సోయా చిక్కుడు

సోయా చిక్కుడు చిక్కుడు జాతులలో ఒకటి.

ఇది బలమైన ఆహారము.

సోయా చిక్కుడు
సోయా చిక్కుడు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Faboideae
Genus:
Species:
జి. మాక్స్
Binomial name
గ్లైసీన్ మాక్స్
(L.) Merr.

చరిత్ర

సోయా అపరాలకు చెందిన మొక్క.కాని సోయాను నూనెగింజలకై సాగుచెయుదురు. పామాయిల్ తరువాత రెండోస్దానంలో ఉత్పత్తి అవుతున్ననూనె సొయా. మూలస్దానం తూర్పు ఆసియా.B.C.2853 నాటికే చైనాలో, మంచురుయాలో సాగులో వున్నదని లిఖిత ఆధారాలున్నాయి. ఐరోపా, అమెరికాలకు ఆసియన్ల వలసు కాలంలో ఆదేశాలకు వ్యాప్తిచెందినది.కీ.శ.1800 నాటికి పైఖండాలలో సాగులోకి వచ్చింది.కీ.శ.1765 లో సామ్యూల్‌బొవెన్ అనేనావికుడు సోయాను అమెరికాకుతీసుకెళ్లి'సరన', 'జార్జిలా'లలోసాగుచేసాడుకీ.శ.1857లో ఆఫ్రికా, ఇజిప్టులలో, కీ.శ.1882లో అమెరికా, బ్రెజిల్లో సోయా సాగు మొదలైంది.కాని కీ.శ.1940నుండి అమెరికలో సోయా సాగు వూపందుకున్నది.ఎక్కువ భూమిని క్రమంగా సోయాసాగుకు తెచ్చారు.కీ.శ.1960 నాటికి అమెరిక ప్రపంచదేశాలలో సోయా ఉత్పత్తిలో ప్రథమ స్దాయికి చేరింది.ఏడాదికి 70-85 మిలియను టన్నుల సోయాను ఉత్పత్తి చెస్తున్నది.అమెరిక తరువాత స్దానం బ్రెజిల్‌దేశానిది..

ఉత్పత్తిచేయు దేశాలు

అధికంగా అమెరికా, బ్రెజిల్, అర్జెంటినా, చైనా,, ఇండియాలు సోయాను ఉత్పత్తి చెస్తున్నాయి. అమెరికాలో లోవా, మిన్నెసొటా, ఇండియానా లలో, బ్రెజిల్లో మాంటాగొస్సా, పరగ,, రియో గ్రాండెసుల్లలో సొయాను పండిస్తున్నారు. భారతదేశంలో మధ్యప్రదేశ్, ఊత్తరప్రదేశ్, మహారాష్ట్రలు.ఇప్పుడు తెలంగాణాలో కూడా విపరీతంగా పండిస్తున్నారు

సోయామొక్క

విరివిగా కొమ్మలుండి గుబురుగా పొదలా పెరుగుతుంది. విత్తన రకాన్ని బట్టి 0.3-1.5 మీటర్ల ఎత్తు వుంటుంది. కాండం, ఆకులు, కాయమీద సన్నని కేశంల వంటి నూగును కల్గివుండును. ఆకులు 5-15 సెం.మీ. పొడ వుండును. గుల్లగా, పొడవుగా వుండు కాయ (pod) లో వరుసగా సాయా గింజలుండును. కాయ 5-10సెం.మీ వుండి, కాయలో 2-4 గింజలుండును.సోయా గింజ గోళాకారంగా వుండి (కొద్దిగా అండాకరంగా) 5-10 మి.మీ.ల వ్యాసం వుండును. సోయాబీన్స్ పసుపురంగులో,, చిక్కటి బ్రౌను రంగులో వుండును (వంగడం రకాన్ని బట్టి). పసుపురంగు సొయాలో నూనె శాతం ఎక్కువగా వుండును. సొయాసాగుకు ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. సోయాలో అధిక దిగుబడికై చాలా వంగడాలను అభివృద్ధి చేసారు.ఆయా దేశాలలోని భూసార లక్షణాలను బట్టి వంగడ రకాలను ఎన్నుకొనెదరు. సొయ గింజలో నూనె శతం 18-20% వరకు వుండును. సొయాలో ప్రోటీనులుకూడా అధికమే.నూనె తీసిన సొయా మీల్ (soya meal) లో ప్రొటిన్ శాతం 45-48%.

