స్ట్రాటోస్ఫియర్

స్ట్రాటోస్ఫియర్ అనేది భూమి వాతావరణం లోని రెండవ పొర.

ఇది ట్రోపోస్పియరుకు పైన, మీసోస్పియరుకు క్రిందన ఉంటుంది. స్ట్రాటోస్ఫియరు అనేది స్తరీకరించబడిన ఉష్ణోగ్రత పొరలతో కూడిన వాతావరణ పొర. ఇందులో వెచ్చని గాలి పొరలు ఆకాశంలో ఎత్తున, చల్లని పొరలు భూమి ఉపరితలానికి దగ్గరగానూ ఉంటాయి. సూర్యుని అతినీలలోహిత (UV) రేడియేషన్‌ను ఓజోన్ పొర గ్రహించడం వల్ల ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూంటుంది. ఉష్ణోగ్రత విలోమం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉన్న ట్రోపోస్పియరుతో పోలిస్తే వ్యతిరేకంగా ఉంటుంది -ట్రోపోస్పియరులో ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ట్రోపోస్ఫియరును తెలుగులో ట్రోపో ఆవరణం అనడం కద్దు.

స్ట్రాటోస్ఫియర్
భూమి వాతావరణంలోని ఐదు ప్రాథమిక పొరలను చూపే రేఖాచిత్రం: ఎక్సోస్పియర్, థర్మోస్పియర్, మెసోస్పియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్పియర్. (స్కేలుకు అనుగుణంగా లేదు) భూమి ఉపరితలం నుండి స్ట్రాటోస్ఫియర్ (50 కి.మీ) పైభాగం వరకు భూమి వ్యాసార్థంలో కేవలం 1% లోపే ఉంటుంది.
స్ట్రాటోస్ఫియర్
ట్రోపోస్పియర్ ఆఫ్టర్‌గ్లో (నారింజ), స్ట్రాటోస్ఫియరు (నీలం), మెసోస్పియర్ (నల్లగా). మెసోస్పియరు వద్ద వాతావరణ ప్రవేశం ప్రారంభమవుతుంది. వ్యోమనౌక వాతావరణం లోకి రీఎంట్రీ అవుతున్న దృశ్యం

ట్రోపోస్ఫియర్ స్ట్రాటోస్ఫియరుల మధ్య ట్రోపోపాజ్ సరిహద్దు ఉంది. ఇక్కడే ఉష్ణోగ్రత విలోమం మొదలౌతుంది. భూమధ్యరేఖకు సమీపంలో, స్ట్రాటోస్ఫియరు దిగువ అంచు 20 km (66,000 ft; 12 mi) వరకు ఉంటుంది. మధ్య అక్షాంశాల వద్ద 10 km (33,000 ft; 6.2 mi), ధ్రువాల వద్ద సుమారు 7 km (23,000 ft; 4.3 mi) ఉంటుంది. ఉష్ణోగ్రతలు సగటున ట్రోపోపాజ్ వద్ద −51 °C (−60 °F; 220 K) నుండి మెసోస్పియర్ దగ్గర సగటున −15 °C (5.0 °F; 260 K) వరకు ఉంటాయి. ఋతువులు మారుతూంటే స్ట్రాటోస్ఫియరులో ఉష్ణోగ్రతలు కూడా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ధ్రువ రాత్రి (శీతాకాలం)లో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి. స్ట్రాటోస్ఫియరు లోని గాలులు ట్రోపోస్పియరులోని గాలివేగాలను మించి 60 m/s (220 km/h; 130 mph) కి చేరుకుంటాయి.

