పి. కేశవరెడ్డి: ప్రసిద్ధ తెలుగు రచయిత

డా.

పి. కేశవరెడ్డి (1946 మార్చి 10 - 2015 ఫిబ్రవరి 13) తెలుగు నవలా రచయిత, వైద్యుడు. ఆయన రాసిన ఎనిమిది నవలలు పాఠకుల ఆదరణ పొందాయి. కొన్నినవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచయితగా కేశవరెడ్డి ఏ వాదాలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవాడు కాదు. అవేవీ లేకుండా తన పాఠకవర్గాన్ని సృష్టించుకున్న రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి. కేశవరెడ్డి అణగారిన ఎరుకలకు, యానాదులకు, మాలలకు రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండని బక్కిరెడ్డి వంటి కాపోనికి, బతుకు భారమై నూతిని, గోతిని వెతికే సమస్త కులాల కష్టజీవులకు, వ్యథార్త జీవులకు కావ్య గౌరవం కలిగించి వారి జీవిత కదనాన్ని కథనంగా మలిచి పాఠకుడి ముందు నిలిపిన రచయిత కేశవరెడ్డి. [ఆధారం చూపాలి]

పి. కేశవ రెడ్డి
పి. కేశవరెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, కేశవరెడ్డి గురించి, రచనలు
డాక్టర్ పెనుమూరు కేశవరెడ్డి
పుట్టిన తేదీ, స్థలం(1946-03-10)1946 మార్చి 10
తలుపులపల్లె, చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్
మరణం2015 ఫిబ్రవరి 13(2015-02-13) (వయసు 68)
నిజామాబాద్, తెలంగాణ
వృత్తినవలా రచయిత, వైద్యుడు
జాతీయతIndia
కాలం1970–2015
జీవిత భాగస్వామిధీరమతి
సంతానం2

సంతకంపి. కేశవరెడ్డి: బాల్యం, విద్యాభ్యాసం, కేశవరెడ్డి గురించి, రచనలు

బాల్యం, విద్యాభ్యాసం

పెనుమూరు కేశవరెడ్డి 1946 మార్చి 10చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లెలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి లోని విక్టోరియా ఆస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయారు.

కేశవరెడ్డి గురించి

ప్రముఖ రచయిత మధురాంతకం రాజారామ్ కేశవరెడ్డి గురించి ఇలా అంటారు: “కేశవరెడ్డి తల్లి పుట్టినూరు మావూరే. అంతటి రచయితను కన్న తల్లి మావూరి ఆడపడుచే కావడం నాకు గర్వకారణం”. మధురాంతకం రాజారామ్‌కు తాను ఏకలవ్యశిష్యుణ్ణని కేశవరెడ్డి చెప్పుకున్నాడు.

రచనలు

గ్రామీణ సమాజపు రూపు రేఖలను, అంతః సంఘర్షణలను లోతుల్లోకి వెళ్లి చిత్రీకరించిన రచయితగా, దళితులు, గిరిజనులు, స్రీలు, అణచివేతకు గురయ్యే సమూహాల పట్ల సంవేదనతో రచనలు చేసిన ప్రగతీశీల రచయితగా కేశవ రెడ్డి గుర్తింపు పొందాడు. అతడు అడవిని జయించాడు, మునెమ్మ, మూగవాని పిల్లనగ్రోవి, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటీఫుల్‌, చివరి గుడిసె, రాముండాడు రాజ్జముండాది, ఇన్‌ క్రెడిబుల్‌ గాడెస్‌ వంటి ఎన్నో రచనలను కేశవరెడ్డి తెలుగు సమాజానికి అందించారు.

కేశవరెడ్డి తీసుకున్న ఇతివృత్తాలు చాలా క్లిష్ట మైనవి. ఒంటిల్లు అనే గ్రామ కేంద్రంగా నెలకొన్న వర్ణవ్యవస్థను, వర్గాన్ని భూస్వామ్యాన్ని దాని నిజస్వరూపాన్నీ బట్టబయలు చేసిన రచన కేశవరెడ్డిది. కేశవరెడ్డి రచనలకు నక్సల్బరీ, ఆదివాసి, రైతాంగ పోరాటాలు ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఆయన రచనల్లో ఉద్యమాల ప్రస్తావన నేరుగా వుండదు. అయితే వాటి ద్వారా సమాజం ముందుకు వచ్చిన వైరుధ్యాలను కళాత్మకంగా చెప్పడం ఉంటుంది. కేశవరెడ్డి ఇటీవల రైతాంగ స్త్రీ ఇతివృత్తంగా రాసిన మునెమ్మ ఇందుకు దాఖలాగా నిలుస్తుంది. ఆయన పశ్చిమ దేశాల సాహిత్యంతో ప్రగాఢ పరిచయం కలిగినవారు, ప్రభావితమైన వారూను. కేశవరెడ్డి పైన హెమింగ్వే, స్టెయిన్‌బాక్‌, విలియం ఫాక్‌నీర్‌వంటి రచయితల ప్రభావం ఉన్నది.

