బ్రూస్ లీ

బ్రూస్ లీ (నవంబర్ 27, 1940 - జులై 20, 1973) అమెరికాలో జన్మించి, హాంకాంగ్ లో పెరిగిన కరాటే యోధుడు, నటుడు.

ఆయన్ను చాలామంది 20 వ శతాబ్దంలోనే ప్రఖ్యాతి గాంచిన యుద్ధ విద్యా ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు. కుమారుడు బ్రాండన్ లీ, కుమార్తె షానన్ లీ కూడా నటులే. తమ్ముడు రాబర్ట్ 1960వ దశకంలో హాంకాంగ్ ను ఒక ఊపు ఊపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు.

బ్రూస్ లీ
బ్రూస్ లీ
జననం
లీ జున్-ఫాన్

(1940-11-27)1940 నవంబరు 27
మరణం1973 జూలై 20(1973-07-20) (వయసు 32)
కౌలూన్ టాంగ్, బ్రిటిష్ హాంకాంగ్
మరణ కారణంసెరెబ్రల్ ఎడెమా
ఇతర పేర్లులే యూన్-చం
లే యూన్-కామ్
వృత్తినటుడు, తత్వవేత్త
ఎత్తు1.72 m (5 ft 8 in)
తల్లిదండ్రులు
  • లీ హోయి-చుయెన్ (తండ్రి)
  • గ్రేస్ హో (తల్లి)
పురస్కారాలు
హాంకాంగ్ ఫిల్మ్ అవార్డ్స్Lifetime Achievement Award
1994
Star of the Century Award
2004

Golden Horse AwardsBest Mandarin Film
1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ
Special Jury Award
1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ

వెబ్‌సైటుబ్రూస్ లీ ఫౌండేషన్
బ్రూస్ లీ అధికార సైటు

బ్రూస్ లీ లో తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను, జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు లీని అమితంగా అభిమానించేవారు. చైనీయుల సాంప్రదాయ క్రీడయైన కుంగ్ ఫూను లీ తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవాడు.

బాల్యం

బ్రూస్ లీ కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరంలో పుట్టి, హాంకాంగ్ లో పెరిగాడు. ఇతని అసలు పేరు లీ జూన్ ఫాన్. లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం. బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ చాన్ హాంగ్‌కాంగ్ కు చెందిన ఒక పేరు పొందిన కాంటోనీస్ ఒపెరా గాయకుడు. 1939 డిసెంబరులో లీ తల్లిదండ్రులు అంతర్జాతీయ ఒపెరా యాత్రలో భాగంగా అమెరికాలోని, కాలిఫోర్నియా రాష్ట్రం, శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని చైనాటౌన్ కి వెళ్ళారు. 1940 నవంబరు 27 న లీ ఇక్కడే జన్మించాడు. అలా పుట్టుకతోనే ఆయనకు, హాంగ్‌కాంగ్, అమెరికా దేశాల నుంచి రెండు పౌరసత్వాలు దక్కాయి. లీ నాలుగు నెలల వయసులో అతని తల్లిదండ్రులు తిరిగి హాంగ్‌కాంగ్ కి వెళ్ళారు. అలా వెళ్ళగానే జపాన్ 1941 డిసెంబరులో రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా హాంగ్‌కాంగ్ మీద మెరుపు దాడి చేసి నాలుగు సంవత్సరాల పాటు తమ ఆధీనంలో ఉంచుకోవడంతో ఆ కుటుంబం అనేక కష్టాలనెదుర్కొన్నది.

బ్రూస్ తండ్రి కాంటోనీస్, తల్లి గ్రేస్ హో యురేషియా మూలాలు ఉన్న వ్యక్తి. గ్రేస్ హో తండ్రి కూడా కాంటోనీస్ కి చెందిన వాడు, తల్లి మాత్రం ఆంగ్లేయురాలు. గ్రేస్ హో దూరపు బంధువైన రాబర్ట్ హోటంగ్ హాంగ్‌కాంగ్ లో పేరొందిన వ్యాపారవేత్త.

విద్యాభ్యాసం, వృత్తి

1940-1958: నటనలో తొలి అడుగులు, పాఠశాల విద్య, యుద్ధవిద్యల్లో ప్రవేశం

లీ తండ్రి లీ హోయ్ చాన్ ఒక ప్రముఖ కాంటోనీస్ ఒపెరా గాయకుడు. దీనివల్ల బ్రూస్ లీకి చిన్నప్పటి నుంచే సినిమా రంగంతో పరిచయం ఏర్పడింది. బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. పసిపాపడిగా ఉన్నప్పుడే గోల్డెన్ గేట్ గర్ల్ అనే చిత్రంలో కనిపించాడు. అతను పుట్టిన సంవత్సరం చైనా క్యాలెండరు ప్రకారం డ్రాగన్ సంవత్సరం. అందుకనే అతనికి రంగస్థలం మీద లిటిల్ డ్రాగన్ అనే పేరు వచ్చింది.

