఆసియాలోని ఇతర ప్రాంతాలలో క్రీ.పూ మొదటి సహస్రాబ్ధం అంతా విస్తరించింది.

అనువంశిక వియత్నాం

" హాంగ్ బాంగ్ " రాజవంశానికి చెందిన హంగ్ రాజులు మొదటి వియత్నాం రాజులని భావిస్తున్నారు. వీరు వియత్నామీయులు వాన్ లాగ్ అని అనేవారు. క్రీ.పూ 257లో చివరి హంగ్ రాజును థుక్ ఫాన్ ఓడించాడు. థుక్ ఫాన్ లాక్ వియట్ , ఔ వియట్ గిరిజన జాతులను సమైక్యం చేసి ఔ లాక్ రూపొందించి తనకుతానుగా " యాన్ డురాంగ్ వురాంగ్ "గా ప్రకటించుకున్నాడు. క్రీ.పూ. 207 లో చైనీస్ జనరల్ " ఝావో టూవో " యాన్ డూరాంగ్ వురాంగ్ ఓడించి ఔ లాక్ ఇంటో నాన్యూలతో సమైక్యం చేసాడు.అయినప్పటికీ నాన్యూ దక్షిణంగా విస్తరించి " హాన్ - నాన్యూ యుద్ధం " తరువాత క్రీ.పూ 111 నాటికి చైనా హాన్ సామ్రాజ్యంతో విలీనం చేయబడింది.

వియత్నాం 
Map of Vietnam showing the conquest of the south (the Nam tiến), 1069–1757
  900
  1100
  1475
  1650
  1760

తరువాత వెయ్యి సంవత్సరాలు ప్రస్తుత ఉత్తర వియత్నాం చైనీయుల ఆధిక్యతలో కొనసాగింది. స్వతంత్రసమరం ఆరంభకాలంలో ట్రంగ్ సిస్టర్లు , లేడీ ట్రియూ స్వల్పకాల విజయం సాధించారు. అయినప్పటికీ సా.శ. 544 , 602 మద్య కాలంలో యాంటిరియర్ లీ రాజవంశానికి చెందిన వ్యాన్ క్సుయాన్ కాలంలో ఈ ప్రాంతానికి దీర్ఘకాల స్వాతంత్ర్యం లభించింది. 10శతాబ్దం నాటికి వియత్నాం ఖుక్ కుటుంబం ఆధ్వర్యంలో స్వయంప్రపత్తి సాధించింది. క్రీ.పూ. 738 లో వియత్నామీయుల ప్రభువు " నాగో క్యుయెన్ " బాక్ డాంగ్ (938) యుద్ధంలో చైనీయుల సదరన్ హాన్ రాజ్య సైన్యాలను ఓడించి వెయ్యి సంవత్సరాల చైనీయుల ఆధిపత్యం నుండి వియత్నాంకు పూర్తి స్వాతంత్ర్యం సాధించాడు. తరువాత ఈ ప్రాంతానికి " డై వియట్ " (గ్రేట్ వియట్) తిరిగి నామకరణం చేసాడు. తరువాత వియత్నాంలో లీ , ట్రాన్ రాజవంశం ఆధ్వర్యంలో స్వర్ణయుగం ఆరంభం అయింది. ట్రాన్ రాజవంశం పాలనలో డై వియట్ మూడు మంగోలియన్ దాడులను తిప్పికొట్టింది. ఈ సమయంలో వియత్నాంలో బౌద్ధమతం ప్రవేశించి విలసిల్లి మెల్లగా దేశీయమతంగా మారింది.1406-1407 మద్య కాలంలో మింగ్- హో యుద్ధంలో మింగ్ రాజవంశం హో రాజవంశాన్ని తొలగించి నాలుగవమారు వియత్నాం మీద తిరిగి ఆధిక్యత సాధించింది. తరువాత లీ లోయి (లీ రాజవంశ స్థాపకుడు) వియత్నాం స్వాత్రంత్రం తిరిగి సాధించాడు. వియత్నాం రాజవంశాలు 15వ శతాబ్దంలో (ప్రత్యేకంగా లీ తాన్ తాంగ్ 1460-1497) అత్యున్నత స్థాయికి చేరుకుంది. 11-18 శతాబ్ధాల మద్య వియత్నాం దక్షిణదిశగా విస్తరించింది. చివరకు కేమర్ సాంరాజ్యపాలనలో చంపా రాజ్యం మీద విజయం సాధించారు.