సోయా చిక్కుడు 
సోయాచిక్కుడు గింజలు

ఉపయోగాలు

1. సొయా గింజలను ముఖ్యంగా నూనెను తీయుటకు వాడుచున్నారు. ఉత్పత్తి అయిన సొయాలో85-90%ను సోయానూనెను తీయుటకు వినియోగిస్తున్నారు. 2.5-10% వరకు సొయాను సొయా పిండి (flour), సొయా మీల్ చెయ్యుటకు వాడెదరు. 3.5-10% వరకు ఆహరపదార్థంలలో నేరుగా వాడెదరు. సొయా నుండి 'పిల్లల ఆహరపదార్థంలు, బిస్కత్తులు, ఫ్లోర్‌మీల్, బ్రెడ్ల తయారిలో వాడెదరు.అలాగే సొయామిల్క్ క్రీమ్, సొయాచీజ్, తయారు చెయ్యుదురు. సొయాలోని ప్రొటీన్లు (మాంసక్రుత్తులు), మాంసంలోని ప్రోటిన్లవంటివే. అందుచే సొయాసీడ్స్తో 'సొయమీట్‌ మీల్' చెయ్యుదురు. భారతదేశంలో కూడా వెజిటెరియన్ బిర్యియానిలో సొయామీట్ మీల్ ను వుపయోగిస్తారు. నూనె తీసిన సొయ మీల్్‌ను పశువుల, కోళ్ల మేతలో వాడెదరు.

సొయ గింజలలోని పోషక విలువలు

పదార్థం శాతం
తేమ 9.5-14%
ఫ్యాట్‌/నూనె 18-24
ప్రొటిను 39-47
పిండి పదార్థం 3-20
పీచు పదార్థం 4-8

సోయా చిక్కుడు పండించు ప్రాంతాలు

ఇతర ఉపయోగాలు

ఇవి కూడా చూడండి

  • సోయా పాలు

మూలాలు

Tags:

సోయా చిక్కుడు చరిత్రసోయా చిక్కుడు ఉత్పత్తిచేయు దేశాలుసోయా చిక్కుడు పండించు ప్రాంతాలుసోయా చిక్కుడు ఇతర ఉపయోగాలుసోయా చిక్కుడు ఇవి కూడా చూడండిసోయా చిక్కుడు మూలాలుసోయా చిక్కుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

చేతబడితెలంగాణ ప్రభుత్వ పథకాలుపసుపు గణపతి పూజరైలు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుద్వాదశ జ్యోతిర్లింగాలుమెరుపుఅయోధ్యఅమర్ సింగ్ చంకీలాకడప లోక్‌సభ నియోజకవర్గంప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాపర్యాయపదంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరాజనీతి శాస్త్రముఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితారోహిత్ శర్మభారత జాతీయ మానవ హక్కుల కమిషన్రతన్ టాటాఉప్పు సత్యాగ్రహంహైపర్ ఆదిసాలార్ ‌జంగ్ మ్యూజియంశ్రీకాంత్ (నటుడు)మహాభాగవతంపోలవరం ప్రాజెక్టుఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతేటగీతిదూదేకులఢిల్లీ డేర్ డెవిల్స్సముద్రఖనిపాడ్కాస్ట్వెంట్రుకప్రేమలుచెమటకాయలుకూచిపూడి నృత్యంనామినేషన్విజయవాడయోనిశ్రీముఖిఎన్నికలుహల్లులుబాలకాండకామసూత్రభారతదేశ ప్రధానమంత్రిబమ్మెర పోతనమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవాట్స్‌యాప్బౌద్ధ మతంతెలుగు వికీపీడియావిటమిన్ బీ12శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంనన్నయ్యకీర్తి సురేష్వినాయక చవితిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాకుప్పం శాసనసభ నియోజకవర్గంపుష్కరంశ్రీలీల (నటి)కీర్తి రెడ్డిరాశిఫ్యామిలీ స్టార్భారతీయ సంస్కృతిసంక్రాంతివెలిచాల జగపతి రావుసుందర కాండచిరంజీవి నటించిన సినిమాల జాబితాబ్రాహ్మణ గోత్రాల జాబితామూలా నక్షత్రంవిశ్వామిత్రుడుసజ్జలుభారతీయ రైల్వేలుఅష్ట దిక్కులుఆంధ్ర విశ్వవిద్యాలయంవంకాయరష్మికా మందన్నరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ఆంధ్రజ్యోతిహైదరాబాదుకృష్ణా నదిఅండాశయము🡆 More