ఓజోన్ పొర

ఓజోన్ పొర ఏర్పడటాన్ని వివరించే యంత్రాంగాన్ని బ్రిటీష్ గణిత శాస్త్రజ్ఞుడు సిడ్నీ చాప్‌మన్ 1930లో వివరించాడు. పరమాణు ఆక్సిజన్ UV-C ప్రాంతంలో 240 nm కంటే తక్కువ తరంగదైర్ఘ్యాల వద్ద అధిక శక్తి గల సూర్యకాంతిని గ్రహిస్తుంది. హోమోలిటిక్‌గా విభజించబడిన ఆక్సిజన్ అణువుల నుండి ఉత్పత్తి అయిన రాడికల్స్, పరమాణు ఆక్సిజన్‌తో కలిసి ఓజోన్‌ను ఏర్పరుస్తాయి. ఓజోన్, మాలిక్యులర్ ఆక్సిజన్ కంటే చాలా వేగంగా ఫోటోలైజ్ అవుతుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ తరంగదైర్ఘ్యాల వద్ద బలమైన శోషణ సామర్థ్యం ఉంటుంది. ఇక్కడ సౌర ఉద్గారాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఓజోన్ (O3) ఫోటోలిసిస్‌లో O, O2 లను ఉత్పత్తి అవుతాయి. ఆక్సిజన్ అణువు, వాతావరణం లోని మాలిక్యులర్ ఆక్సిజన్‌తో కలిసి O3 ని ఉత్పత్తి చేసి, ఈ క్రమంలో వేడిని విడుదల చేస్తుంది. వేగవంతమైన ఫోటోలిసిస్, ఓజోన్ పునరుత్పత్తి వలన స్ట్రాటోస్ఫియరు వేడెక్కుతుంది. ఫలితంగా ఉష్ణోగ్రత విలోమం ఏర్పడుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత పెరగడం స్ట్రాటోస్ఫియరు లక్షణం; నిలువుగా మిక్సింగ్‌ అవడానికి అది నిరోధం కలిగిస్తుందంటే దానర్థం అది స్తరీకరించబడిందని. స్ట్రాటోస్ఫియరు పైభాగంలో ఉష్ణోగ్రత దాదాపు 270 K (−3 °C) ఉంటుంది.

విమానం ఫ్లైట్

స్ట్రాటోస్ఫియర్ 
ట్రోపోస్పియర్‌లో ఉండే కల్లోలాల నుండి తప్పించుకోడానికి విమానం సాధారణంగా స్ట్రాటోస్ఫియరులో ప్రయాణిస్తుంది. ఈ చిత్రంలో నీలిరంగు పుంజం ఓజోన్ పొర. ఓజోన్ స్ట్రాటోస్ఫియరును వేడి చేస్తుంది. జెట్‌లు, వాతావరణ బెలూన్‌లు ఎగరగలిగే ఎత్తుకు పరిమితి స్ట్రాటోస్ఫియరే. ఇక్కడి గాలి ట్రోపోస్పియరులో కంటే దాదాపు వెయ్యి రెట్లు పలుచగా ఉంటుంది.

వాణిజ్య విమానాలు సాధారణంగా 9–12 km (30,000–39,000 ft) ఎత్తులో ప్రయాణిస్తాయి. సమశీతోష్ణ అక్షాంశాలలో ఈ ఎత్తు స్ట్రాటోస్పియర్ దిగువ ప్రాంతాలలో ఉంటుంది. ఈ ఎత్తులో ప్రయాణించే విమానపు ఇంధన ఖర్చు తక్కువగా ఉంటుంది. ట్రోపోపాజ్ దగ్గర ఉష్ణోగ్రతలు, గాలి సాంద్రత తక్కువగా ఉండడం కారణంగా, ఎయిర్‌ఫ్రేమ్‌పై డ్రాగ్‌ను తగ్గిస్తుంది.

కాంకార్డ్ విమానం సుమారు 60,000 ft (18 km) ఎత్తున మ్యాక్ 2 వేగంతో ప్రయాణించింది. SR-71 85,000 ft (26 km) ఎత్తున మ్యాక్ 3 వేగంతో ప్రయాణించింది. ఈ రెండూ స్ట్రాటోస్ఫియరు లోనే.