అంతఃకలహాలు

16 వ శతాబ్దంలో అంతర్యుద్ధాలు , రాజకీయ సంఘర్షణలు వియత్నాం క్షీణతకు దారితీసాయి. మొదటిగా లీ రాజవంశపాలనను చైనీయుల మద్దతుతో " మాక్ రాజవంశం సవాలు చేసింది. మాక్ రాజవంశం ఓటమి తరువాత లీ రాజవంశపాలన నామమాత్రంగా పునఃస్థాపించబడింది. అయినప్పటికీ అసలైన అధికారం మాత్రం ఉత్తర ప్రాంతంలోని ట్రిన్ లార్డులు, దక్షిణప్రాంతం లోని మద్య విభజించబడింది. తరువాత 1670లో సంధిజరిగే వరకు ఆయన నాలుగు దశాబ్ధాల కాలం అనర్యుద్ధానికి ప్రోత్సాహం ఇచ్చాడు. తరువాత ఈసమయంలోనే న్గూయెన్ దక్షిణ వియత్నాంలో మెకాంగ్ నదీమైదానం వరకు విస్తరించి సెంట్రల్ హైలాండ్, ఖెమర్ భూములతో విలీనం చేసాడు. టే సొన్ సోదరులు రాజ్యస్థాపన చేసేవరకు ఈ విభాగం ఒక శతాబ్ధకాలం అలాగే కొనసాగింది. అయినప్పటికీ వారి పాలన స్వల్పకాలంలోనే ముగిసింది. ట్రై సొన్ సోదరులను గియా లాంగ్ నాయకత్వంలో ఫ్రెంచ్ సహాయంతో న్గూయెన్ ప్రభువులు ఓడించారు. న్గూయెన్ అన్న్ వియత్నాంను సమైక్యపరిచి న్గూయెన్ రాజవంశాన్ని స్థాపించి గియా లాంగ్ పేరిట పరిపాలన కొనసాగించాడు.

1862–1945: ఫ్రెంచ్ ఇండోచైనా

వియత్నాం స్వతంత్రాన్ని క్రమంగా ఫ్రెంచ్ వారు తుడిచిపెట్టారు. ఫ్రెంచ్ వారు కాథలిక్ సైనికులతో 1859, 1862 మద్య వియత్నాం మీద వరుస దాడులు చేసారు. దక్షిణ భూభాగం ఫ్రెంచి కాలనీగా (ఫ్రెంచి కూచిన్ చీనా) మారింది. 1884 నాటికి మొత్తం భూభాగం ఫ్రెంచి పాలనలోకి మారింది. మద్య, ఉత్తర భూభాగాలు అన్నం, ట్రోకిన్ రక్షణలోకి మారింది. మూడు వియత్నామీ భూభాగాలు 1887లో ఫ్రెంచి ఇండోచైనా పేరుతో సమైక్యపరచబడ్డాయి. ఫ్రెంచి నిర్వాహకులు వియత్నాంలో గణనీయంగా రాజకీయ, సాంస్కృతిక మార్పులను ప్రవేశపెట్టారు. పాశ్చాత్య శైలిలో ఆధునికతరహా విద్య అభివృద్ధి చేయబడుతుంది. అలాగే రోమన్ కాథలిజం దేశం అంతటా వ్యాపించింది. ఇండోచైనాలో స్థిరపడిన ఫ్రెంచి ప్రజలు కూచించీనా ప్రాంతంలో (ప్రత్యేకంగా సైగాన్ ప్రాంతంలో) కేంద్రీకృతం అయ్యారు. రాచరిక వ్యవస్థకు అనుకూలంగా ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా " కేన్ వురాంగ్ ఉద్యమం " మొదలైంది. దశాబ్ధాల కాలం కొనసాగిన ఉద్యమం 1890లో ఓటమికి గురైంది. కేన్ వురాంగ్ ఉద్యమానికి చెందిన గొరిల్లాలు ఈ సమయంలో వియత్నాం క్రైస్తవులలో మూడవవంతు మందిని హత్యచేసారు.