తొమ్మిది సంవత్సరాల వయసులో ఉండగా తన తండ్రితో కలిసి ద కిడ్ (1950) అనే చిత్రంలో నటించాడు. ఇది ఒక కామిక్ పాత్ర ఆధారంగా రూపొందిన పాత్ర. అతను పోషించిన మొదటి ప్రధాన పాత్ర. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి 20 చిత్రాల్లో నటించాడు. 218, నాథన్ రోడ్, కౌలూన్ లోని అతని ఇంటికి సమీపంలో ఉన్న టాక్ సన్ స్కూల్ లో చదివిన తర్వాత 12 సంవత్సరాల వయసులో క్యాథలిక్ లా శాలీ కాలేజ్ లో చేరాడు.

బ్రూస్ లీ 
1958 లో లీ, ఇప్ మ్యాన్

బ్రూస్ లీ 1973 వ సంవత్సరంలో ఎంటర్ ది డ్రాగన్ చిత్రంలో నటించాడు. కానీ, అతడు ఈ చిత్రం విడుదలకు ముందే చనిపోయాడు.

శారీరక ధారుడ్యము, పౌష్టికాహారం

అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషనింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించేవారు కాదని బ్రూస్ లీ అభిప్రాయపడేవాడు. అన్నిరకాలుగా ఫిట్ గా ఉండటం కోసం బాగా కసరత్తు చేసేవాడు. వింగ్ చున్ విధానంలోని వన్ ఇంచ్ పంచ్కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు. 1964లో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్‌లో మొట్టమొదటిసారి అతను ఈ పంచ్‌ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వస్తువుకు కేవలం ఒక అంగుళం దూరంలో చేతిని ఉంచి, కనురెప్ప కాలంలో బలమైన పంచ్‌ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరూ గుర్తించలేకపోయారు. చాలాకాలం ఈ విధానంపై అధ్యయనాలు జరిగాయి. చివరికి టెక్నిక్‌తో మాత్రమే ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు. సహజంగా శక్తినంతా కూడగట్టుకొని, చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు. కానీ, బ్రూస్ లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్‌తో ముక్కలు చేసేవాడు. వస్తువుకు అతి సమీపం నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుందన్నది ఆశ్చర్యం కలిగించినా, అది అక్షరసత్యమని నిరూపించాడు బ్రూస్ లీ. ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్‌లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది. అయితే, అపారమైన అనుభవం ఉన్నవారికే అది సాధ్యమవుతుంది. ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్‌ ని ప్రపంచానికి పరిచయం చేశాడు బ్రూస్ లీ.

బ్రూస్ లీ గురించిన కొన్ని విశేషాలు

పీడ్ ఫైటింగ్ టెక్నిక్‌తో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బ్రూస్ లీ. 32 ఏళ్లకే చనిపోయిన ఈ మార్షల్ ఆర్టిస్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

  • బ్రూస్ లీ ప్రైవేట్‌గా కుంగ్ ఫూ పాఠాలు చెప్పటానికి గంటకు 275 డాలర్లు వసూలు చేసేవాడు.
  • ఫైటింగ్‌లో బ్రూస్ లీ చెయ్యి కనురెప్పపాటు కంటే వేగంగా కదులుతుంది. ఈ వేగాన్ని నిరూపించటం కోసం బ్రూస్ లీ ఓ టెక్నిక్ ప్రదర్శించేవాడు. ఓ వ్యక్తి తన చేతిలో నాణాన్ని ఉంచుకుని అరచేతిని మూసేలోగా బ్రూస్ లీ ఆ నాణాన్ని దొరకపుచ్చుకునేవాడు.
  • ఒక అంగుళం దూరం నుంచే పవర్‌ఫుల్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్ లీ నేర్పరి.

మరణం

1973 జులై 20 న ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతుండగా లీ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మెదడు విపరీతంగా ఉబ్బిపోవడం దీనికి కారణం. వెంటనే లీని హాంకాంగ్ బాప్టిస్ట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికీ బ్రూస్ లీ కోమాలోకి వెళ్ళిపోయారు. ఒక గంటలోనే చనిపోయాడు.