జీవం

బాక్టీరియా

స్ట్రాటోస్ఫియరులో బాక్టీరియా ఉంటుంది. అంచేత ఇది జీవావరణంలో ఒక భాగం. 2001లో, ఎత్తైన బెలూన్ ప్రయోగంలో 41 కిలోమీటర్ల ఎత్తున దుమ్మును సేకరించారు. ఆ తరువాత ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు అందులో బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు.

పక్షులు

కొన్ని పక్షి జాతులు ట్రోపోస్పియరులో పై స్థాయిలలో ఎగురుతున్నట్లు గమనించారు. 1973 నవంబరు 29 న ఐవరీ కోస్ట్ పైన 11,278 m (37,000 ft) ఎత్తున ఎగురుతున్న విమానపు జెట్ ఇంజను, ఒక రప్పెల్ రాబందును (జిప్స్ రుపెల్లి) లాగేసుకుంది. బార్-హెడ్ గీస్ (అన్సర్ ఇండికస్) 8,848 m (29,029 ft) ఎత్తున్న ఎవరెస్ట్ శిఖరం మీదుగా ఎగురుతూ వలస వెళ్తాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

స్ట్రాటోస్ఫియర్ ఓజోన్ పొరస్ట్రాటోస్ఫియర్ విమానం ఫ్లైట్స్ట్రాటోస్ఫియర్ జీవంస్ట్రాటోస్ఫియర్ ఇవి కూడా చూడండిస్ట్రాటోస్ఫియర్ మూలాలుస్ట్రాటోస్ఫియర్ఓజోన్ పొరభూమి వాతావరణం

🔥 Trending searches on Wiki తెలుగు:

సూర్యుడు (జ్యోతిషం)ఉత్తర ఫల్గుణి నక్షత్రముహైదరాబాదుతెలుగు కులాలుబైబిల్ గ్రంధములో సందేహాలుపాండురాజుదశరథుడుశ్రీశ్రీ సినిమా పాటల జాబితాపలవల దుప్పిత్రయంబకేశ్వరాలయం (నాసిక్)పూజిత పొన్నాడషేర్ షా సూరిత్రిఫల చూర్ణంతులారాశియేసుమొదటి హరిహర రాయలుచెట్టుఎల్లమ్మకేంద్రపాలిత ప్రాంతంతేగయక్షగానంఅనభేరి ప్రభాకరరావుప్లీహమురంగుగజేంద్ర మోక్షంఅక్బర్బతుకమ్మప్రశ్న (జ్యోతిష శాస్త్రము)ఆర్య వైశ్యులుసంయుక్త మీనన్నవలా సాహిత్యముకౌరవులుఛత్రపతి శివాజీసుగంధ ద్రవ్యంతెలంగాణా సాయుధ పోరాటంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంగొంతునొప్పిఎయిడ్స్ద్వారకా తిరుమలనర్మదా నదివేయి స్తంభాల గుడివనితా విజయ కుమార్పొంగూరు నారాయణవెట్రిమారన్అచ్చులునిర్మలమ్మఅగ్నికులక్షత్రియులుతిలక్ వర్మఆశ్లేష నక్షత్రమురాయప్రోలు సుబ్బారావుG20 2023 ఇండియా సమిట్పాండ్యులుబోదకాలుడొక్కా సీతమ్మకాళేశ్వరం ఎత్తిపోతల పథకంకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుమూఢ నమ్మకాలురోహిణి నక్షత్రంతెలుగు పదాలుపాండవులుఅంగారకుడురాం చరణ్ తేజఢిల్లీదశదిశలుతెలంగాణ జిల్లాలుఆవర్తన పట్టికతాజ్ మహల్మహాత్మా గాంధీలంబాడిగోల్కొండక్రిక్‌బజ్తెలంగాణ దళితబంధు పథకంసిద్ధార్థ్శ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లిబోయింగ్ 747యముడుసురేఖా వాణిఉప్పు సత్యాగ్రహం🡆 More