వ్యవసాయ సంబంధిత ఆర్థికవిధానంలో భాగంగా పొగాకు, ఇండిగో, తేయాకు, కాఫీ పంటలు ప్రోత్సహించబడ్డాయి. వియత్నామీయుల స్వీయప్రభుత్వం, పౌరహక్కుల పిలుపును ఫ్రెంచి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తరువాత ఫాన్ బొయి చౌ, ఫాన్ చౌ ట్రింహ్, ఫాన్ దిన్ ఫంగ్, హాం న్ఘి, హో చీ మిన్ మొదలైన ప్రభువుల నాయత్వంలో జాతీయ రాజకీయ ఉద్యమం మొదలైంది. అయినప్పటికీ 1930లో వియట్ నాం కుయాట్ డాన్ డాంగ్‌కు చెందిన యెన్ బాయి ఉద్యమం సులభంగా అణిచివేయబడింది. రెండవ ప్రపంచ యుద్ధం వరకు ఫ్రెంచిప్రభుత్వం పూర్తి నియంత్రణను నిలబెట్టుకుంది. పసిఫిక్ యుద్ధం ఇండోచైనా మీద జపానీయుల దాడికి (1940) దారితీసింది. తరువాత జపాన్ సంరాజ్యం తమ సైనిక బృందాలను వియాత్నాంలో మకాం చేయడానికి అనుమతించింది. " వించీ ఫ్రాన్స్ " ఫ్రెంచి కాలనీ అడ్మినిస్ట్రేషన్‌కు వియత్నాం అనుమతి కొనసాగింది. జపాన్ తమ సైనిక బృందాలకు అవసరమైన సహజసంపదను విపరీతంగా వాడుకున్నది. ఇది ఫ్రెంచి ఇండోచైనా మీద నియంత్రణ కొరకు ఉద్యమించడానికి (1945) దారితీసింది. 1945లో వియత్నాంలో సంభవించిన కరువు ఒక మిలియన్ ప్రజల మరణానికి కారణం అయింది.

1946–54: మొదటి ఇండోచైనా యుద్ధం

1941లో మార్కిస్ట్- లెనినిస్ట్ రివల్యూషనరీ నాయకత్వంలో వియట్ మిన్ (కమ్యూనిస్ట్, నేషనలిస్ట్ లిబరేషన్ మూవ్మెంట్ ) ప్రారంభం అయింది. వియత్నాంలో జపాన్ ఆక్రమణ తొలగించడానికి, ఫ్రెంచి ఆధిక్యత నుండి వియత్నాంకు విముక్తి కలిగించడానికి ఈ ఉద్యమం మొదలైంది. 1945లో జపాన్ సైన్యం ఓటమి, వితత్నాంలో జపాన్ పప్పెట్ సామ్రాజ్యం పతనం తరువాత వియట్ మిన్ హనోయీని ఆక్రమించుకుని ప్రొవిషనల్ ప్రభుత్వాన్ని ప్రకటించింది. ఇది సెప్టెంబరు 2 న జాతీయ స్వాతంత్ర్యాన్ని నొక్కిచెప్పింది. అదే సంవత్సరం ఫ్రెంచి రిపబ్లిక్ ప్రొవిషనల్ ప్రభుత్వం వియత్నాంలో ఫ్రెంచి కాలనీ పాలన పునఃస్థాపన చేయడానికి ఫ్రెంచి ఫార్ ఈస్ట్ ఎక్స్పెడిషనరీ కార్ప్స్‌ను పంపింది. 1946 వియట్ మిన్ ఫ్రెంచి సైన్యం మీద గొరిల్లా దాడి చేసింది. ఫలితంగా మొదలైన ఇండోచైనా యుద్ధం 1954 వరకు కొనసాగింది. 1954లో సంభవించిన " డీయిన్ బీయిన్ ఫూ యుద్ధం "లో ఫ్రెంచి , వియత్నామీస్ నేషనల్ ఆర్మీ ఓటమి పొందిన తరువాత హోచిన్ మిన్ రాజీపడి యుద్ధవిరమణకు అంగీకారం తెలిపాడు.జెనీవా సమావేశం తరువాత ఫ్రెంచి కాలనీ ప్రభుత్వపాలన ముగింపుకు వచ్చింది. తరువాత 1954లో ఇండోచైనా ప్రభుత్వం రద్దుచేయబడింది. తరువాత లాయలిస్ట్ సైన్యాలు కమ్యూనిస్టులతో విడిపోయారు.

