మోదుకూరి జాన్సన్

మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 - డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత.

1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన 'మరో ప్రపంచం' సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.

మోదుకూరి జాన్సన్
మోదుకూరి జాన్సన్
మోదుకూరి జాన్సన్
జననంఆగష్టు 8, 1936
కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లా
మరణండిసెంబరు 24, 1988
మరణ కారణంగుండెపోటు
ప్రసిద్ధినటులు, నాటక కర్త
తండ్రిమోదుకూరి గరువయ్య (పేటూరు)
తల్లిరత్తమ్మ

జననం - విద్యాభ్యాసం - ఉద్యోగం

వీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగష్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,

నాటకరంగ ప్రస్థానం

ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు నటనాలయం, దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.

సినీరంగ ప్రస్థానం

మోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు - ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు. వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు - దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.

రచించిన పాటలు

  1. కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం (కరుణామయుడు)
  2. మన జన్మభూమి... బంగారు భూమి(పాడిపంటలు)
  3. స్వాగతం దొరా (దేశోద్ధారకులు)

మరణం

వీరు 1988, డిసెంబరు 24 తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

మూలాలు

బయటి లింకులు

Tags:

మోదుకూరి జాన్సన్ జననం - విద్యాభ్యాసం - ఉద్యోగంమోదుకూరి జాన్సన్ నాటకరంగ ప్రస్థానంమోదుకూరి జాన్సన్ సినీరంగ ప్రస్థానంమోదుకూరి జాన్సన్ మరణంమోదుకూరి జాన్సన్ మూలాలుమోదుకూరి జాన్సన్ బయటి లింకులుమోదుకూరి జాన్సన్19361988ఆగష్టు 8ఆదుర్తి సుబ్బారావుడిసెంబరు 24నాటక రచయితరచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఉదగమండలంనామినేషన్రోనాల్డ్ రాస్రజత్ పాటిదార్నువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలుగు అక్షరాలుఛత్రపతి శివాజీమిథునరాశిమొదటి పేజీనాయుడుశాసనసభ సభ్యుడుపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిహస్త నక్షత్రముప్రకృతి - వికృతినిర్మలా సీతారామన్పెళ్ళి చూపులు (2016 సినిమా)ఆవేశం (1994 సినిమా)మామిడిబొడ్రాయిబుధుడు (జ్యోతిషం)సాలార్ ‌జంగ్ మ్యూజియంచిరంజీవులుప్రేమలుతెలుగు కథతోటపల్లి మధు2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుమానవ శరీరమునవధాన్యాలుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాకల్వకుంట్ల చంద్రశేఖరరావుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థకందుకూరి వీరేశలింగం పంతులురాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్శుక్రుడుచరాస్తిఝాన్సీ లక్ష్మీబాయివిష్ణువు వేయి నామములు- 1-1000విశాల్ కృష్ణబ్రాహ్మణ గోత్రాల జాబితాఉప రాష్ట్రపతిపెళ్ళి (సినిమా)ప్రీతీ జింటాఅయోధ్య రామమందిరంప్రియురాలు పిలిచిందితెలుగుదేశం పార్టీతెలుగు సినిమాలు 2023హను మాన్పంచారామాలుఏప్రిల్ 26కలబందవడదెబ్బమాధవీ లతశ్యామశాస్త్రిరామదాసుప్రధాన సంఖ్యతెలుగు సినిమాలు 2022మాళవిక శర్మభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుశుభాకాంక్షలు (సినిమా)రష్మికా మందన్నసమంతసునాముఖిరాకేష్ మాస్టర్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితానానార్థాలుబంగారంనాగార్జునసాగర్వై.యస్.భారతిపర్యావరణంవాల్మీకిమలేరియాపాల కూరచాట్‌జిపిటిపాడ్కాస్ట్అమర్ సింగ్ చంకీలా🡆 More