సంబల్‌పూర్

సంబల్‌పుర్ పట్టణం పశ్చిమ ఒడిషాలో ఉంది.

ఈ పట్టణం మహానది తీరాన ఉంది. ఈ పట్టణం ఒరిస్సా రాజధాని భుబనేశ్వర్ నుండి 300 కి.మీ. దూరంలో ఉంది. సంబల్‌పుర్ జంక్షన్ ఒరిస్సా లోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటి..ఈ పట్టణం పూర్వపు పేరు శ్యామలపుర. శ్యామలేశ్వరి ఆలయం పేరున ఆ పేరు వచ్చింది. కాలక్రమేణ శ్యామలపుర పేరు సంబల్‌పుర్‌గా మారింది.

సంబల్‌పూర్
సమలేశ్వరీ దేవి అలయం, సంబల్‌పుర్

సంబల్‌పుర్ ఒరిస్సా పశ్చిమ ప్రాంతపు పాలనా కేంద్రం. ఇదొక విద్యా కేంద్రం కూడా. అనేక చారిత్రిక భవనాలకు, పార్కులకు ఈ పట్టణం నెలవు. సంబల్‌పుర్ విశ్వవిద్యాలయం, వీర సురేంద్ర సాయి మెడికల్ కాలేజి, వీర సురేంద్ర సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇంన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్, ఒడిషా స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్థలకు ఇది నెలవు. సంబల్‌పుర్ కు దగ్గర లోనే హీరాకుడ్ ఆనకట్ట ఉంది. మహానదిపై ఉన్న ఈ ఆనకట్ట ప్రపంచం లోనే అత్యంత పొడవైన మట్టి కట్ట.

సంబల్‌పుర్ ఒరిస్సా లోని ప్రధానమైన రైల్వేస్టేషను. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను లోని సంబల్‌పుర్ రైల్వే డివిజనుకు కేంద్రం. జాతీయ రహదారులు -53, 55, రాష్ట్ర రహదారులు -10, 15 ఈ పట్టణం గుండా పోతున్నాయి.

జనాభా వివరాలు

సంబల్‌పుర్ నగరం సంబల్‌పుర్ మునిసిపల్ కార్పొరేషను పరిధి లోకి వస్తుంది. 2011 జనగణన ప్రకారం సంబల్‌పుర్ నగర జనాభా 183,383, దాని చుట్టుపట్ల ఉన్న పట్టణ ప్రాంతపు (బుర్లా, హీరాకుడ్ లతో కలిపి) మొత్తం జనాభా 269,575. ఇందులో పురుషులు 138,826 కాగా స్త్రీలు 130,749. సంబల్‌పుర్ అక్షరాస్యత 85.69% పురుషుల్లో ఇది 90.30% కాగా, స్త్రీలలో 80.92% ఉంది.

మూలాలు

వెలుపలి లింకులు

Tags:

ఒడిషాభుబనేశ్వర్మహానదిసంబల్‌పుర్

🔥 Trending searches on Wiki తెలుగు:

సూర్యుడుదేవదాసిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఅక్షయ తృతీయముదిరాజ్ (కులం)2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంఅల్లూరి సీతారామరాజుతోలుబొమ్మలాటపాడ్కాస్ట్బర్రెలక్కAతోడికోడళ్ళు (1994 సినిమా)సునీల్ గవాస్కర్జ్యేష్ట నక్షత్రంనవగ్రహాలుబైబిల్వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)అవకాడోసింహరాశిఆటలమ్మరక్త పింజరిద్రోణాచార్యుడుచాళుక్యులువర్షంటీవీ9 - తెలుగుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)సత్యనారాయణ వ్రతంతాటిప్రేమ (1989 సినిమా)కింజరాపు అచ్చెన్నాయుడుసావిత్రి (నటి)రామప్ప దేవాలయంనువ్వుల నూనెఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.కీర్తి రెడ్డివంగవీటి రంగానామవాచకం (తెలుగు వ్యాకరణం)ఇంగువమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఅలెగ్జాండర్పద్మశాలీలుతెలుగు సినిమాలు డ, ఢకన్యకా పరమేశ్వరిఉగాదిపరశురాముడుమా తెలుగు తల్లికి మల్లె పూదండతెల్ల గులాబీలుసుడిగాలి సుధీర్మదర్ థెరీసాభారతీయ శిక్షాస్మృతిఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలురాబర్ట్ ఓపెన్‌హైమర్ఇల్లాలు (1981 సినిమా)షర్మిలారెడ్డిగర్భంధన్‌రాజ్వందే భారత్ ఎక్స్‌ప్రెస్రమ్యకృష్ణఐక్యరాజ్య సమితిగుణింతంపి.వెంక‌ట్రామి రెడ్డివంతెనశేఖర్ మాస్టర్శ్రీలలిత (గాయని)సిమ్రాన్తెలుగు సినిమాలు 2023అనుష్క శెట్టిసమాసంఉపమాలంకారంశ్రీ గౌరి ప్రియశివ కార్తీకేయన్హలో బ్రదర్ముప్పవరపు వెంకయ్య నాయుడునానార్థాలుతెలంగాణ ఉద్యమంచరవాణి (సెల్ ఫోన్)మహావీర్ జయంతిసీత్ల🡆 More