విభజన తరువాత రెండు దేశాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఉత్తర వియత్నాంలో " హోచీ మిన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం " , దక్షిణ వియత్నాంలో చక్రవర్తి బావో డై ఆధ్వర్యంలో " స్టేట్ ఆఫ్ వియత్నాం " ఏర్పాటు చేయబడ్డాయి. ఆపరేషన్ పాసేజ్ టు ఫ్రీడం (300 డే పీరియడ్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంటు ) సమయంలో ఒక మిలియన్ మంది ప్రజలు (ప్రధానంగా కాథలిక్కులు ) కమ్యూనిస్టుల ఊచకోతకు భయపడి ఉత్తర వియత్నాం నుండి దక్షిణ వియత్నాంకు పారిపోయారు.

వియత్నాం 
French Indochina in 1913

జెనీవా సమావేశంలో వియత్నాం విభజన శాశ్వతంగా ఉండాలని నిర్ధేశించబడలేదు. 1956 ఎన్నికల తరువాత అది తిరిగి సమైక్యం కావాలని సూచించింది. అయినప్పటికీ 1955లో స్టేట్ ఆఫ్ వియత్నాం ప్రధానమంత్రి " న్గో డిన్ డీయం " తన సోదరుడి చేత మోసపూరిత ప్రజాభిప్రాయ సేకరణ చేసి తనకుతాను " రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం " అధ్యక్షునిగా ప్రకటించుకున్నాడు.

1954–1975: వియత్నాం యుద్ధం

వియత్నాం 
U.S. helicopter spraying chemical defoliants (probably Agent Orange) over the Mekong Delta, 1969