కేశవరెడ్డి సృష్టించిన మన్నుగాడు, రంపాల రామచంద్రుడు, బైరాగి, అర్జునుడు వంటి పాత్రలు, వ్యవస్థ భిన్నరూపాలలో విధించే కట్టుబాట్లను ధిక్కరించి తమదయిన జీవిత పథాన్ని ఎంచుకుని స్వేచ్ఛాన్వేషణలో, ఆత్మగౌరవంతో బతికిన వాళ్లు.

రచనల జాబితా

  1. మూగవాని పిల్లనగోవి - 1996
  2. చివరి గుడిసె - 1996
  3. అతడు అడవిని జయించాడు - 1984
  4. క్షుద్ర దేవత (ఇంక్రెడిబుల్ గాడెస్) - 1979
  5. శ్మశానం దున్నేరు - 1979
  6. సిటీ బ్యూటిఫుల్ - 1982
  7. రాముడుండాడు - రాజ్యముండాది - 1982
  8. మునెమ్మ - 2008
  9. బానిసలు - భగవానువాచ - రెండు పెద్ద కధల సంకలనం - 1975
  10. మూగవాని పిల్లనగోవి: బల్లార్డ్ ఆఫ్ ఒంటిల్లు - 2013

మరణం

2015, ఫిబ్రవరి 13నిజామాబాద్ లో ఆనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మూలాలు

Tags:

పి. కేశవరెడ్డి బాల్యం, విద్యాభ్యాసంపి. కేశవరెడ్డి కేశవరెడ్డి గురించిపి. కేశవరెడ్డి రచనలుపి. కేశవరెడ్డి రచనల జాబితాపి. కేశవరెడ్డి మరణంపి. కేశవరెడ్డి మూలాలుపి. కేశవరెడ్డిఇంగ్లీషుఎరుకలతర్జుమాతెలుగుఫిబ్రవరి 13మార్చి 10మాల (కులం)యానాదులురచయితవికీపీడియా:మూలాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉపనయనముగరుడ పురాణంభారత సైనిక దళంఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకొంపెల్ల మాధవీలతఓటుపరిటాల రవిరామసహాయం సురేందర్ రెడ్డిభూమిసింహరాశిమహామృత్యుంజయ మంత్రంహలో బ్రదర్షడ్రుచులుఆంధ్రప్రదేశ్ చరిత్రబి.ఆర్. అంబేద్కర్జమ్మి చెట్టుమానవ శరీరముకె. అన్నామలైరమ్య పసుపులేటిఘట్టమనేని కృష్ణశేఖర్ మాస్టర్పాల్కురికి సోమనాథుడులలితా సహస్ర నామములు- 201-300సీత్లపెరిక క్షత్రియులుయవలుమఖ నక్షత్రముకంప్యూటరుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డినువ్వు నేనుగుంటూరు కారంమేషరాశిత్రినాథ వ్రతకల్పంఅయ్యప్పతిలక్ వర్మఉత్తర ఫల్గుణి నక్షత్రము2024 భారత సార్వత్రిక ఎన్నికలుఆయాసంఆరూరి రమేష్గంగా నదిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)దగ్గుబాటి పురంధేశ్వరినీతి ఆయోగ్ఝాన్సీ లక్ష్మీబాయిపేర్ని వెంకటరామయ్యనందిగం సురేష్ బాబువందేమాతరంతెలంగాణ రాష్ట్ర సమితియేసువృశ్చిక రాశిఅంజలి (నటి)భారతదేశ రాజకీయ పార్టీల జాబితానువ్వు వస్తావనిసుగ్రీవుడుచరాస్తిగోత్రాలు జాబితాశ్రవణ నక్షత్రమువంగ‌ల‌పూడి అనితధర్మవరం శాసనసభ నియోజకవర్గంవినుకొండసెక్స్ (అయోమయ నివృత్తి)ఆలీ (నటుడు)తెలుగుదేశం పార్టీఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకౌరవులుగజాలాకరోనా వైరస్ 2019అయోధ్యత్రిష కృష్ణన్తెలుగు పదాలుఉప రాష్ట్రపతినన్నయ్యమహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రుల జాబితాతాటి ముంజలుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలలితా సహస్ర నామములు- 1-100🡆 More