సినిమాలు

సంవత్సరము శీర్షిక పాత్ర గమనికలు
1969 మార్లో విన్స్లో వాంగ్
1971 ది బిగ్ బాస్ చెంగ్ చావో-అన్ ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ అని కూడా పిలుస్తారు
1972 ఫిస్ట్స్ ఆఫ్ ఫ్యూరీ చెన్ జెన్ ది చైనీస్ కనెక్షన్ అని కూడా పిలుస్తారు
1972 వే అఫ్ ది డ్రాగన్ టాంగ్ లంగ్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని కూడా పిలుస్తారు
1972 గేమ్ ఆఫ్ డెత్ హై టెన్ 1978 వరకు సినిమా తీయడం పూర్తి కాలేదు
1973 ఎంటర్ ది డ్రాగన్ లీ మరణానంతర విడుదల
1979 ది రియల్ బ్రూస్ లీ మరణానికి ముందు బ్రూస్ లీ ప్రారంభ బ్రూస్ లీ చలన చిత్రాల క్లిప్‌లతో డాక్యుమెంటరీ, బ్రూస్ లీ అనుకరించేవారితో సన్నివేశాలు.
1981 గేమ్ ఆఫ్ డెత్ II దీనిని టవర్ ఆఫ్ డెత్ అని కూడా అంటారు. ఈ చిత్రం నిర్మాణానికి ముందే లీ మరణించాడు ,దృశ్యాలు అతని ఇతర చిత్రాల నుండి తీసుకోబడ్డాయి.
బ్రూస్ లీ 
బ్రూస్ లీ తల్లీ ,తండ్రి 1940లో

మూలాలు

బ్రూస్ లీ 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

బ్రూస్ లీ బాల్యంబ్రూస్ లీ విద్యాభ్యాసం, వృత్తిబ్రూస్ లీ శారీరక ధారుడ్యము, పౌష్టికాహారంబ్రూస్ లీ గురించిన కొన్ని విశేషాలుబ్రూస్ లీ మరణంబ్రూస్ లీ సినిమాలుబ్రూస్ లీ మూలాలుబ్రూస్ లీ19401973అమెరికాజులై 20నవంబర్ 27హాంకాంగ్

🔥 Trending searches on Wiki తెలుగు:

బేతా సుధాకర్చిరంజీవి నటించిన సినిమాల జాబితాగ్యాస్ ట్రబుల్అమ్మకోసంమిథునరాశివందేమాతరంగుంటూరు కారంఅవకాడోతొట్టెంపూడి గోపీచంద్సింగిరెడ్డి నారాయణరెడ్డిజవాహర్ లాల్ నెహ్రూగోత్రాలువై. ఎస్. విజయమ్మ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమృత అయ్యర్మకరరాశిబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిసంభోగంవేమనవాట్స్‌యాప్సరోజినీ నాయుడుశుభ్‌మ‌న్ గిల్అనపర్తి శాసనసభ నియోజకవర్గంబలి చక్రవర్తికస్తూరి రంగ రంగా (పాట)భద్రాచలంవిశ్వనాథ సత్యనారాయణసాయిపల్లవితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతమన్నా భాటియాపెరూవిజయ్ (నటుడు)దేవీ ప్రసాద్సర్పినయన తారసెక్యులరిజంమాధవీ లతకరక్కాయజానపద గీతాలుకెఫిన్అరుణాచలంచెల్లమెల్ల సుగుణ కుమారిమార్చి 28శ్రీ గౌరి ప్రియవసంత వెంకట కృష్ణ ప్రసాద్ఇజ్రాయిల్వరలక్ష్మి శరత్ కుమార్తెలుగుదేశం పార్టీఇందిరా గాంధీకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంకాపు, తెలగ, బలిజఉప రాష్ట్రపతిచరవాణి (సెల్ ఫోన్)ఉపనయనముబియ్యముభారతదేశంలో కోడి పందాలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమేషరాశిజి.ఆర్. గోపినాథ్మశూచినారా చంద్రబాబునాయుడురూప మాగంటిభారతదేశ జిల్లాల జాబితాపునర్వసు నక్షత్రముతెలుగు కులాలుఅమ్మఅశ్వగంధమహాత్మా గాంధీమేళకర్త రాగాలుభారతదేశ ప్రధానమంత్రిరవీంద్రనాథ్ ఠాగూర్గుంటకలగరఅనిష్ప సంఖ్యత్రిఫల చూర్ణంకరోనా వైరస్ 2019చంద్ర గ్రహణం🡆 More