1950లో ప్రో - హనోయి వియట్ కాంగ్ డీయం ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గొరిల్లా యుద్ధం ఆరంభించింది. 1953 , 1956 మద్య కాలంలో వియత్నాం ప్రభుత్వం అద్దెమినహాయింపు , వియత్నాం భూసంస్కరణలు అగ్రేరియన్ సంస్కరణలు ప్రారంభించాడు. ఇవి రాజకీయ వత్తిడిని అధికం చేసింది. భూసంస్కరణల సమయంలో ఉత్తర వియత్నాంలో 160 మందిలో ఒకరు మరణశిక్షకు గురైయ్యారు. దేశం మొత్తంలో 1,00,000 మరణశిక్షలు అమలయ్యాయి. ప్రధానంగా రెడ్ నదీమైదానంలో మరణశిక్షలు అధికంగా విధించబడ్డాయి. ఈ ప్రాంతంలో దాదాపు 50,000 మరణశిక్షలు విధించబడ్డాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ వియాత్నాం , హంగేరియన్ ఆర్చివ్స్‌లో ఉన్న వర్గీకరించని దస్తావేజులు (డాక్యుమెంట్లు) మాత్రం నివేదికలో వెల్లడించిన దానికంటే తాక్కువ సంఖ్యలో మరణశిక్షలు విధించబడ్డాయని అవి 13,500 కంటే అధికంగా ఉన్నాయని వివరిస్తున్నాయి. 1960 , 1962 మద్య సోవియట్ యూనియన్ , వియత్నాంలు అదనపు సోవియట్ సహకారం కొరకు ఒప్పందం మీద సంతకాలు చేసాయి. దక్షిణ వియత్నాంలో ఉత్తర వియత్నాం దక్షిణవియత్నాంను కూలద్రోయడానికి (1956లో 450 మంది దక్షిణ వియత్నాం అధికారులను కాల్చివేయడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి) ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకు ప్రతిచర్యగా దక్షిణ కొరియా కమ్యూనిష్టులుగా అనుమానించబడిన లక్షలాది మందిని అదుపులోకి తీసుకుని " పొలిటికల్ రీ ఎడ్యుకేషన్ సెంటర్లు " లోచేర్చింది. ఈ చర్యలలో కమ్యూనిస్టులు కానివారిని కూడా ఖైదు చేయబడినప్పటికీ దేశంలో కమ్యూనిస్టు చర్యలు మాత్రం హరించబడ్డాయి. ఉత్తర వియత్నాం ప్రభుత్వం ఈ చర్యలలో 2,418 మంది చంపబడ్డారని (1957 నవంబరు నాటికి) విమర్శించింది. 1960 , 1962లో సోవియట్ యూనియన్ , నార్త్ వియత్నాం అదనపు సోవియట్ సైనిక మద్దతు కొరకు ఒప్పందం మీద సంతకం చేసాయి.1963లో డీయింస్ పాలనతో అసంతృప్తి చెందిన బౌద్ధులు సాగించిన అల్లర్లు ప్రభుత్వం హింసాత్మకచర్యలకు పూనుకొనడానికి దారితీసింది. ఈ చర్యల కారణంగా దక్షిణ వియత్నాం నాయకుడు డీయిం యునైటెడ్ స్టేట్స్ మద్య సంబంధాలు చెరిగిపోయాయి. చివరికి 1963 దక్షిణ వియత్నాం తిరుగుబాటులో డీయిం , న్హూ హత్య చేయబడ్డారు. డీయిం ప్రభుత్వం తరువాత ఒక డజన్ కంటే అధికమైన సైనిక ప్రభుత్వాల పాలన కొనసాగింది. తరువాత ఎయిర్ మార్షల్ " గూయెన్ కాయోకీ, జనరల్ న్గూయెన్ వ్యాన్ థియూ కూటమి 1965లో దక్షిణ వియత్నాం అధికారం చేజిక్కించుకుంది. థియూ క్రమంగాకీ మీద ఆధిపత్యం సాధించాడు. తరువాత తన అధికారం బలపరచుకోవడానికి 1967, 1971లో మోసపూరితమైన ఎన్నికలు నిర్వహించాడు. రాజకీయ అస్థిరత కమ్యూనిస్టులకు అనుకూలంగా మారింది. దక్షిణ వియత్నాం కమ్యూనిస్టుల తిరుగుబాటును ఎదుర్కోడానికి మద్దతుగా యునైటెడ్ స్టేట్స్ సైనికసహాయం అధికం చేసింది. 1965లో యునైటెడ్ స్టేట్స్ గ్రౌండ్ దాడులలో పాల్గొన్నది. చివరిగా వారి సంఖ్య 5,00,000 లకు చేరుకున్నది. యు.ఎస్. వాయుమార్గ బాంబింగ్ చర్యలో భాగస్వామ్యం వహించింది. మరొక వైపు చైనా, సోవియట్ యూనియన్ ఉత్తర కొరియాకు గణనీయమైన యుద్ధసామాగ్రి, 15,000 మంది యుద్ధవీరులను అందించింది. కమ్యూనిస్టు సైనికులు వియట్ కాంగ్‌కు అవసరమైన సామాగ్రి అందజేసింది. 1968లో కమ్యూనిస్టులు దక్షిణ వియత్నం లక్ష్యాలను గురిచేస్తూ దాడి సాగించారు. అయినప్పటికీ పోరాటం విఫలం అయింది. అమెరికన్ చర్యలను వ్యతిరేకిస్తూ అమెరికన్ ప్రజలు అభిప్రాయం వెలిబుచ్చడం అమెరికా ప్రభుత్వాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ సమయంలో కమ్యూనిస్ట్ బృందాలు హ్యూ ప్రాంతంలో 3,000 మందిని మూకుమ్మడిగా హతమార్చాయి. యుద్ధానికి వ్యతిరేకంగా దేశంలో బలపడుతున్న అభిప్రాయాలు, అంతర్జాతీయ విమర్శలు యు.ఎస్. " నిక్సన్ డాక్టరిన్ " విడుదలచేస్తూ భూమార్గ దాడుల నుండి వైదొలగింది. ఈ కార్యక్రమాలు దక్షిణ వియత్నాంలో రాజకీయ అస్థిరతను తొలగించడంలో విఫలం అయ్యాయి.1973 జనవరి 27 న " పారిస్ పీస్ ఒప్పందం " తరువాత 1973 మార్చి 29నాటికి అమెరికన్ సైనిక బృందాలు పూర్తిగా దక్షిణ వియత్నాం నుండి వైదొలిగాయి. 1974 డిసెంబరులో ఉత్తర వియత్నాం ఫురోక్ లాంగ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. తరువాత స్వల్పకాలం దక్షిణ వియత్నాం " ప్రొవిషనల్ రివల్యూషనరీ గవర్నమెంటు " పాలనలో (ఉత్తర వియత్నాం సైన్యం దక్షిణ వియత్నాంను ఆక్రమించింది) ఉంది. 1976 జూలై 2న ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంలు సమైక్యపరచబడి " సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం "గా అవతరించింది. యుద్ధం వియత్నాంను విధ్వంశం చేసి వదిలింది. మొత్తం మరణాలు 8,00,000 నుండి 31,00,000 ఉండవచ్చని భావించారు.

1976–ప్రస్తుత సమైఖ్యత , సంస్కరణలు

వియత్నాం 
హనోయ్ లో నెలకొన్న ప్రముఖ స్థలం హొ చి మిన్ మాసోలియం.
వియత్నాం 
Saigon Trade Center, one of the first skyscrapers to be built in Ho Chi Minh City after the Doi Moi reforms

యుద్ధం తరువాత లీ డుయాన్ పాలనలో దక్షిణ వియత్నాంలో పాశ్చాత్యదేశాల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాలన్న భయం కారణంగా యు.ఎస్.తో అనుబంధం ఉన్న వారి మూకుమ్మడి హత్యలు లేవు. అయినప్పటికీ 3,00,000 మంది దక్షిణ వియత్నామీయులు రీయెజ్యుకేషన్ కేంపులకు తరలించబడ్డారు. అక్కడ వారు పలు హింసలు, పస్తులు, వ్యాధులు , బలవంతపు చాకిరి మొదలైన అవస్థలు భరించారు. ప్రభుత్వం సమైకృత వ్యవసాయం , పరిశ్రమలు ప్రారంభించింది. ఇది ఆర్థిక పతనానికి కారణమై మూడంకెల ద్రవ్యోల్భణం సంభవించింది. క్రమంగా దేశపునర్నిర్మాణ కార్యక్రమాలు అభివృద్ధి చేయబడ్డాయి. 1978 వియత్నాం మిలటరీ వియత్నాం సరిహద్దు గ్రామాలపై దాడి చేస్తున్న ఖేమర్ రూజ్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కంబోడియా మీద దాడి చేసింది. కంబోడియాలో నూతన ప్రభుత్వాన్ని స్థాపించడంలో (నూతన ప్రభుత్వం 1989 వరకు కంబోడియాలో పాలనచేసింది) వియత్నాం విజయం సాధించింది. ఈ చర్య వియత్నాం, చైనాల సంబంధాలను బలహీనపరిచాయి. ఫలితంగా 1979లో " సినో- వియత్నాం" యుద్ధం సంభవించింది. ఈ యుద్ధం కారణంగా వియత్నాం ఆర్థిక, సైనిక సహాయం కొరకు సోవియట్ యూనియన్ మీద మరింతగా ఆధారపడవలసిన అవసరం ఏర్పడింది. 1986లో వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ " సిక్స్ట్ నేషనల్ కాంగ్రెస్ " సమావేశంలో రాజకీయ సంస్క్రణవాదులు సరికొత్త నాయకత్వంలో " ఓల్డ్ గార్డ్ " ప్రభుత్వం ఏర్పాటుచేసారు. సంస్కరణవాదులకు పార్టీ జనరల్ సెక్రెటరీ 71 సంవత్సరాల " న్గుయెన్ వ్యాన్ లిన్ " నాయకత్వం వహించాడు. సంస్కరణవాదులు వరుసగా " ఫ్రీ మార్కెట్ " (స్వేచ్ఛావిఫణి) సంస్కరణలు చేపట్టారు. అది క్రమంగా ప్రణాళికా బద్ధమైన " సోషలిస్ట్ - ఓరియంటెడ్ మార్కెట్ ఎకనమీగా " మారింది.

అయినా దేశాధిఖ్యత తిరుగులేకుండా " డోయీ మోయీ " ఆధ్వర్యంలో మిగిలిపోయింది. ప్రభుత్వం వ్యవసాయ భూములు , పరిశ్రమలలో ప్రైవేట్ యాజమాన్యం! ఆర్థిక స్వాతంత్ర్యం , విదేశీపెట్టుబడులకు అనుమతించింది. మరొకవైపు పరిశ్రమల మీద వ్యూహాత్మకమైన నియంత్రణను ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకొన్నది. వియత్నాం ఆర్థికరగం వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తి, నిర్మాణరంగం, ఎగుమతులు , విదేశీపెట్టుబడులలో శక్తివంతమైన అభివృద్ధిని సాధించింది. అయినప్పటికీ ఈ సంస్కరణలు ఆర్థిక అసమానతలు , లింగవివక్షకు దారితీసాయి.

మూలాలు

ఇతర లింకులు

    Government
    Media and censorship


Tags:

వియత్నాం చరిత్రవియత్నాం మూలాలువియత్నాం ఇతర లింకులువియత్నాంఇండోనేషియాకాంబోడియాచైనాఫిలిప్పీన్స్మలేషియాలావోస్

🔥 Trending searches on Wiki తెలుగు:

నందిగం సురేష్ బాబురాకేష్ మాస్టర్శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణశివపురాణంపాల కూరకోల్‌కతా నైట్‌రైడర్స్కర్ర పెండలంఆర్టికల్ 370 రద్దువిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాతిలక్ వర్మతమిళనాడువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిమూర్ఛలు (ఫిట్స్)తులసీదాసుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాటమాటోసజ్జా తేజమాగుంట శ్రీనివాసులురెడ్డిమౌన పోరాటంజూనియర్ ఎన్.టి.ఆర్వై.యస్. రాజశేఖరరెడ్డిప్రేమలుపూర్వాషాఢ నక్షత్రముశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రితెలంగాణ గవర్నర్ల జాబితాధన్‌రాజ్బంగారంపరీక్షిత్తురవీంద్రనాథ్ ఠాగూర్సునాముఖిరామోజీరావుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుతమలపాకునితీశ్ కుమార్ రెడ్డిఆలీ (నటుడు)సుందర కాండగుణింతంభారత రాష్ట్రపతికారకత్వంఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుడీజే టిల్లుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభారతదేశంలో బ్రిటిషు పాలనద్రౌపదియోనిసచిన్ టెండుల్కర్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఎఱ్రాప్రగడషడ్రుచులుసుడిగాలి సుధీర్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిమృణాల్ ఠాకూర్సామెతలుచేతబడిరావి చెట్టుఅర్జా జనార్ధనరావుభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుమాగుంట సుబ్బరామిరెడ్డిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపూర్వ ఫల్గుణి నక్షత్రముగంగా నదిత్రినాథ వ్రతకల్పంఇత్తడిఅన్నమయ్యతెలంగాణ రాష్ట్ర సమితిపల్నాడు జిల్లాఅమరావతిగాయత్రీ మంత్రంమధుమేహంఉప రాష్ట్రపతితెలుగు సినిమాల జాబితాజీలకర్రసునీల్ గవాస్కర్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)సావిత్రి (నటి)ఆవారా🡆 More